Gunde Ninda Gudi Gantalu February 24th Episode : మీనాపై ప్రభావతి కడుపుమంట.. పార్క్ లో మనోజ్ ను చూసిన బాలు..

Gunde Ninda Gudi Gantalu : గుండెనిండా గుడి గంటలు ఫిబ్రవరి 24th రసవత్తరంగా మారింది. గత ఎపిసోడ్ లో బాలు మీనాకు పూల కొట్టు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. శృతి మీనాకు బట్టలు పిండినందుకు డబ్బులిస్తుంది. అయితే శృతి మాత్రం మంచి ఉద్దేశంతోనే మీనాకు డబ్బులు ఇస్తుంది. కానీ మీనా మనస్సు బాధపడుతుంది. భర్త బాలుతో చెప్పడంతో రగిలిపోతాడు. సర్ ప్రైజ్ సర్ ప్రైజ్ అంటూ... కుటుంబ సభ్యులందరినీ పిలిచి ఇంటి ముందే పూలకొట్టును ఏర్పాటు చేస్తాడు. అక్కడే అసలు కథ మొదలవుతుంది. మీనాకు డబ్బులిచ్చిన శృతితోనే రిబ్బెన్ కట్ చేయించి పూలకొట్టును ప్రారంభిస్తాడు. అందుకు రూ.2500 డబ్బులిచ్చి శృతికి దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తాడు. దానికి తల్లి ప్రభావతి చిరాకు పడటంతో పాటు శృతి కూడా మండిపడుతుంది.

ఇక లేటెస్ట్ ఎపిసోడ్ ఇంకా రసవత్తరంగా మారింది. బాలు తనను అవమానించాలనే డబ్బులిచ్చాడని శృతి నెత్తినోరు కొ్టుకుంటుంది. భర్త రవితో తన అన్న ఉద్దేశపూర్వకంగా పూలకొట్టు తనతో ప్రారంభించమే కాకుండా డబ్బులిచ్చి అవమానించాడన్నారు. మీనాతో తను చనువుగా ఉండటం.. సపోర్ట్ చేయడం బాలుకు ఏమాత్రం నచ్చడం లేదని అభిప్రాయపడింది. అందుకునే మీనాకు పూల కొట్టు పెట్టించాడని, ఆ డబ్బులతో మళ్లీ తాగుతాడని శృతి, భర్త రవితో చర్చ పెడుతుంది. కానీ రవి మాత్రం తన అన్న మంచి మనస్సును తెలుసుకొని అలాందేమీ లేదని శృతి మాటలను, ఆలోచన విధానాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తాడు. కాస్తా గట్టిగానే మాట్లాడుతాడు శృతి మీద.

Gunde Ninda Gudi Gantalu serial episode 364 February 23rd 2024 here is full story

ఇక అంతలోనే అత్త ప్రభావతి ఎంట్రీ ఇస్తుంది. శృతికి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుంది. అదే దోవలో బాలు, మీనాపై తనకున్న కోపాన్ని కూడా వెళ్లగక్కుతుంది. ఇంటి ముందే పూలకొట్టు పెట్టి పరువుతీస్తున్నారు. ఉద్యోగాలు చేసే ఆడపిల్లలున్న ఇంటి ముందే ఇలా పూల కొట్టు పెట్టడం అవమానం అనింది ప్రభావతి. శృతికి అవమానం జరిగిందని రచ్చ చేస్తుంటే... ప్రభావతి సర్దిచెప్పి త్వరలో పూలకొట్టు తీయించేందుకు ఏదైనా పరిష్కారం చూద్దాం అంటూ చెప్తుంది.

ఇదిలా ఉంటే... మరోవైపు మీనా తన పూలకొట్టును చూసుకుంటూ మురిసిపోతుంది. అక్కడే ఉన్న తల్లి, చెల్లి, తమ్ముడితో తన ఆనందాన్ని పంచుకుంటుంది. ఈరోజుటితో తను పూలకొట్టుకు యజమానిగా మారానని తెలిపింది. అందుకు పుట్టింటి వారు కూడా సంతోషిస్తారు. కానీ శృతి డబ్బులిచ్చిన సంగతి పుట్టింటి వారికి కూడా తెలియడంతో మీనాను అడుగుతారు. బాలు అంతా చెప్పాడనడంతో మీనా స్పందించి శృతి అలాంటిదేమీ కాదని చెప్పుకొచ్చింది. అంతలోనే బాలు టిఫిన్స్ పట్టుకొని వచ్చి అందరికీ ఇస్తాడు. మీనా కోసం స్పెషల్ గా మసాలా దోశ తెచ్చి ఇస్తాడు. ఎప్పుడూ మీనా కోసం ఏదీ తేలేదని.. ఇప్పుడు ప్రత్యేకంగా మసాలా దోశ తెచ్చి ఇచ్చానని చెప్పి మీనాతో పాటు ఆమె పుట్టింటి వారిలోనూ ఆనందం నింపుతాడు. తన కుతూరిని ఎంతో బాగా చూసుకుంటున్నందుకు మీనా తల్లి సంతోష పడుతుంది. కానీ మీనా తండ్రి కూడా ఉంటే.. ఇంకా సంతోష పడేవారని గుర్తు చేసుకున్నారు.

