Gunde Ninda Gudi Gantalu March 17th : బాలును అవమానించిన కుటుంబం.. నిలదీసిన భార్య మీనా.. సత్యం మౌనం!

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. మార్చి 17వ ఎపిసోడ్ గుండెను హత్తుకునేలా సాగింది. ఇప్పటికే సత్యం ఇంట్లో మనోజ్ కు జాబ్ లేదని నానా రచ్చ జరుగుతుండా... ప్రస్తుతం మౌనికా తాళి మార్చే ఫంక్షన్ తెరమీదకి వచ్చింది. దీంతో రోహిణి ఇంట్లో నుంచి వెళ్లిపోవడం, అందుకోసం బాలు మనోజ్ మధ్య గొడవ జరిగి.. ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడం.. మనోజ్ కు జాబ్ లేకపోవడంతో రోహిణి గుట్టురట్టు అయ్యే ప్రమాదం వంటి పరిస్థితులకు చెక్ పడింది. రోహిణి అసలు జీవితం బయటపడుతుందని అనుకున్న తరుణంలో.. సీన్ ఒక్కసారి మౌనికా తాళి ఫంక్షన్ తో బాలువైపు మళ్లింది.

ఇక చెల్లి మౌనిక తాళి ఫంక్షన్ కోసం బాలు ఎన్నో ఏర్పాట్లు చేసి.. ఫంక్షన్ రోజు సంప్రదాయ దుస్తుల్లో రెడీ అవుతాడు. ఫంక్షన్ కు సంబంధించిన మిగిలిన ఏర్పాట్లను కూడా చేస్తుంటాడు. ఎప్పటిలాగే అందరిపైనా సరదగా పంచులు పేల్చుతూ ఉంటాడు. రవి, శృతి, రోహిణిపై కాస్తా చనువుగా మాట్లాడుతాడు. ఇక అప్పటికే దిగులు మొహంతో తండ్రి సత్యం, తల్లి ప్రభావతి హాల్ ల్లోకి ఎంట్రీ ఇస్తుంది. రాగానే బాలుపై తల్లి విరుచుకుపడుతుంది. ఫంక్షన్ సరిగా చేయాలని ఉందా? లేదా? అని అడుగుతుంది. ఏ నీకు లేదా? అంటూ తల్లి ప్రభావతిని తిరిగి ప్రశ్నిస్తాడు. దాంతో ప్రభావతి ఇంకా మండిపోతుంది.

Gunde Ninda Gudi Gantalu serial episode 381 March 17th 2025 here is full story

నా కూతురు ఫంక్షన్ బాగా జరగాలంటే నువ్వు కాకినాడకు వెళ్లి పూజ చేయించాలని ఆదేశిస్తుంది. మొక్కు ఉందని అది ఇవ్వాళ్లే తీర్చాలని, నువ్వే వెళ్లి ఆ పూజా చేయించాలని బాలుకు తల్లి ప్రభావతి చెబుతుంది. లేదు ఫంక్షన్ రోజే ఆ పూజ చేయాలా? నేను వెళ్లను.. మౌనికా నేను లేకపోతే చాలా బాధపడుతుందని చెప్పి తండ్రి సత్యం పక్కన కూర్చుంటాడు. బాలు మాటలు విన్న సత్యం ఇంకా దిగులు పడుతాడు. బాలుకు అర్థంకాకపోవడంతో ప్రభావతి బట్టబయలుగా మాట్లాడుతుంది. బాలు ఉంటే మౌనిక అత్తవాళ్లు ఫంక్షన్ కు రాబోమని చెప్పారని ప్రభావతి తెలుపుతుంది.

