Gunde Ninda Gudi Gantalu:మనోజ్ మోసగాడు..గుడ్డిగా నమ్మితే గొంతు కోసే రకం..భర్తను నిలదీసిన రోహిణి..కానీ

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఫిబ్రవరి 28th ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా నడిచింది. మనోజ్ గుట్టురట్టు చేసిన తర్వాత కుటుంబ సభ్యులు ఎంతగానో షాక్ అయ్యారు. పార్క్ లో వీడియో తీసిన బాలు మనోజ్ భాగోతాన్ని మొత్తం బయటపెడ్తారు. బాలు ఆఫీస్ కు వెళ్తున్నానని చెప్పి పార్క్ లో ఏటైమ్ కు ఏం చేస్తున్నాడనేది క్లియర్ గా కుటుంబ సభ్యులకు అర్థమయ్యేలా చూపిస్తాడు. దీంతో మనోజ్ పై అందరూ మండి పడుతారు. ఉద్యోగం, సద్యోగం లేకుండా పార్క్ లో జల్సాలు చేయడం పట్ల అందరూ మండిపడ్తారు. మనోజ్ భాగోతం బయటపడటంతో తల్లి ప్రభావతి బిక్కు బిక్కుమని చూపిస్తుంది. తండ్రి సత్యం మనోజ్ పై రెచ్చిపోతారు.

మనోజ్ అబద్ధం చెప్పటం వల్ల అందరినీ మోసం చేశారని మండిపడ్డారు. తల్లి ప్రభావతి, మనోజ్ కలిసే ఇలాంటి నాటకం ఆడారన్నారు. ఇక బాలు గతాన్ని తవ్వుతూ మనోజ్ కౌంటర్ ఇస్తాడు. గతంలో తనకు జాబ్ లేనప్పుడు బార్ లో పనిచేయమని సలహానిచ్చాడని, కార్లు కడితే తన క్లైంట్స్ ముందు పరువు పోతుందంటూ అవమానించాడని మనోజ్ అన్న మాటలను గుర్తు చేస్తాడు. ఒక్క నెలలో ఇంట్లోకి డబ్బులివ్వడం నాలుగు రోజులు లేట్ అయితే నానా మాటలు అన్నారన్నారు. అందుకే అప్పుడు కార్లు కూడా కడిగానని తెలిపారు. మనోజ్ ఒక ఫ్రాడ్ అని... ఇంత మోసం చేస్తాడని అస్సలు ఊహించలేదన్నారు బాలు.

Gunde Ninda Gudi Gantalu serial episode 369 February 28th 2025 here is full story

మరో వైపు మీనా కూడా తన భర్తను, తనను అన్న మాటలను మనోజ్ భార్య రోహిణికి గుర్తుచేస్తుంది. బట్టలు ఉతికేప్పుడు మనోజ్ ఆఫీస్ కు వెళ్లేవాడు కాబట్టి ఐరన్ చేసిన బట్టలుండాలని, తన భర్త బాలు కారు తోలేవాడే కాబట్టి ఎలాగున్న నడిచిపోతుందని అవమానించావంటూ రోహిణిని మాటలను తనకే అప్పజెప్పుతుంది. అసలు ఇదంతా ప్రభావతి, రోహిణికి ఎప్పటి నుంచో తెలుసని.. తెలిసి కూడా తన భార్యను ఉదయం టిఫిన్స్ నుంచి ప్రతి పనిలో కావాలనే ఇబ్బంది పెట్టారని బాలు నిందిస్తాడు. మధ్యలో సత్యం కలుగజేసుకొని నిజం చెప్పకుండా ప్రభావతి, మనోజ్ తనను ఇంత కాలం మోసం చేశారని బాధపడుతాడు.