మీనా ఒక్క పూలకొట్టుతోనే ఆగిపోకూడదని.. పెద్దపెద్ద షాప్ లకు యజమానిగా మారాలని కోరుకుంటున్నారు. కట్ చేస్తే.. ఒక్క రోజు పూలకొట్టుపై రూ.600 లాభం వచ్చిందని బాలు, మీనా లెక్కలు వేస్తుంటారు. ఇదే విషయాన్ని ప్రభావతి గమనిస్తుండటంతో బాలు ఎటకారంగా మీనా కష్టార్జితం రూ.600 అంటూ గొప్పగా చెబుతాడు. కానీ ప్రభావతికి మాత్రం మింగుడుపడదు. వచ్చింది ఆరువందలేగా.. ఏదో ప్రపంచంలో పూల వ్యాపారం అంతా మీరే చేస్తున్నారా? అంటూ విసుక్కుంటుంది. కానీ బాలు మాత్రం తన మాటలతో ఇంకా ప్రభావతికి అసూయ పెంచుతుంటాడు.

మరోవైపు మీనా పూలకొట్టు ద్వారా వచ్చిన ఆర్డర్లకు సంబంధించిన పనులు చేస్తుంటుంది. పనిలో మునిగిపోతుంటే.. బాలు వచ్చి మీనాను కాస్తా రెస్ట్ లేకుండా పనిచేస్తున్నావేంటీ అంటాడు. ఇక మీనా బాలు ఇచ్చే సపోర్ట్ కు ఎమోషనల్ అవుతుంది. ఒక్క రోజులోనే తన జీవితాన్ని మార్చినందుకు కన్నీటితో బాలుకు ధన్యవాదాలు తెలియజేస్తుంది. మీనా నార్మల్ అయ్యేందుకు బాలు సరదా ముచ్చట్లు చెప్పి నవ్విస్తాడు. మున్ముందు ఇంకా పెద్ద షాపులు పెట్టి నడిపిద్దామని, మనుషులను పెట్టి పూలకొట్టును విజయవంతంగా నడిపిద్దామంటారు.

ఇక భర్త సపోర్ట్ తోనే మీనా ఎదుగుతుందని భర్త బాలుతో చెప్పుకుంటుంది. తన తండ్రిలాగే ఇంకా కష్టపడి పూలకొట్టును వృద్ధిలోకి తీసుకొస్తా అని చెప్పుకొస్తుంది. అందుకు బాలు సంతోషిస్తాడు.. ఇక ప్రోమోలో.... బాలు, మీనా పూలకొట్టు ఏర్పాటు చేయడంపై తల్లి ప్రభావతి, తమ్ముడు మనోజ్ అభ్యంతరం వ్యక్తం చేస్తాడు. రాత్రంతా నిద్రకూడ పట్టడం లేదని మీనాపై ప్రభావతి మండిపడుతుంది. మనోజ్ కూడా ఎక్కడా స్థలం లేనట్టు పోయిపోయి ఇంటి ముందే ఎలా పూల కొట్టు పెట్టారని బాలుపై విరుచుకుపడుతాడు. కట్ చేస్తే పూలకొట్టుపై పాంప్లమెంట్స్ పంచుతూ బాలు పార్క్ కు వెళ్తాడు. అక్కడే ఉన్న మనోజ్, జాబ్ లేకుండా పార్క్ లో చేసే పనులను అంతా ఫోన్ లో రికార్డ్ చేస్తాడు. తమ్ముడి బంఢారాన్ని ఇంట్లో బయటపెడ్తానంటూ వెళ్లిపోతాడు.... ఈ అంశాలతో మనోజ్ పరిస్థితి ఏంటని, తరువాత ఏం జరుగతబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X