Gunde Ninda Gudi Gantalu january 24th: మీనాకు ప్రభావతి వార్నింగ్.. ఇంట్లో రచ్చ చేసిన బాలు..
Gunde Ninda Gudi Gantalu january 24th: గుండె నిండా గుడి గంటలు శుక్రవారం ఎపిసోడ్ లో ప్రభావతి మీనాను నానా మాటలు అంటుంది. 'రవి,శృతి ఎంత బాధ పడుకుంటూ ఇంట్లో నుండి వెళ్లిపోయారో.. నీకు ఈ విషయాలు ఏమీ అవసరం లేదు. నువ్వు నీ మొగుడు గదిలో సుఖంగా ఉంటే చాలు. ఈ రోజు వాడు గదికి తాళం వేసుకొని వెళ్లమని చెప్పింది నువ్వే.. వాడిని కొంగున కట్టేసుకున్నావ్. సాయంత్రం వాడు రాగానే.. గదిలోకి వెళ్లి తాళం వేసుకోండి' అంటూ ప్రభావతి రెచ్చిపోతుంది. దీంతో మీనా ఏడుస్తూ బయటికి వెళ్లిపోతుంది.
బాలుకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు. ప్రభావతి అన్న మాటలను గుర్తు చేసుకుంటూ మీనా బాధపడుతుంది. మీనా ఫోన్ చేస్తున్నా.. బాలు లిఫ్ట్ చేయకపోవడంతో బాయ్ ఫ్రెండ్ రాజేష్ చూసి.. మీనా ఫోన్ లిఫ్ట్ చేయమని అంటాడు. కానీ,ఇంట్లో జరుగుతున్న విషయాలను చెబుతాడు. 'ఇంట్లో మాకు రూమ్ లేకుండా చేశారు. నేను ఎక్కడైనా పడుకుంటా.. కానీ, మీనా రోజంతా పనిచేసి.. అలసిపోతుంది. అలాంటి మీనా ఎక్కడ పడుకుంటుంది. కనీసం రూమ్ లేకుండా చేశారు' అంటూ కథ మొత్తం చెప్తారు.
అందుకే తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పారు.

మరోవైపు శృతి డబ్బింగ్ స్టూడియో కు రవి వెళ్తాడు. రవిని చూసి సర్ప్రైజ్ అవుతుంది. మనం టూర్ కి వెళ్దామని చెప్తాడు. కానీ, రవిని అలా చూసిన శృతి ఏం జరిగిందని ఆరా తీస్తుంది. దీంతో అసలు విషయాన్ని చెప్పేస్తాడు. అయినా.. ఇంటికి వెళ్ళిపోదాం ముందుగానే ఈ విషయాలను ఊహించాను. వాళ్ళ రూమ్ లో వాళ్లు ఉండటమే న్యాయం కదా అంటూ రవికి సర్ది చెబుతోంది. కానీ, రవి ఆందోళన చెందుతుంది ఇంటికి బయలుదేరుతారు.
మరోవైపు.. మీనాను వెతుక్కుంటూ ప్రభావతి వస్తుంది.'ఇక్కడ దాక్కున్నావా అంటూ మీనా పై మండిపడుతుంది. 'నాకు దక్కొవలసిన కర్మ పట్టలేదు. నేను ఏమైనా లక్షలకు లక్షలు ఎత్తుకొని వెళ్లలేదు కాదా' అని అంటుంది. 'అన్ని చేసి.. ఏం తెలియనట్లు ఉన్నావా.. వాడు రూమ్ కి తాళం వేసుకొని వెళ్లడానికి కారణం నువ్వే..' అంటూ మరోసారి మీనా ను నిందిస్తుంది. 'బాలు నేను చెప్తే వినే రకం అయితే.. గొడవ ఇక్కడ వరకు వచ్చేది కాదు' అంటుంది మీనా.
'ఒకరు సుఖంగా ఉంటే నువ్వు ఓర్చుకోలేవు. రవికి రూమ్ కావాలని ముందుగానే చెప్పాను. శృతి పెద్దింటి పిల్ల.. నువ్వు పేదింటి దానివి. వాళ్లు ఇంటికి రావడం నీకు ఇష్టం లేదు' అంటూ ప్రభావతి నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది. 'మీరు గతం మరిచి మాట్లాడుతున్నారు. శృతి, రవి ఇంటికి రావడానికి కారణం నేనే.. వాళ్ల గురించి పట్టించుకుంది నేను.' అంటూ ప్రభావతికి రివర్స్ మాట్లాడుతుంది.
'అన్ని చేసేవి చేసి.. ఇప్పుడు ఏం తెలియనట్లు మాట్లాడుతున్నావా? ఒక్కరోజు మొగడు పక్కన లేకపోతే పడుకోలేవా అంటూ అసహ్యంగా మాట్లాడుతుంది ప్రభావతి. 'చాలు అత్తయ్య.. మీకు ఆడపిల్ల ఉంది.. తనతో ఇలానే మాట్లాడతారా.. ఎన్నిసార్లు నన్ను అంటారు మీ కండ్లకు నేను ఎలా కనిపిస్తున్నాను. పని మనిషి కన్నా హీనంగా చూస్తున్నా.. మీ ఇంట్లో పడి ఉంటానని మీకు అలుసు. మీరు మాట్లాడే మాటలు అవతలి వాళ్లకు ముల్లల గుచ్చుకుంటాయని తెలుసా.. దయచేసి నన్ను పని మనిషిగా కాకుండా ఇంటి మనుషులా చూడండి' అంటూ ప్రభావతిని రిక్వెస్ట్ చేస్తోంది.