నువ్వు ఉంటేనే మౌనికా ఫంక్షన్ ఆగిపోతుందని చెబుతుంది. మీనా వాళ్ల అత్తవాళ్లు బాలు ఉంటే రాబోమని చెప్పిన విషయన్ని పూర్తిగా తెలియజేస్తుంది. తల్లి ప్రభావతి మాటలు విన్న బాలుకు గుండె ముక్కలు అవుతుంది. ఒక్కసారి షాక్ కు గురవుతాడు. వాళ్లు ఎవరమ్మా నన్ను ఉండొద్దని చెప్పడానికి... నా చెల్లి ఫంక్షన్ లో నేను ఉండటం తప్పేలా అవుతుందని వాదిస్తాడు. ఈ విషయం కేవలం తల్లికే తెలుసనుకున్న బాలుకు మరో షాకిచ్చే న్యూస్ తెలుస్తుంది. ప్రభావతి బాలుకు మరో షాక్ ఇస్తుంది. బాలు ఉండదనే విషయాన్ని నేనేమీ చెప్పడం లేదు.. మీ నాన్న గారి ముందే మౌనిక అత్తవాళ్లు చెప్పారంటూ వివరిస్తుంది. దాంతో బాలు గుండె ముక్కలవుతుంది. బాధతో లోలోపల కుమిలిపోతాడు.

మరోవైపు ప్రభావతి మాటలకు కోడలు మీనా గట్టిగా బదులిస్తుంది. ఫంక్షన్ కోసం బాలు ఎంత కష్టపడ్డాడో తెలుసుకదా అత్తయ్య.. అలాంటిది మౌనిక ఫంక్షన్ లో తన భర్తను ఉండొద్దని చెప్పడం ఏమాత్రమైనా న్యాయమా అంటూ ప్రశ్నిస్తుంది. వాళ్లు చెప్పినా మీరెలా ఒప్పుకున్నారని గట్టిగా అడుగుతుంది. బాలు లోలోపల ఎంత బాధపడుతున్నారో మీ ఎవ్వరికీ అవసరం లేదు కదా అంటూ కన్నీళ్లు కార్చుతుంది. దీంతో బాలు జ్యోక్యం చేసుకొని మీనాను ఓదార్చుతాడు. ఇక తానే వెళ్లిపోతున్నాని తండ్రి సత్యంతో చెబుతాడు. ఈ విషయం నిన్ననే చెబితే ముందే ఇంట్లోంచి వెళ్లిపోయి ఏ చెట్టుకిందనో ఉండేవాడిని కదా అంటూ తండ్రి సత్యంతో చెబుతాడు. దీంతో సత్యం ఇంకా కుమిలిపోతాడు.

బాలు తన తండ్రి మౌనాన్ని భరించలేకపోతాడు. ఈ విషయం కేవలం అమ్మకు మాత్రమే తెలుసుని అనుకున్నాను. కానీ నాన్నకు కూడా తెలుసని ఇప్పుడే అర్థమైంది. ఫంక్షన్ లో నేనే లేకపోతేనేం చూసుకోవడానికి వీళ్లందరూ ఉన్నారు కదా అంటూ.. బరువెక్కిన గుండెతో బదులిస్తాడు. తండ్రి కన్నీళ్లు పెట్టుకోవడం చూసి..అయినా మనందరికీ కావాల్సింది మౌనిక సంతోషమే కదా అని సత్యంతో చెబుతాడు. ఇక నేను ఒక్కడినే వెళ్లాలా? నా భార్య మీనా కూడా ఉంటే ఫంక్షన్ ను అభ్యంతరం ఉంటుందా? అని తల్లి ప్రభావతిని అడుగుతాడు. అందుకు ప్రభావతి కూడా బాధపడుతుంది. కొడుకును ఫంక్షన్ కు దూరంగా ఉండమన్నందుకు చిన్నబోతుంది. ఆ మాటలు వారివి కాదని, మౌనికా అత్తగారింటివేనని చెబుతుంది. వాళ్లు అనడంతోనే చెబుతున్నామని తెలుపుతుంది.

