Gunde Ninda Gudi Gantalu February 22nd Episode : సంతోషంలో మీనా.. బాలు దెబ్బకి అల్లాడిపోయిన తల్లి ప్రభావతి!

Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడి గంటలు లేటెస్ట్ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. శుక్రవారం ఎపిసోడ్ లో శృతిపై బాలు రివేంజ్ ప్లాన్ ను విజయవంతం చేసుకుంటాడు. ఇంటి ముందే పూలకొట్టు ఏర్పాటు చేయడంతో మీనాకు ఉపాధి కల్పించడమే కాకుండా.. తన భార్యను అవమానిస్తున్న కుటుంబ సభ్యులకు చుకలంటిస్తాడు. తన మనస్సులోని బాధను మీనా ఎలాగూ చెప్పుకోకపోవడంతో బాలునే పూలకొట్టు వ్యూహంతో తల్లి ప్రభావతి, ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు మరదళ్లను ఏకిపారేస్తాడు.

మరీ ముఖ్యంగా.. శృతికి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తాడు. మీనాకు బట్టలు ఉతికినందుకు డబ్బులు ఇచ్చిన శృతికి.. పూలకొట్టును ప్రారంభించమని రూ.500 ఎక్కువ కలిపి మరీ రూ.2500 ముట్టజెప్పుతాడు. మరోవైపు పూలకొట్టుకు తల్లి ప్రభావతి పేరునే పెట్టి గిల్ట్ ఫీలయ్యేలా చేస్తాడు. బాలు ఇచ్చిన షాకింగ్ సర్ ప్రైజ్ కు కుటుంబ సభ్యులంతా నివ్వెర పోతారు. తండ్రి సత్యం మాత్రం తన కొడుకు బాలును, మీనాను అభినందించి శుభాకాంక్షలు తెలియజేస్తాడు. ఇక తల్లి ప్రభావతి మాత్రం ఒంటినిండా మంటతో రగిలిపోతుంది.

Gunde Ninda Gudi Gantalu serial episode 364 February 22nd 2024 here is full story

కొడుకు తనపేరు మీదనే పూటకొట్టు పెట్టడం ప్రభావతికి ఏమాత్రం నచ్చదు. భర్త సత్యంతో తన అవమానాన్ని పంచుకుంటుంది. దీనంతటికి కారణం మీనానే అని భావిస్తుంది. వాళ్లకి తిరిగి కౌంటర్ ఇవ్వలేకపోతుండటం, ఏమీ చేయలేని స్థితిలో ఉక్కిరిబిక్కిరి అవుతుంటుంది. మరోవైపు బాలు ఇచ్చిన కౌంటర్ శృతి గిలగిల కొట్టుకుంటుంది. భర్త రవితో బాలు కావాలనే చేశాడని చర్చపెడుతుంది. మరోవైపు మీనాకు సొంత పూలకొట్టు ఏర్పాటవ్వడంతో తను పార్లర్ అమ్ముకొని అందులోనే ఉద్యోగం చేస్తున్న రోహిణి తన బంఢారం ఎప్పుడు బయటపడుతుందోనని ఆందోళన చెందుతుంది.

బాలు ఇచ్చిన షాక్ కు తల్లి ప్రభావతి, రోహిణి, శృతిలు మండిపడుతుంటారు. దీంతో శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. ఇన్ని ఘర్షణల మధ్య బాలుకు ఎలాంటి సమస్యలు తెచ్చిపెడుతారోననేది నెక్ట్స్ ఎపిసోడ్ పై మరింతగా ఆసక్తిని పెంచుతోంది. పూలకొట్టు ప్రారంభం తర్వాత బాలు అందరికీ తానే స్వయంగా టిఫిన్స్ తెప్పిస్తాడు. పూలకొట్టు ఓపెన్ చేసినందుకు చిన్న పార్టీని సెలబ్రేట్ చేస్తాడు. అందుకు కుటుంబ సభ్యులందరినీ పిలుస్తాడు.

ఇక తల్లి, శృతి, మీనా బాలు ఇచ్చే ట్రీట్ కు వెళ్లారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఎన్నో కష్టాలను చవిచూసిన మీనా జీవితంలో బాలు ఏర్పాటు చేసిన పూలకొట్టుతో వెలుగులు నిండాయి. ఆమె ఎంతో సంతోషంగా ఉంది. భర్తతో తన ఆనందాన్ని తెలియజేసింది. ఈ క్రమంలో వారి ముగ్గురు నుంచి మీనాకు ఎలాంటి ప్రమాదం పొంచి ఉందనేది మున్ముందు తెలియనుంది.

తమను అవమానించాడని రగిలిపోతున్న తల్లి ప్రభావతి, చిన్నమరదలు శృతి బాలుపై మళ్లీ ఎలా రివేంజ్ తీర్చుకుంటారో చూడాలి. లేదంటే.. బాలు ఎలాగూ మంచి పనే చేశాడు కాబట్టి.. అన్నీ మర్చిపోయి ముందుకు సాగుతారా? అన్నది సోమవారం ఎపిసోడ్ లో చూడాలి. బాలు కౌంటర్ ను మర్చిపోయి మరో కొత్త సమస్యకు తెరలేపుతారా అన్నది చూడాలి. మీనాకు పూలకొట్టుతో కష్టాలు తీరాయా? లేకా మరిన్ని సమస్యలు వచ్చాయా? అనేది నెక్ట్స్ ఎపిసోడ్ తో తెలిసే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X