ఆయన ప్రభావతి రియలైజ్ కాకుండా..'మొగున్ని కొంగుకుముడి వేసుకున్నవ్.. వాడికి ఏ మందు పెట్టావే..ఈ విషయం శృతికి తెలిస్తే .. అక్కనుండే అక్కడికి వెళ్ళిపోతుంది. వెంటనే బాలుకి ఫోన్ చేసి.. వచ్చి రూమ్ తాళం తీయమని చెప్పు 'అని మీనాకు ఆర్డర్ వేస్తోంది ప్రభావతి. 'మీ మాటలు పడలేకనే ఇప్పటికి వందసార్లు ఫోన్ చేశా.. అయినా బాలేదు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు' అంటుంది మీనా. 'నేను ఏం చెప్పినా వినను. రవి, శృతి ఇంటికి వచ్చేలోపు బాలు వచ్చి రూమ్ తాళం తీయాలి. లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు' అంటూ మీనాకు వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి
'ఒకవేళ రవి గాడు ఇంట్లో నుండి వెళ్లిపోతే.. నీ కూడా ఇంట్లో చోటు ఉండదు' అంటూ వార్నింగ్ ఇస్తుంది. 'ఇంట్లో నుంచి వెళ్లగొడుతారా? ఆ పని చేయండి . బయటకు వెళ్లి కూలిపోయిన చేసుకుంటూ.. హాయిగా బతుకుతాను' అని ప్రభావతికి దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇస్తుంది మీనా. ఆ తర్వాత మీనా బాలుకు కంటిన్యూస్గా ఫోన్ చూస్తూనే ఉంటుంది. దీంతో బాలు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఏం జరిగిందని మీనా ను అడుగుతాడు. 'మీ మానానికి మీరు రూమ్ కు తాళం వేసుకొని వెళ్లిపోయారు. అందరు నన్ను నిందిస్తున్నారు. ఇప్పుడు మీరు వస్తారా? లేదా నన్ను ఇంట్లో నుండి వెళ్లిపోమంటారా' అంటూ మీన గట్టిగా అరుస్తుంది. దీంతో కంగారుగా బాలు ఇంటికి బయలుదేరుతారు.
ఇంట్లోకి బాలు రాగానే ప్రభావతి రెచ్చిపోతుంది. రూమ్ కు ఎందుకు తాళం వేసుకొని వెళ్లావ్? ఎవర్ని అడిగావ్? అంటూ నిలదీస్తుంది. 'ఎవరిని అడగాలి?' అని బాలు రివర్స్ గా ప్రశ్నిస్తాడు. ఈ ఇల్లు నాది.. రెండు రోజులు రూమ్ ఇస్తే ఏమవుతుంది అని ప్రభావతి అంటుంది. ఇందులో మనోజ్ కలుగ చేసుకుని అనవసరంగా గొడవ చేయక అని బాలుకు సలహా ఇస్తాడు. అయినా రెండు రోజులు రూమ్ ఇస్తే.. ఏమవుతుంది రోహిణి కూడా అంటుంది. 'మేము మాత్రమే అడ్జస్ట్ కావాలా.. అదే రెండు రోజులు మీరు ఇవ్వండి. నేను నా భార్య ఎలా కనిపిస్తున్నా మీకు.. వాడు ఇంటికి పెద్దవాడే కదా.. వాడు రూమ్ ఇవ్వచ్చు కదా.. మీరు అనవసరంగా నా మీద ఎందుకు నిందలు వెస్తున్నారు. అదే రూమ్ మీరు ఇచ్చి కిచెన్ లో మీరు పడుకోండి' అని అని బాలు అంటాడు.
గొడవ ఎక్కడ పెద్దగా అవుతుందోననీ మీనా కలగచేసుకొని.. ముందు రూమ్ తాళాలు ఇస్తారా ? లేదా ? అని బాలుని అడుగుతుంది. 'నాకు రూమ్ ఇచ్చే కర్మ పట్టలేదు. అవసరమనుకుంటే.. ఈ లక్షల మందిని వాడు రూమ్ ఇస్తాడు. ఆ పార్లరమ్మ కిచెన్ లో పడుకుంటుంది. ఈ లక్షలు మింగినోడు. ఏ పార్కులోను పడుకుంటాడు' అని బాలు అంటాడు. 'నాకు ఏ రూమ్ అవసరం లేదు' అంటూ మీనా ఏడుస్తుంది. దీంతో బాలు రియాక్ట్ అవుతూ,..' అసలు ఏం జరిగింది? ఎవరు ఏమన్నారు?' అంటూ మీన ను అడుగుతాడు.
'మీరు హాయిగా తాళం వేసుకొని వెళ్లిపోయారు. మాటలు పడాల్సింది. అవమానాలు ఎదుర్కోవాల్సింది నేనే' అంటూ తన బాధను బయటపడుతుంది మీనా. 'ఎవరేమన్నారు ? నువ్వు ఇంతగా ఏడుస్తున్నావంటే.. ఇంట్లో ఏదో పెద్ద గొడవ జరిగే ఉంటుంది?అని బాలు ప్రశ్నిస్తాడు. దీంతో ఎక్కడ మీనా తన పేరు చెబుతుందోనని ప్రభావతి టెన్షన్ పడుతుంది. మరోవైపు సత్యం కూడా వారి మాటలు వింటుంటాడు. ఇక్కడితో నేటి సీరియల్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











