Gunde Ninda Gudi Gantalu: సత్యం షాకింగ్ డెసిషన్.. ప్రభావతికి చుక్కలు చూపించిన బాలు..

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు సోమవారం ఎపిసోడ్లో 'మీనా ఏడుస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించిన బాలు..' నిన్ను ఎవరు ఏమన్నారు. ఎందుకు బాధపడుతున్నావ్ ? అంతగా ఏడుస్తున్నావ్..? కారణం ఏంటి చెప్పు. నువ్వు ఇంతలా ఏడుస్తున్నావంటే ఏదో పెద్ద గొడవే జరిగి ఉంటుంది' అని మీనాను బాలు ప్రశ్నిస్తాడు. దీంతో మీనా ఏడుస్తూ..' ఒక
రోజు కూడా మొగోడు పక్కన లేకుంటే .. పడుకోలేవా అన్నారు'అని ఏడుస్తుంది. అంత మాట ఎవరన్నారని బాలు అడుగుతాడు.' ఆ మాట అత్తమ్మనే అన్నది' అని రోహిణి అంటుంది. అయినా బాలు రూమ్ ఇవ్వకపోతే.. అంత మాట ఎలా అంటారు. ఈ విషయం నాకు నచ్చలేదని అంటీ అని ప్రభావతిని నిలదీస్తుంది రోహిణి.

మరోవైపు .. సత్యం ఆ మాటలు వినుకుంటూ ఇంట్లోకి వస్తాడు. దీంతో బాలు తన తన తల్లిపై మండిపడుతాడు. 'రవి చేసిన పని నచ్చక .. నేను రూమ్ కి తాళం వేసుకొని వెళ్ళిపోయాను. అందుకు నా భార్యను ఎంతమాట అన్నదో విన్నావా నాన్న .. ఏమైనా అనాలి అనుకుంటే నన్ను తిట్టమను, కానీ మీనా ఏం చేసింది 'అని బాలు ప్రశ్నిస్తాడు. 'మీనా మొదటి నుండి రూమ్ కు తాళం వేయొద్దు అని చెబుతూనే ఉంది కదా.. కానీ, నేనే రూమ్ కు తాళం వేసుకొని వెళ్ళిపోయాను. ఒక ఆడ మనిషి.. ఆడపిల్లతో అనకూడని మాట అన్నది. తల్లి అయిపోయింది కానీ అది వేరే వాళ్ళు అయ్యుంటే మరోలా ఉండేది. రవి గాడి పెళ్ళాం గొప్పింటి నుండి వచ్చింది నా పెళ్ళాం పేదింటి నుండి వచ్చింది కాబట్టి ఏమైనా అన్నా పడుతుందని ఇష్టమున్నట్లు మాట్లాడవచ్చా. ఆ మాటలకు అర్థాలు ఉండవా.. ఆ మాటలు ఆడపిల్ల మనసులో గాయం చేయవా? అని బాలు ప్రశ్నిస్తాడు.

Gunde Ninda Gudi Gantalu serial episode 345 january 27th 2024 here is full story

'అసలు ఏమనుకుంటున్నావు నా పెళ్ళాం గురించి.. అదే శృతి ప్రమాదంలో ఉంటే నలుగురు గుండాలను ఉరికించి కొట్టింది. బలం లేక.. శక్తి లేక.. తెగింపు లేక కాదు.. అత్త అని నిన్ను గౌరవిస్తుంది. ఆ గౌరవం లేకపోతే మరోలా ఉండేది' అంటూ ప్రభావతికి వార్నింగ్ ఇస్తాడు. ' అయినా కావాల్సింది నీకు రూమే కాదా అని వెళ్లి ఆ రూమ్ తాళం తీస్తాడు. ఇప్పుడు నీకు నచ్చిన వారికి రూం ఇచ్చోమని .. మీనాకు ధైర్యం చెప్పి అక్కడి నుండి తీసుకువెళ్తాడు.

అవమానంగా భావించిన సత్యం.. ప్రభావతి రూమ్ లోకి రమ్మని ఆర్డర్ వేస్తాడు. దీంతో ప్రభావతి భయపడుతూ రూమ్ లోకి వెళ్లింది. 'కడుపుకి అన్నం తింటున్నావా .. గడ్డి తింటున్నావా.. నీ నోటి నుండి ఆ మాట ఎలా వచ్చాయి. కొడుకు కోడలు సంసారం గురించి తప్పుగా మాట్లాడడానికి నీకు మనసు ఎలా వచ్చింది'అని ప్రభావతిని మందలిస్తాడు సత్యం. అయినా రవి శృతి ఇంట్లోకి రావడానికి కారణం మీనానేగా.. అలాంటి మీనాను అంత మాట ఎలా అన్నావు అని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు సత్యం. 'నేను అన్న మాటనే పట్టించుకుంటున్నారు. గాని మీనా ఏం చేసింది మీకు తెలుసా' అని టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది ప్రభావతి.

