Gunde Ninda Gudi Gantalu February 4th: అగ్గిరాజేసిన శోభ.. మీనా దెబ్బకు ప్రభావతికి ముచ్చెమటలు

Gunde Ninda Gudi Gantalu February 4th: గుండె నిండా గుడి గంటలు సోమవారం ఎపిసోడ్ లో శోభ తన ప్లాన్ లో భాగంగా ప్రభావతి ఇంట్లో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తుంది. ప్రతి ఆడపిల్లకు తన పుట్టింటి నుండి బంగారం తీసుకురావడం ఆనవాయితీగా మారింది కదా. దాని ప్రకారమే మేము కూడా తీసుకోవచ్చాము అంటూ గొప్పలు చెబుతుంది. ఈ విషయం తనకు నచ్చలేదని సత్యం అంటున్న.. శోభ మాత్రం సాంప్రదాయాలను తాము మర్చిపోము అంటూ బదులిస్తోంది. మీ పెద్ద కోడలు కూడా భారీగానే తెచ్చుకుంటుంది కదా అని మీనా గురించి ఇన్ డైరెక్ట్ గా ఆరా తీస్తుంది. రోహిణి వాళ్ళ నాన్న మలేషియాలో ఉంటాడు వాళ్లకు పెద్ద పెద్ద బిజినెస్ లు ఉన్నాయి. అయితే. వీళ్ల పెళ్లి సమయంలో వాళ్లు ఇక్కడికి రాలేకపోయారు.

అందుకే మేమే గుళ్లో సింపుల్ గా పెళ్లి జరిపించాం.. వాళ్ల నాన్న తలుచుకుంటే.. 1000 తులాల బంగారమైన ఈజీగా పెట్టేస్తాడు అంటూ లేని పోనీ గొప్పలు చెబుతుంది ప్రభావతి. రోహిణి తన బండారం ఎక్కడ బయట పడుతుందోనని.. ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు లేండి అంటూ టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇక మీ రెండో కోడలు ఎంత తీసుకొచ్చిందని శోభ మెల్లగా చిచ్చు పెడుతుంది. దీంతో ప్రభావతి రెచ్చిపోతుంది. మీనాను టార్గెట్ చేస్తూ.. 'తను తీసుకురాక పోగా.. మేమే ఎదురు ఇవ్వాల్సి వచ్చింది' అంటూ మీనాను అవమానిస్తాడు. 'అయినా ఏ కోడలు కైనా అత్తగారింటికి తీసుకువచ్చిన దాన్నిబట్టి కదా గౌరవం, మర్యాద. మీనా వాళ్ళ నాన్న బతికున్న ఈ పెళ్లి చేసేవాడు కాదు. వాళ్ల నాన్న మా ఆయన బస్సు కింద పడి చచ్చాడు. దీంతో ఆ పాపం మా మెడకు చుట్టుకుంది. మా ఆయన మంచితనంతో మీనాను మా కోడలుగా చేసుకున్నాం' అంటూ మాట జారుతుంది. దీంతో మీనా అక్కడి నుండి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది.

Gunde Ninda Gudi Gantalu serial episode 351 February 4th 2024 here is full story

ఆ తరువాత ప్రభావతి.. మళ్ళీ మీనాను వెతుక్కుంటూ వస్తుంది. ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నావా? ఇంట్లో పనులు ఎవరు చేస్తారనుకుంటున్నావు? అంటూ మరోసారి రెచ్చిపోతుంది. దీంతో మీనా సహనం కోల్పోతుంది. ఎక్కడ కూర్చొని ఏడవాలో కూడా మిమ్మల్ని అడగాలా ? ఇంట్లో పనులు చేయడానికి వేరే ఆడవాళ్లు లేరా? వాళ్లకు పనులు రావా? ఇంట్లో పనులు చేయడానికి నన్ను కోడలుగా తీసుకువచ్చారా? అంటూ ప్రభావతి నిలదీస్తుంది మీనా. 'ఏంటి బాగా మాట్లాడుతున్నావ్? చిన్నా లేక పెద్ద తేడా తెలియకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావా' అంటూ ప్రభావతి అరుస్తుంది. 'నీతో మాట్లాడాలంటే కోటీశ్వరుల కూతురే అయి ఉండాలా..' అంటూ ప్రభావతిని నిలదీస్తుంది. దీంతో ఇంట్లో వాళ్లంతా బయటకి వస్తారు. ఏం జరిగిందని అడుగుతారు. దీంతో ప్రభావతి రియాక్ట్ అవుతూ.. తిన్నది అరగడం లేదు అందుకే ఇలా మాట్లాడుతుంది అంటూ మరోసారి ప్రభావతి నోరు జారుతుంది.

