Gunde Ninda Gudi Gantalu March 20th : తాళి దొంగతనం.. మీనాపై నింద.. అసలు దొంగ ఆమె కదా?
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక మార్చి 19వ తేదీ 383వ ఎపిసోడ్ ఆద్యాంతం ఆసక్తికరంగా సాగింది. బాలును మౌనికా ఫంక్షన్ లో ఉండొద్దని చెప్పిన అత్తవారింటి వాళ్లే చివర్లో బాలును ఉండమని లోనికి తీసుకెళ్తారు. బావ సంజూపై గతంలో మౌనికను పెళ్లి చేసుకోవద్దంటూ చేయి చేసుకున్నందుకు ఇప్పుడు పగ తీర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. సంజూ, ఆయన మేనత్త కాంతంతో కలిసి నానా రకాలు మాటలతో హింసిస్తారు. అయినప్పటికీ బాలు తన కోపాన్ని మునిపంటితో బిగిపట్టేస్తాడు. కాంతం ఎన్ని సూటిపోటు మాటలు అన్న.. తన కుటుంబాన్ని కించపరిచినా.. అడుక్కుతినేవాళ్లలా ఉన్నారంటూ అవమానించినా అన్ని భరిస్తూ ఉంటాడు. ఎంతో ప్రేమ పెంచుకున్న తన తండ్రిని అనరాని మాటలు అన్న కూడా చెల్లి మౌనిక కోసం బాలు మౌనంగా ఉంటాడు.
సంజూ అత్త కాంతం మాత్రం బాలు కుటుంబాన్ని కించపరిచేందుకు పలు విధాలుగా ప్రయత్నిస్తూనే ఉంటుంది. సత్యం, ప్రభావతి, శృతి అవమానించినా ఎలాంటి రేషాలు పోకుండా శాంతంగా ఉంటారు. మరోవైపు బాలు భార్య మీనాను కూడా ఇష్టమొచ్చినట్టు తిట్టినా సహిస్తుంది. ఇక ఎవ్వరూ ఎంత తిట్టినా ఆవేశాలకు పోకుండా శాంతం ఉండటంతో సంజూ, కాంతం, మౌనికా మామ అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటారు.దీంతో కాంతం ఊహించని ట్విస్ట్ ఇస్తుంది. తాళి మార్చే ఫంక్షన్ కావడంతో కాంతం సరిగ్గా బాలు ఎంతో కష్టపడి కొనుగోలు చేసిన బంగారు తాళిని దొంగలించి దాచి పెడుతుంది. దీంతో ఆ నింద మీనాపై పడుతుంది. కానీ బాలు అసలు ఆ తాళి తీసిందెవరు అంట ఆరా తీస్తాడు. అంతటితో చివరి ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక మార్చి 20వ తేదీ 384వ ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...?

ఇక బాలుతో ఎలాగైన గొడవ పడాలని మౌనిక భర్త సంజూ ప్రయత్నిస్తూ ఉంటాడు. తన అత్త కాంతంతో కలిసి ఇంట్లో వాళ్లను అవమానించే పనిలో ఉంటాడు. తాళి మార్చే ఫంక్షన్ కు వచ్చినప్పటి నుంచి ఏదోలా గొడవ చేయాలని చూస్తారు. తన అత్త కాంతంతో సూటిపోటు మాటలు అనిపించి ఆవేశానికి లోనయ్యేలా చేస్తారు. అయినప్పటికీ బాలు, మీనా, శృతి అందరూ ఓపిగ్గా ఉంటారు. ఏమాత్రం రేషానికి పోకుండా మౌనిక జీవితాన్ని దృష్టిలో ఉంచుకొని నానా మాటలను భరిస్తాడు. వచ్చిన కాంతం మాత్రం ఇంకా రేషం వచ్చేలా మాట్లాడుతూనే ఉంటుంది. ఇక భోజనాలు చేసే సమయంలోనూ మీనా వడ్డిస్తుండగా.. కాంతం అత్తే కావాలని తనచీరపై సాంబార్ పోసుకొని మీనాపై నెట్టి వేస్తుంది. దాంతో బాలుకు చిర్రెత్తిపోతుంది. వెంటనే కాంతంపై మాటల తూటాలు పేల్చుతాడు.
మీనా కావాలని పోసేది అయితే, చీరమీద ఎందుకు పోస్తుంది, మీ మొహం మీద పోసేది కదా అంటూ గట్టిగా బదులిస్తాడు. ఇక చీర కడుక్కోవాలని బాలు, మీనాల గదిలో ఉన్న వాష్ రూమ్ లోకి వెళ్తుంది. చీర వాష్ చేసుకొని వచ్చేప్పుడు మీనా దాచిన పెట్టిన మౌనిక తాళిని దొంగలిస్తుంది కాంతం. అప్పటికే బాలును ఏం చేయకలేకపోతున్నానని రగిలిపోతున్న సంజూకు తాళిని దొంగలించానని, బాలు కుటుంబాన్ని మొత్తం అవమానిస్తానని చెబుతుంది. దాంతో మౌనిక మళ్లీ అత్తగారింటిలో అడుగుపెట్టబోదని, పుట్టింటిలోనే శాశ్వతంగా ఉంటుందని తన కుట్రను అల్లుడు సంజూతో తెలియజేస్తుంది. దాంతో సంజూ కూడా ఆనందిస్తాడు. ఇక ప్లాన్ ప్రకారమే కాంతం దొంగలించిన తాళిని తన కారులో దాచిపెట్టి.. ఏమీ తెలియనట్టుగా తిరిగి ఇంట్లోకి వస్తుంది. ఇక తాళి మార్చే కార్యక్రమాన్ని ప్రారంభించండి అంటూ ప్రభావతితో అంటుంది.
