Gunde Ninda Gudi Gantalu February 19th : మీనాకు ఘోర అవమానం.. డబ్బులిచ్చి కూలీగా మార్చిన తోటికోడలు శృతి.!
Gunde Ninda Gudi Gantalu : గుండెనిండా గుడి గంటలు ఫిబ్రవరి 19th ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. నిన్నటి ఎపిసోడ్ లో శృతి పొట్టిబట్టలు వేసుకొని అలాగే హాల్లోకి రావడాన్ని అత్త ప్రభావతి సున్నితంగా తప్పుబట్టింది. శృతిని పొట్టి బట్టల్లో చూడలేక అక్కడ నుంచి మామ సత్యం వెళ్లి పోతారు. ఆ తర్వాత రోహిణి, ప్రభావతి శృతికి చకెప్పే ప్రయత్నం చేస్తుంటారు. కానీ వినిపించుకోదు. నా బట్టలు నాఇష్టం. నాకు నచ్చిన బట్టలు వేసుకోవడంలో ఇతరు సమస్య ఏముంటుందని వారిస్తుంది. అక్కడే ఉన్న మీనా శృతిని పక్కకి తీసుకెళ్లి అత్తవారింట్లో ఎలాంటి బట్టలు వేసుకోవాలో తెలియజేస్తుంది. శృతిని ఎవరూ తప్పు కూడా అనుకోకూడదంటే మరోసారి పొట్టి బట్టలు వేసుకోకూడదని ప్రేమగా చెబుతుంది..
ఇక నేటి ఎపిసోడ్ లో శృతి మీనా చెప్పినట్టు వింటుంది. వెంటనే వెళ్లి డ్రస్ చేంజ్ చేసుకొని తిరిగి హాల్లోకి వచ్చి ఇలా నిండుగా కనిపిస్తే ఓకేనా అంటూ మీనాను అడుగుతుంది. అలాగే అత్త ప్రభావతి, రోహిణిని కూడా ఇలా బాగుంది కాదా అని వారి అభిప్రాయం తీసుకుంటుంది. అయితే.. మీనా చెప్పగానే శృతి వినడం.. అత్త రోహిణికి ఏమాత్రం గిట్టదు. మీనాపై కడుపు మంటతో రగిలిపోతుంది. దాంతో మీనాను ఇబ్బంది పెట్టేందుకు ఇంట్లో విడిచి బట్టలన్నీ ఒకే రోజు తీసుకొచ్చి ఉతకడానికి వేస్తుంది. అవి చూసిన రోహిణి ఎంతో బాధపడుతుంది. ఏరోజు బట్టలు ఆరోజు వేస్తే సులువుగా ఉంటుంది కదా అని వెనకాలే వచ్చిన అత్త ప్రభావతిని చూసి అడుగుతుంది. కానీ ప్రభావతి మాత్రం నోటికొచ్చిన మాటలతో మీనా మనసును గాయపరుస్తుంది.

