Gunde Ninda Gudi Gantalu Feb 18th : తమ్ముడిని కుక్కతో పోల్చిన బాలు.. మీనాపై అత్త ప్రభావతి పనిభారం

Gunde Ninda Gudi Gantalu : గుండెనిండా గుడి గంటలు ఫిబ్రవరి 17th ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగిన విషయం తెలిసిందే. నిన్నటి ఎపిసోడ్ లో బాలు తన చెల్లికోసం ఎంత ఆరాటం పడ్డాడో తెలిసిందే. బాలును ఎంతలా కుటుంబ సభ్యులు అడ్డుకున్నారో కూడా చూశాం. గుండెనిండా బాధాలు పెట్టుకున్నా... మౌనికా మాత్రం తన పడుతున్న కష్టాలను మాత్రం కుటుంబ సభ్యులకు ఏమాత్రం చెప్పలేదు. మౌనిక ఎంతో సాహసం చేసి అత్తగారింటి నుంచి ఆమె అత్తమ్మ సపోర్ట్ తో పుట్టింటికి వచ్చి వెళ్తుంది. ఎలాగో పసిగట్టిన భార్య సంజూ, మౌనిక మామ ఆమెకు మళ్లీ చెప్పకుండా ఎక్కడికి వెళ్లొద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అంతలోనే మౌనిక అత్తమ్మ గుడికెళ్లి వచ్చిందని చెప్పడమే కాకుండా ఆధారం కూడా చూపించి సమస్య నుంచి గట్టెక్కించింది. ఇక ఈరోజు ఫిబ్రవరి 18వ ఎపిసోడ్ సరదాగా సాగిపోయింది. కానీ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చి ఆకట్టుకున్నారు.

ఇక.. నిన్నటి ఎపిసోడ్ లో మనోజ్ బాగోతాన్ని బయటే పెట్టే ట్విస్ట్ గురించి తెలిసిందే. దానికి కంటిన్యేయేషన్ గానే ఫిబ్రవరి 18వ ఎపిసోడ్ సాగింది. మనోజ్ అన్న కార్ల షోరూంలో మేనేజర్ గా పనిచేస్తున్నారని, గొప్ప పోజిషన్ లో వర్క్ చేస్తున్నాడని తన తమ్ముడు రవి, శృతికి రూ.18 లక్షల కారును రూ.16కే ఇప్పిస్తానని చెప్పాడని తల్లి ప్రభావతితో చెప్పుతుంటారు. ఈ విషయం తెలుసుకున్న తల్లి మండిపోతుంది. అసలు జాబ్ లేక ఏడుస్తుంటే పైగా డిస్కౌంట్లు ఇప్పిస్తాడా? అంటూ దెప్పిపొడుస్తుంది. రూ.10 లక్షలకే ఇప్పిస్తాడులే కారు అంటూ ఇంకా ఇరకాటంలో పెడుతుంది.

Gunde Ninda Gudi Gantalu serial episode 361 February 18th 2024 here is full story

ఇదిలా ఉంటే.. కథ మనోజ్ నుంచి ఆయన భార్య రోహిణి వైపు వెళ్లింది. మనోజ్ కు ఆమె తండ్రితో చెప్పి మంచి కార్ల షోరూమ్ పెట్టించు అంటూ శృతి రోహిణికి సలహా ఇస్తుంది... కానీ బాలును తన మామ ఒక్కరోజు కూడా మనిషిగా చూడకపోవడాన్ని తండ్రి సత్యం తప్పుపడుతారు. ఒక్కసారైనా అడుగొచ్చు కాదా అని ప్రశ్నిస్తారు. ఈలోగానే బాలు తందూరు చికెన్ తో ఇంటికి తిరిగి వస్తాడు. షోరూం, రోహిణి మామ అనే మాటలు విని.. హా ఆయన డబ్బులు పెడితే శాంతం నాకి కూర్చుంటాడు అంటూ దెప్పిపోడుస్తాడు. ఇప్పటికే ఆయన చేసిన ఘనకార్యం చాలని హితవు పలుకుతాడు.