ఇక బాలు కూడా అర్థం చేసుకొని సరేనని వెళ్లిపోయేందుకు సిద్ధమవుతాడు. బెడ్ రూమ్ లోకి వెళ్లి సంప్రదాయ దుస్తులను మార్చేసి నార్మల్ డ్రెస్ వేసుకుంటాడు. ఇక మీనా కూడా భర్త బాలు వెనకాలే వచ్చి తాను కూడా శారీ మార్చుకోవాలనుకుంటుంది. అది చూసిన బాలు నువ్వు ఇంట్లో ఉండి ఫంక్షన్ బాగా జరిగేలా చూసుకోమని చెబుతాడు. కానీ మీనా ఒప్పుకోదు. నా భర్తలేని ఫంక్షన్ లో నేను ఎలా ఉండాలి అంటూ ప్రశ్నిస్తుంది. ఇన్నాళ్లు అందరూ నావాళ్లు అనుకున్నాను. అది కేవలం మిమ్మల్ని భర్తగా అంగీకరించడం వల్లనే అంటూ బాలుతో చెబుతుంది. మీరు లేకపోతే నేనూ ఫంక్షన్ లో ఉండబోనని స్పష్టం చేస్తుంది.

వెళ్లి పూలకొట్టులో కూర్చుంటానని, మీరు అవసరం లేని మనుషులు, నాకు కూడా అవసరం లేదని తన నిర్ణయాన్ని చెబుతుంది మీనా. దాంతో బాలు తనకు వీలైనంత వరకు మీనాకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. బాలు కూడా స్పందిస్తూ... మౌనికా పెళ్లి సమయంలో సంజూపై తను చేయిచేసుకోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది కదా అంటూ మీనాతో చెబుతాడు. కానీ ఆ పెళ్లి ఇష్టం లేకనే వాడిపై చేయిచేసుకున్నాను అంతే.. ఇక ఇప్పుడు కూడా మళ్లీ వాళ్లు ఏదైనా అంటే గొడవ జరిగే అవకాశం కూడా ఉంది కదా అంటూ మీనాతో చెప్పుకొస్తాడు. అందుకు మీనా బదులిస్తూ...రెండు రోజులు తిండినిద్ర మానుకోని, చేతికి గాయమైనా డే అండ్ నైట్ రైడ్స్ కొట్టిన సంగతి వాళ్లు ఎలా మరిచిపోయారని బాధపడుతుంది.

మౌనిక ఫంక్షన్ కు ఏమాత్రం లోటురాకుండా డబ్బులు ఏర్పాటు చేశారు కదా అంటూ బదులిస్తుంది. మౌనిక భర్త సంజూతో ఏదైనా గొడవ వస్తే మిమ్మల్ని నేనే ఆపేదాన్ని కదా అంటూ బదులిస్తుంది బాలుకు. అందరినీ కడిగేయాలనేంత పౌరుషం ఉందని చెబుతుంది. కానీ తనకిప్పుడు ఏం అవసరం లేదంటుంది. మీనా కూడా తనవెంటనే వస్తానని తెగేసి చెప్పడంతో అలా కాదని సర్దిచెబుతుంటాడు. మీనా లేకపోతే మౌనికా చాలా బాధపడుతుందని, తను లేకపోయినా అర్థం చేసుకుంటుందంటాడు బాలు. ఇక ఎలాగోలా మీనాను ఒప్పించి బాలు ఫంక్షన్ నుంచి దూరంగా వెళ్లేందుకు సిద్ధమవుతాడు. ఇక మీనా కూడా మళ్లీ ఎప్పుడు తింటారో లేదో అని టిఫిన్ పెడుతుంది. తిని వెళ్లండి అని చెబుతుంది.

దాంతో బాలు కూడా తినడానికి కూర్చుంటాడు. కానీ అత్త ప్రభావతి ఎంట్రీ ఇచ్చి ఉదయమే వెళ్లమని చెబితే ఇంకా వెళ్లకుండా తినుకుంటూ కూర్చుంటావేంటీ అంటూ మండిపడుతుంది. వెంటనే వెళ్లు అంటూ కనికరం లేకుండా మాట్లాడుతుంది. మండిపోయిన బాలు ఇంకా ఇడ్లీలు తినే వెళ్తానని పట్టుబట్టుకొని కూర్చుంటాడు. తర్వాత ఇంట్లోంచి వెళ్లిపోబోతున్న బాలును బావ సంజూ వచ్చి ఆగు అంటాడు. ఇంట్లోకి పిలుస్తాడు. దాంతో ఆయన అత్తమ్మ బాలును సంజూ కాళ్లు కడగమని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది రేపటి ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X