Gunde Ninda Gudi Gantalu March 7th Episode : మీనా ఉగ్రరూపం.. మనోజ్ పొగరుకు గడ్డిపెట్టిన లేడీ బాస్.!

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ మార్చి 7th ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగింది. మనోజ్ మోసం చేశాడని రోహిణి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆమెను వెతుకుంటూ బాలు, మీనాతో పాటు మనోజ్ కూడా కారులో పాలెం వరకు వెళ్తారు. ఎక్కడ వెతికినా రోహిణి కనిపించకపోవడంతో బాలుకు చిరాకు వస్తుంటుంది. సూటిపోటు మాటలతో మనోజ్ కు కోపం వచ్చేలా చేస్తాడు. అలా మధ్యలో ఆగిన వారికి చింటూ కనిపిస్తాడు. చింటూ వల్ల సుగుణమ్మ ఇంటికి వెళ్తారు. అప్పటికే అక్కడ రోహిణి ఉంటుంది. ఆ విషయం వాళ్లకు తెలియకుండా రోహిణి దాక్కుంటుంది, సుగుణమ్మ కూడా ఏమాత్రం అనుమానం రాకుండా జాగ్రత్తగా మాట్లాడుతుంది.

ఇక ఇంటికి తిరిగి వచ్చిన బాలు, మీనా, మనోజ్ రోహిణి జాడ దొరకలేదని తల్లిదండ్రులకు చెబుతుంటారు. ఈ క్రమంలోనే మళ్లీ బాలు మనోజ్ పై కామెంట్ల వర్షం కురిపిస్తాడు. గతాన్ని గుర్తుచేస్తూ మరీ తిట్ల పురాణం మొదలు పెడుతాడు. ఆ సమయంలోనే రోహిణి ఇంట్లోకి సడెన్ ఎంట్రీ ఇస్తుంది. రోహిణి రాగానే మనోజ్ ఎమోషనలై హగ్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఆమెకు క్షమాపణలు చెప్పి సిచ్యూయేషన్ ను నార్మల్ చేస్తాడు. ఇక తెల్లవారి లేవగానే మనోజ్ ఉద్యోగం కోసమని ఇంటర్వ్యూకు బయల్దేరుతాడు. ఇక రోహిణి మనోజ్ కు కొత్త షర్ట్ ఇచ్చి, కొన్ని మంచి ముచ్చట్లు చెప్పి మరీ ఇంటర్య్వూకి వెళ్తాడు.

Gunde Ninda Gudi Gantalu serial episode 374 March 7th 2025 here is full story

ఇక హాల్ లోకి ఆఫీసర్ లాగా రెడీ అయ్యి రాగానే.. తల్లి ప్రభావతి వీరతిలకం దిద్దుతుంది. అది చూసిన బాలు మళ్లీ తన పంచులతో విసుగు తెప్పిస్తాడు. గతంలో మనోజ్ ఇంటర్వ్యూలకు వెళ్లి మాట్లాడిన ఎక్ట్రాలను గుర్తుచేస్తాడు. ఉద్యోగం రాకపోతే నేను కారు తోసే ఉద్యోగం ఇప్పిస్తానని బదులిస్తాడు. ఈ క్రమంలోనే రోహిణి బాలుకు తిరికి కౌంటర్ ఇస్తూనే ఉంటుంది. మనోజ్ మూడ్ ఖరాబ్ చేసేలా మాట్లాడొద్దని తను కూడా రెచ్చిపోయి మాట్లాడుతుంది. ఇదిలా నడుస్తుంటూనే స్టోరీ మీనా వర్సెస్ రోహిణి, ప్రభావతిగా మారుతుంది.

కారు తోలడం ఛీప్ అని రోహిణి అనడంతో మీనా రోహిణిపై రెచ్చిపోతుంది. నీ భర్త కంటే నా భర్త చాలా గొప్పవాడని, కారు నడివాడిని చిన్నతనంగా చూస్తున్నారంటూ మండిపడుతుంది. చదువులేకపోతే చిన్నచూపు చూస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలోనే ప్రభావతి జోక్యం చేసుకొని మీనాను మందలిస్తుంది. కానీ మీనా ఏమాత్రం తగ్గకుండా ప్రశ్నకు ప్రశ్న వేసి బదులిస్తుంది. ఇక తండ్రి సత్యం కూడా మనోజ్ ను త్వరగా ఉద్యోగం చూసుకోమని సలహా ఇస్తాడు. దాంతో మనోజ్ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని ఇంటర్వ్యూకు వెళ్తాడు.

