Gunde Ninda Gudi Gantalu March 19th : అన్న బాలుపై మౌనికా చిరాకు.. అసలు గుట్టు కనిపెట్టిన శృతి!

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక మార్చి 18వ తేదీ 382వ ఎపిసోడ్ ట్విస్ట్ లు ఎమోషనల్ సీన్లతో ఆసక్తికరంగా సాగింది. మౌనికా తాళి మార్చే కోసమని బాలు ఎంతగానో కష్టపడుతాడు. సత్యం, ప్రభావతి కూతురు మౌనిక తాళి మార్చే ఫంక్షన్ కోసమని వారి అత్తగారిని ఆహ్వానిస్తారు. వారు ఫంక్షన్ కు అంగీకారం తెలుపుతారు. కానీ షరత్ తో కూడిన అంగీకరాన్ని తెలియజేస్తారు. బాలు ఇంట్లో ఉంటే... ఫంక్షన్ కు రాబోమని చెబుతారు. అందుకు తండ్రి ఏమాత్రం ఒప్పుకోడు కానీ.. తల్లి ప్రభావతి సరేనని చెప్పి ఒప్పుకుంటుంది. దాంతో ఇంటికి వచ్చి బాలును ఫంక్షన్ రోజు ఇంట్లో లేకుండా చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది.

అసలు విషయం తెలియని బాలు చెల్లి తాళి మార్చే ఫంక్షన్ కోసం ఎంతో కష్టపడుతుంటాడు. నాన తిప్పలు పడి డబ్బులు పోగుచేస్తాడు. తిండినిద్ర మానుకొని కారు డ్రైవ్ చేసి మరీ ఫంక్షన్ కోసమని డబ్బులు సంపాదించి తండ్రికి ఇస్తాడు. అంత కష్టపడినా చెల్లి ఫంక్షన్ లో నువ్వు ఉండొద్దురా అని తల్లి ప్రభావతి కఠువుగా చెబుతుంది. అసలు విషయం తెలుసుకున్న బాలు ఎంతో బాధపడుతాడు. తన భర్త బాలును అవమానించడంతో మీనా కూడా లోలోపల కుమిలి పోతుంది. ఎలాగూ అంత మాట అన్నాక బాలు కూడా ఫంక్షన్ కు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంట్లోనుంచి వెళ్లేందుకు బయల్దేరుతాడు. ఆలోగానే మౌనిక అత్తవాళ్లు వచ్చి బాలుపై పగతీర్చుకునే ఉద్దేశంతో మళ్లీ ఇంట్లోకి తీసుకొస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక మార్చి 19వ తేదీ 383వ ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...?

Gunde Ninda Gudi Gantalu serial episode 383 March 19th

మౌనిక ఫంక్షన్ కు దూరంగా ఉందామని వెళ్లిన బాలును బావ సంజూ తిరిగి ఇంట్లోకి తీసుకొస్తాడు. గతంలో సంజూను బాలు కొట్టడం మనసులో పెట్టుకొని ఇప్పుడు పగతీర్చుకోవాలని భావిస్తాడు. తన అత్త కాంతంతో అవమానించే పనికి పూనుకుంటాడు. కాంతం ఇంట్లోకి రాకగానే తెగ రెచ్చిపోతోంది. బాలు కుటుంబంపై చాలా మాటలు అంటుంది. కాసేపు ఓపిక పట్టిన బాలు, మీనా, శృతి ఇక ఒక్కసారిగా కాంతంకు కౌంటర్స్ ఇవ్వడం మొదలు పెడుతారు. దాంతో ఆమె చల్లబడుతుంది. అయితే బాలుపై పగ సాధిద్దామనుకున్న సంజూకు ఎదురుదెబ్బ తగిలింది. పైగా తనకే కాళ్లు కడిగే దగ్గర అవమానం జరుగుతుంది. బాలు కూడా గట్టిగానే మాట్లాడుతాడు. అయితే ఇంట్లోకి వచ్చాక జరిగిన అన్ని విషయాలను సంజూ గుర్తు చేసుకుంటాడు. ఎలా పగతీర్చుకోవాలా? అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోగా తల్లిదండ్రులు వచ్చి సంజూను మందలిస్తాడు.

