Gunde Ninda Gudi Gantalu February 14th: రవిని బకరా చేసిన మనోజ్.. మౌనికకు నరకం చూపిస్తున్న సంజు..

Gunde Ninda Gudi Gantalu February 14th: గుండె నిండా గుడి గంటలు శుక్రవారం ఎపిసోడ్ లో జాబ్ లో తిరిగి జాయిన్ అవ్వమని మౌనిక కు ఆఫీస్ నుండి ఫోన్ వస్తుంది. ఈ విషయం తన భర్త సంజూకు ఎలా చెప్పాలని ఆలోచిస్తూ హాల్లో కూర్చొంటుంది. ఇంతలోనే తన అత్తయ్య వచ్చి ఏం జరిగిందమ్మా అని అడుగుతుంది. తనకు ఆఫీస్ నుండి ఫోన్ వచ్చిందని, తిరిగి జాయిన్ కమ్మంటున్నారంటూ అసలు విషయం చెబుతుంది. దీంతో తన అత్తయ్య అనుమానం కొద్దీ వాడు జాబు పంపిస్తాడో ? లేదో? నని సందేహం వ్యక్తం చేస్తుంది. పెళ్లికి ముందు తాను జాబ్ చేస్తానంటే ఒప్పుకున్నాడని, తన ఇష్ట ప్రకారం నడుచుకుంటానని మాట ఇచ్చాడని మౌనిక అంటుంది.

ఇంతలోనే సంజు అక్కడికి వస్తాడు. దీంతో మౌనిక అసలు విషయం చెబుతుంది. జాబ్ చేయవలసిన అవసరం లేదని, నీ మొగుడు పని పాట లేకుండా తిరిగేవాడు కాదని బదిలిస్తాడు. అయినా పెళ్లికి ముందు సవాలక్ష అబద్ధాలు ఆడతామని, నీ మీద ప్రేమతో కాదు.. మీ అన్నల మీద కోపంతో పెళ్లి చేసుకున్నానంటూ అసలు విషయం బయట పెడతాడు సంజూ. దీంతో మౌనిక బాధపడుతుంది. మరోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుంటే బాగోదని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు సంజు. ఆఫీస్ కు వెళ్తా అంటున్నావ్.. ఆఫీస్ లో ఎవరైనా ఉన్నారా? అని నీచంగా మాట్లాడుతాడు సంజూ. దీంతో మౌనిక బాధపడుతుంది.

Gunde Ninda Gudi Gantalu serial episode 359 February 14th 2024 here is full story

మరోవైపు రవి, శృతి కారు తీసుకోవడానికి షోరూం కి వెళ్తారు. తన అన్న మనోజ్ ఇక్కడ స్టోర్ మేనేజర్ అని, తనని పిలవమని సేల్స్ మాన్ కు రవి చెప్పగా.. మనోజ్ అనే పేరుతో ఇక్కడ పనిచేసే వారు ఎవరు లేరని చెబుతాడు. దీంతో రవి కంగారు పడతాడు. తన అన్నయ్య ఇదే షో రూమ్ లో వర్క్ చేస్తున్నాడని, తనకు బాగా తెలుసు అని.. ఏదో మిస్ లీడ్ అయిందని డైరెక్టుగా రవి.. మనోజ్ కు కాల్ చేస్తాడు. దీంతో మనోజ్ కంగారు పడతాడు. తనకు అడగకుండా.. షోరూం ఎలా వెళ్తారని, ఆయన తాను అక్కడ లేనని, హెడ్ ఆఫీస్ లో ఉన్నానని చెబుతాడు. ఒకసారి అక్కడ పనిచేసే వారితో మాట్లాడతానని వారికి ఓసారి ఫోన్ ఇవ్వమని అంటాడు. దీంతో రవి సేల్స్ మ్యాన్ కు ఫోన్ ఇవ్వగానే.. మనోజ్ ఇంగ్లీషులో మాట్లాడుతూ రెచ్చిపోతాడు.

తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటాడు మనోజ్. రవి కూడా తన అన్నయ్య చాలా పెద్ద హోదా పనిచేస్తున్నాడని నమ్ముతాడు. అలా మన తన బండారం బయట పడకుండా తప్పించుకుంటాడు మనోజ్. పైగా వచ్చేవారం కొత్త వెహికల్స్ వస్తున్నాయని, ఇప్పుడు ఓల్డ్ వర్షన్ నడుస్తుందంటూ రవిని అక్కనుండి పంపించేస్తాడు. మరోవైపు .. బాలు తన చెల్లి మౌనిక ఆఫీసుకు వెళ్తాడు. అక్కడనైనా తన చెల్లెలు చూసి.. మాట్లాడవచ్చని ఎంతో ఆశతో ఎదురుచూస్తాడు. కానీ, మౌనిక జాబ్ మానేసిందని విషయం తెలుసుకుని చాలా బాధపడతాడు. ఆ జాబ్ కోసం మౌనిక ఎంత కష్టపడిందో బాలు మాత్రమే తెలుసు. జాబ్ మానేయడానికి గల కారణమేంటో తెలుసుకోవడానికి బాలు తన చెల్లెకి కాల్ చేస్తాడు.

Gunde Ninda Gudi Gantalu serial episode 359 February 14th 2024 here is full story

అయితే.. సంజు పక్కనే ఉండడంతో మౌనిక తన అన్నయ్య ఫోను లిఫ్ట్ చేయలేకపోతోంది. అయినా బాలు కంటిన్యూగా ఫోన్ చేయడంతో ఎవరని ఆరా తీస్తాడు సంజు. కస్టమర్ కేర్ అని చెప్పినా నమ్మడు.. వెంటనే మౌనిక ఫోన్ తీసుకొని.. కాల్ డేటా చెక్ చేస్తాడు. అందులో బాలు మిస్డ్ కాల్స్ ఉండడం చూసి.. బాలు ఫోన్ చేస్తే.. కస్టమర్ కేర్ ఫోన్ చేస్తారని చెప్పావ్ ఏంటి ? అని మౌనిక నిలదీస్తాడు. మీ ముందు మా అన్నయ్య పేరు ఎత్తడం మీకు ఇష్టం లేదు కదా అని ఉద్దేశంతో తాను కస్టమర్ కేర్ అని చెప్పానంటూ బదులుస్తుంది మౌనిక. ఇక నుండి బాలు నుండి కేవలం మిస్ కాల్స్ మాత్రమే రావాలని, తనకు తెలియకుండా బాలు తో మాట్లాడితే పరిస్థితి మరోలా ఉంటుందని వార్నింగ్ ఇస్తాడు. తెర ముందు ఓ పెర్ఫార్మెన్స్ తెర వెనక మరో పర్ఫామెన్స్ చేస్తే బాగోదని, తాను ప్రతినెలా కాల్ డేటా కూడా చెక్ చేస్తానంటూ మౌనికను బెదిరిస్తాడు. ఇంతటితో నేటికీ సీరియల్ ముగుస్తుంది.

More from Filmibeat

Read more about: gunde ninda gudi gantalu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X