Gunde Ninda Gudi Gantalu February 3rd: 500 తులాల బంగారం.. నోరెళ్ళబెట్టిన ప్రభావతి.. మీనాను టార్గెట్ చేసిన శోభ
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు సోమవారం ఎపిసోడ్ లో బాలు తాగి వచ్చి ఇంట్లో గొడవ చేయడంతో మీనా అవమానంగా భావిస్తుంది. అలాగే.. శ్రుతి అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఏడుస్తోంది. ఇంతలో బాలు వచ్చి ఏమైందని ప్రశ్నిస్తాడు. మీరు తాగొచ్చి.. ఇంట్లో గొడవ చేయడం వల్ల తనకు మనశ్శాంతి లేకుండా పోయిందని, తోడికోడళ్ల ముందు తలెత్తుకొని తిరగలేకపోతున్నానని అంటుంది. తాను ఆ విషయాన్ని అసలు పట్టించుకోవడంలేదని, వాళ్ళను మనుషులుగా కూడా చూడడం లేదని అంటాడు. మీరు పట్టించుకున్నా.. పట్టించుకోకపోయి.. తాను మాత్రం అందరితో కలిసి ఉండాలని, అందుకే తలెత్తుకొని తిరగలేకపోతున్నానని బాధపడుతుంది. సర్లే అని కనీసం తినడానికి అయినా రమ్మని బాలు మీనాను రిక్వెస్ట్ చేస్తాడు. కానీ, మీనా మాత్రం తనని వదిలేయమని తినకుండా పస్తుల పడుకుంటుంది. దీంతో బాలు ఫీల్ అవుతాడు.
మరుసటి రోజు ఉదయం మీనా కాఫీ తీసుకుని శ్రుతికి ఇవ్వడానికి వెళుతుంది. ఇంతలో శృతి కిందికి వచ్చేస్తుంది. మరోవైపు.. రోహిణి కూడా తనకు కాఫీ కావాలని అడుగుతుంది. ముగ్గురికి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం రమ్మని శృతి అంటుంది. దీంతో మీనా.. రోహిణి కూడా కాఫీ తీసుకుని వచ్చి.. ముగ్గురు హాల్లో కూర్చొని
కాఫీ తాగుకుంటూ కబుర్లు చెప్పుకుంటారు. తమ మొగుళ్ల మీద జోకులు వేసుకుంటూ నవ్వుకుంటారు. ఇంతలో ప్రభావతి అక్కడికి వస్తుంది. ముగ్గురు కోడలు నవ్వుతూ మాట్లాడుకోవడం చూసి మండిపడుతుంది. ఎలాగైనా వారిని డిస్టర్బ్ చేయాలని ప్రయత్నిస్తోంది.

ఈ విషయాన్ని గమనించిన సత్యం .. ముందు ఈ నీళ్లు తీసుకోమని అంటాడు. ఇప్పుడు నాకు నీకెందుకు అని ప్రశ్నించగా.. కళ్ళల్లో నిప్పులు పోసుకోకు.. ముగ్గురు కోడలు సంతోషంగా అక్కాచెల్లెళ్ల ఉండడం చూసి తట్టుకోలేకపోతున్నావు కదా.. అంటాడు. మీనా వారితో మాట్లాడుకుంటూ కూర్చుంటే.. ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? ఇంట్లో పని పాతర పెట్టి.. పనిమనిషి జాతరకు వెళ్లినట్లు ఉంది వ్యవహరముందని అంటుంది. దీంతో సత్యంకు కోపం వస్తుంది. అనవసరంగా వాళ్లను డిస్టర్బ్ చేయమని సత్యం సూచిస్తాడు. కానీ, ప్రభావతి.. మీనా దగ్గరికి వెళ్లి ఇంట్లో పనులన్నీ అలానే ఉన్నాయి. అలాగే, తనకు కాఫీ ఇవ్వమని అంటోంది.
దీంతో మీనా లేచి వెళ్లిపోవడానికి ట్రై చేస్తోంది. ఇంతలో శృతి రియాక్ట్ అవ్వతూ.. కాఫీ కదా అత్తమ్మ మీరే పెట్టుకోండి. మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. మేము సీరియస్ మ్యాటర్ లో ఉన్నాం ' అంటూ ప్రభావతికి ఎదురు మాట్లాడుతుంది. దీంతో ప్రభావతి సైలెంట్ గా వంటింట్లోకి వెళ్ళిపోతుంది. అలా తోడికోడళ్ళు కాసేపు సంతోషంగా గడుపుతారు. తన కోడల్లు అక్కచెల్లెలులా కలిసిపోయారని సత్యం సంతోషిస్తాడు. కానీ, ప్రభావతి మాత్రం కండ్లలో నిప్పుపొసుకుంటుంది.

