Gunde Ninda Gudi Gantalu February 11th: ప్రభావతి మరో కన్నింగ్ ప్లాన్.. బాలు గుణపాఠం.. పార్వతి కంటతడి..

Gunde Ninda Gudi Gantalu February 11th:గుండె నిండా గుడి గంటలు మంగళవారం ఎపిసోడ్ లో ప్రభావతి తన ఫ్రెండ్ మీనాక్షి ఇంటికి వెళ్లి జరిగిన విషయాలన్నీటిని చెబుతుంది. తన భార్త ఇచ్చిన ట్వీస్ కు తాను చాలా భయపడ్డాన్నీ, మళ్లీ తనని ఆ పల్లెటూరికి ఎక్కడ తీసుకెళ్లారోనని కంగారుపడ్డానని అంటుంది ప్రభావతి. ఆ తరువాత రోహిణి తన పాకెట్ మనీ ఇస్తుందని గొప్పగా చెబుతోంది. దీంతో మీనాక్షి రియాక్ట్ అవుతూ.. తన వల్లనే రోహిణి పరిచయమైందని, ఆ పరిచయం వల్లనే నీకు కోటీశ్వరులు కోడలుగా వచ్చిందని చెబుతోంది. ఆ క్రెడిట్ మొత్తం తనకే దక్కుతుందని , తనకు మంచి పార్టీ ఇవ్వాలని అడుగుతుంది మీనాక్షి. దీంతో ప్రభావతి కూడా సరే అంటుంది.

కుక్కతోక వంకరా అన్నట్టు అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ మీనా,బాలు పై మండిపడుతుంది. వాళ్ల వల్ల తనకు మనశ్శాంతి లేకుండా పోయిందని, వారిని ఏదోక రోజు ఇంట్లో నుండి తప్పకుండా పంపిస్తానని, లేదా వాళ్లంతట వాళ్లను వెళ్లిపోయేలా చేస్తానంటూ సవాల్ చేస్తుంది ప్రభావతి. దీంతో అనవసరంగా వారి జోలికి వెళ్లకమని చెబుతుంది. అయినా తనేంటో చేసి చూపిస్తానని అంటుంది ప్రభావతి. ఇక మరుసటి రోజు ఉదయాన్నే ప్రభావతి వంటింట్లోకి వెళ్లి మీనాకు వరుసగా పనిమీద పని చెబుతుంది. దీంతో మీనాకు రియాక్ట్ అవుతూ.. నాకు ఉన్నవి రెండు చేతులు.. ఇలా పని మీద పని చెప్తే ఎలా చేయాలి' అంటూ వ్యంగంగా మాట్లాడుతుంది. ఈ మధ్య ఎక్కువగా మాట్లాడుతున్నావ్ గా అంటుంది ప్రభావతి.

Gunde Ninda Gudi Gantalu serial episode 356 February 11 th 2024 here is full story

ఇంతలోనే రోహిణి వచ్చి, తనకు దోస కావాలని కోరుతుంది. దీంతో ప్రభావతి.. మీనాను వెళ్లి దోశ చేయమని ఆర్డర్ వేస్తుంది. ఇంతలోనే శృతి వచ్చి తనకు కూడా ఆమ్లెట్ కావాలని అడుగుతుంది. అది కూడా చేసి పెట్టమని ఆర్డర్ వేస్తుంది ప్రభావతి. ఈ విషయాన్ని గమనించిన బాలు వారికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని, తాను ఆమ్లెట్లు బాగా వేస్తాననీ, ఎన్ని ఆమ్లెట్లు కావాలి అడుగుతాడు. దీంతో ప్రభావతి కంగారు పడుతూ రెండు ఆమ్లెట్లు వేయమని చెప్పగా.. వెంటనే బాలు కోడి గుడ్లు తీసుకువచ్చి హలో పడేస్తాడు. దీంతో ప్రభావతి షాక్ అవుతుంది. ఏం చేస్తున్నావని అడగగా ఆమ్లెట్లు వేస్తున్నానని వాటిని తినమని అంటాడు బాలు.

పరిస్థితి అర్థం చేసుకొని రోహిణి తనకు ఆకలిగా లేదని పక్కనుండి వెళ్ళిపోతుంది. మీనా ఆమ్లెట్లు బాగా వేస్తుందని చెప్తే ఇలా చేస్తావా అంటూ బాలు పై కోప్పడుతుంది శ్రుతి. మరోసారి తన భార్యకు ఇలా పని మీద పని చెప్తే బాగోదు అంటూ వార్నింగ్ ఇస్తాడు. దీంతో శృతి కూడా సైలెంట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అనంతరం ప్రభావతి ఇల్లు క్లీన్ చేసి, మార్కెట్ వెళ్లి చేపలు తీసుకు రమ్మని చెబుతుంది. అలా పనులన్నీ ముగించుకొని మార్కెట్ కి వెళ్ళిన మీనాకు తన తల్లి పార్వతి కనిపిస్తుంది. దీంతో పార్వతి తెగ సంతోషపడుతుంది. కానీ అంతలోనే మెడలో పసుపు తాడును చూసి కంగారుపడుతుంది ఏం జరిగిందని ఆరా తీస్తుంది. కానీ మీనా అసలు విషయం చెప్పకుండా అక్కడినుండి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది.

దీంతో పార్వతికి మరింత అనుమానం వస్తుంది. మీనాను వెంటనే ఇంటికి తీసుకువెళ్లి అసలు విషయం అడుగుతుంది. తన తోడికోడలు వాళ్ళ అమ్మ బంగారు నగలు తీసుకొచ్చారని, ఆ సమయంలో తనను, నాన్నను తక్కువ చేసి మాట్లాడిందని, అందుకే తాను పౌరుషంతో తాళి తీసి ఇచ్చేశానని చెబుతోంది. పరిస్థితి అర్థం చేసుకున్న పార్వతి.. తాను తాళి చేయించి ఇస్తానని అంటుంది. కానీ, మీనా మాత్రం దానికి ఒప్పుకోదు. తన భర్త తనకు తాళి చేయించి వేసేంత వరకు.. తాను ఇలానే పసుపు తాడుతో ఉంటానని చెబుతుంది. ఇంతటితో నేడు సీరియల్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X