ఇదిలా ఉంటే.. తోటి కోడలు రోహిణి కూడా వచ్చి మనోజ్ బట్టలు ఉతకవా అని మీనాకు పనిచెప్పి అవమానిస్తుంది. మీ ఆయన బట్టలు నేను ఉతకలేను అని సమాధానం చెబుతుంది మీనా. కానీ అత్త ప్రభావతి మాత్రం ఎందుకు ఉతకవే.. ఉతకాలి అంటూ ఒత్తిడి చేస్తుంటుంది. మీనా మాత్రం చచ్చినా ఉతకనంటూ తెగేసి చెబుతూ అప్పటి వరకు కుప్పగా ఉన్నబట్టలను నానబెడుతూ ఉంటుంది. ఇక్కడ ఘర్షణ జరుగుతుండగానే.. వెనకాల నుంచి శృతి కూడా తన టాప్స్ కూడా తీసుకొచ్చి ఉతికిస్తావా? అని మీనాను అడుగుతుంది. కానీ అన్ని బట్టలు చూసి ఇవన్నీ నువ్వు మాత్రమే ఉతుకుతున్నావా? అత్త ఖాళీగానే ఉంటుంది కాదా.. వాష్ చేయొచ్చు కదా అని అంటుంది.
నేను పెళ్లి అయినప్పటి నుంచి ఉతకలేదు... పనిమనిషి ఉందంటూ శృతికి బదులిస్తుంది. దాంతో ఇంకా శృతి ప్రభావతిపై మండిపడుతుంది. ఇంట్లోనే మీనా మా అందరి కంటే నాలుగురెట్లు పనిచేస్తుందని, ఆమె పనికి ఎలాంటి గుర్తింపు లేదని, బెనిఫిట్ లేదన్నారు. కనీసం ఆమెపై ఎలాంటి సానుభూతి కూడా చూపించడం లేదని అత్త ప్రభావతి, తోటి కోడలు రోహిణికి చురకలు అంటిస్తుంది. ఆవెంటనే రూ.2000 తీసుకొని వచ్చి మీనాకు ఇచ్చి తీసుకో అంటుంది. వీళ్ల లాగా ఫ్రీగా పని చేయించుకోవడం నాకు రాదని, నువ్వు చేసే పనికి వాల్యూ ఉండాలని చెబుతుంటుంది. కానీ శృతి వాళ్ల ముందే మీనాకు డబ్బులివ్వడం పరోక్షంగా అమానించినట్టైంది. మీనాకు మద్దుతు ఇద్దామనే మాట్లాడినా డబ్బు ఇవ్వడంతో నెగెటివ్ గా మారిపోయింది.

అదే అలుసుగా ప్రభావతి, రోహిణి మీనాపై రెచ్చిపోతారు. డబ్బులు తీసుకొని మరీ బట్టలు ఉతుకుతోంది. అందుకే శృతి బట్టలను తీసుకొని.. మనోజ్ డ్రసులు మాత్రం తీసుకోలేదని నొచ్చుకునేలా మాట్లాడారు. మీనా అన్నీ విని భరిస్తుంది. ఇదే విషయం తెలుసుకున్న శృతి భర్త రవి ఇంటికి రాగానే భార్యను మందలిస్తాడు. నువ్వు మా వదినకు డబ్బులివ్వడం సరికాదని కోపగించుకుంటాడు. కానీ శృతి మాత్రం తన వెర్షన్ లోనే మాట్లాడుతుంది. వీరి మధ్య గొడవ అలాగే కొనసాగుతుంది.
ఇదిలా ఉంటే... మీనా గుండెనిండా బాధతో తన బెడ్ రూమ్ లో బట్టలు మడత పెడుతూ ఉంటుంది. అదే సమయంలో వచ్చిన బాలుతో జరిగిన విషయాన్ని పట్టలేని బాధతో చెప్పుకుంటుంది. ఇంట్లో డబ్బున్న వారికి, సంపాదించే వారికి ఎక్కువ మర్యాద ఉందని, నాకేమీ చేతకాకపోవడంతో మర్యాద లేదని బాధపడుతుంది. ఆ డబ్బును రవికి తిరిగికి ఇవ్వమని చెప్పి ఎలాంటి గొడవ పడొద్దని కోరుతుంది. ఇక ఆ తర్వాత ఎపిసోడ్ లో మాత్రం మీనా కోసం ఇంటి ముందు పూల కొట్టు ఏర్పాటు చేస్తాడు బాలు. శృతితో రెబ్బన్ కట్ చేయించి డబ్బులు తిరిగి ఇప్పించి అవమానిస్తాడు. అసలు పూలకొట్టు పెట్టడానికి కారణం, మంచిగానే ఆలోచించి డబ్బు ఇవ్వడంతో చెడ్డగా మారిపోయిన శృతిని నిజంగానే అవమానించారా? అనేది రేపటి ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచుతోంది.


Click it and Unblock the Notifications