కానీ.. బాలు తీసుకొచ్చిన తందూరు చికెన్ తో అంతర్గతంగా గొడవ మొదలైంది. మాంచి మాసలా వాసన వస్తుందంటూ మనోజ్ ఏం తీసుకొచ్చావు అంటూ మనోజ్ అన్న బాలును అడుగుతుంటాడు.... ఆశగా అడిగిన మనోజ్ ను అన్న బాలు కుక్కలా భలే పసిగడుతావురా.. అంటూ మండిపడుతాడు. తన భార్య మీర కోసం తీసుకొచ్చానంటూ బాలు సమాధానం ఇస్తాడు. ఈక్రమంలో ఎవరి కడుపు వారు చూసుకుంటున్నారంటూ.. నా భార్య మాత్రం తింటుందా లేదా అని ఎవరూ అడగటం లేదని ప్రశ్నిస్తారు. వెంటనే మీనాను వాళ్ల బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లి చికెన్ తినమని చెబుతుంటాడు.

Gunde Ninda Gudi Gantalu serial episode 361 February 18th 2024 here is full story

బాలు, మీనా మధ్య సాగిన సన్నివేశం ఎంతో సరదాగా ఉండింది. భార్యభర్తలుగా ఒకరిపై ఒకరు ప్రేమ వర్షాన్ని కురిపించుకున్నారు. కట్ చేస్తే.. ప్రభావతి-సత్యం మధ్య చిన్న ఘర్షణ మొదలైంది. ఉగాదికి వాళ్ల అమ్మగారి ఇంటికి వెళ్లాలి అంటూ ప్రభావతితో చెప్పారు. అదే సమయంలో మనోజ్-రోహిణిని కూడా తప్పకుండా రావాలంటాడు తండ్రి సత్యం. కానీ వారిద్దరూ తటపటాయిస్తూ సరే అంటారు. ఇక కోడలు శృతి మాత్రం.. ఈ సంగతి ముందుగానే విని.. తాను రాను అనే విషయాన్ని చెప్పేందుకు నాటకం వేస్తుంది. పొట్టి బట్టలతో హాల్ లోకి దోమల బ్యాట్ తీసుకొచ్చి దోమలు తెగ ఇబ్బంది పెడుతున్నాయంటూ వాటిని చంపేస్తాననంటూ పరోక్షంగా బెదిరిస్తూ ఉంటుంది. కానీ ఆమె బట్టలపై మీనా అభ్యంతరం తెలుపుతుంది. శృతికి మాత్రం అలాంటి బట్టలే కంఫర్ట్ గా ఉంటాయని తెగేసి చెప్పింది. అత్త ప్రభావతి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదు. ఇక మీనా పక్కకు తీసుకెళ్లి అర్థమయ్యేలా చెప్పింది. అత్తవారింట్లో ఉన్నప్పుడు కాస్తా పద్ధతిగా ఉండాలని, దాని ద్వారా మనకే మరింత మర్యాద పెరుగుతుందని చెబుతుంది. పుట్టింట్లో మెదిలినట్టు ఉంటే కుదరదని, చూసేవాళ్లకు కూడా ఇబ్బంది ఉండకూడదని, మనల్ని ఎవరూ తక్కువ చేసి చూడకూడదని చెప్పుకొస్తుంది. దాంతో శృతి తోటికోడలు మీనా మాట విని బట్టలు మార్చేస్తుంది. ఇక నెక్ట్స్ ఎపిసోడ్ లో మీనాపై అత్త ప్రభావతి విరుచుపడుతుంది. తానే ఇంట్లో వారి అందరి బట్టలు ఉత్తకాలని, తిండిపెడుతున్నందూ అది ఫ్రీగానే చేయాలంటుంది. అప్పటికే తన బట్టలు తీసుకొని వచ్చిన శృతి మీనా చేస్తున్న పనికి రూ.2000 ఇస్తుంది. ఇన్ని బట్టలు నువ్వే ఉతుకుతున్నావా? మరీ అత్తయ్యా ఏం చేస్తుందంటూ ప్రశ్నిస్తుంది. డబ్బులు చేతిలో పెట్టి వెళ్లిపోతుంది. తోటికోడళ్లు, అత్త మధ్య జరిగిన ఈ సన్నివేశం రేపటి ఎపిసోడ్ పై ఆసక్తిని రేకెత్తిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X