Gunde Ninda Gudi Gantalu: బాలు - మీనాల రొమాన్స్... వంటమనిషిగా ప్రభావతి.. ఇంటిల్లిపాదీని ఉతికారేస్తున్న సత్యం
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు ఫిబ్రవరి 25th ఎపిసోడ్ బాలు, మీనా మధ్య ఆసక్తికరంగా సాగింది. మీనాకు బట్టలు ఉతికినందుకు మీనాకు శృతి డబ్బులు ఇవ్వడం... ఆ విషయం తెలుసుకొని బాలు సర్ ప్రైజ్ అంటూ పూల కొట్టు ఏర్పాటు చేయడం.. డబ్బుడమ్మ శృతితోనే ఆ కొట్టును ప్రారంభించి తిరిగి ఆమె డబ్బును వెనక్కి ఇవ్వడం.. మీనాను క్షణం కూడా ఓర్వని తల్లి ప్రభావతి పేరునే పూలకొట్టుకు పెట్టి చిరాకు తెప్పించడంతో రీసెంట్ ఎపిసోడ్స్ రసవత్తరంగా సాగాయి.
ఇక ప్రస్తుతం మీనాకు భర్త బాలు ఎంతో సహకరిస్తుండటం.. పైగా పూలకొట్టు పెట్టి ఆమెకు ఉపాధిని కల్పించడంతో ఎంతో ఆనందపడుతుంది. బాలు తన వెంటే ఉంటే ఏదైనా సాధిస్తాననే నమ్మకం వచ్చిందని చెప్పుకొచ్చింది. పూలకొట్టు పెట్టి తనతో మొదటి అడుగు వేయించారని భర్త బాలుపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. తనకు తెలిసింది చేశానని బాలు చెప్పుకొచ్చారు. ఇక బాలుకు హగ్ ఇచ్చి మరీ కృతజ్క్షతలు తెలియజేస్తుంది. అంతేకాదు.. బాలుకి గులాబీ ఇచ్చి మరీ తన ప్రేమను తెలియజేస్తుంది.

వెంటనే.. బాలు - మీనా ఇద్దరూ పూలు తేవడానికి కారులో వెళ్తుంటారు. దారిలోనే బాలు పూలకొట్టు పెట్టడానికి కారణాన్ని తెలియజేస్తాడు. డబ్బుడమ్మ శృతి, పార్లరమ్మ రోహిణిలాగే నువ్వు కూడా ఉపాధి కలిగి ఉండాలనే పూలకొట్టు ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ఎప్పుడూ పూలనే కాకుండా... పక్కనే ఉండే ముళ్లను కూడా చూడాలని అన్నారు. తల్లి ప్రభావతితో మీనా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తారు. ఇదిలా ఉంటే.. పూటకొట్టును వృద్ధిలో తీసుకొచ్చే పనులపై మాట్లాడుతూ.. ఒకరిపై ఒకరు ప్రేమ వర్షం కురిపించుకుంటారు. మీనా, బాలు ఎంతో అన్యోన్యంగా కనిపిస్తారు. ఒకరికొకరు ప్రేమను ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంలో మునిగి తేలుతారు.
ఇదిలా ఉంటే... మీనా ఇంట్లోనే ఉందనుకొని ప్రభావతి, మనోజ్ - రోహిణి, రవి - శృతిలు కాఫీ ఇవ్వమని అడుగుతుంటారు. కానీ సత్యం వచ్చి మీనా ఇప్పటి నుంచి ఫుల్ బిజీగా ఉంటుంది.. ఎవ్వరి పనులు వారే చేసుకోవాలని చెప్తాడు. మీనా బిజీగా ఉంటుందని పూలు తెచ్చుకోవడానికి రోజూ వెళ్తుంటారని.. ఇకపై పనులన్నీ నువ్వే చేయాలని ప్రభావతికి గట్టిగా చెప్తాడు సత్యం. ఇక ప్రభావతి కిచెన్ లో కనీసం కాఫీ కూడా పెట్టుకోలేని స్థితిలో మీనా చిరాకు పడుతుంది. అన్నీ పనులు తనే చేసుకోవాల్సి వస్తుందే అని విసిగిపోతుంది. ప్రతిరోజూ మీనా పనిచేసి ఈ ఒక్కరోజు ఇంట్లో పనులు చేయకపోవడంతో అందరూ తమ తమ పనులకు వెళ్లిపోతారు.
