Gunde Ninda Gudi Gantalu February 20th : బాలు, శృతికి మధ్య వివాదం.. మీనా కోసం రివేంజ్

Gunde Ninda Gudi Gantalu : గుండెనిండా గుడి గంటలు ఫిబ్రవరి 20th ఎపిసోడ్ ఎమోషనల్, సర్ ప్రైజ్, రివేంజ్ లతో ఆసక్తికరంగా సాగింది. నిన్నటి ఎపిసోడ్ లో మీనా బట్టలు ఉతికినందుకు శృతి డబ్బులు ఇస్తుంది. దాంతో మీనా చాలా బాధపడుతుంది. ఆ డబ్బును రవికి తిరిగికి ఇవ్వమని భర్త బాలుతో మీనా చెబుతుంది. ఎలాంటి గొడవ పడొద్దని కూడా కోరుతుంది. శృతి డబ్బులు ఇవ్వడం పట్ల మీనా తన భర్తతో చెప్పుకుంటూ ఎంతో బాధపడుతుంది. తనకు జరిగిన అవమానం పట్ల భర్త రవి ఎవరితోనూ గొడవపడకూడదని కోరుతుంది.

దాంతో మీనా మనస్సులోని బాధను ఎలాగైన పోగెట్టేందుకు రవి ఓ ప్లాన్ వేస్తాడు. మీనాకు సర్ ప్రైజ్ చేద్దామని ప్లాన్ చేసుకుంటాడు. దీంతో అర్ధరాత్రి మీనా వాళ్ల అమ్మగారింటికి వెళ్లి రవి హడావుడి చేస్తాడు. అర్ధరాత్రి తలుపులు కొట్టడంతో రౌడీలు అనుకొని మీనావాళ్ల అమ్మ, తమ్ముడు, చెల్లి భయపడుతారు. ఇంట్లోని ఆయుధాలతో తలుపుతీసి దాడి చేసే ప్రయత్నం చేశారు. కానీ వెంటనే బాలు వారిని నివారించి.. వెంటనే మా ఇంటికి వెళ్లాలని చెప్పి తీసుకొస్తాడు. ఓ సర్ ప్రైజ్ ఉందని, ఎవ్వరూ ఏం అడగొద్దని చెప్పి వెంటపెట్టుకొని ఇంటికి వచ్చేస్తాడు.

Gunde Ninda Gudi Gantalu serial episode 363 February 20th 2024 here is full story

ఇక భార్య మీనాను కూడా తెల్లవారుజామునే రెడీ అవ్వుమని చెబుతుంటాడు. ఎందుకని అడుగుతున్నా.. ఏమాత్రం చెప్పడు. అలాగే తమ్ముళ్లు మనోజ్, రవిని కూడా వాళ్ల భార్యలతో కలిసి రెడీ అవ్వమని చెబుతుంటాడు. ఇంట్లో వాళ్లంతా మాకేమీ చెప్పకుండా ఎందుకు రెడీ అవ్వమంటున్నావంటూ ప్రశ్నిస్తున్నారు. చెప్పడానికే రెడీ అవ్వమంటున్నానంటూ బదులిస్తాడు. డబ్బుడమ్మ, పార్లరమ్మలు త్వరగా రెడీ అయ్యి రావాలని ఫన్నీగా కామెంట్స్ పేలుస్తుంటారు. అందరూ షాక్ లో ఉంటారు. ఏదేమైనా బాలు రీజన్ లేకుండా ఏ పని చేయడని తండ్రి మద్దతిస్తాడు. వెంటనే అందరినీ రెడీ అయ్యి రమ్మంటాడు.

అందరూ రెడీ అయ్యాకా.. బయటికి వచ్చి ఎదురుచూస్తుంటారు. అసలేంటీరా అని బాలును అడుగుతూనే ఉంటారు. సర్ ప్రైజ్.. సర్ ప్రైజ్ అని తన ఫ్రెండ్ రాజేశ్ రాగానే అప్పటికే ప్లాన్ ప్రకారం ఏర్పాటు చేసిన పూలకొట్టును కుటుంబ సభ్యులందరికీ చూపించి సర్ ప్రైజ్ చేస్తాడు. పైగా తన తల్లి పేరు మీదుగా 'ప్రభావతి పూల కొట్టు, ప్రొప్రైటర్ : మీనా' అని బోర్డు కూడా ఏర్పాటు చేస్తాడు. అది చూసి కుటుంబీకులంతా షాక్ అవుతారు. తండ్రి సత్యం, బాలు అత్త, బావమర్ది, మరదలు ఎంతో సంతోషిస్తారు. మీనా తన కోసం భర్త పూలబండి ఏర్పాటు చేయడంతో చాలా ఆనంద పడుతుంది.

Gunde Ninda Gudi Gantalu serial episode 363 February 20th 2024 here is full story

ఇక ఆ బండిని ప్రారంభించే క్రమంలో రిబ్బెన్ కట్టింగ్ ను శృతి చేతుల మీదుగానే చేయిస్తాడు బాలు. రిబ్బెన్ కట్టింగ్ చేయించినందుకు రూ.2500 ఇస్తాడు. దాంతో శృతి, బాలు మధ్య వివాదానికి తెర లేస్తుంది. తనకు డబ్బులు ఇవ్వడం పట్ల శృతి ఎంతగానో రగిలిపోతుంది. తను డబ్బులు ఇచ్చినందుకే బాలు ఇలా అమమానించాడని భర్త రవితో పోరు పెడుతుంది. అయితే.. పూలకొట్టు ఓపెనింగ్ సందర్భంలో ఇంకా ఎలాంటి సన్నివేశాలు జరిగాయనేది ఆసక్తికరంగా మారింది. శృతికి తిరిగి డబ్బులివ్వడం పట్ల కుటుంబ సభ్యులు ఎలా స్పందించారు.. ముఖ్యంగా బాలు చేసిన పనికి శృతి రియాక్షన్ ఏంటనేది నెక్ట్స్ ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X