Gunde Ninda Gudi Gantalu March 5th Episode : కొంప ముంచిన చింటు.. రోహిణి దొంగవేషాలు.. బాలుపై నింద తొలగింపు!
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు సీరియల్ మార్చి 5th ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగింది. రీసెంట్ గా సత్యం ఇంట్లో జరుగుతున్న పరిణామాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. బాలు మీనాపై చూపించే ప్రేమ, వీరిద్దరిపై మండిపడే మనోజ్, ప్రభావతి, మరోవైపు సందర్భానుసారంగా స్పందించే రవి, శృతిలు.. కొద్దిగా బాధ, కొద్ది సంతోషంతో సత్యం క్యారెక్టర్లు చాలా ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. మీనాకు బట్టలు ఉతికినందుకు శృతి డబ్బులివ్వడం మొదలు రోహిణి ఇంట్లో నుంచి వెళ్లడం వరకు అంతా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం మనోజ్ జాబ్ లేకుండా పార్క్ లో తిని, తిరుగుతున్నాడని, అక్కడే పడుకొని సాయంత్రం ఇంటికి వస్తున్నాడే విషయాన్ని బాలు వీడియో చూపించి మరీ గుట్టురట్టు చేసిన సంగతి తెలిసిందే. దాంలో ఇంట్లో వాళ్లందరూ మనోజ్ ను తిట్టిపోస్తారు. రోహిణిని కూడా నొప్పించేలా కాంమెంట్స్ చేస్తారు. దాంతో రోహిణి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. కాగా.. మనోజ్ తో బాలు, మీనా రోహిణి జాడా వెతికేందుకు వెళ్తుంటారు. ప్రస్తుతం పాలెంలో రోహిణి ఉందని తెలుసుకుంటారు.

రోహిణిని వెతుకుంటూ బాలు, మీనాతో పాటు మనోజ్ కూడా కారులో వెళ్తుంటారు. ఎక్కడ వెతికినా రోహిణి కనిపించకపోవడంతో బాలుకు చిరాకు వస్తుంటుంది. సూటిపోటు మాటలతో మనోజ్ కు కోపం వచ్చేలా చేస్తాడు. ఓ కాలనీలో తిరుగుతున్న క్రమంలో కారు ఆపేసే నేనే ఒక్కడినే వెతుకుంటా.. అంటూ బాలుపై మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. దాంతో బాలు కూడా కోపంతో కారు ఆపేసే దిగరా లక్షలు మింగినోడా అని లైట్ తీసుకుంటాడు. దీంతో మీనా కూడా కారులోంచి దిగిపోతుంది. మీనాతోపాటు బాలు కూడా దిగాల్సి వస్తుంది. ఇక అక్కడే రోహిణిని అత్త అని పిలిచే చింటూ వీళ్లకు కనిపిస్తాడు. వాళ్లందరూ షాక్ అవుతారు.
చింటూ వాళ్ల ఇంటికి వెళ్తారు. అప్పటికే చింటూ తన తల్లి సుగుణమ్మతో తన బాధ చెబుకుంటూ ఉంటుంది. సుగణనే రోహిణి అసలు తల్లి అని, ఆమెకు మలేషియాలో ఉండే తండ్రి లేడని, తనకు పార్లర్ కూడా లేదని, పైగా గతంలో పెళ్లి అయ్యి విడాకులు కూడా అయ్యిపోయిందనే విషయాలేవీ బాలు, మీనా, మనోజ్ కు, చింటు కు కూడా తెలియదు. దీంతో చింటుకు వాళ్లు కనిపించడంతో నేరుగా ఇంటికి తీసుకొని వస్తాడు. కారు వచ్చిన శబ్ధం విన్న రోహిణి వాళ్లను చూస్తుంది. వెంటనే తల్లితో తను అక్కడ లేనని చెప్పు అని దాక్కుంటుంది. మనోజ్, బాలు, మీనా ఇంట్లోకి రాగానే సుగుణమ్మ వాళ్లను మర్యాదగా పలకరిస్తుంది.
ఇంట్లోనే రోహిణిని పెట్టుకొని ఏమీ తెలియనట్టుగానే నటిస్తూ ఏ పనిమీద వచ్చారంటూ వాళ్లను అడుగుతుంది. ఇక వాళ్లు రోహిణి అనే అమ్మాయి కోసం వచ్చామని, ఆమె మనోజ్ భార్య అని చెబుతారు. ఫొటో కూడా చూపిస్తారు. ఫొటో చూసి ఆందోళన చెందుతుంది. అయితే అప్పటికే రోహిణి అక్కడ ఉందని తెలిసిన చింటు ఆ ఫొటో చూసేందుకు ప్రయత్నిస్తాడు. కానీ సుగణమ్మ నివారిస్తుంది. చిన్నపిళ్లోడివి మాట్లాడుతున్నప్పుడు మధ్యలో దూరొద్దని చెప్ప మందలిస్తుంది. అప్పటికే చింటు వాళ్లను ఇంటికి తీసుకొచ్చి కొంప ముంచాడని భావిస్తుంది.
ఇక రోహిణి జాడ దొరకపోవడంతో మలేషియా వెళ్లిందోమోనని అనుమానిస్తారు. అలా ఏం లేదు బాబు కోపం అలిగి వెళ్లిపోయి ఉంటుంది తప్పకుండా తిరిగి వస్తుందని సుగుణమ్మ సర్దిచెబుతుంటుంది. కానీ బాలు అనుమానంతో మీరేంటి రోహిణి ఇక్కడే ఉన్నట్టు వస్తుందని చెబుతున్నారు అని బాంబ్ పేల్చుతాడు. సొంతింట్లో రోహిణి దొంగవేషాలకు తల్లి సుగుణ బయటపడకుండా జాగ్రత్త పడుతుంది. మొత్తానికి వాళ్లను ఇంట్లో వెళ్లే వరకు నోటిమాట జారకుండా చూసుకుంటుంది. ఇక బాలు, మీనా, మనోజ్ రోహిణి కనిపించడం లేదంటూ పోలీసు కేసు పెట్టాలని నిర్ణయించుకుంటారు.
కానీ తండ్రి సత్యంతో చెప్పిన తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్దామని నేరుగా ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్లాగానే రోహిణి మేటర్ పక్కకు పెట్టి బాలు, మనోజ్ ఘర్షణకు దిగుతారు. దాంతో తన పనులన్నీ మానుకొని, సొంత డబ్బులతో డీజిల్ కొట్టించుకొని మరీ రోహిణి కోసం వెతికినందుకు తననే అవమానిస్తున్నారని బాలు ఫైర్ అవుతాడు. ఇంక తనకేం అవసరం లేదని, మనోజ్ వల్లే అంతా జరిగిందని మండిపడుతాడు. మనోజ్ పై బాలు ఫైర్ అవుతుంటే రోహిణి సడెన్ గా ఇంట్లోకి వస్తుంది. బాలును అరవొద్దని హెచ్చరిస్తుంది. భార్య ను చూసి మనోజ్ షాక్ అవుతాడు. మరోవైపు ఆనందంతోనూ పొంగిపోతాడు... ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది రేపటి ఎపిసోడ్ కు వాయిదా పడింది... తరువాయి భాగంలో మీనా, రోహిణి మధ్య రొమాన్స్ ఆడియెన్స్ ను ఆకట్టుకునేలా ఉంది. ఇక రోహిణి అత్తగారికి ఎం సమాధానం ఇస్తుంది? ఇంట్లో వాళ్లు ఆమెపై ఎలాంటి ప్రశ్నలు కురిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications










