GundeNinda GudiGantalu:మనోజ్ చెంప చెల్లుమనిపించిన బాలు..భర్త పార్క్ స్టోరీ తెలిసి ఇంట్లోంచి వెళ్లిపోయిన రోహిణి

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఫిబ్రవరి 27th ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ప్రభావతి వర్సెస్ బాలు - మీనాగా సన్నివేశాలు ఇంట్రెస్టింగ్ గా ఇప్పటి వరకు సన్నివేశాలు సాగిన విషయం తెలిసిందే. మీనాపై అత్త ప్రభావతి మండిపడుతుండటం.. అది చూసి బాలు తన తల్లిపై సున్నితంగా పంచులు పేల్చడం ఆడియెన్స్ కు మరింత ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశాయి. పూల కొట్టు ఏర్పాటు తర్వాత బాలు - మీనా ఎంతో సంతోషంగా ఉంటున్నారు. ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించుకుంటూ అన్యోన్యంగా జీవిస్తున్నారు. కానీ ప్రభావతి, కొడుకు మనోజ్ మాత్రం మీనాపై బాలుపై విరుచు పడుతూనే ఉన్నారు.

కానీ బాలు పార్క్ లో మనోజ్ ను చూసిన సంగతి తెలిసిందే. మనోజ్ జాబ్ లేకుండా పార్క్ లో ఎలాంటి వేషాలు వేస్తున్నారో... ఎంత హ్యాపీగా సమయాన్ని వృథాచేస్తున్నాడో తెలియజేసేలా వీడియో రికార్డు చేశాడు బాలు. ఇక వెంటనే ఆలస్యం లేకుండా ఇంట్లో కుటుంబ సభ్యుల ముందు మనోజ్ భాగోతాన్ని బయటపెడుతాడు. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ లో.. స్టోరీ మరింత రసవత్తరంగా సాగింది. ఇన్నాళ్లు జాబ్ లేకుండా ఖాళీగా పార్క్ లో తిరుగుతున్న మనోజ్ గుట్టును రట్టు చేశాడు బాలు.

Gunde Ninda Gudi Gantalu serial episode 368 February 27th 2025 here is full story

ఇంట్లో కుటుంబ సభ్యులను పిలచి త్వరగా రండి అంటూ కేకలు వేస్తాడు. ముఖ్యంగా తల్లి ప్రభావతికి చూపించాల్సిన ఓ షార్ట్ వీడియో ఉందని, కుటుంబ సభ్యులంతా చూడాలంటాడు. అన్న మనోజ్ భాగోతానికి సంబంధించిన వీడియోను శృతి ల్యాప్ టాప్ లో ప్రదర్శిస్తాడు. మనోజ్ ఓ పెద్ద కార్ల కంపెనీలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని చెప్పి పార్కులో జల్సాలు చేస్తుండటం చూసి కుటుంబ సభ్యులంతా షాక్ అవుతారు. మీనా, భర్త రోహిణి, రవి-శృతిలకు ఏం అర్థం కాక అలానే చూస్తుంటారు.

ఇక బాలు ఆఫీస్ కు వెళ్తున్నానని చెప్పి పార్క్ లో ఏటైమ్ కు ఏం చేస్తున్నాడని క్లియర్ గా కుటుంబ సభ్యులకు వివరిస్తాడు. మనోజ్ భాగోతం బయటపడటంతో తల్లి ప్రభావతి బిక్కు బిక్కుమని చూపిస్తుంది. ఇంకా ఆపేయరయ్యా బాబు అంటూ బ్రతిమిలాడుతుంది. కానీ బాలు ఏమాత్రం లెక్కచేయకుండా మనోజ్ బాగోతాన్ని బయటపెడ్తాడు. తండ్రి సత్యం వాడు ఏం పనిచేయడం లేదా? అని అడుగుతాడు. అవును అని బాలు కన్ఫమ్ చేస్తాడు. దీంతో కుటుంబ సభ్యులు రోహిణిపై ప్రశ్నల వర్షం కురిపిస్తారు. మనోజ్ చేస్తున్న పని ఇదేనా? మాకెందుకు చెప్పడం లేదని మండిపడుతారు.