రోహిణి ఎవ్వరూ ఎమోనద్దని.. ఇన్నాళ్లు ఇంట్లో ఏం జరుగుతుందనే విషయం తెలుసుకోకుండా తానే తప్పుచేశానని చెప్పి.. హాల్ లో నుంచి అందరిని వెళ్లిపోమని చెప్తాడు. ఇకబెడ్ రూమ్ లోకి వెళ్లిన రోహిణి... గుక్కపెట్టి ఏడుస్తుంది. తన భర్త చేసిన మోసాన్ని తట్టుకోలేకతుంది. అందరూ తనను అనరాని మాటలు అనడంతో కళ్ల వెంట దారలు కార్చుతుంది. ఇక మనోజ్ భార్య రోహిణికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాడు. నిజం తెలిస్తే బాధపడ్తారని ఎవ్వరికీ చెప్పకుండా ఉన్నానని రోహిణికి మనోజ్ వివరణ ఇస్తాడు. కానీ బాలు చేసిన మోసాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేకున్నానంటూ రోహణి రోదిస్తుంది.

చిన్నప్పటి నుంచి తను అందరి దగ్గర మోసపోయానని.. కానీ మనోజ్ ఒక్కడినే నమ్మి పెళ్లి కూడా చేసుకున్నట్టు గతాన్ని గుర్తు చేసింది. కానీ చివరకు నిజం దాచి మనోజ్ కూడా తనను మోసం చేశాడని బాధపడుతుంది. గుడ్డిగా నమ్మినందుకు, అన్నీ నువ్వే అనుకున్నందుకు తగిన శాస్త్రి చేసావ్ కాదా.. అంటూ మండిపడుతుంది. ఇక మోసం చేయాలనే ఉద్దేశంతో నిజం దాచలేదని.. వెళ్లిన ప్రతి ఇంటర్వ్యూ రిజెక్ట్ అవుతుంటే ఎలా చెప్పాలని చెప్పలేదన్నారు. దానికి రోహిణి స్పందిస్తుంది.... నిజం చెబితే పోయేది ఏముంది.. బాలు ఎగతాళి చేస్తాడని ఇంత పెద్ద నిజం దాస్తావా? ఈరోజు బయటపడటంతో అందరి ముందు తలనరికేసినట్టు అయ్యిందని బదులిస్తుంది. ఇన్ని డిగ్రీలు ఉన్న నీకు ఎలాంటి జాబ్ రాకపోవడం వల్ల యూజ్ ఏంటని ప్రశ్నిస్తుంది.

మనోజ్ బదులిచ్చే ప్రయత్నం చేసినా రోహిణి దూరం పెడుతూనే ఉంటుంది. సారీ చెప్పినా.. మోకాళ్లపై నిల్చోని క్షమాపణలు కోరినా పట్టించుకోదు. మనోజ్ ను నమ్మినందుకు తనమీద తనకే అసహ్యం వేస్తుందని, తనను నుంచి దూరంగా వెళ్లిపో అని అరుస్తుంది. ఆ తర్వాత తన స్నేహితురాలు ఇంటికి వెళ్లి గుక్కపెట్టి ఏడుస్తుంది. మనోజ్ మోసం గురించి ఫ్రెండ్ కు చెబుతుంటుంది. కానీ స్నేహితురాలు రోహిణి గతాన్ని కూడా గుర్తు చేస్తుంది.

మనోజ్ జాబ్ పోగొట్టుకున్నందుకే నువ్వు ఇలా మాట్లాడటం సరికాదని చెప్పింది. రోహిణికి పార్లల్ లేదని, అందులో జాబ్ మాత్రమే చేస్తున్నావనే విషయం ఇంట్లో తెలిసిందంటే ఎలా ఉంటుందని? చిన్నప్పుడే పెళ్లి చేసుకొని మోసం పోయావనే విషయాన్ని మనోజ్ తెలుసుకుంటే.. ఇంతకు పదిరెట్లు తిట్లపురాణం వినాల్సి ఉంటుందని, ఇంకా బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెబుతుంది... మరోవైపు రోహిణి వెళ్లి పోవడంతో ఇంట్లో బాలు, మనోజ్ మధ్య ఘర్షణ మొదలవుతుంది. ఒకరిపై మరొకరకు చేయి కూడా వేసుకుంటారు. తల్లి ప్రభావతి బాలు చేయడం వల్లే ఇలా అయ్యిందని నిందిస్తుంది. కాదంటూ బాలు తిరిగి బదులిస్తుండటం.. ఇక రోహిణి మళ్లీ ఇంటికి తిరిగి వస్తుందా? మనోజ్ ను మళ్లీ ఇంట్లో వారు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? అసలు తర్వాత జరగబోయే పరిణామాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X