Gunde Ninda Gudi Gantalu : బాలుపై కుటుంబం మొత్తం దాడి.. నిజం దాచిపెట్టి మౌనిక

Gunde Ninda Gudi Gantalu : గుండెనిండా గుడి గంటలు ఫిబ్రవరి 17th ఎపిసోడ్ ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. గత వారం సంజూ, మౌనిక మధ్య జరిగిన సన్నివేశమే.. లేటెస్ట్ ఎపిసోడ్ లో ప్రధానంగా సాగింది. ముఖ్యంగా మౌనిక జాబ్ మానేయడంతో బాలు ఎంతో బాధపడుతుంటాడు. మౌనిక ఆ జాబ్ కోసం ఎంతలా కష్టపడిందో అతని మాత్రమే తెలుసు. కానీ మౌనికను భర్త సంజూ మాత్రం జాబ్ చేయొద్దని తగేసి చెప్తాడు. మౌనికకు అత్త సపోర్ట్ ఇచ్చినా.. సంజూ మాత్రం అనరాని మాటలు అని మౌనిక మనసుకు గాయం చేస్తాడు. దాంతో జాబ్ కు వెళ్లడం మానేస్తుంది. ఇదే విషయం తెలుసుకున్న బాలు.. ఎంతో బాధపడుతాడు. తన భార్యతో ఇదే విషయాన్ని చెప్పుతూ సంజూపై రగిలిపోతాడు. ఇంట్లో వాళ్లతో ఇదే విషయమై చర్చ పెడుతాడు.

సంజూ వాళ్ల ఇంటికి వెళ్లి అడిగేసి వస్తానని బయల్దేరుతాడు. అంతలోనే కుటుంబ సభ్యులు అడ్డుకుంటారు. అసలు విషయం తెలుసుకొని బాలు వెళ్లొదని ఆదేశిస్తారు. తల్లిదండ్రులు, మనోజ్, శృతి ఎంత చెప్పినా అతని మనస్సు మాత్రం కుదుట పడదు. మౌనిక జాబ్ మానేసిందంటే.. తన మస్సును చంపుకొని బతుకుంతుందనే భావనే బాలుని కలిచివేస్తుంటుంది. చెల్లి దగ్గరకు వెళ్దామంటే.. కుటుంబ సభ్యులు మొత్తం అడ్డుకుంటారు. రోహిణిలాగా మౌనికాకు అక్కడ జాబ్ చేయాల్సిన అవసరం ఏముంటుంది మనోజ్... వాళ్లదే గొప్పకుటుంబం అక్కడ మౌనికకు ఎలాంటి లోటు ఉండదని తల్లి, ఇంటికి రావొద్దని చెప్పినా కూడా వెళ్లడం బాగుండదేమోనని రోహిణి వంతపాడారు.

Gunde Ninda Gudi Gantalu serial episode 360 February 17th 2024 here is full story

కానీ రవి, శృతి మాత్రం బాలు అన్న చెప్పింది కరెక్టేనని.. అక్కమ మౌనికాకు ఎన్ని కష్టాలున్నాయో ఒక్కసారి చూసి రావడం కరెక్టే కదా అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. కానీ తల్లి మాత్రం నివారిస్తుంటుంది.... ఇక్కడ మౌనికకు జాబ్ లేకపోవడం సమస్య కాదు... బాలుకు పనీపాట లేకపోవడమే అసలు సమస్య అని దెప్పిపొడుస్తుంది. మన ఇంట్లో చక్కబెట్టింది చాలకా.. ఆ ఇంటికి వెళ్లి ఏం ఉద్దరిస్తావంటూ మందలిస్తుంది. పెళ్లి పెంట చేసింది చాలదా అంటూ బాలుపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది బాలు తల్లి. మనోజ్ కూడా కలుగజేసుకొని.. సంజూని రెండుసార్లు కొట్టి మళ్లీ ఎలా వెళ్తావని ప్రశ్నిస్తాడు. బాలును తన భార్య కూడా ఆపుతుంది.

