Gunde Ninda Gudi Gantalu March 3rd Episode:నింద మొత్తం బాలుపైనే..రోహిణికి వాళ్లు ఏమౌతారు? అందరూ ఆమె తప్పునే!
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ మార్చి 3rd ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. తమ్ముడు బాలు అన్న మనోజ్ గుట్టును రట్టు చేసిన తర్వాత కుటుంబ సభ్యులు ఆందోళనపడ్డ విషయం తెలిసిందే. దాంతో మనోజ్ పై కుటుంబీకుంతా ఇందేంటనీ ప్రశ్నల వర్షం కురిపించారు. బాలు, మీనా, రవి, శృతి.... తండ్రి సత్యం కూడా మనోజ్ పై మండిపడుతాడు. మనోజ్ గతంలో చేసిన పనులను పార్క్ వీడియో చూపించిన తర్వాత దెప్పిపొడిచిన సంగతి తెలిసిందే.. దాంతో రోహిణి మనోజ్ ను చీదరించికొని ఇంట్లో నుంచి వెళ్లి పోతుంది.
రోహిణి ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో బాలు మనోజ్ కు మధ్య ఘర్షణ మొదలవుతుంది. ఒకరిపై మరొకరు చేయి చేసుకుంటారు. తండ్రి సత్యం జోక్యంతో ఇద్దరూ శాంతిస్తారు. అప్పటికే ఇంట్లోనుంచి వెళ్లిపోయిన రోహిణి గురించి వెతకడం మానేసి కొట్టుకుంటారేంట్రా అంటూ మందలిస్తాడు. అసలు ఇదంతా బాలు వల్లనే జరిగిందని, బాలు మాటలకే రోహిణి ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని మనోజ్ ఘర్షణకు దిగుతాడు. తల్లి ప్రభావతి, రవి, శృతి కూడా బాలుదే తప్పు అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న మీనా భర్తకు సపోర్ట్ గా మాట్లాడుతుంది.

గతంలో బాలు వారం రోజులపాటు కారు నడపకపోతేనే మనోజ్ ఎన్ని మాటలు అన్నారో మర్చిపోయారా? అని గుర్తు చేస్తుంది. తన భర్త బాలునే కాకుండా తనను కూడా ఇంట్లో మొత్తం తిండి తినేస్తుంన్నానంటూ అవమానించారని ఆవేదన వ్యక్తం చేసింది. బాలు ఒక్కడు మాత్రమే అనడం రోహిణి వెళ్లిపోవడానికి కారణమా? ఇంకెవ్వరూ అనదేదా? అని కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తుంది. అందుకు అందరూ బాలును నిందించడం ఆపేస్తారు. ఇక సత్యం జోక్యంతో రోహిణి ఆచూకీ తెలుసుకునేందుకు బాలు, మనోజ్ కారులో బయటికి వెళ్లి ప్రయత్నస్తుంటారు.
రోహిణి మొదట తన ఫ్రెండ్ దివ్య దగ్గరకు వెళ్లి తన బాధను చెప్పుకున్న సంగతి తెలిసిందే. తన స్నేహితురాలు కూడా మనోజ్ చేసిందీ పెద్ద తప్పేమీ కాదని, రోహిణి చెప్పిన అబద్ధంతో పోల్చితే అది చాలా చిన్నదని చెప్పుకొచ్చింది. అదంతా వదిలేసి ప్రశాంతంగా ఉండూ అని సూచిస్తుంది. కాఫీ తీసుకొస్తానని చెప్పే లోపే రోహిణి అక్కడ నుంచి వెళ్లిపోతోంది. రోహిణి వచ్చి వెళ్లిన సంగతి దివ్య మనోజ్ కు తెలియజేస్తుంది. దాంతో ఆచూకీకి కోసం వెతుకుతున్న సందర్భంలో పార్లర్ వద్ద పనిచేసే వారిని ఫోన్ లో సంప్రదిస్తారు.
దాంతో రోహిణి కేపీ పాలెం బస్సెక్కి వెళ్లిపోయిందని బదులొస్తుంది. వెంటనే బాలు, మనోజ్ తోపాటు.. మీనా కూడా రోహిణిని తీసుకురావాలని కేపీ పాలెం వెళ్తారు. అక్కడే రోహిణి దూరపు బంధువులు ఉన్నారని తెలుసుకొని అక్కడికి వెళ్తారు. అప్పటికే అక్కడ చింటూ కనిపిస్తాడు. రోహిణి అక్కడే ఉందని కన్ఫమ్ చేస్తాడు. ఇంట్లోకి తీసుకెళ్తుంటాడు.... మనోజ్, బాలు, మీనా తన కోసం వచ్చిన విషయాన్ని రోహిణి గమనిస్తుంది... దాంతో తిరిగి ఇంటికి వెళ్తుందా? మనోజ్ ఎలా రోహిణిని ఒప్పిస్తాడు? అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి. నెక్ట్స్ ఎపిసోడ్ తో ఈ విషయం తేలనుంది. అందరూ రోహిణి చేసిన గత తప్పులనే ఎత్తి చూపిస్తుండటంతో కాంప్రమైజ్ అయ్యి తిరిగి ఇంటికి వెళ్తుందా? లేదా? అన్నది చూడాలి.


Click it and Unblock the Notifications