ఆ తరువాత శోభ తన కూతురు కోసం నగలు, పండ్లు తీసుకొని వస్తుంది. శోభను చూడగానే ప్రభావతి ఎనలేని రెస్పెక్ట్ ఇస్తుంది. ఒకవైపు శృతి,రవి లను పిలుస్తోంది. మరోవైపు మీ నాకు తొందరగా కాఫీ తీసుకురమ్మని ఆర్డర్ వేస్తోంది. మరోవైపు సత్యం ను కూడా పిలుస్తుంది. మొత్తానికి కంగారు కంగారుగా శోభను వీఐపీల చూస్తుంది. తాను శ్రుతి కోసం బంగారు ఆభరణాలు తీసుకొచ్చానని చూపిస్తుంది. తనకు ఇలాంటివి ఇష్టం ఉండవని తెలుసు కదా మరి ఎందుకు తీసుకువచ్చావ్ అంటూ తన తల్లిని ప్రశ్నిస్తుంది. అయినా నువ్వు ఇచ్చిన వీటిని తీసుకెళ్లి లాకర్ లో పెట్టడం తప్ప తాను వేసుకోనంటుంది శృతి. ప్రస్తుతం తాను తన కూతురికి పెళ్లి కట్నకానుకలుగా 30 తులాల బంగారం ఇస్తున్నారని, మరో 500 తులాల బంగారం ఇంట్లో ఉందని చెబుతోంది. దీంతో ప్రభావతి.. 500 తులాలా.. అంటూ అవాక్కవుతుంది. కానీ, సత్యం కు ఈ విషయం అసలు నచ్చదు.
ఇప్పుడు ఇలాంటి కట్నకానుకలు అవసరమా? తాము ఇలాంటి కట్నకానుకలను ఎప్పుడు ఆశించలేదు కాదా? రవి,శృతి ప్రేమించుకున్నప్పుడు.. డబ్బుపై ఆశతో రవి.. శ్రుతిని ప్రేమించాడంటూ సురేంద్ర లేనిపోని మాటలు అన్నాడని గుర్తు చేస్తాడు.ఇప్పుడు ఈ కానుకలను తీసుకుంటే.. సురేంద్ర మాటలే నిజమవుతాయి. ఇప్పుడు కట్న కానుకలను వద్దు అంటాడు. వాస్తవానికి ఈ కట్నకానుకలను సురేంద్రనే ఇచ్చి పంపారంటుంది. అయినా.. ఏ ఆడపిల్ల అయినా అత్తగారింటికి వెళ్తే ముందు.. పుట్టింటి వారు ఇలాంటి బంగారం పెట్టడం ఆనవాయితీగా వస్తుంది కదా .. ఇది మా కూతురికి మేము ప్రేమతో ఇస్తున్న కానుకలు అంటుంది శోభ.
సత్యంకు ఇష్టం లేకపోయినా.. ప్రభావతి మాత్రం తీసుకోమని సత్యం ను ఫోర్స్ చేస్తుంది. ఇక చేసేది ఏం లేక.. మొహమాటంగానే బంగారు ఆభరణాలను తీసుకోవడానికి సత్యం అంగీకరిస్తాడు. అయితే.. ఆభరణాలను తమ కాకుండా శృతి, రవి లకు ఇవ్వమని సత్యం సూచిస్తాడు. దీంతో ప్రభావతి తెగ సంతోషపడుతుంది. తనకి ఆ బంగారాభరణాలు ఇచ్చినట్లు ప్రభావతి ఊహల్లో తేలిపోతుంది.


Click it and Unblock the Notifications











