Gunde Ninda Gudi Gantalu january 30th: శోభపై బాలు ఫైర్.. మిస్ అండర్ స్టాండింగ్ తో రచ్చ.. సారీ చెప్పమన్న సత్యం.

Gunde Ninda Gudi Gantalujanuary 30th: గుండె నిండా గుడి గంటలు గురువారం ఎపిసోడ్లో శోభ పై బాలు రెచ్చిపోతాడు. ముగ్గురు కొడుకులు పుడితే మూడు రోజులు కట్టాలా.. అయితే.. మీ ఇంట్లో పది రూమ్ ఉంటే.. పదిమందిని కన్నారా అంటూ నోరు జారుతాడు. వీలైన ఏమన్నా గాడిదనా.. మా నాన్న వసుదేవుడా.. ఇంటి లోన్ కోసం మా నాన్న ఆయన కాళ్లు పట్టుకోవడానికి.. మీ ఆయన ఏమైనా సొంత డబ్బులు ఇచ్చాడా? అయినా మా నాన్న వెదవ కాళ్లు పట్టుకోవాల్సిన కర్మేంటి? 'అని బాలు రెచ్చిపోతాడు. దీంతో రవి.. 'కాస్త మర్యాదగా మాట్లాడు అన్నయ్య 'అని బాలు అని అంటాడు. 'ఎవడికి రా మర్యాద ఎవరికి ఇవ్వాలి? లేచిపోయి పెళ్లి చేసుకున్న వాడి అత్తకి ఇవ్వాలా? తిరిగి మన ఇంటికి వచ్చిన నీకు ఇవ్వాలా' అని అడుగుతాడు. అయినా మీ విషయం గురించి నేను ఏం మాట్లాడటం లేదు.. లోన్ కోసం ఆ వెధవ కాళ్లు పట్టుకున్నాడని మీ అత్తయ్య అంటేనే నేను సమాధానం చెబుతున్నాను అని బాలు అంటాడు.

దీంతో ప్రభావతి..'ఎంత మాట వస్తే అంత మాట అనేస్తావా ' అని బాలు పై కోప్పడుతుంది. 'ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడుతాడు. అందుకే మీ ఇంటికి మేము పిల్లనివ్వమని అన్నాం. మీ నాన్నను వెధవ అంటున్నాడు.. నేను వాడిని రౌడీ వెధవ అని అనాలా.. ఇలాంటి పచ్చి రౌడీ తో ఏం మాట్లాడుతాం' అంటూ బాలుని అవమానిస్తుంది శోభ. దీంతో మీనా రియాక్ట్ అవుతూ.. 'ఏం మాట్లాడుతున్నారు. మా మామయ్య గురించి తప్పుగా మాట్లాడితే.. మేము పడుతూ వినాలా' అంటూ ఫైర్ అవుతుంది. ఇంతలో ప్రభావతి కలగజేసుకుని.. అనవసరంగా ఈ విషయాన్ని ఇంతటితో ఆపేయండి అంటూ అరుస్తుంది.

Gunde Ninda Gudi Gantalu serial episode 348 january 30th 2024 here is full story

'మీ ఆయనను అంటే నీకు చీమకుట్టినట్టు కూడా లేదా ..' అని బాలు ప్రశ్నించగా.. ఆమె లోన్ గురించి తప్పుగా మాట్లాడడం తప్పే.. కానీ మాటకు మాట అనుకుంటూ వెళ్తామా..' అని గొడవను పెద్దది కాకుండా చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ, శోభ మాత్రం తగ్గకుండా.. 'ఇలాంటి రౌడీలు.. గుండాలు.. తిరిగి చోట నా కూతుర్ని ఉంచలేను ఇంటికి వెళ్దాను.. పదవే ' అని శృతిని లాగుతుంది శోభ. దీంతో ఇంటికి పట్టిన దరిద్రం పోయింది అని బాలు సంతోషిస్తాడు. ఇంతలోనే.. సత్యం వస్తాడు. ఏమైందమ్మా అని శోభాను ప్రశ్నించగా.. నా కూతుర్ని నా ఇంటికి తీసుకు వెళుతున్నాను అని సమాధానం ఇస్తుంది.

