Gunde Ninda Gudi Gantalu March 6th Episode : బాలు రౌడీయిజం... గతాన్ని గుర్తుచేసి మరి తిట్లపురాణం..
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ మార్చి 6th ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగింది. మనోజ్ మోసం చేశాడని రోహిణి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆమెను వెతుకుంటూ బాలు, మీనాతో పాటు మనోజ్ కూడా కారులో పాలెం వరకు వెళ్తారు. ఎక్కడ వెతికినా రోహిణి కనిపించకపోవడంతో బాలుకు చిరాకు వస్తుంటుంది. సూటిపోటు మాటలతో మనోజ్ కు కోపం వచ్చేలా చేస్తాడు. దాంతో దారిలో ఒక దగ్గర ఆగిపోతారు. అక్కడే చింటు కనిపిస్తాడు. సుగుణమ్మ ఇంట్లోనే ఉందని చెబుతాడు.
చింటూ వాళ్లని ఇంటికి తీసుకెళ్తాడు. అప్పటికే అక్కడే ఉన్నరోహిణి ఇంట్లోనే దాక్కుంటుంది. తన తల్లి సుగుణమ్మకు ఇక్కడికి రాలేదని చెప్పు అంటుంది. వాళ్లు వెళ్లిపోయాక.. సుగుణమ్మ రోహిణి చేసిన తప్పులను గుర్తుచేసిన మనోజ్ కు మద్దతుగా మాట్లాడుతుంది. తిరిగి ఇంటికి వెళ్లు అని చెబుతుంది. ఇక రోహిణి జాడ తెలియకపోవడంతో తిరిగి ఇంటికి వచ్చిన బాలు, మీనా, మనోజ్ మధ్య గట్టి ఘర్షణ జరుగుతుంది.

మనోజ్ పై బాలు చిర్రెత్తిపోతుంటాడు. ఆ సమయంలోనే రోహిణి ఊహించని విధంగా ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది. బాలుపై మండిపడుతుంది. రోహిణి రాగానే మనోజ్ ఎమోషనలై హగ్ చేసుకుంటాడు. ఆ తర్వాత రోహిణి మాట్లాడుతూ... ఇకపై తన భర్తను ఎవ్వరూ అవమానించిన సహించేది లేదని మండిపడుతుంది. మనోజ్ కు జాబ్ లేకపోవడం అనేది వాళ్ల సమస్య అని, ఇంకెవ్వరూ మధ్యలో దూరొద్దని వార్నింగ్ ఇస్తుంది. ఇక బాలు ఘాటుగా స్పందిస్తాడు.
మనోజ్ నిన్ను మాత్రమే కాదు.. ఇంట్లో వాళ్లందరినీ మోసం చేశాడు. అందుకే అడగాల్సి వస్తోంది. పైగా ఇన్నాళ్లు పెద్ద బిల్డప్ ఇస్తూ నానా చాకిరీ చేయించుకున్నాడని మండిపడుతాడు. నాన్న ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నేనే ఇచ్చానంటూ బాలు గుర్తుచేస్తాడు. అందుకే నిలదీస్తున్నానని చెబుతాడు. అంతే కాదు గతంలోనూ 40 లక్షలు మింగేశాడని, ఇంటి కాగితాలు తాకట్టు పెట్టాడని మండిపడుతాడు. అంతే కాదు మనోజ్ కు వత్తాసు పలికిన తమ్ముడు రవిని కూడా మందలిస్తాడు.

నువ్వు లేచిపోయినప్పుడు నాన్న ఆస్పత్రి పాలయ్యాడని, ఏ ఒక్కరూ పట్టించుకోలేదని, తానే కారు అమ్ముకొని మరి బిల్లులు కట్టానని చెప్పాడు. ఇవన్నీ చేసిన తనకు మనోజ్ మోసం చేసినా అడిగే అర్హత లేదా అంటూ ప్రశ్నిస్తారు. ఇక రోహిణి మధ్యలో కలుగుజేసుకొని ఏదేమైనా తన భర్తను ఒక్క మాట అన్న ఇంట్లో ఉండబోమని తన నిర్ణయాన్ని చెబుతుంది. అప్పటికే మంటలో ఉన్న బాలు ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్నామని చెబుతాడు.

దాంతో తల్లి ప్రభావతి కలుగుజేసుకొని మనోజ్ ను ఇంట్లోంచి వెళ్లగొట్టాలనే చూస్తున్నాడని బాలుని నిందిస్తుంది. బాలు కూడా కౌంటర్ ఇస్తాడు. గతంలో మమ్మల్ని కూడా వెళ్లగొట్టేందుకు ప్రయత్నించలేదా అమ్మ అంటూ కడిగేస్తాడు. మరోవైపు రోహిణిని మనోజ్ క్షమించమని మోకాళ్లపై కూర్చొని అడుగుతాడు. తను బాధపడుతుందనే జాబ్ లేదనే సంగతి చెప్పలేదని వివరిస్తాడు. మరోవైపు మీనాతో బాలు ఎమోషనల్ అవుతాడు. తన తండ్రిని ఎవ్వరూ మోసం చేసినా సంహించబోనన్నారు. అందుకు అందరినీ ఏకిపారేసినట్టు చెప్పాడు. ఇదిలా ఉంటే... మనోజ్ ఉదయం ఉద్యోగం వెతుక్కోవడానికి వెళ్తుండగా ప్రభావతి కొడుకుకు వీర తిలకం దిద్దుతుంది. దానిపై చర్చ సాగుతుంది. ఈ క్రమంలో ప్రభావతికి మీనాకు మధ్య గట్టి ఫైట్ నడుస్తుంది.


Click it and Unblock the Notifications











