Gunde Ninda Gudi Gantalu january 29th: టెంట్ లో సంసారం పెట్టిన రవి.. ప్రభావతిపై శోభ ఫైర్..

Gunde Ninda Gudi Gantalu january 29th: గుండె నిండా గుడి గంటలు బుధవారం ఎపిసోడ్ లో మనోజ్ ఎక్సైజ్ చేయడానికి దాబా పైకి వెళ్తాడు. అక్కడ రవి శృతి టెంట్ వేసుకొని పడుకున్న విషయం తెలియక కంగారు పడతాడు. దాబాపై దొంగలు టెంటు వేసుకున్నారని ఇంట్లో వారందరిని దాబా పైకి తీసుకువెళ్తాడు. మరోవైపు.. రూమ్ లో రవి,శృతి కనిపించపోయేసరికి ప్రభావతి కూడా కంగారుపడుతుంది. టెంట్ లో ఎవరు ఉన్నారో చూడటానికి ఎవరు కూడా ముందుకు వెళ్లి చూడడానికి సాహసం చేయరు. దీంతో ఫ్యామిలీ మెంబర్స్ అంతా .. కర్రలు కట్టలతో టెంట్ చుట్టుముడుతారు. అటాక్ చేయడానికి సిద్దమవుతారు. ఇంతలోనే రవి, శృతి టెంట్లో నుండి బయటకు వస్తారు. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు.

అసలేం జరిగింది? ఇక్కడెందుకు పడుకున్నారు? అని ప్రభావతి అడుగుతుంది. ' నేను నిన్న టెంట్ కొన్నాను. అది ఎలా ఉంటుందో నాని నైట్ ధాబాపై టెంట్ వేసుకుని పడుకున్నామని, ఎన్సిసి క్యాంపులకు, అడవిలో టూర్లకు వెళ్ళినప్పుడు నేను అలానే టెంట్లో పడుకునేదాన్ని ' అని శృతి చెబుతోంది.'గొడవపడి మరి మీకు రూమ్ ఇస్తే.. ఇంట్లో పడుకుంటారా?' అని ప్రభావతి అడుగుతుంది. 'అది కాదు ఆంటీ.. నాకు ఏది చేయాలనిపిస్తే అది చేస్తా.. చేసి తీరాల్సిందే అంతే.. అందుకే రవిని కూడా తనతో పాటు పైకి తీసుకువెళ్లాలని చెబుతోంది' శ్రుతి. దీంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక రవి తెల్ల ముఖం వేస్తాడు.

Gunde Ninda Gudi Gantalu serial episode 347 january 29th 2024 here is full story

ఈ విషయంపై సత్యం సీరియస్ అవుతాడు. 'మీకు రూమ్ ఇచ్చే విషయంలో గొడవలు జరుగుతున్నాయి. మీరు ఇబ్బంది పడవద్దని, మేము రూము ఇస్తే.. మీరు దాబా పై వెళ్లి పడుకున్నారా? అసలు మీ ఉద్దేశం ఏంటి ? నలుగురు చూస్తే ఏమనుకుంటారు ?' అని సత్యం సీరియస్ 'నలుగురితో మనకు సంబంధం ఏంటి? అంకుల్ .. మనకు నచ్చింది చేసుకుంటూ వెళ్లాలి? అంటూ తింగరి సమాధానమిస్తుంది శృతి.

ఇది ఒక కుటుంబం.. దానికి తగ్గట్లు నడుచుకో అంటూ సత్యం రవికి వార్నింగ్ ఇస్తాడు. 'ఈ కాలం పిల్లల అలవాట్లు చాలా కొత్తగా ఉన్నాయి. ఆ రోజులలో ఇలాంటివి మనకు తెలియవు కదా' అంటూ శృతిని సమర్థించే ప్రయత్నం చేస్తుంది ప్రభావతి. 'తెలుసుకోవాలనుకుంటే నువ్వు వెళ్లి ఆ టెంట్లో పడుకో.. ఎప్పుడు ఏం మాట్లాడతావ్ నీకైనా అర్థమవుతుందా..' అని ప్రభావతిపై ఫైర్ అవుతాడు సత్యం. 'చూసావు కదా మీ నాన్న ఎంత కోపంగా ఉన్నాడో.. ఆయనను బాధ పెట్టకు రా.. ఈ టైంలో బాలు ఉంటే మరోలా ఉండేది' అని రవికి ఇన్ డైరెక్టుగా శృతికి ప్రభావతి చెబుతుంది.

మరోవైపు..శోభ శృతికి ఫోన్ చేస్తుంది. అత్తారింటికి వెళ్లి రెండు రోజులు అవుతుంది. కనీసం ఫోన్ కూడా చేయలేదు. అక్కడ సంసారం ఎలా ఉంది అని ప్రశ్నిస్తోంది. తాను రెండు రోజుల నుండి ఫుల్ బిజీ అందుకే ఫోన్ చేయడం లేదని శ్రుతి సమాధానం ఇస్తుంది. సరేలే ఇప్పుడు ఏం చేస్తున్నావ్ ? ఎక్కడ ఉన్నావ్ అని అడుగుతుంది శోభ.'ఈరోజు స్టూడియోకి వెళ్లలేదని, ఇంటి దగ్గరనే ఉన్నానని, దాబాపై టెంట్ సదురుతున్నానని చెబుతుంది' అని శ్రుతి చెబుతుంది. టెంట్ ఏంటి ? అని శోభ ప్రశ్నించగా.. తాను నైట్ టెంట్ లోనే పడుకున్నానని, అంతముందుకు రోజు గొడవ జరిగిందని చెబుతుంది. పూర్తి విషయం తెలుసుకోకుండా శోభ ఫోన్ కట్ చేసి డైరెక్ట్ గా ఇంటికి వస్తుంది.

వచ్చి రాగానే అటు ప్రభావతిపై అరుస్తుంది శోభ. ఇదేనా మా బిడ్డకు ఇచ్చే గౌరవం.. ఓ కోడలు ఇలాగానే చూసుకుంటారా.. కొత్తగా సంసారం వచ్చిన వారికి కనీసం రూమ్ కూడా ఇవ్వకుండా దాబాపై పడుకోబెడతారా? అంటూ సీరియస్ అవుతుంది. ఎవరు చెప్పే ప్రయత్నం చేసిన శోభ మాత్రం వినకుండా హేళన చేస్తుంది. అసలు విషయం తెలియకుండా ఎందుకు అలా మాట్లాడుతున్నావ్ అని శ్రుతి అన్నగాని శోభ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. దాబాపైనా రూమ్ కట్టడానికి సత్యం తన భర్త కాళ్లు పట్టుకున్నాడుగా అంటూ మాట జారుతుంది. ఇంతలోనే బాలు ఎంట్రీ ఇస్తాడు. శోభ అన్న మాటలకు ఆగ్రహంతో ఊగిపోతాడు. కాళ్లు పట్టుకోవడానికి మీ ఆయన ఏమైనా అంటూ దిమ్మ తిరిగిపోయేలా సమాధానమిస్తాడు బాలు. ఇంతటీతో సిరియల్ ముగుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X