'మా నాన్న గురించి ఎంత తప్పుగా మాట్లాడారో మర్చిపోయారా.. నా తండ్రి గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను. ఈ లోకంలో లేని మనిషి గురించి మాట్లాడితే బాగోదు. నా త్రండ్రి ఏం పాపం చేశారు' అంటూ మీనా సీరియస్ అవుతుంది. మీనా తో ప్రభావతి వ్యవహరించిన తీరును రవి, శృతి కూడా తప్పుపడతారు. ఎంత బాధపడి ఉండి ఉంటే.. వదిన అలా మాట్లాడుతుంది అని రవి అనగా.. టాపిక్ ఏదైనా మీనాను టార్గెట్ చేస్తున్నారు అంటూ శృతి కూడా తన అత్తయ్య ను తప్పుపడుతుంది. దీంతో ప్రభావతి మొఖం మాడిపోతుంది.'నేను ఉన్న విషయమే కదా చెప్పింది' అంటూ తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది.

దీంతో మీనా రియాక్ట్ అవుతూ.. మొత్తం విషయం చెప్పకుండా మీరు చెప్పాలనుకున్న విషయం మాత్రమే చెప్పారు కదా.. మరి నన్ను ఎవరికి ఇచ్చి పెళ్లి చేద్దామని మ్యారేజ్ ఫిక్స్ చేశారు? ఆరోజు 40 లక్షల తీసుకొని మనోజ్ పారిపోయిన విషయం ఎందుకు చెప్పలేదు. అవి కూడా నిజాలే కదా.. మీరు ముగ్గురు కోడలు సమానంగా చూడరా? అంటూ మీనా ప్రభావతిని అడుగుతుంది. 'చూశారా .. మర్యాద లేకుండా మాట్లాడుతుందో? ' అంటూ ప్రభావతి ఏం తెలియనట్లు మాట్లాడుతుంది. దీంతో సత్యం రియాక్ట్ అవుతూ.. 'మర్యాద అనేది మన వయసును బట్టి కాదు. మన ప్రవర్తన బట్టి ఇస్తారు. ఆ గౌరవాన్ని నువ్వే పోడగొట్టుకుంటున్నావు' అంటూ సీరియస్ అవుతాడు. శృతి, రవి కూడా ప్రభావతిని తప్పు పడతారు. నోరు జారడం వల్ల మీ పెద్దరికం మీరే కోల్పోతున్నారు అంటూ శృతి కూడా అనేస్తుంది.

'ఇప్పుడు అంటున్న.. మీనాకు గతి లేదు. దీని పుట్టింటికి గతి లేదు. మనమే దీని మెడలో బంగారం వేసుకొని తీసుకొచ్చా..' అంటూ మరోసారి మీనాను అందరి ముందు అవమానిస్తుంది దీంతో మీనా అక్కడినుండి ఇంట్లోకి వెళుతుంది. మీనా సడన్ గా వెళ్లిపోయేసరికి ఏం చేస్తుందో అంటూ మిగతావారు. ముగ్గురు కోడలు ఒక విధంగా చూడమని ఎన్నో సార్లు చెప్పానని సత్యం ప్రభావతి మీదా ఫైర్ అవుతాడు. ఇంట్లో నుండి మీనా తన అత్తగారు పెట్టిన నగలు తీసుకోవచ్చు ఇస్తుంది. 'తీసుకోండి.. మీ నగలు వీటిలో నాకు వీసమెత్తు బంగారం కూడా అవసరం లేదు' అంటుంది మీనా. ఇంతలోనే బాలు వస్తాడు. ఏం జరుగుతుంది అని అడుగుతాడు. దీంతో సత్యం రియాక్ట్ అవుతూ.. ' మీ అమ్మ చేసిన నిర్వాహకం.. అందుకే మీనా ఇలా చేసింది' అంటాడు.

మీనాకు సత్యం నచ్చప్రయత్నం చేస్తాడు. తాను ప్రాణం పోయినా ఆ బంగారాన్ని వేసుకోవాలని, తనకు అవసరం లేదని అంటుంది. అయితే నీ మెడలో ఉన్న తాళిబొట్టు కూడా మేము చేయించింది అని ప్రభావతి నోరు జారుతుంది. మీరు ఆ విషయం కూడా అంటారని తెలుసా.. ఇగో మీ తాళి అంటూ తాళిని తీసివేసి ప్రభావతికి ఇచ్చివేస్తోంది. దీంతో ఇంట్లో వారంతా షాక్ అవుతారు. తన ముందే తన భార్య తాళి తీసివేయడం బాలుకి కూడా అవమానంగా అనిపిస్తుంది. భర్త ముందు తాళి తీసివేయడం సరికాదని సత్యం అంటాడు.. నా పుట్టింటి స్థాయికి తగ్గట్లుగా తాను పసుపు కొమ్ము కట్టుకున్నానని అందరికీ చూపించి మరోసారి షాక్ ఇస్తుంది మీనా. నా స్థాయి ఇదే నా పుట్టింటికి తగ్గట్లుగా నేను తాళిబొట్టు తీసివేసి పసుపు కొమ్ము కట్టుకున్నాను. మరోసారి నా తండ్రి గురించి తక్కువ చేసి మాట్లాడితే బాగోదు అంటూ ప్రభావతికి వార్నింగ్ ఇస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X