Gunde Ninda Gudi Gantalu january 28th: మామను తప్పుబట్టిన కోడలు.. మరదలపై బావ కన్నెర్ర..

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు మంగళవారం ఎపిసోడ్లో సత్యం షాకింగ్ డెసిషన్ తీసుకుంటారు. తాను ఇకనుండి హాల్లోనే పడుకుంటానని, తనకు రూమ్ అవసరం లేదని తెగేసి చెప్తాడు. ఇంట్లో వారు వద్దని చెప్పిన సత్యం వినడు. రవికి తాము రూమ్ ఇస్తామని బాలు చెప్పినా.. తాను ఇక నుండి హాల్లోనే ఉంటానని చెప్తాడు. దీంతో బాలు తన రూమ్ లో ఉన్న బెడ్ తీసుకువచ్చి ఇస్తాడు. మరోసారి మీనా తమ రూం ఇస్తామని అంటుంది. దీంతో ప్రభావతి 'వాళ్ళే రూమ్ ఇస్తారని అంటున్నారు కదా.. మనం వాళ్ళ రూమ్ లోకి వెళ్దాం' అంటుంది. 'నీకు కష్టంగా అయితే.. నువ్వు వెళ్ళు నేను మాత్రం ఇక్కడనే ఉంటా' అని సత్యం తెగేసి చెప్తాడు.

ఇంతలోనే రవి శృతి ఇద్దరూ ఇంటికి చేరుకుంటారు. 'ఏమైంది ఇక్కడ ఉన్నారు. రూమ్ కు ఏమైనా పెయింటింగ్ వర్క్ చేస్తున్నారా' అని శృతి ప్రశ్నించగా.. 'నాన్న ఇకనుంచి ఇక్కడే ఉంటానని అంటున్నారు' అని మనోజ్ చెబుతాడు. ఎందుకని రవి ప్రశ్నించగా.. 'నిన్ను కన్నందుకు.. నువ్వు లేచిపోయినందుకు.. తిరిగి సిగ్గు లేకుండా మళ్లీ ఇంట్లోకి వచ్చినందుకు..' అంటూ బాలు రెచ్చిపోతాడు. మధ్యలో నేనేం చేశానని రవి బాధపడతాడు. 'నీలాంటి వాడు ఇంట్లో ఒక్కడుంటే చాలు.. తల్లిదండ్రులు రోడ్డు మీద పడతారు' అని నానా మాటలు ఉంటాడు బాలు.

Gunde Ninda Gudi Gantalu serial episode 346 january 28th 2024 here is full story

దీంతో శృతి రియాక్ట్ అవుతూ..'మీరు రెండు రోజులు రూమ్ ఇవ్వమంటే లాక్ వేసుకొని వెళ్లిపోయారు కదా.. ఇదేమైనా లార్జ్ అనుకున్నారా.. లేదా జైలు అనుకున్నారా..' అని బాలుని నిలదీస్తుంది. 'దొంగలు, ఖైదీలు ఇంట్లో అడుగుపెడితే.. ఇల్లు జైలే అవుతుంది' బాలు అంటాడు. దీంతో 'మైండ్ యువర్ వర్డ్స్.. ఏదంటే అది పడడానికి నేను మీనా ఇలాంటి దాన్ని కాదు' అంటూ బాలుకి శృతి వార్నింగ్ ఇస్తుంది. 'ఇకనుండి ఏం మాట్లాడాలో.. పేపర్ పై డైలాగులు రాసి ఇవ్వు డబ్బుడమ్మా అని వెటకారంగా మాట్లాడుతాడు బాలు.

దీంతో సత్యం ఎంటర్ అయ్యి..'వదిన తల్లితో సమానం.. తమ్ముడు భార్య కన్న కూతురితో సమానం.. అలాంటి వారితో గొడవలు పడడం సరికాదు, వాళ్లను అనే హక్కు నీకు లేదు' అని బాలుకి వార్నింగ్ ఇస్తాడు సత్యం. ఏంటమ్మా.. ఇదంతా అని రవి ప్రభావతిని అడుగుతాడు. 'ఆ జైల్ వార్డెన్ రెండు రోజులు రూమ్ ఇవ్వమంటే ఇవ్వలేదు. అందుకే ఇలాంటి గతి పట్టింది' అని ప్రభావతి బాధపడుతుంది. 'మాకోసం ఎవరు ఇబ్బంది పడవద్దు.. కావాలనుకుంటే మేము ఇంట్లో నుండి వెళ్లిపోతాం' అని రవి అంటాడు. దీంతో ప్రభావతి షాక్ అవుతుంది.

'మిమ్మలను వెనక్కి పంపించడానికిగా ఇంత కష్టపడింది. నోరు మూసుకొని నీ గదిలోకి నువ్వు వెళ్ళు..' అని రవికి చెబుతుంది ప్రభావతి. 'అసలు దీనంతటికీ కారణం అంకుల్.. అవును.. తప్పు మీరే చేశారు అంకుల్..' అంటుంది శ్రుతి. దీంతో ఇంటిల్లిపాది షాక్ అవుతారు. నేనేం తప్పు చేశానని సత్యం అడుగుతాడు. 'అంకుల్ కు లాంగ్ విజన్ లేదు. అదే ముందు విజన్ ఉంటే.. ఇలా జరిగేది కాదు. ముగ్గురు కొడుకులు ఉన్నప్పుడు.. మూడు గదులు కట్టించాల్సి ఉండేది' అని శ్రుతి అంటుంది.