'నోరు మూసుకో.. అదే మాట మీనా నిన్ను అని ఉంటే.. నీతల ఎక్కడ పెట్టుకునే దానివి. వయసులో ఉన్నవాళ్లు రూమ్ ఇవ్వాలి.కానీ, ఈ వయసులో నీకు రూమ్ అవసరమా అని మీనా అంటే నీ పరువు ఏమయ్యేది. అలాగే శృతి గురించి మాట్లాడితే.. గొప్పింటి నుండి వచ్చింది అనుకో నీ కొడుకుని పెళ్లి చేసుకున్నప్పుడు. ఆ పిల్లకు తెలియదా వాడి స్తోమత ఏంటో.. అయినా గొప్పింటి నుండి వచ్చినా .. పేదింటి నుండి వచ్చినా.. మన ఇంటికి వచ్చాక అందరూ సమానమే. వారి మధ్య అనవసరంగా నువ్వే స్థాయి భేదం పెంచుతున్నావ్. ముగ్గురు కూడాలను సమానంగా చూడమని ఎన్నోసార్లు చెప్పాను'అంటూ ప్రభావతిపై మండిపడతాడు.

అయినా ప్రభావతి తన మాట తీరును మార్చుకోదు. దీంతో ప్రభావతిపై సత్యం కోప్పడతాడు. కొడుకులకు కోడలు మన అస్థికలను గోదావరిలో కలిపేటప్పుడు పుట్టి బూడిదే కదా అని అనుకోకుండా..మన గురించి తలుచుకుంటూ ఏడవాలి అది జీవితం అంటే అని ప్రభావతికి క్లాస్ పీకుతాడు. 'నేను అంత మాట అనుకోలేదు ఏదో కోపంలో నోరు జారింది'అని ప్రభావతి అంటుంది. 'సరేలే ఇకనుండి అయినా పేద ఇంటి కోడలు.. పెద్దింటి కోడలు.. అనే తారతమ్యాలు చూపించకుండా అందరితో సమానంగా చూడమని ప్రభావతికి చెబుతాడు సత్యం.

మరీ రవికి రూమ్ ఇవ్వకుంటే మన మర్యాద పోతుంది కదా అని సత్యంను ప్రశ్నిస్తుంది ప్రభావతి. దానికి కూడా తన దగ్గర ఒక పరిష్కారం ఉందని హాల్లోకి వెళ్లి.. తన కొడుకు, కోడళ్లను పిలిచి మాట్లాడుతాడు. 'ఇల్లు అంటే పర్ణశాలల ఉండాలి. కానీ చేపల మార్కెట్ లాగా.. కొత్త సినిమా టాకీస్ లో ఉన్నట్లుగా హడావిడిగా ఉండకూడదు. నాకే కాదు.. మీకు కూడా ప్రశాంతత ఉండాలి అందరూ ప్రశాంతంగా ఒకరికి ఒకరు సహకారం తో ఉండాలి' అని సత్యం చెప్తాడు‌. ఇంతలో మనోజ్ కలగచేసుకుని.. బాలు గాడి వల్లనే ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని గొడవ స్టార్ట్ చేస్తాడు.

'నావల్ల గొడవలు అవుతున్నాయా.. ఇంట్లో వాళ్లంతా నాపై నా భార్యపై పడితే ఏడుస్తున్నారు' అని బాలు మండిపడతాడు. దీంతో రోహిణి కలగజేసుకుని.. ఇలా రౌడి లాగా బిహేవ్ చేస్తే ఇంట్లో ఎలా ఉంటాం మామయ్య అని ప్రశ్నిస్తుంది. అయితే వెళ్లిపోండి అంటూ బాలు నోరు జారుతాడు. అయినా రూ. 40 లక్షలు తిరిగి తెచ్చి ఇస్తానంటేనే మా నాన్న వీడిని ఇంట్లోకి రానిచ్చాడు. వెళ్లి ఆ నలభై లక్షలు తీసుకొని రండి అని బాలు అంటాడు. దీంతో ఇంటిల్లిపాది షాక్ అవుతారు. దీంతో ఇంట్లో మాటా మాట పెరుగుతుంది.

ఈ విషయంలో సత్యం కలగజేసుకొని.. ఇక ఆపండి ఇప్పుడు రూమ్ సమస్య కదా.. రవికి నేను రూమ్ ఇస్తాను. అని తన నిర్ణయాన్ని చెబుతాడు. దీంతో ప్రభావతి షాక్ అవుతుంది. మన రూమ్ ఇవ్వడమేంటి అని ప్రభావతి అడుగుతుంది. నువ్వే కదా రవిని శృతిని ఇంట్లోకి రావాలని ప్రయత్నించావు. వారికి రూమ్ ఇవ్వాలంటే మనం రూమ్ లో ఉండకూడదని సత్యం అంటాడు. బాలు, మీనా, రోహిణి ఎంత నచ్చజెప్పిన సత్యం తన నిర్ణయం మార్చుకోడు. ఇదే తన నిర్ణయమని, సత్యం చాప, నిందు తీసుకుని వచ్చి హాల్ లో వేసుకుంటాడు. దీంతో బాలు తాను రూం ఇస్తానని అంటాడు.

'అవసరం లేదు. ఇది నా బాధ్యత. నేను కిందపడుకుంటా.. మీ అమ్మ సోఫాలో పడుకుంటుంది' అని తన నిర్ణయాన్ని చెబుతాడు సత్యం. దీంతో ప్రభావతి షాక్ అవుతోంది. మొగుడి మాట కాదనలేక.. సరే అంటుంది. ఇంతలోనే రవి, శ్రుతి ఇంటికి చేరుకుంటారు. ఇంతతో నేటీ సిరీయల్ ముగిసిపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X