Gunde Ninda Gudi Gantalu: మనోజ్ కు చుక్కలు చూపిస్తున్న బాలు.. ప్రభావతికి గుండెపోటే.. రోహిణి ఆచూకీ ఇలా!

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ మార్చి 4th ఎపిసోడ్ మరింత ఇంట్రెస్టింగ్ గా కొనసాగింది. బాలు మనోజ్ గుట్టురట్టు చేయడంతో.. ఇంట్లో వాళ్లంతా అతనిపై మండిపడ్డ విషయం తెలిసిందే. తల్లిదండ్రులు, భార్య రోహిణి, రవి శృతి, మీనా కూడా మనోజ్ చేసిన పనికి చివాట్లు పెట్టారు. రోహిణిని కూడా నిలదీస్తారు. అవమానంతో రోహిణి తన బెడ్ రూమ్ లోకి వెళ్లి ఏడుస్తుంది. మనోజ్ పై చిరాకు పడి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. దాంతో బాలు వల్లే రోహిణి ఇంట్లోనుంచి వెళ్లిపోయిందని మనోజ్, ప్రభావతి అంతా నిందిస్తారు.

రోహిణి విషయంలో బాలు, మనోజ్ మధ్య పెద్ద ఘర్షణే జరుగుతుంది. సత్యం జోక్యం చేసుకోవడంతో అసలు రోహిణి ఎక్కడికి వెళ్లిపోయిందనే దానిపై అందరూ దృష్టి పెడ్తారు. సత్యం ఆదేశాలతో బాలు, మీనా మనోజ్ తో పాటు రోహిణిని వెతికేందుకు పలు చోట్లకు తిరుగుతుంటారు. ఈ క్రమంలోనే కేపీ పాలెం బస్సు ఎక్కి వెళ్లిందని తెలుసుకుంటారు. దాంతో మనోజ్ ను వెంట పెట్టుకొని కారులో బాలు, మీనా కేపీపాలెం వైపు వెళ్తారు. ఇక ఈ జర్నీలో మనోజ్ కు బాలు చుక్కులు చూపిస్తాడు. దెప్పిపొడిచే మాటలతో చిన్నబోయేలా చేస్తాడు.

Gunde Ninda Gudi Gantalu serial episode 371 March 4th 2025 here is full story

భార్య మీనా ముందే.. అన్న మనోజ్ పై రకరకాలుగా విమర్శలు గుప్పిస్తాడు. ముందు సీట్లో కూర్చున్న మనోజ్ ను కారులోంచి దింపి మరీ మీనాను కూర్చోబెడుతాడు. కాసేపు జర్నీ అయ్యాక తనకు నిద్రవస్తుందని.. ఈ చుట్టుపక్కల ఏమైనా పార్కులున్నాయా? అంటూ దెప్పిపొడుస్తాడు. అంతే కాదు.. అసలు రోహిణి కేపీ పాలెం బస్సు ఎక్కింది కానీ అక్కడికి వెళ్లిందో లేదో? బహుశా లాయర్ ను సంప్రదించేందుకు వెళ్లినట్టుందని అంటాడు. ఎందుకని మీనా ప్రశ్నించగా.. ఇంకెందుకు మనోజ్ చేసిన పనికి డివోర్స్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది అని కావాలనే భయం కల్పించేలా మాట్లాడుతాడు. మనోజ్ ను కూడా మంచి లాయర్ ను చూసుకో అని సలహా ఇస్తాడు.

కట్ చేస్తే.... దివ్య ఇంటి నుంచి బయల్దేరిన రోహిణి కేపీ పాలెం బస్సెక్కిన తన తల్లి సుగుణ దగ్గరకు వెళ్తుంది. తల్లిని చూడగానే గుక్కపెట్టి ఏడుస్తుంది. మనోజ్ తనను మోసం చేశాడని చెబుతుంది. జాబ్ లేకున్నా ఉన్నదని చెప్పాడు. ఇన్నాళ్లు మా స్నేహితులందరికీ మేం ఇద్దరం జాబ్ చేస్తున్నామని చెప్పాను. కానీ బాలు మోసం చేశాడని తల్లికి చెబుతుంది. కానీ..... సుగుణ మాత్రం రోహిణికి భరోసా చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో రోహిణికి చేసిన మోసాన్ని గుర్తు చేస్తుంది. తనకు లేని తండ్రిని ఉన్నాడని చెప్పిందని, ఉన్న తల్లిని లేదని చెప్పిందని, పెళ్లి అయినా కాలేదని మనోజ్ కు చెప్పి మోసం చేయలేదా? అని రోహిణిని ప్రశ్నిస్తుంది. గతంలో చెప్పిన విషయాలనే పట్టుకొని జీవితాన్ని నాశనం చేసుకోవాలా అని బదులిస్తుంది.

మరోవైపు.. ప్రభావతి ఇంట్లో దిగాలుగా కూర్చొని ఉంటుంది. ఆ సమయంలోనే ప్రభావతి వదిన రాగిణి ఇంటికి వస్తుంది. మనోజ్ జాబ్ చేయకపోవడం, ఎవ్వరికి చెప్పకుండా పార్క్ లో జల్సాలు చేసుకుంటూ ఉంటాడా? అని ప్రశ్నిస్తుంది. ఇలాగే ఉంటే.. ఇంట్లో నుంచి వెళ్లిన రోహిణి మొత్తంగా వెళ్లిపోయే వరకు కళ్లు తెరుచుకుని చూడొద్దని చెప్పింది. అంతే కాదు.. అప్పటికే భయంలో ఉన్న ప్రభావతికి ఇంకా వణుకుపుట్టించేలా మాట్లాడుతుందామె. డబ్బున్న అమ్మాయి కాబ్టటి మలేషియాకు వెళ్లి కేసు పెడితే మాత్రం.. కోర్టు చుట్టు తిరిగేందుకు ఇల్లు కూడా అమ్ముకోవాలని, రోహిణి ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే పోలీసులు కేసులు, మీడియా అల్లరితో కుటుంబ పరువు పోతుందని, ఎందుకైనా మంచిది రోహిణి ఆత్మహత్య చేసుకోవడానికి ఏదైనా రైలు పట్టాలవైపు వెళ్లిందేమో ఒకసారి తెలుసుకోమను అంటూ ప్రభావతికి గుండెపోటు తెప్పించేలా మాట్లాడుతుంది.

ఇక రోహిణి ఆచూకీలో విసిగిపోయిన బాలు, అన్న మనోజ్ ను ఇంకా మాటలతో విసిగిస్తాడు. ఉదయం నుంచి వెతుకుతున్నా అస్సలు జాడే లేదని చిరాకు పడుతుంటాడు. బాలు అనే మాటలకు చిర్రెత్తిపోయిన మనోజ్ కారు ఆపేసియ్... నేను దిగి పోతాను అని అంటాడు.. అంతటితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది... ఇక తరువాయి భాగంలో బాలు, మీనా, మనోజ్ రోహిణిని ఎలా కనిపెడ్తారు. చింటూ బాలు, మీనా, మనోజ్ కు ఎలా కలుస్తాడు. వాళ్లని ఇంటికి తీసుకురావడంతో రోహిణి ఎలా రియాక్ట్ అయ్యింది... రోహిణికి సుగుణకు మధ్య ఉన్న సంబంధం బయటపడిందా? మనోజ్ రోహిణికి జరిగినా సంభాషణ ఏంటీ? బాలు, మీనా ఏం మాట్లాడారు. అనే విషయాలతో రేపటి ఎపిసోడ్ పై మరింతగా ఆసక్తి పెరుగుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X