Gunde Ninda Gudi Gantalu March 18th : బాలుపై పగ సాధించిన బావ సంజూ.. కొడుకు నిజస్వరూపం తెలిసి భయపడ్డ ప్రభావతి!
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక మార్చి 17వ తేదీ 381వ ఎపిసోడ్ ట్విస్ట్ లు ఎమోషనల్ సీన్లతో ఆసక్తికరంగా సాగింది. మౌనికా తాళి ఫంక్షన్ చేయాలని అన్న బాలు ఎంత కష్టపడ్డారో తెలిసిందే. తిండీనిద్ర మానుకొని రాత్రింభవళ్లు కారు నడిపి డబ్బులు సంపాదించారు. తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా చెల్లెలు సంతోషమే లక్ష్యంగా పనిచేశాడు. అంత కష్టపడినా బాలుకు ఫలితం దక్కకుండా పోయింది. తన చెల్లి ఫంక్షన్ లో ఉండకూదని మౌనికా అత్తవారి నుంచి షరతులు విధించారు. ఈ విషయాన్ని సత్యం చెప్పలేక పోయినా.. కన్న తల్లి ప్రభావతి ఎలాంటి సంకోచం లేకుండా బాలు మొహం మీదనే చెబుతుంది.
మొత్తానికి ఫంక్షన్ లో తాను ఉండకూడదనే కండీషన్ ను తెలుసుకున్న బాలు లోలోపల ఎంతో కుమిలిపోతాడు. తన చెల్లి ఫంక్షన్ లో ఉండలేకపోతున్నందుకు, పైగా తల్లి ప్రభావతి ఉండొద్దని మొహం మీదే చెప్పినందుకు చాలా బాధపడుతాడు. మీనా కూడా తన భర్తను కుటుంబ సభ్యుల ముందే అవమానించినందుకు కన్నీళ్లు పెట్టుకుంటుంది. తన భర్తతో పాటే తాను కూడా బయటికి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. కానీ బాలు కోరిక మేరకు ఇంట్లోనే ఆగిపోతోంది. ఇక బాలు ఇంట్లో నుంచి వెళ్లి కారు తీసే సమయానికి మౌనికను తీసుకొని భర్త సంజూ, అత్తవారింటి బంధువులు వస్తారు. బాలును చూసి సంజూ లోపలికి తీసుకెళ్తాడు. గతంలో సంజూను కొట్టడటంతో ఆ పగను తీర్చుకునేందుకు తన అత్తతో బాలు చేత కాళ్లు పట్టించేలా మరో షరతు విధిస్తాడు. కానీ బాలు సంజూ కాళ్లు కడుగుతాడా? లేదా? అనేది తరువాయి ఎపిసోడ్ లో తేలనుంది. ఇక మార్చి 18వ తేదీ 382వ ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.....?

బాలు ఫంక్షన్ కు దూరంగా వెళ్తూ ఉండగా... మీనా భర్త బాలుకు కనీసం టిఫిన్ చేయమని ఫోర్స్ చేస్తుంది. దాంతో బాలు కూడా పుష్టిగా తింటానని చెప్పి ఇండ్లీలు తింటూ ఉంటాడు. మీనా కూడా మరింతగా వడ్డిస్తూ ఉంటుంది. భర్త కడుపునిండా తింటూ ఉంటే చూసి ఆనందిస్తుంది. కానీ తల్లి ప్రభావతి మధ్యలోనే వచ్చి కొడుకును తిండితినకుండా చేస్తుంది. కాసేపట్లో మౌనిక అత్తవారింటి నుంచి అందరూ వస్తున్నారంటే.. ఇప్పుడు వీడు తీరిగ్గా కూర్చొని తినడం అవసరమా? అంటూ తల్లి ప్రశ్నిస్తుంది. ఇవ్వాళ ఒక్కరోజు తినకపోతే ఏం అవుతుంది.. అయినా బయట టిఫిన్స్ దొరకవా? అంటూ అవమానిస్తుంది. ఇక బాబు మధ్యలోనే తినకుండా లేచిపోతాడు. తల్లి మాటలకు ప్లేట్ ఉన్న ఫుడ్ ను సగంలోనే ఆపేసి చేయి కడుక్కుంటాడు. దాంతో మీనా, సత్యం ప్రభావతిపై మండిపడుతారు.
ఇక బాలు ఫైనల్ గా ఇంట్లో నుంచి బయటికి వెళ్తూ ఉంటాడు. రైడ్ కు వెళ్లేందుకని ఇంటి ముందే ఉన్న తన కారును తుడుచుకుంటూ ఉంటాడు. ఈలోగా మౌనిక అత్తవారు కారులో వచ్చేస్తారు. బాలు చెల్లి మౌనికను చూసి ఆగిపోతాడు. సంతోషంతో పొంగిపోతాడు. కానీ బావ సంజూ మాత్రం తన మేనత్తను తీసుకొని వచ్చి షాక్ ఇస్తాడు. ఆమెతో బాలు కుటుంబాన్ని అడుగడుగునా అవమానించమని చెబుతాడు. ఇక సంజూ అత్తమ్మ నానా మాటలు అంటూ, ఒక్కొక్కరి మీద సూటిపోటి మాటలు అంటూ బాధపెడుతుంది. ఇక బాలును చూసిన మౌనిక మామ ఇంక వెళ్లలేదేంటీ నీ కొడుకు అంటూ ప్రభావతిని ప్రశ్నిస్తాడు. వెంటనే ప్రభావతి బాలు వెళ్లిపో అని అంటుంది. ఇక బాలు వెళ్లిపోతుండగా... సంజూ కావాల్చుకొని బావా ఎక్కడకి జారుకుంటున్నావ్ అంట్ పిలుస్తాడు. నువ్వు కూడా ఇంట్లోకి రా అంటూ ఎటకారంగా పిలుస్తాడు.