లాంగ్ విజన్ అంటే అర్థం కాక బాలు.. పక్కనే ఉన్న మనోజ్ ను అడుగుతాడు. నాన్నకు ముందు దృష్టి లేదని మనోజ్ సమాధానం ఇస్తాడు. 'ఈ అమ్మాయి ఏమైనా కళ్ళ డాక్టర్..? ముందు చూపు లేదని రోహిణి అర్థం చెప్తుంది. 'నిజమేనమ్మ కన్నపుడు ఆ విలువ తెలియలేదు. వారు పెరిగి పెద్దయ్యాకనే ఆ బాధ్యత, ఆ బాధ తెలిసి వస్తుంది. నిజంగానే నాకు ముందు చూపులేదు.నా లెక్క ఎక్కడో తప్పింది' అంటూ సత్యం ఫీల్ అవుతాడు. దీంతో రవి అవన్నీ వదిలేయ్ నాన్న మీ గదికి మీరు వెళ్ళండి అని రిక్వెస్ట్ చేస్తాడు దీంతో శృతి మళ్లీ ఇన్వాల్వ్ అయ్యి.. మీ నాన్ననే రూమ్ ఇచ్చాక మళ్లీ ఎందుకు ఫీల్ అవుతావ్.. వచ్చేటప్పుడు లగేజ్ తీసుకొని రమ్మని చెబుతోంది.

ఆ తర్వాత సత్యం అందర్నీ ఎవరి రూమ్ కి వాళ్లని వెళ్ళమని చెబుతాడు. 'ఏంటండీ మన పరిస్థితి' అని ప్రభావతి బాధపడుతుంది. 'చిన్న కోడలు చెప్పినట్లు మనకు ముందు చూపు లేదు. మనం అంత దూరం ఆలోచించలేదు. తనే నా కళ్ళు తెరిపించింది, కొడుకులు కోడళ్ళు సంతోషంగా ఉంటే చాలు' అని సత్యం ఫీల్ అవుతాడు. ఆ తర్వాత రవితో శృతి మాట్లాడుతూ.. ఇక్కడ అంతా బాగానే ఉందని, నువ్వు పక్కన ఉంటే ఎక్కడైనా తాను సంతోషంగానే ఉంటానని శృతి చెపుతుంది. కానీ, తాను మాత్రం .. ఎక్కడ ఇబ్బంది పడుతున్నావోనని, చాలా ఫీల్ అవుతున్నాయని, కాస్త ఆగి ఉంటే మనం ఈఎంఐలో ఇల్లు తీసుకొని హ్యాపీగా ఉండే వాళ్ళం అని రవి తన మనసులోని మాటను బయట పెట్టేస్తాడు.

ఇప్పటివరకు అందరితో కలిసి ఉండాలని.. ఇప్పుడు సొంతిల్లు అంటున్నావ్.. అని శ్రుతి ప్రశ్నించగా.. నువ్వు ఇక్కడ అన్ కంఫర్ట్ గా ఉంటున్నావ్ అని కాస్త బాధేస్తోంది అని రవి అంటాడు. మరోవైపు బాలు, మీనాల మధ్య మరోసారి వాగ్వాదం జరుగుతుంది. 'నువ్వు చేయడం వల్లనే అత్త, మామయ్య కింద హాల్లో పడుకున్నారు. ఇంట్లో ఇంత పెద్ద గొడవ జరగడానికి కారణం నువ్వే' అని
బాలుని నిందిస్తుంది. 'ఎప్పటికైనా ఈ సమస్య బయటపడాల్సిందే.. అందుకు ఈరోజు ఇలా జరిగింది. ఈరోజు రెండు రోజులు రూమ్ అడిగారు.. ఆ తర్వాత రెండు నెలలు రెండు సంవత్సరాలు. మనల్ని ఇంట్లో ఉండి వెళ్ళగొట్టడానికి ప్లాన్ చేశారని అసలు విషయాన్ని చెబుతాడు బాలు.

ఇదిలాఉంటే.. శృతి సర్ప్రైజ్ అంటూ రవి దాబా పైకి తీసుకువెళ్తుంది. అక్కడ టెంపరరీ టెంట్ ను చూసి రవి షాక్ అవుతాడు.. ఇదేలా ఇక్కడికి వచ్చిందని అడుగుతాడు రవి. మీకు తెలియకుండా షాపింగ్ చేశాననీ, ఆ సర్ప్రైజ్ ఇదేనని చెబుతుంది. ఇంట్లో ఏదైనా గొడవ జరిగితే.. ఇద్దరం ఇక్కడికి వచ్చి పడుకోవచ్చు కదా.. అని ఈ టెంట్ తీసుకున్నారని అసలు విషయం చెబుతోంది శృతి. రూమ్ ఉండగా ఈ టెంట్ అవసరమా అని రవి అంటాడు. ప్రశాంతత ఎక్కడ ఉంటుందో అక్కడనే స్వర్గంలా ఉంటుంది. జీవితంలో నువ్వు నా పక్కన ఉంటే.. ఎలాంటి కష్టం వచ్చినా ఇట్టే మరిచిపోతానని శృతి భారీ డైలాగులు వేస్తుంది. దీంతో రవి కరిగిపోతాడు. నువ్వు నా జీవితంలోకి రావడం చాలా లక్కీ అని సంతోషపడుతాడు. ఆ తర్వాత మెల్లగా రొమాన్స్ లోకి జారిపోతారు. ఇక తెల్లారాక ప్రభావతి .. తన చిన్న కోడలు కోసం కాఫీ స్వయంగా రెడీ చేసి తీసుకొని వాళ్ల రూమ్ కి వెళ్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X