Gunde Ninda Gudi Gantalu February 13th: బయటపడ్డ ప్రభావతి నిజస్వరూపం.. మనోజ్ గుట్టురట్టు..

Gunde Ninda Gudi Gantalu February 13th:గుండె నిండా గుడి గంటలు గురువారం ఎపిసోడ్లో శృతిని కలవడానికి తన డబ్బింగ్ స్టూడియో కు వెళ్తాడు రవి. తనను తీసుకెళ్లడానికి రవి రావడంతో శృతి సంతోషంతో గంతులు వేస్తూ.. రోడ్డుపైనే హగ్ చేసుకుంటుంది. ఈ సమయంలో తాను కారు తీసుకోవాలని డిసైడ్ అయినట్లు చెబుతాడు. దీంతో శృతి సర్ప్రైజ్ అవుతుంది. ఇద్దరు సంపాదిస్తున్నాం.. కాబట్టి తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, అలాగే మనోజ్ కారు షోరూమ్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. కాబట్టి మరింత డిస్కౌంట్ వస్తుందనీ, అలాగే మనకు మంచి కారు సెలక్ట్ చేస్తాడని రవి అంటాడు. దీంతో శృతి కూడా ఓకే అంటుంది.

ఇక మరోవైపు బాలు మీనా దగ్గరికి వచ్చి.. ఇంటిపని నువ్వే ఒకదానివి చేయడం అవసరమా? ఇలా రోజు ఈ పనులు చేయడం బాగాలేదని, ఇంట్లో ఎంతమంది ఉన్న అన్ని పనులు నువ్వే చేస్తుండడం కరెక్ట్ కాదని అంటాడు. ఇలా చేసుకుంటూ పోతే .. వారికి అలవాటుగా మారుతుందని, నువ్వు ముసలి దానివి అయ్యే వరకు ఇలానే చేయిస్తారని చెబుతాడు బాలు. తనకు కొత్తేం కాదని, ఈ రోజైనా రేపైనా తానే చేయాల్సి వస్తుందని సర్ది చెప్పి చెబుతుంది మీనా. సరేగాని తనకు గొంతు నొప్పిగా ఉందని, వచ్చేటప్పుడు వేడి నీళ్లు తీసుకురమ్మని బాలు అంటాడు. బాలు చెప్పినట్లుగానే మీనా వేడి నీళ్లు తీసుకొని బెడ్ రూమ్ లోకి వస్తుంది. కానీ, ఆ విషయం మర్చిపోయి బాలు డైరెక్ట్ గా తాగేస్తాడు. దీంతో మంట మంట అంటూ బాలు అరుస్తాడు.

Gunde Ninda Gudi Gantalu serial episode 358 February 13th 2024 here is full story

తాను ముందే చెప్పాను కదా.. అన్నింటికి ఆగం ఎక్కువేనని మీనా అంటుంది. తన విషయం పక్కన పెట్టుగాని, ఇంట్లో అన్ని పనులు నువ్వు ఒక్కదానివి చేయొద్దు అంటూ బాలు మీనాకు క్లాస్ పీకుతాడు. కానీ, మీనా మాత్రం తాను ఇంట్లో పని మనిషిగా ఫీల్ కావడం లేదని, అందర్నీ తన వారీగా భావిస్తున్నాను. కాబట్టి.. తాను పనులు చేస్తున్నానని బాలుకు బదులుస్తుంది. ఎన్నడొక రోజు.. నీకు వారి గురించి అర్థం అర్థమవుతుందని, తన తల్లి నువ్వు రాగానే పని మనిషిని మానిపించిందని, వారు నిన్ను ఎలా ట్రీట్ చేస్తున్నారో ఇప్పుడైనా అర్థం చేసుకోమని బాలు అంటాడు. సరేలే.. నాకు నిద్ర వస్తుందంటూ మీనా తినకుండానే పడుకుంటుంది.