మళ్లీ బాలుతో నీకు గొడవ ఎందుకు రా? వాడిని ఇంట్లోనుంచి ఫంక్షన్ లో లేకుండా వెళ్లగొట్టం కదా మళ్లీ ఎందుకు పిలిపించావు అంటాడు. సంజూ దగ్గర ఎలాంటి సమాధానం ఉండదు. దాంతో అత్త కాంతం స్పందిస్తూ... వాడిని ఒక్కరోజు కాదు శాశ్వతంగా ఇంట్లో లేకుండా చేస్తానని, అందుకు ప్లాన్ ఉందంటూ చెబుతుంది. ఇంక హింస పెట్టాలనే తన ఆలోచనను తెలియజేస్తుంది. ఇక వాళ్ల దగ్గరికి వచ్చిన ప్రభావతిని పిలిచి అవమానిస్తుంది. అల్లుడు ఇంటికి వచ్చి ఇంత సేపు అవుతున్న ఏమాత్రం మర్యాద చేయవా? అంటూ మండిపడుతుంది. అల్లుడు ఇంటికి వచ్చి ఎంత సేపైనా కనీసం మంచినీళ్లు, స్వీటైనా ఇచ్చావా? అంటూ అసహించుకుంటుంది. నానా మాటలతో తిట్టిపోస్తుంది. ఇక గతంలో మీనాపై మాట్లాడిన మాటలన్నీ ప్రభావతికి మౌనిక వాళ్ల అత్తగారి బంధువైన కాంతం నుంచి తిరిగి వస్తాయి.

ఇకపోతే... మౌనిక ఫంక్షన్ పక్కన పెట్టి కాంతం అత్త పాత విషయాలన్నీ బయటకి తెస్తుంది. తన కూతురుని చేసుకోమంటే సంజూ ఓ డ్రైవర్ కూతురిని చేసుకున్నావేంట్రా అంటూ దెప్పిపోడుస్తుంది. ఇంత ఇరుకు గదుల్లో ఏమాత్రం గాలి కూడా ఆడటం లేదని చిరాకు పడుతుంది. దాంతో సత్యం స్పందిస్తాడు. మేమేం మా కూతురిని చేసుకోమని బతిమిలాడలేదు. సంజూనే మా అగ్గిపెట్టే లాంటి ఇంటికి వచ్చి కోరి మరి పెళ్లి చేసుకున్నాడని గుర్తు చేస్తాడు. దాంతో కాంతం మళ్లీ మాట మార్చుతుంది. మావాళ్లదే తప్పు అని అంటున్నాను అని చెప్పుకోస్తుంది. అంతటితో ఆగకుండా శృతిని కూడా అవమానిస్తుంది. కోటీశ్వరుడైన సంజూను కాదని ఈ ఇంటికి వచ్చావా తల్లి అంటూ ఎగతాళిగా మాట్లాడుతుంది. ఇక శృతి కూడా తగ్గట్టుగానే బదులిస్తుంది. అవును పిన్ని నేనే.. మీకేమైనా ఇబ్బందిగా ఉందా? అంటూ ధీటుగా సమాధానం ఇస్తుంది.

