Gunde Ninda Gudi Gantalu February 12th: పార్వతి సంచలన నిర్ణయం.. పనిమనిషిలా మౌనిక.. రోహిణికి బిగ్ షాక్..

Gunde Ninda Gudi Gantalu February 12th:గుండె నిండా గుడి గంటలు బుధవారం ఎపిసోడ్ లో మీనా తన పుట్టింటికి వెళ్లి.. తన తల్లికి అత్తగారింట్లో జరిగిన అవమానం గురించి చెబుతుంది. అయితే తాను తాళిబొట్టు చేయిస్తానని పార్వతి అంటుంది. కానీ, తన భర్త చేయించి ఇచ్చినాడే వేసుకుంటాననీ, అదే తనకు గౌరవమనీ, అప్పటి వరకు తాను పసుపు తాడుతోనే ఉంటానని అంటుంది. ఇక లేట్ అవుతుందని తాను మళ్ళీ వస్తానంటూ తన పుట్టింటి నుండి బయలుదేరుతుంది మీనా. ఇక మీనా ఇంటికి రాగానే ప్రభావతి రెచ్చిపోతుంది. ఇంత సేపు ఎటు వెళ్ళావ్? అంటూ ప్రశ్నిస్తుంది. నాలుగు షాపులలో వెళ్లి చెప్పిన సామాను తెస్తే లేటే అవుతుందని బదిలిస్తుంది. నాలుగు షాపులు తిరిగావా? ఊరు మొత్తం బలాదుర్ తిరిగావా? ఇంత లేటా ఎందుకు అయిందని ప్రభావతి అనగా మరోసారి త్వరగా తెచ్చేవారిని పంపించమని బదులుస్తుంది మీనా.

సరేలే అంటునే.. రోహిణి, మనోజ్ కి చాపల కూర,శృతి,రవి లకి చికెన్ కర్రీ, తనకు మామయ్యకు తోటకూర చేసి పెట్టమని ఆర్డర్ వేస్తోంది. దీంతో మీనాకు కోపం వస్తుంది. ఇందులో తన పేరు లేకపోయినా సరే.. కనీసం బాలు పేరు అయినా ఉండాలని చెప్పొచ్చు కదా అని అడుగుతుంది. ఈ సామానుకు డబ్బులు ఇచ్చింది మా ఆయననే , విషయం గుర్తు పెట్టుకోమని చెప్పి మీనా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మీనాను టార్గెట్ చేస్తూ.. వంట పని, ఇంటి పని, బట్టలు అంటూ పని తర్వాత పని చెబుతూ.. క్షణం తీరగా లేకుండా చేస్తుంది. పనిమనిషి కంటే హీనంగా మీనాను ట్రీట్ చేస్తుంది ప్రభావతి. ఇంతలోనే మీనా తల్లి పార్వతి తన మంగళసూత్రం తీసుకొని వస్తుంది.

Gunde Ninda Gudi Gantalu serial episode 357 February 12 th 2024 here is full story

పార్వతిని చూడగానే ప్రభావతి అసహ్యించుకుంటుంది. ఎందుకొచ్చారంటూ హేళనగా మాట్లాడుతుంది. తన కూతురి మెడలో పసుపు తాడు చూసి, తాను బాధపడ్డననీ, మంగళసూత్రం చేయించానని, అది ఇచ్చి వెళ్లడానికి వచ్చాను అంటూ బదిలిస్తుంది పార్వతి. నీవు కూతురి మెడలో నుండి బంగారాన్ని, మంగళసూత్రాన్ని ఎవరూ లాక్కోలేదనీ, నీ కూతురే పొగరు ఎక్కువై తీసేసిందంటూ నానా మాటలు అంటుంది ప్రభావతి. ఇక అత్తకు వంత పాడుతుంది రోహిణి. ఇలా బంగారం తెచ్చిస్తే ..అత్తయ్యని అవమానించినట్లు కాదా అంటూ నోరు జారుతుంది. దీంతో బాలుకి ఎక్కలేని కోపం వస్తుంది.

'మీనాకు కనీసం తల్లిగారు ఉన్నారు.. నీకు ఉన్నారో? లేరో? దేవునికే తెలియాలి. ఇంతవరకు నీ పుట్టింటి నుంచి కనీసం ఒక తులం బంగారం అయినా వచ్చిందా? కనీసం మీ పుట్టింటి వారు మంగళసూత్రం అయినా చేయించారా? పండుగ వస్తే అల్లుడ్ని ఇంటికి పిలిచి మర్యాద చేయడం తెలుసు.. కొత్త అల్లుడు పండుగకు వెళ్లే.. బంగారు ఉంగరం పెట్టడం తెలుసు.. అని బాలు తన అత్తగారి గురించి గొప్పగా మాట్లాడుతాడు. దీంతో రోహిణికి షాక్ తగిలినట్టు అవుతుంది. బాలుతో ఏం మాట్లాడాలో అర్థం కాక దిమ్మతిరిగిపోతుంది. ఎక్కడ తన పుట్టింటి బాగోతం బయటపడుతుందోనని భయపడి అక్కనుండి వెళ్ళిపోతుంది రోహిణి. ఇక మీనా తన తల్లితో మాట్లాడుతూ.. నాకు అర్థం చేసుకునే భర్త నాకు ఉన్నాడు. ఈ బంగారంతో నాకు అవసరం లేదు' అని తన తల్లిని పంపిస్తుంది.

పార్వతి వెళ్లిపోగానే సత్యం తన భార్య ప్రభావతి దగ్గరికి వెళ్లి.. నీకు కూడా ఓ కూతురు ఉంది. తనని కూడా మన కంటే గొప్పింటి, కోటీశ్వర్ల ఇంటికి కోడలుగా పంపించాం.. వాళ్లు నీ లాగా మౌనికను ట్రీట్ చేస్తే.. నీ కూతురు పరిస్థితి ఏంటి? అత్త లాగా కాకుండా.. ఓ ఆడదాని లాగా ఆలోచించు.. మీనా విషయంలో జాగ్రత్తగా ఉండు'అంటూ ప్రభావతికి క్లాస్ పీకుతాడు సత్యం. మరోవైపు మౌనిక తన అత్తగారింట్లో నానా కష్టాలు పడుతుంది. సంజు తనని పనిమనిషి కంటే అద్వానంగా ట్రీట్ చేస్తాడు. పెళ్లికి ముందు తన అన్నయ్యలు ఎంత చెప్పిన వినకుండా.. తాను పెళ్లి చేసుకున్నాననీ బాధపడుతుంది. ఈ సమయంలో తన ఆఫీసు నుండి రీ జాయినింగ్ అవ్వమని ఫోన్ వస్తుంది. ఈ విషయాన్ని సంజూతో చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడు అని టెన్షన్ పడుతుంది మౌనిక. ఇంతటితో నేటి సీరియల్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X