కానీ... రవి, శృతి మాత్రం బాలు అన్నయ్యే అనిందే కరెక్ట్. కావాలంటే మేము కూడా వెళ్లి చూసి వస్తామని తెగేసి చెప్తుంటారు. ఇక అంతలోనే మౌనిక సడెన్ గా పుట్టింటికి వచ్చి ఆశ్చర్యపరుస్తుంది. దాంతో కుటుంబం వాళ్లు ఎంతో సంతోషంగా ఉంటారు. ఇక మౌనికా యోగక్షేమాలు తెలుసుకొంటారు. తన గురించి పుట్టింటి వాళ్లు ఎంతో బాధపడుతుంటారని తెలిసి తను అత్తవారి ఇంట్లో ఎంతో సుఖంగా ఉన్నానని చెబుతుంది. కానీ.. ఆ ఇంట్లో పడుతున్న కష్టాలను మదిలో గుర్తుచేసుకుంటూనే ఉంటుంది. ఇదే క్రమంలో రోహిణి, శృతి.. మౌనికా నిజంగానే అత్తవారింట్లో బాగుంటుందా అని ప్రశ్నించారు. అందరికీ తాను బాగానే ఉన్నానంటూ సర్దిచెప్పుతుంది. ఇక బాలు మాత్రం చెల్లెలుతో మాట్లాడకుండా అలాగే ఉంటాడు. అసలు నువ్వు జాబ్ ఎందుకు మానేవ్ అని అడుగుతాడు. అత్తవారింట్లోనే తమ బిజినెస్ అకౌంట్స్ చూస్తున్నానని.. అందుకే జాబ్ మానేసినట్టు చెప్తారు. పుట్టింటిలో భోజనం చేసి బయల్దేరుతుంది.

Gunde Ninda Gudi Gantalu serial episode 360 February 17th 2024 here is full story

గుండెనిండా బాధను పెట్టుకొని పుట్టింటి వారికి ఒక్క మాట కూడా చెప్పకుండా తిరిగి వెళ్లిపోతుంది మౌనికా. కానీ మనస్సులో మాత్రం బాలు అన్న చెప్పినా వినకుండా పెళ్లి చేసుకోవడం పెద్ద తప్పు అయ్యిందని భావిస్తుంది. ఇక మౌనికా తిరిగి అత్తవారింటికి వెళ్లగానే భర్త సంజూ ఎక్కడికి వెళ్లావని అడుగుతాడు. మౌనిక బయటికి వెళ్లానని చెప్తుంది. కానీ సంజూ మాత్రం పుట్టింటికా? ఇంకెవరినో కలిసేందుకా? అని అనుమానిస్తాడు. అత్త తను గుడికి వెళ్లిందని చెప్పుకొస్తోంది. కానీ మామ, భర్త మాత్రం అనుమానిస్తారు. గుడికి వెళ్లిందానికి కొబ్బరికాయ, పువ్వు ఏదో ఒకటి చేతిలో ఉండాలి కదా? అని నిలదీస్తాడు. కానీ కారు డ్రైవర్ మాత్రం గుడికే వెళ్లిందని, పూలు, కొబ్బరికాయలున్న బుట్టను తీసుకొచ్చి చూపిస్తాడు. దాంతో నమ్మిన సంజూ, మామ చెప్పి వెళ్లాలని తెలియదా? ఇంకోసారి ఎక్కడికి వెళ్లినా నేను చెప్పేవరకు వెళ్లకూడదని కండీషన్ చెప్తాడు సంజూ. ఇదిలా ఉంటే.. మనోజ్ సీక్రెట్ ఒకటి తెలిసిందంటూ.. రవి, శృతి ట్విస్ట్ ఇస్తారు. కుటుంబ సభ్యులందరి ముందు అదేంటో చెప్పుకొస్తాడు... అన్నయ్య వాళ్ల ఆఫీస్ వాళ్లతో ఇంగ్లీష్ లో ఇరగదీస్తున్నాడని చెప్పుకొస్తారు. అది అలా ఉంటే.. బాలు భార్యకు, తల్లికి మళ్లీ గొడవ ముదురుతుంది. బట్టలు ఊతకాలని బాలు తల్లి, అన్నీ నేనే ఉతకాలా అంటూ బాలు భార్య మధ్య వాగ్వాదం జరుగుతుంది.. ఈ సారి బాలు ఇంట్లో వివాదంతో ట్విస్ట్ ఇచ్చి నెక్ట్స్ ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచారు.

More from Filmibeat

Read more about: gunde ninda gudi gantalu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X