మళ్లీ ఎప్పుడు పంపిస్తారని సత్యం ప్రశ్నించగా.. మీ ఇంట్లో తన కూతురు ఉంచడం తనకి ఇష్టం లేదని, అందుకే శాశ్వతంగా తీసుకువెళుతున్నానని సమాధానం ఇస్తుంది. 'మీరు మాకు అప్పజెప్పి వెళ్లారు కదా.. మాట తప్పి మళ్లీ ఎలా తీసుకువెళ్తారు .. అని సత్యం ప్రశ్నిస్తారు. మీరు బాగా కుంటామని మాటిస్తేనే ఇక్కడ అప్పజెప్పి వెళ్లాను. కానీ కనీసం వారికి రూమ్ కూడా ఇవ్వలేదు కదా ..' అని శోభా అంటుంది. అదేం లేదు.. మేము రూమ్ ఇచ్చాం.. మా గదిలోని వారు పడుకుంటున్నారు' అని సత్యం అంటాడు. 'రూమ్ ఇస్తే శృతి మేడపై ఎందుకు పడుకుంటుంది' అని శోభ ప్రశ్నిస్తుంది.

దీంతో సత్యం కు కోపం వస్తుంది. 'ఏరా నేను మెడపై పడుకోమని అన్నానా?' అంటే అని రవిని నిలదీస్తాడు. అయినా ఈ విషయం ఎవరు చెప్పారని మీనా శోభను ప్రశ్నిస్తుంది. రూమ్ ఇవ్వకుంటే తాము దాబా పై పడుకున్నామని శ్రుతి చెప్పిందని అంటుంది శోభ. దీంతో శృతి అసలు విషయం చెబుతోంది. అందరూ ఈ విషయాన్ని మిస్ అండర్స్టాండింగ్ చేసుకుని మాట్లాడుతున్నారు. తాను టెంట్ కొన్నామని సరదాగా దాబాపై పడుకున్నామని చెప్పాను. కానీ రూమ్ ఇవ్వలేదు అని చెప్పలేదంటూ తన తల్లికి క్లియర్ గా చెబుతోంది. దీంతో శోభ పరువు పోతుంది. ఆ తర్వాత మీనా మాట్లాడుతూ..'మా మామయ్య అత్తమ్మ హాల్లోనే పడుకుంటున్నారు వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలని వారి రూమును వాళ్లకు ఇచ్చారు ఆయన ఆడపిల్లను ఇచ్చినచోట కాస్త అనుకోగా ఉండాలి'అంటూ మీనా అంటుంది. దీంతో శోభ తల కొట్టేసినట్లు అవుతుంది.

'అయినా ఆమె పిల్లను ఎక్కడ ఇచ్చింది. మనోడే వాళ్ళ పిల్లను ఎత్తుకొని వెళ్లి పెళ్లి చేసుకున్నాడు' అని వెటకారంగా మాట్లాడుతాడు బాలు. ' చూశారా మీ ముందే ఇలా మాట్లాడుతున్నాడో ..అందుకే నేను ఈ ఇంటికి తన కూతుర్ని పంపించానని మొదటి నుండి చెప్తూనే ఉన్నాను'అని శోభా మరో డైలాగు వేస్తుంది. మీ కూతుర్నే కాదు మావోడిని కూడా తీసుకువెళ్ళు'అని బాలు సమాధానం ఇస్తాడు. బాలు.. ఇలానైనా పెద్దవారితో మాట్లాడేది అంటూ బాలుని మందలిస్తాడు. 'ఆయన ఏం తప్పుగా మాట్లాడలేదు మామయ్య.. శృతి వాళ్ళ మమ్మీనే అతిగా మాట్లాడింది'
అని అసలు విషయం చెప్పబోతోంది. దీంతో ప్రభావతి అడ్డుపడుతుంది. ఇప్పటివరకు వాడు గొడవ చేశాడు ఇప్పుడు నువ్వు గొడవ చేస్తున్నావా.. మాట మాట అంటే అదే పట్టుకుని కూర్చోవాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

అయినా ఇదింతా నీ వల్లనే జరిగిందని ప్రభావతిని పై మండిపడతాడు బాలు. మీ వాడు ఏమైనా తక్కువ మాట్లాడాడ.. ఆయన మా ఆయన గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు అంటూ సత్యం కు చెబుతోంది. దీంతో అసలు విషయం తెలియక సత్యం బాలుని సారీ చెప్పమని అడుగుతాడు. వాళ్ళ ఆయన ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్న తాను సారీ చెప్పనని, అసలు తాను చెయ్యని తప్పుకు సారీ ఎందుకు చెప్పాలని పక్కనుండి వెళ్ళిపోతాడు బాలు. ఇకనుండి ఇక్కడ విషయాలను మీ అమ్మగారికి చెప్పేటప్పుడు కొంచెం క్లారిటీతో చెప్పమ్మా అంటూ శృతికి సలహా ఇస్తాడు. అవమానంతో శోభా కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత బాలు తన ఫ్రెండ్స్ తో కలిసి మందు తాగడానికి బార్ కి బయటకు వెళ్తాడు. మార్గమధ్యంలో తన ఫ్రెండ్ రాజేష్ ను ఒరిస్తడు‌. ఇంతతో సిరియల్ కంప్లీట్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X