Gunde Ninda Gudi Gantalu February 21st : బాలు రివేంజ్.. డబ్ డమ్మ శృతికి గుండె పగిలిపోయే పని.!
Gunde Ninda Gudi Gantalu : గుండెనిండా గుడి గంటలు ఫిబ్రవరి 21st ఎపిసోడ్ కాస్తా ఘర్షణలతో హీటెక్కించింది. బాలు పంచ్ లతో రసవత్తరంగా సాగింది. సర్ ప్రైజ్ తర్వాత ఎమోషనల్ సీన్లు, రివేంజ్ సీన్లు ఆకట్టుకున్నాయి. మీనా బట్టలు ఉతికినందుకు శృతి డబ్బులు ఇచ్చినందుకు గాను.. రివేంజ్ తీర్చుకునేందుకు బాలు పూలకొట్టు ఏర్పాటు చేశారు. ఈరోజు ఎసిపోడ్ లో పూలకొట్టు ప్రారంభోత్సవం చాలా ఆసక్తికరంగా మారింది. కొట్టు ఓపెనింగ్ సమయంలో బాలు అందరిపై విరుచుకుపడ్డారు. తన భార్య మీనా పడ్డ వేదనను అర్థమయ్యేలా వివరించాడు.
డబ్ డమ్మ శృతి... పార్లరమ్మ రోహిణి లాగే ఈ పూల కొట్టుతో మీనా కూడా స్వయం ఉపాధిని కలిగి ఉంటుందని బాలు చెప్పుకొచ్చాడు. తనకు ఏ పనిచేత కాదని బాధపడాల్సిన పనిలేదని, పూలు కుట్టుడం ఒక కళ అని భర్త బాలు స్ఫూర్తివంతమైన మాటలతో ఆకట్టుకున్నాయి. ఇక పూలకొట్టుకు తల్లి ప్రభావతి పేరును పెట్టినా.. చిన్న కోడలు శృతితో ఓపెనింగ్ చేయించారు. ఆ తర్వాత బాలు, మీనా తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. తండ్రి బాలు చేసిన పనికి ఎంతో సంతోషిస్తాడు. ఆడపిల్లలు వాంటిళ్ల కుందేళ్లు కాదని బాలు మరోసారి రుజువు చేశారన్నారు.

అయితే.. అందరూ సంతోషంగా ఉన్న సమయంలో బాలు పెద్ద బాంబ్ పేల్చారు. శృతికి సెలబ్రెటీ హోదా ఇచ్చి పూలకొట్టును ఓపెన్ చేయించిన బాలు.. ఆమెకు రూ.2,500 ఇచ్చారు. సినిమా వాళ్లు ఓపెనింగ్ కు వస్తే డబ్బులు తీసుకుంటారు కాదా.. అలాగే శృతికి కూడా డబ్బులిస్తున్నానని చెప్పి.. పైగా మీనాతోనే డబ్బులు ఇప్పిస్తాడు. కట్ చేస్తే.. సత్యం - ప్రభావతి మధ్య సాగిన సరదా సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. భార్య ప్రభావతిని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తారు. కొడుకు బాలుపై రగిలిపోతున్న ఆమెను సత్యం కూల్ చేస్తాడు.
రోహిణి పార్లర్ కు తన పేరు పెట్టుకొని గౌరవం పెంచారని, కానీ బాలు మరీ పూలకొట్టుకు నా పేరు పెట్టారని తల్లి ప్రభావతి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఏమాత్రం కూడా తనకు బాలు చేసిన పని నచ్చలేదని భర్త సత్యంతో చెప్పుకుంటుంది. భర్త సర్దిచెప్పే క్రమంలోనే.. కామాక్షి నుంచి ఫోన్ వచ్చింది. అప్పటికే మండిపోతున్న ప్రభావతికి కామాక్షి మాటలు ఇంకా మంటను పెంచాయి. అలా వారిరువరి మధ్య బాలు, పూలకొట్టుపై సంభాషణ జరుగుతూనే ఉంటుంది. 'మీనాను నువ్వు పూలు కుట్టుకునేది.. పూలు కుట్టుకునేది అంటూ ఉండేదానికి కాదా.. ఇప్పుడు అది తిరిగి నీమీదకే వచ్చింది. ఇప్పటి నుంచి అందరూ ప్రభావతి పూల కొట్టు.. ప్రభావతి పూలకొట్టు అని పిలుస్తారు'.. అంటూ కామక్షి ప్రభావతిని దెప్పి పొడుస్తుంది.
పూలకొట్టు ఏర్పాటు తో ప్రభావతికి విపరీతమైన ఫోన్ కాల్స్ వచ్చాయి. దాంతో పుండు మీద కారం చల్లినట్టుగా ప్రభావతికి వరుసగా వచ్చిన ఫోన్ కాల్స్ విసిగించాయి. మొత్తంగా పూలకొట్టు పెట్టడం, బాలు తీరు, మీనాపైనా కూడా ప్రభావతికి ఒళ్లు మండిపోతుంది. ఇదిలా ఉంటే.. శృతికి డబ్బులు ఇవ్వడం పట్ల చాలా బాధపడుతుంది. మీనాకు రూ.2000 ఇవ్వడం వల్లే బాలు రివేంజ్ తీసుకున్నాడని.. నేనిచ్చే నా దాని కంటే రూ.500 ఎక్కువగా ఇచ్చి అవమానించాడని భర్త రవితో చెప్పుకుంటుంది.
అంతేకాదు... మీనాకు తను ఎంతో సపోర్ట్ ఇచ్చానని, తన వల్లే మీనా స్వతంత్రంగా ఆలోచించడం ప్రారంభించిందని చెప్పుకొచ్చింది. అది నచ్చిన బాలు కుళ్లుతోనే పూలకొట్టి మరీ డబ్బులిచ్చి అవమానించాడని చెప్పింది... కానీ రవి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇక ప్రభావతి మండిపాటు.. శృతికి బాలు రివేంజ్, రోహిణి -సంజూ అంటిముట్టనితనంతో మీనా పూలకొట్టును ఎలా నడిపిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











