Gunde Ninda Gudi Gantalu February 6th: అత్తా కోడళ్ళ మధ్య బాలు చిచ్చు.. సత్యం సంచలన నిర్ణయం.. రోడ్డున పడ్డ మీనా

Gunde Ninda Gudi Gantalu February 6th: గుండె నిండా గుడి గంటలు గురువారం ఎపిసోడ్ లో మీనా బాలుని ఎలాగైనా ఇంట్లో నుండి పంపించాలని ప్రభావతి ప్రయత్నిస్తుంది. ఉదయం లేవగానే మీనాకు వరుసగా పనులు చెబుతూ తీరిక లేకుండా చేస్తుంది. ఈ విషయాన్ని బాలు గమనిస్తూనే ఉంటాడు. ఇంతలోనే మనోజ్ వచ్చి తనకు వేడి నీళ్లు కావాలని చెబుతాడు. వెంటనే ప్రభావతి.. మీనాకు పిలిచి మనోజ్ కు వేడి నీళ్లు పెట్టుకొని ఆర్డర్ వేస్తోంది. తాను మనోజ్ కు వేడి నీళ్లు పెట్టనని, కావాలనుకుంటే రోహిణిని వచ్చి వేడి నీళ్లు కాచుకోమని మీనా బదులిస్తుంది. తాను చెప్పిన పనిచేయవా? అంటూ మీనాపై ప్రభావతి మండిపడుతుంది. మనోజ్ కు మాత్రం తాను వేడి నీళ్లు పెట్టనని అంటుంది.

ఈ విషయంలో బాలు కలగజేసుకొని.. వాడికి నా పెళ్లాం వేడినీళ్లు ఎందుకు పెట్టాలి? వాడికి పెళ్ళాం లేదా? వాడి పెళ్లాంను వచ్చి నీళ్లు పెట్టమని అంటాడు. ఇలా తెల్లారగా ఇంట్లో గొడవ ప్రారంభమవుతుంది. మనోజ్ కు బుద్ధి చెప్పాలని బాలు.. ఎవరికీ తెలియకుండా మనోజ్ స్నానానికి చన్నీటికి బదులు వేడి నీటిని పెడతాడు. ఆ విషయం తెలియక మనోజ్ వేడి నీళ్లను డైరెక్ట్ గా పోసుకుంటాడు. దీంతో మనోజ్ ఒళ్ళు కాలుతుంది. మంట మంట అంటూ వాష్ రూమ్ లో నుండి మనోజ్ నుండి బయటకు వస్తాడు. పెద్దకొడుకు అరుపులు విన్న ప్రభావతి పరుగున వెళ్లి ఏమైందని అడుగుతుంది.

Gunde Ninda Gudi Gantalu serial episode 353 February 6th 2024 here is full story

తన బకెట్ లో చన్నీళ్ళకు బదులు వేడి నీళ్లు పోసారని, ఆ విషయం తెలియక తాను డైరెక్ట్ గా పోసుకుంటే ఒళ్ళు కాలిపోయిందని మనోజ్ బాధపడుతాడు. వెంటనే మీనాను పిలిచి ఈ పని చేసింది నువ్వేనా అంటూ కోప్పడుతుంది. తనకు ఏ విషయం తెలియదని మీనా సైలెంట్ గా వెళ్లిపోతుంది. ఇంతలోనే బాలు వచ్చి వేడి నీళ్లు కావాలన్నాడు కదా.. నేనే వేడి నీళ్ళు పోసాను అని అంటాడు. దీంతో ప్రభావతి రియాక్ట్ అవుతూ.. ' మనిషివా.. రాక్షసుడివా..' అంటూ ప్రభావతి బాలుని ఇష్టం వచ్చినట్లు తిడుతుంది. మరోసారి తన భార్యకు ఇలాంటి పనులు చెప్తే చర్మం ఊడొచ్చేలాగా చేస్తా అంటూ వార్నింగ్ ఇస్తాడు.

ఈ విషయం ఎలాగైనా సత్యంకు చెప్పాలని హాల్ లో కాలు కాలిన పిల్లిలాగా తిరుగుతుంది. సత్యం రాగానే బాలుపై లేనిపోని కథలు చెబుతుంది. ఇంతలోనే బాలు రావడంతో.. వీడు ఈరోజు ఇంట్లో ఎంత పెద్ద ఘోరం చూశాడు తెలుసా.. కాస్తుంటే మనోజ్ కు తోలు ఉడొచ్చేది. చన్నీళ్ళకు బదులు వేడి నీళ్లు పోసాడు' అని ప్రభావతి చెబుతోంది. 'అదేం పనిరా అంటూ బాలుని అడుగుతాడు సత్యం. అదేం లేదు నాన్న.. నేను ఏదో కాస్త వేడి నీళ్లు పోస్తే .. దానికి మనోజ్ వాడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ప్రభావతమ్మ మరింత ఓవర్ యాక్షన్ చేస్తుంది. అందరు కలిసి మీనాను పని మనిషి లాగా చేశారు. దీనికి ప్రభావతమ్మనే ప్రెసిడెంట్. ఈ విషయం నచ్చలేదంటూ బాలు ఫీల్ అవుతాడు.