బాలు వస్తేనే మేం ఇంట్లోకి వస్తామని, లేదంటే ఈ ఫంక్షన్ మా ఇంట్లోనే చేసుకుంటామని సంజూ చెబుతాడు. దాంతో బాలు ఎక్కడికి వెళ్లను లే అంటూ అందరితోపాటు ఇంట్లోకి వస్తాడు. ఇక ఇంట్లోకి రాగానే సంజూ అత్తమ్మ ఇంట్లో వాతావరణం చూసి అవమానిస్తుంది. ఇరుకైన గదులు, పాత టీవీ, చిన్న చిన్న సోఫాలు చూసి దెప్పిపోడుతుంది. నలుగురు గట్టిగా ఇంటికి వస్తే బంగారం అమ్మి మర్యాద చేసేలా ఉన్నారేమో అంటూ ఏటకారం చేస్తుంది. దాంతో బాలుకు చిర్రెత్తిపోతుంది. అయినా చెల్లి మౌనికా కోసం నోరుమెదపకుండా అలాగే నిలబడి చూస్తుంటాడు. మరోవైపు సంజూ అత్తమ్మ మాటలకు శృతి తగిన విధంగా కౌంటర్ ఇస్తుంది.
రాకరాక అల్లుడు ఇంటికి వస్తే మీరు చేసే మర్యాద ఇదేనా అంటూ సంజూ అత్త కాంతం ప్రశ్నిస్తుంది. బాలుతోనే సంజూ కాళ్లు కగిడించాలని అంటుంది. దాంతో బాలుకు మండిపోతుంది. మీనాను పళ్లెం, నీళ్లు తీసుకురా అని చెబుతాడు. తీసుకొచ్చాక కోపంతో పళ్లెం కిందపడేస్తాడు. కాళ్లు కడగబోతుండగా.. మీనా అడ్డుకుంటుంది. ఇంటికి పెద్దకొడుకు ఉండగా.. చిన్నవాడితో కాళ్లు కడిగించడం ఎక్కడి సంప్రదాయం, ఎలాంటి పద్ధతి, ఏం ఆచారం అంటూ ప్రశ్నిస్తుంది. దాంతో పెద్ద బావమర్ది అయిన మనోజ్ వచ్చి సంజూ కాళ్లు కడుగుతాడు. దాంతో మనోజ్ కు సంజూ నోట్ల కట్ట ఇస్తాడు. అది చూసి మనోజ్ సంతోషపడితే. కాళ్లు కడిగినందుకు నోట్ల కట్ట ఇచ్చి అవమానించాడని బాలు కోపం చేస్తాడు. మీరు నోట్ల కట్టలు ఇస్తే మావాడు ఏదైనా కడుగుతాడని అటు సంజూను, ఇటు మనోజ్ ను దెప్పిపొడుస్తాడు.
ఇక అల్లుడికి మర్యాదలు చేయడం ముగియడంతో తదుపరి కార్యక్రమాలను జరిపిస్తుంటారు. ఈ క్రమంలో మౌనికను బెడ్ రూమ్ లోకి తీసుకొని వెళ్లి రెడీ చేయాలని చూస్తారు. ఆ సమయంలో సత్యం ఇంటి ముగ్గురు కోడళ్ల మౌనిక దగ్గరకు వెళ్లి మాట్లాడుతుంటారు. ఆమె బాగోగులు తెలుసుకుంటూ ఉంటారు. ఇక శృతి మాత్రం అస్సలు నువ్వు బాగానే ఉన్నవా? అంటూ మౌనికాను ప్రశ్నిస్తుంది. సంజూ ప్రవర్తన చూస్తుంటే నువ్వు అక్కడ ఏమాత్రం సంతోషంగా లేవని తెలుస్తోందని చెబుతుంది. అలాగే బాలును ఇంట్లో ఉండొద్దని చెప్పినా కూడా ఎందుకు ఉన్నావంటూ చెల్లి మౌనికా ప్రశ్నించి అవమానిస్తుంది. చెల్లికోసం ఎంతో కష్టపడ్డ బాలు గుండెకే తన మాటలతో గాయం చేస్తుంది. సంజూతో గొడవపడుదామనే ఇంట్లో ఉన్నావు కదా అంటూ బిగ్గరగా అరుస్తుంది. మరోవైపు మౌనికా అత్తవారింట్లో పడే కష్టాలను ఎక్కడ చెబుతుందోనని మామ కంగారు పడుతాడు. అందుకని సంజూని పంపి త్వరగా మౌనికను బయటికి తీసుకొచ్చేలా చూడు అంటూ చెబుతాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది గుండెనిండా గుడిగంటలు 383 ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