Gunde Ninda Gudi Gantalu serial episode 374 March 7th 2025 here is full story

ఇదిలా ఉంటే... బాలు, మనోజ్, సత్యం ఇంట్లో నుంచి బయటికి వెళ్లాక ప్రభావతి మీనా మధ్య ఘర్షణ మొదలవుతుంది. ఇంట్లో విషయాలపై గతంలో కంటే రెచ్చిపోయి ఎందుకు మాట్లాడుతున్నావంటూ మీనాపై విరుచుకు పడుతుంది. మీనా వల్లనే బాలు తిరిగబడుతున్నాడని, ఇలా తిక్క తిక్క సమాధానం చెప్పొద్దంటూ ప్రభావతి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక మీనా మాత్రం ఏమాత్రం తగ్గదు. ఇంట్లో ఎలాంటి విషయాలైనా పట్టించుకోనని తన భర్త జోలికి వస్తే మాత్రం సంహించేది లేదని హెచ్చరిస్తుంది.

బాలును కంట్రోల్ లో పెట్టాలనుకుంటే నువ్వు ట్రై చేయమని అత్త ప్రభావతిని మాటలతో తిప్పికొడుతుంది. ఇంట్లో వంట పని చేసి, పూల కొట్టు చూసుకుంటున్నానని.. అనవసరమైన విషయాల్లో తలదూర్చే సమయం తనకు లేదని కూడా చెబుతుంది. ఇక ప్రభావతి ఒళ్లు మండిపోతుంది. మీనా సంగతి చూస్తానంటూ రోహిణికి చెబుతుంది. ఇదిలా ఉంటే... మనోజ్ ఇంటర్వ్యూల కోసం నానా ఆఫీసులు తిరుగుతుంటాడు. ఎక్కడా ఫలితం కనిపించకపోవడంతో విసుగుపోతాడు. మళ్లీ గతంలో లేడీ ఎండీ ఉన్న చోట వర్క్ చేయనని పొగరుగా చెప్పి వెళ్లిపోయిన ఆఫీస్ కే మళ్లీ ఉద్యోగం కోసం వెళ్తాడు.

Gunde Ninda Gudi Gantalu serial episode 374 March 7th 2025 here is full story

కానీ అక్కడి ఆఫీస్ లో లేడీ ఎండీ బాలు గతంలో ఇంటర్వ్యూకు వచ్చి చేసిన రచ్చను గుర్తు చేసి మరీ అవమానిస్తుంది. మనోజ్ కు లేడీ బాస్ ల కింద పనిచేయడం చిన్నచూపని అతని పొగరును తెలియజేస్తుంది. బాలు మాత్రం తనకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ ను ఇవ్వమని బతిమిలాడుతాడు. మునపటి లాగా కాదని, తను ఎంతో మారిపోయాయని చెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ లేడీ ఎండీ వినిపించుకోలేదు. తన ఉద్యోగం ఇవ్వడం కష్టమని చెబుతుంది. మరోవైపు మనోజ్ కోసం రోహిణి ఎదురుచూస్తుంటుంది. ఆ లోపు రవి, శృతి వస్తారు. మనోజ్ కు జాబ్ లేకపోవడం వల్లే బాలు అవమానిస్తున్నాడని, జాబ్ వచ్చే వరకు బతకనిచ్చేలా లేడని శృతి అంటుంది. ఆ మాటలు విన్నా మీనాకు కోపం వస్తుంది. బాలు ఇంట్లో లేనప్పుడు సూటిపోటీ మాటలు అనడం దేనికని మండిపడుతుంది. ఈ సన్నివేశంతో రేపటి ఎపిసోడ్ పై మరింత ఆసక్తి నెలకొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X