Gunde Ninda Gudi Gantalu February 7th: తోడికోడలు కాళ్ళు పట్టుకున్న రోహిణి.. కన్నింగ్ ప్లాన్ వేసిన పార్లరమ్మ..

Gunde Ninda Gudi Gantalu February 7th: గుండె నిండా గుడి గంటలు శుక్రవారం ఎపిసోడ్ లో శృతి జ్యూస్ ఇవ్వమని రోహిణికి ప్రభావతి చెబుతుంది. దీంతో బాలు రియాక్ట్ అవుతూ పోస్ట్ పోయిందంటూ కామెంట్ చేస్తాడు. 'ప్రభావతమ్మ ఏ ఎండకు ఆ గొడుగు పడుతుంది. ఈరోజు శృతి నగలు తెచ్చింది. కాబట్టి.. మీనా పోస్ట్ నీకు వచ్చింది. ఇప్పుడు నిన్ను పని మనిషి లాగా చూస్తుందం'టూ కామెంట్ చేస్తాడు బాలు. దీంతో రోహిణి ఫీల్ అవుతుంది. కొత్తగా వచ్చిన శృతికి ప్రభావతి ఇచ్చే మర్యాద తనకు ఇవ్వడం లేదనీ, నగలు తెచ్చిన నుంచి శ్రుతికి ఇచ్చే మర్యాద వేరేగా ఉన్నాయని బాధపడుతుంది. అయినా.. తన అత్తయ్య మాట కాదనలేక శృతికి జ్యూస్ ఇవ్వడానికి వెళుతుంది.

ఈ సమయంలో శృతి బిజీగా ఉండి చూడకుండా థాంక్యూ మీనా అంటుంది. దీంతో రోహిణి మరింత హర్ట్ అవుతుంది. బాలు అన్నట్లుగానే తనకు మర్యాద ఇవ్వడం లేదని ఫీల్ అవుతుంది. ఆ తర్వాత శృతి కిందికి వచ్చి తనకు నెయిల్ కట్టర్ కావాలని అడుగుతుంది. దానికి నువ్వెందుకు శ్రమ పడటం ఎందుకు.. మన ఇంట్లోనే బ్యూటిషన్ ఉంది కదా అంటుంది ప్రభావతి. రోహిణి అని పిలిచి శ్రుతికి పెడిక్యూర్, మేనిక్యూర్ చేయమని ఆర్డర్ వేస్తుంది. శృతి వద్దని చెప్పినా.. రోహిణితో తానే బ్యూటీ పార్లర్ పెట్టించాననీ, ఆ బ్యూటీ పార్లర్ కు తన పేరే ఉంటుందని గొప్పలు చెబుతుంది.

Gunde Ninda Gudi Gantalu serial episode 354 February 7th 2024 here is full story

ఫైనల్ గా శృతికి రోహిణి పెడిక్యూర్ చేయిస్తుంది. ఇలా రోహిణితో శృతి కాళ్లు పట్టుకునేలా చేస్తుంది ప్రభావతి. వాస్తవానికి రోహిణి ప్రొఫెషన్ బ్యూటిషన్ అయినా.. తన తోడికోడలు కాళ్లు పట్టుకునే సరికి కాస్త ఫీల్ అవుతుంది రోహిణి. ఇంతలోనే మీనా అక్కడికి వస్తుంది. మీనా ను కూడా పెడిక్యూర్ చేయించుకోమని శృతి చెప్పగా.. ప్రభావతి రియాక్ట్ అవుతూ అందరూ సమానం కాదంటుంది. దీంతో మీనా ఫీల్ అయి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. రోహిణి తన గౌరవాన్ని తిరిగి తెచ్చుకోవాలని కన్నింగ్ ఓ ఐడియా వేస్తుంది.