ఇక బాలు తిరిగి టిఫిన్స్ తీసుకొని ఇంట్లోకి వస్తాడు. ఎవ్వరూ తిని ఉండారనే ఉద్దేశంతో తీసుకొచ్చానని తల్లి ప్రభావతికి ఇస్తాడు. కానీ అప్పటికే ఆకలి మంటతో ఉన్న ప్రభావతి బాలుపై చిరాకు పడుతుంది... దాంతో బాలు కాస్తా ఎటకారంగా మాట్లాడుతూనే తన భార్యకు ఎవ్వరూ పనులు చెప్పకూడదని తెగేసి చెప్తాడు. ఇంట్లో పనులు చేయడానికి మీనాకు ఏమాత్రం సమయం ఉండదని, అందుకు వంట చేసేందుకు, పూలకొట్టులో మీనాకు సాయంగా ఉండేందుకు పని మనిషిని పెట్టబోతున్నట్టు తల్లి ప్రభావతికి చెప్తాడు. అప్పటి వరకు ఇంట్లో పనిమనిషిలా అన్నీ పనులుచేసిన మీనా పూలకొట్టుకు ఓనర్ అయ్యి.. ఇప్పుడు ఆమె పనులు ఆమెనే చేసుకుంటుండటంతో ప్రభావతికి ఇంకా కడుపు మండుతుంది.
ఇక మీనా ఇంట్లోకి రాగానే... తన అసూయను వెళ్లగక్కుతుంది. బాలు నివారించి మీనా పూలకొట్టు మాత్రమే చూసుకోవాలని తెగేసి చెప్తాడు. కట్ చేస్తే... అర్థరాత్రి పూట సత్యం ఇంటికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వస్తారు. అందరూ పడుకున్న సమయంలో తలుపులు బాదుతుంటారు. ఎవ్వరూ లేవకపోవడంతో ప్రభావతినే లేచి డోర్ తీస్తుంది. బయట ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఉంటారు. వాళ్లు ఎవరి ఆరా తీస్తుంది ప్రభావతి. అయితే వాళ్లు వచ్చింది పెళ్లికి పూలదండల కోసమని ప్రభావతికి చెప్తుంటారు. ఇంత అర్థరాత్రి పూలదండలెందుకు ఎవరైనా చనిపోయారా? అని ప్రభావతి ఎటకారంగా అడుగుతుంది. అందుకు పూలమ్మే వారి అత్త చనిపోయింది.. అందుకే ఇక్కడి వచ్చామని బదులిస్తారు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.
అయితే.. మీనా పూలకొట్టులో పెళ్లి పూలదండలు కొనేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు మాట్లాడిన మాటలకు ప్రభావతి రాత్రంతా నిద్రపోలేదని తరువాయి భాగంలో చెప్తుంది. అందుకు కారణం మీనానే అంటూ మండిపడుతుంది. పూల కొట్టు పెట్టడం వల్లే అందరికీ ఇబ్బందిగా ఉందని మనోజ్ కూడా తన అభిప్రాయాన్ని చెప్తాడు. మరోవైపు మీనాపైనా ప్రభావతి మండిపడుతుంది... ఇదిలా ఉంటే.. మనోజ్ పార్క్ లో ఖాళీగా ఉండటం బాలు కంట పడుతుంది. పూలకొట్టు పాంప్లమెంట్స్ ను పంచుతున్నక్రమంలో పార్క్ లో మనోజ్ ను చూసి.. రెండు నెలలుగా పార్క్ లో కనిపిస్తున్నారనే విషయం తెలుసుకుంటాడు. దీంతో ఫోన్ లో బాలు పార్క్ లో ఉన్నట్టుగా వీడియోలు తీస్తాడు... ప్రభావతి, మనోజ్ పూలకొట్టుపై ఎలా అభ్యంతరం చెప్పారు, బాలు మనోజ్ బంఢారాన్ని ఎలా బయటపెట్టారు? మీనాకు వచ్చిన చిక్కులేంటి? తోటి కోడలు ఎలా ప్రవర్తించారనే విషయాలు నెక్ట్స్ ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచుతున్నాయి.


Click it and Unblock the Notifications











