Gunde Ninda Gudi Gantalu january 31th: మీనా ప్రయత్నం వృధా.. ఆలుమగల మధ్య చిచ్చుపెట్టిన బాలు..
Gunde Ninda Gudi Gantalujanuary 31th: గుండె నిండా గుడి గంటలు శుక్రవారం ఎపిసోడ్ లో బాలు తన ఫ్రెండ్స్ తో కలిసి బార్ కు వెళ్తాడు. ఇంట్లో జరిగిన విషయాలను గుర్తుకు చేసుకుంటూ ఫుల్ గా తాగుతాడు. ఈ సమయంలో ఓ వ్యక్తితో బాలు గొడవ పడతాడు. దీంతో బాలు ఫ్రెండ్స్ సారీ చెప్పి..అక్కడి నుంచి పట్టుకవస్తారు. తనని ఆపినందుకు బాలు తన ఫ్రెండ్ రాజేష్ ను కొడతాడు. నీకు కూడా కోపం వచ్చింది కదా.. ఇంట్లో నా పరిస్థితి కూడా ఇలానే ఉంది. అనవసరమైన విషయాలలో మీనా ను ఇన్వాల్వ్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. ఆ విషయాలను చూస్తూ నేనే సైలెంట్ గా ఉండలేను అని బాలు క్లారిటీగా చెబుతాడు. దీంతో మరో ఫ్రెండ్ కూడా సైలెంట్ అవుతాడు. కానీ రాజేష్ మాత్రం.. అనవసరంగా ప్రతి విషయానికి గొడవ పడొద్దు అని సూచిస్తాడు.
ఆ తర్వాత బాలు సైలెంట్ గా ఇంటికి వెళ్లాడు. బాలు వాలకం చూసిన మీనా.. ఫుల్లుగా తాగొచ్చాడని అర్థం చేసుకుంటుంది. తాగొచ్చావా ? అని బాలుని అడుగుతే .. తాను తాగలేదని అబద్ధం చెప్తాడు బాలు. దీంతో మీనా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లాగా మీనా ఓ టెస్ట్ పెడుతుంది. దాని బాలు కూడా ఓకే చెబుతాడు. మీనా గీత గీయకుండానే.. గీత గీసినట్లు చెప్పి.. ఆ లైన్ పై నడవమని చెబుతోంది. ఫుల్లుగా తాగి ఉన్న మైకంలో బాలు అక్కడ గీత ఉందో లేదో అనే విషయం గమనించకుండా.. అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తాడు. చూశావా నేను ఎంత జాగ్రత్తగా నడిచానో.. నేను తాగలేదని అంటాడు బాలు. తాను అసలు గీత గీయలేదని, అసలు విషయం చెబుతోంది మీనా. అలా మీనా చేతికి బాలు దొరికిపోతాడు.

ఆ తర్వాత తిందామని రమ్మని బాలును డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళుతుంది మీనా. తనకోసం ఎగ్ ఆమ్లెట్ వేయమని బాలు అడుగుతాడు. తాను పొద్దు నుండి కంటిన్యూగా పనిచేస్తున్నాననీ, సాయంత్రం ఇంటిల్లిపాదికి చపాతీలు చేశారని చెబుతుంది. ఇంతలోనే శృతి, రవి బయటికి వెళ్లి వస్తారు. వారిని కూడా తిందాం రమ్మని పిలుస్తుంది మీనా. సారీ వదిన తాము బయటనే తినొచ్చామని బదిలిస్తాడు రవి. దీంతో బాలుకి కోపం వస్తుంది. తినే ప్లేట్ ను కింద పడేసి, ఆలుమగలు ఇష్టం ఉన్నట్లు బయట బలాదూర్ గా తిరిగివచ్చి, బయటనే తిని వచ్చామని చెబితే ఎలా? మీ కోసం మీనా కష్టపడి చపాతీలు చేసింది. ఇప్పుడు ఆ చపాతీలు తినాల్సిందేనని బాలు పట్టుపడతాడు.
తాను బయట తిని వచ్చామని, ఆ విషయాన్ని ముందుగా చెప్పకపోవడం తన తప్పేనని రవి సారీ చెబుతాడు. కానీ, బాలు పట్టించుకోడు. రవిని లాక్కొచ్చి నోట్లో చపాతీలను కుక్కుతాడు. దీంతో శృతికి ఎక్కలేని కోపం వస్తుంది. బుద్ధి లేదా అంటూ బాలుని నానా మాటలు అంటుంది. దీంతో బాలు రివర్స్ అవుతాడు. లేచిపోయిన వాళ్ళు బుద్ధి గురించి మాట్లాడుతున్నారా? అని ప్రశ్నిస్తాడు. దీంతో శ్రుతి రియాక్ట్ అవుతూ.. తాము బయట తినొచ్చామని చెప్తున్నా కదా.. పాడైతే డస్ట్ బిన్ లో పాడేయండి .. కానీ బలవంతంగా నోట్లో కుక్కుతారా ? అంటూ పొగరుగా సమాధానం ఇస్తుంది.
ఇంతలోనే మనోజ్, రోహిణి వాళ్లు కూడా రూమ్ లో నుండి బయటికి వస్తారు. శృతికి నచ్చజెప్పి ప్రయత్నం చేయకుండా.. మాకు ఇది రోజు అలవాటయింది. బాలు తాగి వస్తే.. ఇలానే గొడవ చేస్తాడు అంటుంది శ్రుతి. ఈ విషయం ఆల్రెడీ తనకు రవి చెప్పాడని, బాలు రోజు పీకలదాకా తాగి వచ్చి ఇంట్లో కూడా వచ్చేస్తాడని, ఇల్లును వారి జోన్ గా మార్చాలని రవి చెప్పాడని శృతి అంటుంది. ఏరా ఇంటికి వచ్చే ముందే నీ పెళ్ళానికి అన్ని విషయాలు చెప్పావా.. నేను మాత్రమే తాగుతానని చెప్తావా.. మనం నీ బర్త్ డే నాడు దాబాపై తాగిన విషయాన్ని నీ పెళ్ళాన్ని చెప్పలేదా? అని బర్త్ డే పార్టీ గురించి బయటపెడతాడు బాలు.
దీంతో శ్రుతి, రోహిణి, ప్రభావతి షాక్ అవుతుంది. మనోజ్, రవి కూడా తాగుతారా అని ప్రశ్నిస్తుంది ప్రభావతి. ఒక్కొక్కడు మూడు- నాలుగు బీర్లు తాగుతారనీ, ఆ రోజు కాటన్ బీర్లు తాగేశారని అని బాలు అసలు విషయాన్ని బయటపెడుతాడు. దీంతో తమను తాము కవర్ చేసుకోవడానికి అటు మనోజ్.. ఇటు రవి తిప్పలు పడుతారు. ఏదో బర్త్డే నాడు జోష్ లో తాగానని రవి చెప్పగా.. మనోజ్ మాత్రం తనని బలవంతం చేసి తాగిపించారని అంటాడు. బలవంతం చేస్తే మూడు బీర్లు తాగుతారా అని వాళ్ళ బాగోతాన్ని బయటపెడతాడు బాలు. దీంతో 'నీకుంది' అనుకుంటూ మనోజ్ ను రూంలోకి లాక్కెళ్తోంది రోహిణి. మరోవైపు శృతి కూడా కోపంగా రవిని రూమ్ లోకి రమ్మని వార్నింగ్ ఇస్తుంది. ఇలా నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