Gunde Ninda Gudi Gantalu serial episode 353 February 6th 2024 here is full story

సరే ఈ విషయం తర్వాత మాట్లాడుతా.. నీకు వర్క్ ఉంది కదా వెళ్ళిపో అంటూ గొడవ కాకుండా బాలుని బయటకు పంపిస్తాడు. బాలు వెళ్లిపోయాక.. ప్రభావతి సత్యంతో మాట్లాడుతుంది. ఇంట్లో రోజురోజుకు గొడవలు ఎక్కువవుతున్నాయని, ముగ్గురు కొడుకులు కోడలు ఉన్న ఉన్నారని మీరు సంతోషించినా.. బాలు, మీనాల వల్ల రోజుకో ఒక గొడవ జరుగుతూనే ఉంది. ఈ గొడవలన్నీంటికి తాను ఓ పరిష్కారమా ఆలోచించానని ప్రభావతి అంటుంది. ఏంటి ఆ పరిష్కారమని సత్యం అడుగగా.. బాలు, మీనాలను ఇంట్లో నుండి పంపించి, వేరు కాపురం పెట్టిద్దాం..అంటూ అసలు విషయాన్ని బయట పెడుతుంది.

దీంతో సత్యం షాక్ అవుతాడు. వాళ్లే ఎందుకు వెళ్లి ఇంటికి నుండి వెళ్లిపోవాలని ప్రభావతిని అడుగుతాడు. వాళ్ల వల్లనే ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని, ఇంట్లో కోటీశ్వర్ల ఇంట్లో నుండి వచ్చిన కోడలు ఉన్నారని, వాళ్లకు ఇలాంటి గొడవలు తెలియదు అంటుంది. పైగా తాను హాల్లో పడుకుంటున్నానని, తనకు కూడా ఓ రూమ్ కావాలని, బాలు, మీనాలను ఇంట్లో నుండి పంపిస్తే.. తనకు కూడా రూమ్ దొరుకుతుందని అంటుంది. తన నిర్ణయంపై అభిప్రాయం చెప్పమని సత్యంను అడుగుతుంది. దీంతో సత్యం ఏం చెప్పాలో అర్థం కాక తాను ఆలోచిస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

ఇక సాయంత్రం శృతి జ్యూస్ ఆర్డర్ చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. కానీ, ఇంట్లో సిగ్నల్ రాకపోవడంతో టేబుల్స్, బెంచీలు, సోఫాలు ఎక్కుతూ సిగ్నల్ కోసం ట్రై చేస్తుంది. ఈ విషయాన్ని గమనించిన ప్రభావతి ఏంటమ్మా అలా పైకి ఎక్కావ్ కింద పడిపోతావని జాగ్రత్తలు చెబుతుంది. తాను జ్యూస్ కోసం ఆర్డర్ చేసుకుంటున్నానని, కానీ, ఇంట్లో సిగ్నల్ రాకపోవడం లేదనీ, అందుకే ఇలా సోఫా పైకి ఎక్కానని అంటుంది. జ్యూస్ కోసం అర్డర్ చేయడమేంటీ? ఇంట్లో తాజా పండ్లు ఉన్నాయి. మీనా ఫ్రెష్ గా జ్యూస్ చేసి ఇస్తుంది కదా అంటుంది ప్రభావతి. దీంతో శ్రుతి రియాక్ట్ అవుతూ.. 'అన్ని పనులు మీనాకే చెప్పాలా ఆంటీ.. మీరు చేయొచ్చు కదా అంటుంది.

Gunde Ninda Gudi Gantalu serial episode 353 February 6th 2024 here is full story

తనకు అలాంటి పనులు రావని, మీనా అయితే చకచక పనులు చేస్తుందని శ్రుతిని పంపిస్తోంది. మీనా పిలిచి జ్యూస్ చేయమని ఆర్డర్ వేస్తుంది. ఇంతలోనే బాలు వచ్చి హల్లో దర్జాగా కూర్చుంటాడు. మీనా జ్యూస్ చేసి శ్రుతికి తీసుకువెళ్లాడాన్ని గమనిస్తాడు.ఆ జ్యూస్ ఎవరికి బాలు ప్రశ్నించగా.. శృతి కోసం ప్రిపేర్ చేశానని బదిలిస్తుంది మీనా. అవసరం లేదు అక్కడ పెట్టుమని అంటాడు బాలు.. అన్ని పనులు తన భార్యకే చెప్తారా? అని బాలు ఫైర్ అవుతాడు. దీంతో ప్రభావతి రోహిణి పిలుస్తుంది. ఆ జ్యూస్ ను చూడగానే.. తనకే నా అంటూ తీసుకొని తాగుబోతోంది. కాదు కాదమ్మా ఇది శృతికి అని చెప్తుంది. దీంట్లో రోహిణి కూడా షాక్ అవుతుంది.

ఈ విషయాన్ని గమనించిన బాలు.. రోహిణి పోస్ట్ పోయింది అంటూ కామెంట్స్ చేస్తాడు. ప్రభావతమ్మ ఏ ఎండకు ఆ గొడుగు పడుతుందని, ఇన్ని రోజులు మలేషియా మలేషియా అంటూ రోహిణికి సేవలు చేసిందని, ఇప్పుడు శృతి రాగానే.. రోహిణిని సైడ్ చేసిందనీ, శృతివైపు మళ్ళీంది అంటూ ఇకనుండి రోహిణిని పనిమనిషిలాగా చూస్తుందంటూ బాలు ఫిట్టింగ్ పెడుతాడు. దీంతో రోహిణి షాక్ అవుతుంది. ఇక్కడితో నేటి సీరియల్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X