దీంతో బాలు ప్లేట్ అన్నం వేసుకో వచ్చి, మీనాకు తినిపిస్తాడు. ఇలా కాసేపు రొమాంటిక్ గా నవ్వుతూ గడుపుతారు బాలు మీనా. ఈ సమయంలో బాలు తన చెల్లెలు మౌనికను చూడాలని అనిపిస్తుందని, మొదటిసారిగా తాను బంధాల కోసం భయపడుతున్నాడని బాలు బాధపడతాడు. దానికి బాధపడాల్సిన అవసరం లేదని, మౌనికను కలవాలంటే.. తాను వర్క్ చేసే ఆఫీస్ కి వెళ్లి చూసి రమ్మని సలహా ఇస్తుంది మీనా. మంచి ఐడియా ఇచ్చినందుకు బాలు సంతోషిస్తారు.

మరుసటి రోజు ఉదయం మనోజ్, రోహిణి ఆఫీస్ కి వెళ్తూ.. జీవితం మొత్తం బోరింగ్ గా ఉందని, పెళ్లయిన కొత్తలో తనని రెస్టారెంట్ కు తీసుకెళ్లి భోజనం చేయించారని, సినిమాకి తీసుకు వెళ్ళమని రోహిణి అడుగుతుంది. దీంతో బాలు తనకు ఈరోజు ఓ కంపెనీతో డీల్ మాట్లాడే పని ఉందని ఖచ్చితంగా తాను ఆఫీసుకు వెళ్లాలంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. ఇంతలో ప్రభావతి వచ్చి, ఎప్పుడు ఆఫీస్ కేనా.. సరదాగా బయటికి వెళ్లలేకపోయారని మనోజ్ను ఇరికించే ప్రయత్నం చేస్తుంది. అదే విషయం తాను మనోజ్ ను అడుగుతున్నానని, ఈ రోజు మనోజ్ కు వేరే కంపెనీ వాళ్ళతో పెద్ద డీల్ ఉందట అని చెబుతోంది. దీంతో ప్రభావతి ఏం తెలియనట్లు అవునా అని అంటుంది.

Gunde Ninda Gudi Gantalu serial episode 358 February 13th 2024 here is full story

సర్లే నాకు టైం అవుతుంది అని రోహిణి పార్లర్లకు వెళ్ళిపోతుంది. అలా రోహిణి బయటికి వెళ్ళగానే మనోజ్ కు క్లాస్ పీకుతుంది ప్రభావతి. ఇప్పటికైనా పని చూసుకోమని, లేకపోతే.. బాలు గారు ఇల్లును కోర్టుగా మారుస్తాడంటూ వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు మన బతుకు రోడ్డుపై పడుతుందంటూ వార్నింగ్ ఇస్తుంది.‌ ఇంతలోనే బాలు వచ్చి మళ్లీ మీనాతో గొడవ పెట్టుకుంటాడు తన మాట వినడం లేదని ఇంట్లో వాళ్ళు అందరికీ పని చేసుకుంటూ వెళ్తే నిన్ను పని మనిషిగానే చూస్తారని‌ సలహా ఇస్తాడు. ఇంతలోనే ప్రభావతి వచ్చి ఇంట్లో పని చేస్తే తప్పేంది తన ఇంట్లో పని చేయదా అంటూ ప్రశ్నిస్తుంది. వాళ్ళ ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు ఒక్కొక్క పని చేస్తారు. కానీ, ఇక్కడ మీనా మాత్రమే ఇంటిల్లిపాదికోసం పనిచేస్తుందని, అయినా మీనా వచ్చాక పని మనిషిని ఎందుకు తీసేసావు అని బాలు అడుగుతాడు.

Gunde Ninda Gudi Gantalu serial episode 358 February 13th 2024 here is full story

దీంతో ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అక్కడినుండి వెళ్ళిపోతుంది. మరోవైపు శృతి, రవి సంతోషంగా బయటికి వస్తారు. తాము కార్ తీసుకోబోతున్నామంటూ తన తల్లికి రవి చెబుతాడు. ఏ కారు తీసుకోవాలా తాను మనోజ్ను అడుగుతానని, డైరెక్ట్ గా షోరూమ్ కి వెళ్తున్నామంటూ చెప్పి వెళ్తాడు. దీంతో మనోజ్ బండారం ఎక్కడ బయటపడుతుందని ప్రభావతి టెన్షన్ పడుతుంది. వెంటనే మనోజ్ కు ఫోన్ చేసిన మనోజ్ మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడు. దీంతో ప్రభావతికి మరింత టెన్షన్ పెరుగుతుంది. ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో కాలు కాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతుంది. ఇంతటితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X