Gunde Ninda Gudi Gantalu February 26th Episode : మనోజ్ ను ఇరకాటంలో పెట్టిన బాలు... పార్క్ వీడియోతో గుట్టురట్టు
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు ఫిబ్రవరి 26th ఎపిసోడ్ లో ప్రభావతి వర్సెస్ మీనాగా నడిచింది. పూల కొట్టు ఏర్పాటు తర్వాత బాలు - మీనా ఎంతో సంతోషంగా ఉంటున్నారు. ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించుకుంటూ అన్యోన్యంగా జీవిస్తున్నారు. మీనాకు బాలు ఎంతో సపోర్ట్ ,చేస్తుండటంతో తండ్రి సత్యం, తమ్ముడు రవి ఎంతో సంతోషిస్తారు. కానీ తల్లి ప్రభావతికి, రోహిణికి, మనోజ్ కు ఏమాత్రం గిట్టడం లేదు. ఈ సన్నివేశాలన్నీ ఇప్పటి వరకు ఆసక్తికరంగా మారాయి.
ఇక లేటెస్ట్ ఎపిసోడ్ లో ప్రభావతి కడుపు మంటతో బాలు, మీనాపై విరుచుకు పడుతుంది. అర్థరాత్రి పూట గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు పెళ్లి దండల కోసమని ఇంటికి వస్తున్నారు. అందరూ పడుకున్న సమయంలో తలుపులు బాదుతుంటారు. ప్రభావతినే లేచి డోర్ తీస్తుంది. పెళ్లికి పూలదండల కోసమని ప్రభావతికి చెప్తుంటారు. ఇంత అర్థరాత్రి పూలదండలెందుకు ఎవరైనా చనిపోయారా? అని ప్రభావతి ఎటకారంగా అడుగుతుంది. అందుకు పూలమ్మే వారి అత్త చనిపోయింది.. అందుకే ఇక్కడి వచ్చామని బదులిస్తారు.

చిర్రెత్తిపోయిన ప్రభావతి దండలు లేవు.. ఏమీ లేవు వెళ్లండి అంటూ తన అసూయను వెళ్లగక్కుతుంది. ఆమె చిరాకును చూసి దండల కోసం వచ్చిన వాళ్లు నాలుగు చివాట్లు పెడ్తారు. దాంతో రాత్రంతా నిద్రపోకుండా అవమానంగా భావిస్తుంది. నిద్రపట్టడం లేదంటూ సత్యంతోనూ ఘర్షణ పడుతుంది. ఇక లేచాక ఉదయం బాలు- మీనాపై ప్రభావతి అసూయను వెళ్లగక్కుతుంది. తనకు రాత్రంతా నిద్రలేదని, యాళ్లపాళ్ల లేకుండా పూలకోసం అంటూ జనాలు ఇంటికి వస్తున్నారని, పూలకొట్టువల్లే రాత్రి ఇబ్బంది పడాల్సి వచ్చిందని చెబుతుంది.
పూల కొట్టు పెట్టడం వల్లే అందరికీ ఇబ్బందిగా ఉందని మనోజ్ కూడా తన అభిప్రాయాన్ని చెప్తాడు. పైగా తను పెద్ద ఆఫీస్ లో పనిచేస్తుండటంతో ఇంటి ముందు పూలకొట్టు ఉండటం తనకు అమానంగా ఉందన్నారు. మరోవైపు మీనా కూడా తన పూలకొట్టు వ్యాపారం చూసుకుంటూ బిజీ అవడంతో ఇంట్లో పనులను పట్టించుకోవడంతో దానివల్ల కూడా ఆమెపై మండిపడుతుంటారు. మధ్యలో బాలు కలుగజేసుకొని పూలకొట్టుపై ఏడ్వడం మానేయండి అంటూ హెచ్చరిస్తారు. అందరి లాగే మీనా కూడా పని ఉపాధితో డబ్బులు సంపాదిస్తుందన్నారు. దాంట్లో తప్పుగా చూడాల్సిన పనేం లేదని చెప్పుకొస్తాడు బాలు.
ఇక ఆ తర్వాత... రైడ్ కోసమని కారులో బయటికి వెళ్తాడు బాలు. డ్రాప్ లోకేషన్ సరిగ్గా మనోజ్ రోజూ జాబ్ కోసమని వచ్చి.. రోజంతా గడిపే పార్క్ వద్దకే వస్తుంది. ఎలాగూ పార్క్ వద్ద కు వచ్చాం కదా అని బాలు పూలకొట్టు పాంప్లమెంట్స్ ను అందరికీ పంచుతుంటాడు. ఈ క్రమంలోనే మనోజ్ పార్క్ లో తన స్నేహితుడితో కనిపిస్తాడు. ఎలాంటి పనిపాట లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీస్ కు వెళ్తున్నానని చెప్పి ఇలా పార్క్ లో కనిపించడంతో బాలు షాక్ అవుతాడు. రెండు నెలలుగా జాబ్ లేకుండా పార్క్ లోనే కాలం గడుపుతున్నాడని తెలుసుకుంటాడు.
తన మొబైల్ లో బాలు రోజూ పార్క్ లో ఏం చేస్తాడు. ఏఏ టైమ్ కి ఏం తింటున్నాడు.. ఎంత బాధ్యతారహితంగా కాలాన్ని లెక్కచేయకుండా పార్క్ లో సమయాన్ని వృథా చేస్తున్నాడనే విషయాలను మొబైల్ లో వీడియో రికార్డు చేస్తాడు. ఇక వీడియోతో మనోజ్ సంగతి తేల్చుతానని ఇంటికి వెళ్తుంటాడు. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది..... ఇక తరువాయి ఎపిసోడ్ లో బాలు మనోజ్ భాగోతాన్ని కుటుంబ సభ్యుల ముందు బయటపెడ్తాడు. తన మొబైల్ ఫోన్ లో షూట్ చేసిన వీడియోను అందరికి చూపించి అసలు నిజాన్ని చూపిస్తాడు. దీంతో అందరూ షాక్ అవుతారు.
రోహిణి, శృతి, తండ్రి సత్యం, తమ్ముడు రవి మనోజ్ మోసం చేస్తున్నాడాని గ్రహిస్తారు. ఇక తల్లి ప్రభావతికి ఈ విషయం ఎప్పటి నుంచో తెలుసుని బాలు అంటాడు. ఆసమయానికే వచ్చిన మనోజ్ కు కూడా తన షార్ట్ షిల్మ్ ను చూపించి ప్రశ్నల వర్షం కుపిస్తారు. ఇక మనోజ్ ఎలా స్పందించారు? ఇంట్లో వాళ్లు ఆయన్ని ఎమని నిందించారు? కొడుకును వెనకెసుకొస్తున్న ప్రభావతి పరిస్థితి ఏంటీ? మీనా దీనిపై ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందనేది రేపటి ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచుతోంది.


Click it and Unblock the Notifications