తన ప్లాన్ లో భాగంగా తన అత్తయ్యకు మంత్లీ పాకెట్ మనీ గా 5000 ఇవ్వాలనీ, తన గౌరవాన్ని తిరిగి తెచ్చుకోవాలని భావిస్తుంది. ఎక్కువ నోట్లు ఉంటే బాగుంటుందని 50 రూపాయల నోట్ల కట్టను తీసుకువెళ్లి ప్రభావతికి ఇస్తుంది. దీంతో ప్రభావతి తెగ సంతోషపడుతుంది. మీలోనే తన తల్లిని చూసుకుంటున్నాననీ, ఆ అవసరం వచ్చిన తనని అడుగుమని రోహిణి డైలాగ్స్ వేస్తుంది. అనంతరం తాను వేసిన బిస్కెట్స్ వర్కవుట్ అయ్యాయా లేదా అని తెలుసుకోవడానికి రోహిణి.. తాను కాస్త పోయానని అంటుంది. వెంటనే మీనా ను పిలిచి రోహిణికి జ్యూస్ ఇవ్వమని ఆర్డర్ వేస్తుంది.

ఇలా తన కన్నింగ్ ఐడియాతో రోహిణి తన గౌరవాన్ని తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. రోహిణి డబ్బులు ఇచ్చిన విషయాన్ని మనోజ్ గమనిస్తాడు. తన తల్లి దగ్గరికి వెళ్లి తనకు పాకెట్ మనీ కావాలంటూ ప్రాధేయపడతాడు. ఇప్పటికైనా ఏదైనా ఓ జాబు చూసుకోమని, ఈ విషయం బాలుకి తెలిస్తే.. డైనింగ్ టేబుల్ ని కోర్టు టేబుల్ గా మారుస్తాడని, అప్పుడు ఇద్దరి ఇంట్లో నుండి వెళ్లగొడతాడని హెచ్చరిస్తుంది ప్రభావతి. ఇంటర్వ్యూకి వెళ్లాలన్న కనీసం కొంత పాకెట్ మనీ ఉండాలని రిక్వెస్ట్ చేస్తాడు. నీ కన్న నీ భార్యనే బెటర్ అంటూ.. 100 నో 200 లో చేతులు పెట్టి ఇదే చివరిసారి మరోసారి తనను డబ్బులు అడగవద్దని వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి.

Gunde Ninda Gudi Gantalu serial episode 354 February 7th 2024 here is full story

ఇక రాత్రి బాలు రాగానే మీనా వెంటనే రూమ్ లోకి తీసుకువెళ్లింది. తన అత్తయ్యను నెలనెలా పాకెట్ మనీగా కొంత డబ్బు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెబుతుంది. ప్రతినెల ఖర్చులకు డబ్బులు ఇస్తున్నాం కదా.. కొత్తగా ఈ పాకెట్ మనీ ఏంటి ? అని బాలు అడుగుతాడు. రోహిణి ఎక్స్ట్రాగా పాకెట్ మనీ ఇస్తుందని, మనం కూడా ఇద్దామంటుంది మీనా. ఇన్ని రోజులు లేనిది కొత్తగా పాకెట్ మనీ ఇవ్వడం ఏంటి ?అని బాలుకు సందేహం వస్తుంది. ఇలా డబ్బులు ఇవ్వడం వెనక ఏదో రహస్యం ఉందని, రోహిణి ఏదో పెద్ద విషయాన్ని దాచిపెడుతుందని భాలు అంటాడు.

మీనా కూడా తన కూడా ఏదో సందేహం కలుగుతుంది అంటుంది. పెళ్లి అయి ఇన్ని రోజులు అవుతున్న రోహిణి వాళ్ళ తల్లిదండ్రులను మనం చూడలేదని, కనీసం మలేషియా నుండి ఏ చిన్న గిఫ్ట్ కూడా రోహిణికి రాలేదని బాలు అంటాడు. మలేషియా చాలా దూరం కదా అందుకే రాలేకపోతున్నారు కావచ్చు అని మీనా అంటుంది. ఎంత మలేషియాలో ఉన్న.. కనీసం వీడియో కాల్ లో అయినా మాట్లాడొచ్చు కదా.. రోహిణి ఏదో విషయాన్ని దాచిపెడుతుందనీ, అందుకే ఆ విషయం బయటకు రాకుండా పాకెట్ మనీ అంటూ తన తల్లికి నెరవేస్తుందని బాలు అంటాడు. ఏదో ఒక రోజు రోహిణి బాగోతాన్ని బయటపెడతానని, మలేషియా భాగోతాన్ని గుట్టురట్టు చేస్తానని అంటాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X