ఇక పోతే మిగితా కార్యక్రమం కోసం మౌనికను రెడీ చేసేందుకు మీనా, శృతి, రోహిణి బెడ్ రూమ్ లోకి వెళ్తారు. మౌనికాను డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చొబెట్టి ముస్తాబు చేసేందుకు రెడీ అవుతారు. అయితే అప్పటి వరకు హాల్లో జరిగిన విషయాలన్నింటిని మళ్లీ అక్కడ గుర్తుచేసుకుంటారు. అసలు నువ్వు సంతోషంగా ఉన్నావా? లేవా? అంటూ మౌనికను అడుగుతారు. సంజూ చాలా సైకోలా ఉన్నాడని శృతి, వాళ్ల అత్త కాంతం మరీ దారుణంగా ఉందని రోహిణి తమ అభిప్రాయాలను చెబుతుంటారు. కాంతం మాటలకు అత్త ప్రభావితే నోరుమూసుకుందంటే ఆమె ఎంతో గయ్యాళో తెలుస్తుందని అనుకుంటారు. ఇక మీనా స్పందిస్తూ.. మౌనికా ఆ ఇంట్లో నువ్వు ఎలా ఉంటున్నావో చెప్పు అంటుంది. ఎందుకంటే సంజూ సంగతి తమకు బాగా తెలుసని చెబుతుంది. ఇక శృతి కూడా ఆ వెదవ సంజూ గురించి తనకు బాగా తెలుసని, మౌనిక అక్కడ ఎలా ఉంటుందోననే డౌట్ తనకూ ఉందంటుంది.

ఇక బాలు చెల్లి మౌనికతో మాట్లాడేందుకు మౌనికను ముస్తాబు చేసే దగ్గరికి వస్తాడు. అదే సమయంలో సంజూను తల్లిదండ్రులు మౌనిక ఏం చేస్తుందో, పుట్టింటి వాళ్లకు ఏం చేబుతుందో చూసిరా అంటూ పంపిస్తారు. బాలు వెనకాలే వచ్చిన భర్త సంజూను చెల్లి మౌనిక చూస్తుంది. అన్నతో ఎంతో ప్రేమగా మాట్లాడాలని ప్రయత్నించిన సంజూ గమనిస్తుండటంతో కఠినంగా మాట్లాడుతుంది. ఇంట్లో ఉండద్దొని తమ మామ, భర్త చెప్పినా ఇంకా ఎందుకు ఉన్నావంటూ ప్రశ్నిస్తుంది. మౌనిక అలా ఎందుకు మాట్లాడిందోనని బాలు, మీనా షాక్ అవుతారు. కానీ వీళ్లతో బాలు అన్న మాటలు పడాల్సి వస్తుందనే అలా అంటుందని సర్దిచెప్పుకుంటారు. ఇక ఈలోగా మరో సమస్య వచ్చి పడుతుంది.

బాలు కారు లోన్ కు సంబంధించిన ఈఎంఐ కట్టలేదని రికవరీ ఏజెంట్ ఇంటికి వస్తాడు. కానీ అప్పటికే ఉన్న డబ్బులన్నీ ఫంక్షన్ కు ఖర్చుచేయడంతో ఈఎంఐ కట్టలేకపోతాడు బాలు. ఏంజెంట్ రావడంతో కంగారు పడుతాడు. సాయంత్రం వరకు ఎలాగైనా కట్టేస్తానని బతిమిలాడుతాడు. అయినా ఆ ఏజెంట్ వినిపించుకోడు. ఫంక్షన్ జరుగుతుండగానే సంజూ, కాంతం, మౌనిక అత్తమామల ముందే అవమానించేలా ఈఎంఐ కట్టమని నిలదీస్తాడు ఏజెంట్. దాంతో సంజూ నేను పడేస్తాలే అంటూ చెబుతాడు. కాంతం కూడా ఈఎంఐ కట్టడానికి దిక్కులేదు కానీ పౌరుషానికేం తక్కువ లేదు అంటూ అవమానిస్తుంది. నేనే కట్టుకుంటానని బాలు బదులిస్తాడు. ఇదిలా ఉంటే... చివర్లో వచ్చే ప్రోమోలో తాళి మార్చే సమయానికి బంగారుతాళి కనిపించకుండా పోతుంది. మీనా గదిలోంచి కాంతం అత్త తీసి దాచేసి కావాలనే అవమానించాలని ప్రయత్నిస్తుంది. అయితే ఆ విషయం తెలుసుకున్న బాలు ఏం చేస్తాడనేది రేపటి ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X