Gunde Ninda Gudi Gantalu February 10th: సినిమా రేంజ్ లో ట్విస్ట్.. ప్రభావతికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సత్యం..
Gunde Ninda Gudi Gantalu February 10th: గుండె నిండా గుడి గంటలు సోమవారం ఎపిసోడ్ లో ప్రభావతి అర్ధరాత్రి లేచి బాత్రూంకి వెళ్లడానికి ఇబ్బంది పడుతోంది. సొంత రూమ్ లేకుండా హాల్లో ఉండడం కష్టంగా భావిస్తుంది. వాష్ రూమ్ కి వెళ్లడం కోసం మనోజ్ గది తలుపు తడుతుంది. కానీ, మనోజ్ తలుపు తీయడు. దీంతో బాలు రూమ్ కి వెళ్ళమని సలహా ఇస్తాడు సత్యం. పడుకున్నా కుక్కను లేపి మరీ కనిపించుకున్నట్లు ఉంటుందని, తాను మాత్రం అస్సలు వెళ్ళనని అంటుంది ప్రభావతి. ఇంకేం చేస్తాం.. బయట కామన్ బాత్రూం ఉంది కదా.. అందులోకి వెళ్ళమని సత్యం అంటాడు. తాను మాత్రం అందులోకి వెళ్లనని ప్రభావతి మొండికేస్తుంది.
మీనా, బాలు రెండు రోజులు అందులోనే స్నానం చేశారు కదా.. అప్పుడు వాళ్లు ఇబ్బంది పడలేదా? ఆ పాపమే నీకు తగిలింది అంటాడు సత్యం. ఇక చేసేది ఏం లేక.. ఫైనల్ గా కామన్ బాత్రూం కి వెళ్తుంది. అనంతరం సత్యంతో ప్రభావతి మాట్లాడుతూ .. తాను హాల్ లో పడుకోలేకపోతున్నాననీ, ఎలాగైనా బాలు, మీనాను ఇంట్లో నుండి పంపించమని కోరుతుంది. సరే.. మార్నింగ్ చెప్తా.. వేరు కాపురం పెట్టేద్దాం అంటాడు. తన భర్త మాట ఇవ్వడంతో ప్రభావతి హాయిగా పడుకుంటుంది. బాలు, మీనాలను ఇంట్లో నుంచి పంపి, ఎంజాయ్ గా ఉండవచ్చని కలలు కంటుంది.

తెల్లవారి లేవగానే ప్రభావతి.. మీనా దగ్గరికి వెళ్లి ఓ కాఫీ ముఖాన కొట్టుకుంటుంది. ముఖాన కొడితే బాగోదు అత్తయ్య.. ఆరోజు మీరు నా మొఖాన టీ కొట్టినప్పుడు.. నేను చాలా బాధపడ్డాను అంటూ మీనా రిప్లై ఇస్తుంది. దీంతో ప్రభావతి నోరు మూసుకొని ఎక్కడినుండి వెళ్ళిపోతుంది. అనంతరం కాలు కాలిన పిల్లిలాగా హాల్లో తిరుగుతుంది ప్రభావతి. బాలు తనకు ట్రిప్ వచ్చిందంటూ హడావిడిగా బయలుదేరుతాడు. ఇంతలో ప్రభావతి అడ్డపడి.. మీతో ఓ విషయం అర్జెంటుగా మాట్లాడాలని అంటుంది. తాను వచ్చిన తర్వాత మాట్లాడుతానని బాలు అంటాడు.కానీ, ప్రభావతి అడ్డుతప్పుకోదు. మీనా ఎంత నచ్చజెప్పిన ప్రభావతి మాత్రం వినదు.
అసలు విషయం ఏంటో చెప్పమని బాలు అడిగినా ప్రభావతి చెప్పదు. మీనా వచ్చి చెబుతాడని మొండికేస్తోంది. ప్రభావతి ప్రవర్తన చూసి ఏమైనా మెంటలా అంటుంది శ్రుతి. దీంతో ప్రభావతి అసలు విషయం బయటపడుతుంది. ' నేను,మీ తండ్రి ఒక నిర్ణయానికి వచ్చాం.. ఈరోజు బాలు, మీనాలను వేరు సంసారానికి పంపించాలని నిర్ణయించుకున్నాము, ఆల్రెడీ నేను ఓ రూం చూసిపెట్టాను. అందులోకి ఈ రోజే షిఫ్ట్ కావాలి ' అంటూ ఆర్డర్ వేస్తోంది ప్రభావతి. దీంతో ఒక్కసారిగా ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. బాలు, మీనా కంటతడి పెట్టుకుంటారు. తాము ఏం తప్పు చేశామని మీనా నిలదీస్తుంది.