ఏ క్లయింట్ ను కలవడానికి వెళ్లాడోనని రోహిణి సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. కానీ బాలు జాబ్ చేయడం లేదని పార్క్ సెక్యూరిటీ, కార్ షోరూమ్ ఆఫీసర్ వీడియో విత్ వాయిస్ ను కూడా కుటుంబ సభ్యులకు చూపిస్తాడు. దాంతో మనోజ్ పై అందరూ మండిపడుతుంటారు. ప్రతిరోజూ వంట లేట్ అయితే అత్తతో నన్ను తిట్టించి మరీ మీ ఆయన వెలగపెట్టే పని ఇదేనా? అని రోహిణిని మీనా ప్రశ్నిస్తుంది.. అందరూ మండిపడుతున్న క్రమంలోనే మనోజ్ ఇంటి గుమ్మం వద్ద ఉన్న పూలను తన్నుకుంటూ వస్తాడు. నాలాంటి బిజినెస్ ఎగ్జిక్యూటీవ్ ఇంటికి వస్తే ఇలా పూలకొట్టు, పూలు అడ్డుగా ఉంటే ఎలా ఉంటుందని చిరాకు పడుతాడు.

ఈరోజు వాళ్ల ఆఫీస్ కు సెలబ్రెటీ కస్టమర్ కింగ్, నాగార్జున గారు వచ్చారని అబద్ధం చెప్తాడు. మనోజ్ ఇంగ్లీష్ కు అభినందించాడని కూడా గొప్పలు చెప్పుకుంటాడు. అంతే కాదు తమ బాస్ వచ్చే నెల జీతం డబుల్ చేస్తాడనని లేనిపోని వన్ని చెప్తాడు. ఇక బాలు అతివినయంతో మనోజ్ బాగోతాన్ని బయపెట్టే వీడియోను మనోజ్ కు కూడా చూపిస్తాడు. దొరికిపోయాయనని చెప్పి మనోజ్ నోరు మూసుకొని బుద్ధిమంతుడిగా ప్రవర్తిస్తాడు. ఇక ఈ విషయం తల్లి ప్రభావతికి కూడా తెలుసునని, కానీ ఇన్నాళ్లు దాచిందని బాలు పూర్తిగా గుట్టురట్టు చెస్తాడు.

కొడుకు చేసిన పనికి సత్యం మండిపడుతుంటాడు. ప్రభావతి మనోజ్ ను వెనకేసుకొని రావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. 40 లక్షలు తీసుకున్నప్పుడు, ఇంటి పత్రాలు తాకట్టు పెట్టినప్పుడు ఇలాగే దాచావని సత్యం ప్రభావతిపై మండిపడుతాడు. ఇక మనోజ్ భయంతో వణికిపోతాడు. దీనంతటికి కారణం ప్రభావతే అని తేల్చేస్తాడు సత్యం.... అంతటి తో ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక మనోజ్ చేసిన పనికి రోహిణి ఇంటిని వదిలి వెళ్లి పోతుంది. దీంతో కుటుంబ సభ్యులంతా కంగారు పడుతారు. బాలు వల్లే ఇలా జరిగిందంటూ తల్లి, మనోజ్ నోరుపారేసుకుంటారు. దీంతో బాలు కాలర్ పట్టుకున్న మనోజ్ చెంప చెల్లుమనిపిస్తాడు. దాంతో తండ్రి సత్యం గొడవను సర్దుమణింగించేందుకు బిగ్గరగా అరుస్తాడు. ఇంత సమస్యలో అసలు రోహిణి ఎందుకు వెళ్లిపోయింది? ఎక్కడికి వెళ్లిపోయింది? అనే విషయాలు రేపటి ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X