Gunde Ninda Gudi Gantalu February 5th: ప్రభావతి కన్నింగ్ ప్లాన్.. మీనా, బాలు వేరే కాపురం..

Gunde Ninda Gudi Gantalu February 5th: గుండె నిండా గుడి గంటలు బుధవారం ఎపిసోడ్ లో మీనా ప్రభావతికి మాస్ వార్నింగ్ ఇస్తుంది. తన తండ్రి గురించి మరోసారి తక్కువ చేసి మాట్లాడితే.. తనకు ఇలానే శివంగిలా రెచ్చిపోతానని, తాను ఆత్మ అభిమానం చంపుకొని ఉండలేనని వార్నింగ్ ఇస్తుంది. మీనాను అవమానించడంతో సత్యం కూడా బాధపడతాడు. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? అంటూ ప్రభావతిని తిడతాడు. శృతి కూడా మీనాకు సపోర్ట్ గా మాట్లాడుతుంది. మీనా చేసింది 100% కరెక్ట్ అయినట్టు ప్రభావతి నీ తప్పుపడుతుంది.

రోహిణి కూడా ప్రభావతి చేసింది కరెక్ట్ కాదని, ఎవరైనా తాళి కూడా అడుగుతారా అని తన అత్తయ్యను ప్రశ్నిస్తుంది రోహిణి. అనంతరం బాలు వెళ్లి మీనా ను ఓదార్పుతాడు. అందరి ముందు కరెక్ట్ గా మాట్లాడావని, తాను ఏ నగలు కావాలంటే ఆ నగలు చేయిస్తానని, ఏమేం కావాలో ఓ లిస్ట్ రాసి ఇవ్వమని బాలు అంటాడు. తనకు ఎలాంటి నగలు అవసరం లేదని, కేవలం తాళిబొట్టు మాత్రమే కావాలని బాలు అంటాడు. ప్రపంచంలో ఏ భార్య కూడా భర్తను తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోదని అలాగే ఇలా లిస్టు వేసి నగలు కావాలని ఆర్డర్ వేయలేదని అంటుంది మీనా.

Gunde Ninda Gudi Gantalu serial episode 352 February 5th 2024 here is full story

మీనా కోరికను ఎలాగైనా తీర్చాలని బాలు బ్లైండ్ గా డిసైడ్ అయిపోతాడు. మరోవైపు ప్రభావతి మీనాక్షి ఇంటికి వెళుతుంది. కాఫీ ఇవ్వమని కోరుతుంది. కాఫీ తెచ్చేలోపే మీనాక్షి బెడ్ రూమ్ లో వెళ్లి దర్జాగా పడుకుంటుంది. దీంతో మీనాక్షి అవాక్కవుతుంది. తనకు ఈ పాపం తెలియనట్లుగా బాలు మీనా వల్ల ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని, మీనా బంగారం తీసుకురాలేదని విషయం శోభకు చెప్పానని, అంతమాత్రాన మీనా తన మెడలో ఉన్న మంగళసూత్రంతో సహా అన్ని నగలు ఇచ్చేసిందని, కావాలని అందరి ముందు తనని విలన్ చేసిందంటూ లేనిపోని ఆరోపణలు చేస్తుంది ప్రభావతి.

తాళిబొట్టు తీసేసిన విషయం చెప్పగానే మీనాక్షి కూడా షాక్ అవుతుంది. భర్త ఉండగానే తాళిబొట్టు చేయడం కరెక్ట్ కాదని, మీనా మనసు ఎంత గాయపడిందో అంటూ మీనాక్షి కూడా ఫీలవుతుంది. అదేం లేదు మీనా కావాలని తనని అందరి ముందు అవమానించిందని ప్రభావతి అంటుంది. ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించానని, బాలు మీ నాన్నను ఇంట్లో నుండి బయటకు వెళ్లగొట్టాలని తాను నిర్ణయించుకున్నట్లు తన ప్లాన్ మీనాక్షి చెబుతుంది. ఈ విషయాన్ని మరోసారి ఆలోచించమని మీనాక్షి సలహా ఇచ్చిన ప్రభావతి మాత్రం తాను ముందే ఫిక్స్ అయ్యానని , తాను ఎవరి మాట విననని అంటుంది ఈరోజు నుండి తాను ఏంటో ఇంట్లో చూపిస్తానని, బాలు మీనా ఇంట్లో నుండి వెళ్లిపోయేంతవరకు చుక్కలు చూపిస్తానంటూ ప్రభావతి తన కన్నింగ్ ఐడియాను చెబుతుంది

మరుసటి రోజు ఉదయం మీనా వంటింట్లో టిఫిన్ చేస్తూ ఉంటుంది. అయితే కరెంట్ లేకపోవడంతో అందరికీ వేడి నీళ్లు పెట్టమని ఆర్డర్ వేస్తోంది. అలా మొదటిగా శృతికి నీళ్లు పెట్టమని చెబుతుంది. దీంతో సరేనని నీళ్లు పెడుతుంది. మరోవైపు బాలు ఈ విషయాన్ని గమనిస్తూ ఉంటాడు. నీళ్లు కాగానే శృతిని పిలిచి తీసుకోపొమ్మని మీనా చెబుతోంది. ఈ విషయాన్ని గమనించిన ప్రభావతి శృతిని ఇలా అక్కడ పెట్టుకుని మీ నాన్న పిలిచి తన బాత్రూంలో పోసి రమ్మని ఆర్డర్ వేస్తుంది. తర్వాత మాట ప్రకారం మీనా తన తోడికోడలుకు సహాయం చేస్తుంది. ఆ తర్వాత మనోజ్ కూడా తనకు వేడి నీళ్లు కావాలని, ఎక్సైజ్ చేసి వచ్చేవరకు పెట్టమని అంటాడు.

దీంతో మీనా తాను పెట్టననీ, అవసరం అనుకుంటే తన భార్యను పెట్టమని అంటుంది మీనా. దీంతో ప్రభావతి రెచ్చిపోతుంది. ఎందుకు పెట్టవని మీనా ను నిలదీస్తోంది. పక్కనే ఉన్న బాలు ఒక్కసారిగా లేచి ఎందుకు పెట్టాలి అని గట్టిగా అడుగుతాడు. దీంతో ప్రభావతి సైలెంట్ అక్కడినుండి వెళ్ళిపోతుంది. దీంతో సీరియల్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X