ఇంతలోనే సత్యం ఆటో తీసుకోని వస్తాడు. తన తండ్రి రాగానే.. 'అమ్మ చెప్పింది నిజమేనా' అని అడుగుతాడు. అవును.. ఇన్ని రోజులు మేము భరించాం.. ఓర్చుకున్నాం.. మాకు ఓపిక లేదు.. ఇక తప్పడం లేదు. ఇంట్లో నుండి వెళ్లిపోవాల్సిందే' అని సత్యం అంటాడు. దీంతో బాలు మరింత ఎమోషనల్ అవుతాడు. మిమ్మల్ని విడిచి ఉండలేను నాన్న అంటూ బాధ పడతాడు. కావాలనుకుంటే తాను తన రూమ్ ఇచ్చి హాల్లో పడుకుంటాను. కానీ, తనని మాత్రం ఇంట్లో నుండి బయటకి పంపించకుమని కోరుతాడు. సత్యం మాత్రం ఈరోజు ఇంట్లో నుండి వెళ్లిపోవాల్సిందే, ఈరోజు వేరు కాపురం పెట్టాల్సిందే. తాను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అందరూ అర్థం చేసుకోవాలి ' అని అంటాడు.
అసలు విషయం తెలియక ప్రభావతి తెగ సంబర పడుతుంది. ఇక లేటవుతుంది తొందరగా వెళ్లి లగేజ్ తెచ్చుకోమని ఆర్డర్ వేస్తుంది. తన తండ్రి మాట కాదనలేక.. బాలు లగేజ్ తెచ్చుకోవడానికి తనరూమ్ లోకి వెళ్ళబోతాడు.కానీ, సత్యం తానే తెస్తానంటూ పైకి వెళ్తాడు. ఎవరు ఊహించని విధంగా సత్యం తమ లగేజ్ తీసుకొని కిందికి వస్తాడు. దీంతో ప్రభావతి షాక్ అవుతుంది. మన లగేజ్ తీసుకవచ్చారేంటి? అని సత్యం ను అడుగుతుంది. ఇంట్లో నుండి వెళ్లిపోయేది బాలు,మీనాలు కాదు.. మనమే ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాం.. మా తల్లి దగ్గరికి వెళ్లి శేష జీవితం సంతోషంగా గడపాలని నిర్ణయించుకున్నాను' అంటూ సత్యం అసలు విషయం బయట పడతాడు.
దీంతో ప్రభావతి భయపడుతుంది. మళ్లీ తన అత్తయ్య కింద పని చేయాల్సి వస్తుందని, రోజు ఆ నరకం అనుభవించే కంటే ఇక్కడే ఉండడం మేలని భావిస్తుంది. తాను మరోసారి సెపరేట్ రూమ్ అడగనని హాల్లోనే పర్మినెంట్ గా సెట్ అవుతాను, కానీ తన అత్తయ్య దగ్గరికి మళ్ళీ వెళ్ళనని అంటుంది ప్రభావతి. మరీ బాలు, మీనాలను ఇంట్లో నుండి ఎలా వెళ్లగొట్టాలని భావించావని సత్యం అడుగుతాడు. అందరూ కలిసి ఉంటేనే దాన్ని కుటుంబం అనీ, ఇలా ఇష్టం వచ్చినట్లు ఎవరి వారు చూసుకుంటే కరెక్ట్ కాదని ప్రభావతికి క్లాస్ పీకుతాడు సత్యం. చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు.. ప్రభావతి తన లగేజ్ ను తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇలా ప్రభావతికి ఊహించని విధంగా సత్యం షాక్ ఇస్తాడు మరోసారి బాలు, మీనాలను ఇంట్లో నుండి వెళ్లగొట్టాలనే ఆలోచన రాకుండా తగిన గుణపాఠం చెబుతాడు.


Click it and Unblock the Notifications