ఇక వెంటనే మీనాను తాళి తీసుకొని రమ్మని ప్రభావతి చెబుతుంది. మీనా తన రూమ్ లోకి వెళ్లి ఎంత వెతికినా తాళి మాత్రం దొరకదు. ఎందుకంటే అప్పటికే కాంతం తీసి కారులో దాచి పెట్టిన సంగతి తెలిసిందే. ఇక తాళి దొరకడం లేదని మీనా వచ్చి చెప్పడంతో చంద్రకాంతం, మౌనిక తల్లిదండ్రులు రెచ్చిపోతారు. ఏం ఫంక్షన్ చేస్తున్నారని, తాళి అసలు కొన్నారా? లేదా? అని ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు. ఓవైపు మీనానే తీసి ఉంటుందని నింద వేస్తారు. లేదంటే బాలునే తీసి తాగేసి ఉంటాడని అవమానిస్తారు. బంగారు తాళి కొనలేమని చెబితే మేమే తీసుకొచ్చి మీ మొహానా పడేసేవాళ్లం కదా అంటూ అరుస్తారు. ఇంతకీ తాళి ఉందా? లేదా? మమ్మల్ని ఉండమంటారా? వెళ్లమంటారా? అంటూ చంద్రకాంతం, మౌనిక మామ గట్టిగా అడుగుతారు. ఇక అదే సమయానికి మౌనిక ఫంక్షన్ వీడియోను షూటి చేసి, ఫోన్ మాట్లేడి శృతి తిరిగి వస్తుంది.
అక్కడ జరుగుతున్న గొడవను చూసి ఏమైందని భర్త రవి ద్వారా తెలుసుకుంటుంది. తాళి పోయిందని, అది మీననే తీసిందంటూ కాంతం బద్నామ్ చేస్తుందని వివరిస్తాడు. ఇక మీనా అలాంటి కాదని, చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ కలిగి ఉందని మౌనిక అత్తవారితో వాదిస్తుంది. మీనాకు సపోర్ట్ గా రోహిణి, అత్త ప్రభావతి కూడా మాట్లాడుతారు. మీనాకు బంగారంపై ఎలాంటి మోజు లేదని, తను ఇచ్చినా తీసుకునే రకం కాదని వివరించే ప్రయత్నం చేస్తారు. ఎంత చెప్పినా చంద్రకాంతం మాత్రం అస్సలు ఊరుకోదు. దీంతో బాలు అసలు మన గదిలోకి చివరిగా ఎవరు వెళ్లారంటూ మీనాను ప్రశ్నిస్తాడు. సాంబార్ పడటంతో కడుక్కోవడానికని కాంతం పిన్ని వాష్ రూమ్ కు వెళ్లి వచ్చిందని చెబుతుంది. అది విన్న శృతికి వెంటనే కాంతంపై డౌట్ వస్తుంది. అప్పటికే తను మౌనిక ఫంక్షన్ వీడియోను షూట్ చేస్తుండగా.. కారు దగ్గరికి వెళ్లి వస్తుండటం గమనిస్తుంది. దీంతో తాళిని కాంతమే తీసి అక్కడ దాచి ఉంటుందని భావిస్తుంది.
అందరూ గొడవపడుతుండగా.. కారు సెంట్రల్ లాక్ ను ఓపెన్ చేసి వెళ్లి కారులో డోర్ ఓపెన్ చేస్తుంది. వెనకాల సీట్ లో బంగారు తాళి కనిపిస్తుంది. అది చూడగానే శృతికి ఒళ్లు మండిపోతుంది. వెంటనే తీసుకొని వచ్చి కుటుంబ సభ్యులకు చూపిస్తుంది. తాళి దొరికిందంటూ చెబుతుంది. దీంతో అందరూ ఎక్కడ కనిపించిందని అడుగుతారు. తన పేరు ఎక్కడ చెబుతుందోనని కాంతం, మౌనిక మామ వణికిపోతారు. కానీ శృతి అలా చేయకుండా మీనా గదిలో ఉందని, కంగారులో సరిగా చూసి ఉండకపోవచ్చని నిజాన్ని దాచేస్తుంది. ఎంత చెప్పినా వినిపించుకోకుండా మీనాను దొంగ అని రుజువు చేయడానికి ప్రయత్నించిన కాంతం పిన్ని క్షమాపణలు కోరాలని శృతి డిమాండ్ చేస్తుంది. ఇక గత్యంతరం లేకపోవడంతో కాంతం తన పొగరును అణుచుకొని క్షమించమని అడుగుతుంది. ఆ తర్వాత కాంతాన్ని ఏదో మాట్లాడాలని శృతి పక్కకు తీసుకెళ్లి పోతుంది.
తాళి దొరకడంతో అందరూ సంతోషిస్తారు. మీనాను ఆ తాళి మార్చే కార్యక్రమాన్ని ప్రారంభించమని అత్త ప్రభావతి చెబుతుంది. కానీ మీనా అప్పటికే అవమానానికి గురవడంతో తాను చేయలేనని ఆ కార్యక్రమాన్ని రోహిణి చేతుల మీదుగా జరిపించమని చెబుతుంది. తాళిని రోహిణికి ఇవ్వని శృతికి చెప్తుంది. శృతి ఆ తాళిని రోహిణికి ఇవ్వడంతో దేవుడి దగ్గరకు వెళ్లి పూజ చేస్తుంది... ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.... ఇక ప్రోమోలో మాత్రం తాళి పోవడానికి కారణం మీనా నిర్లక్ష్యమేనని అత్త ప్రభావతి మండిపడుతుంది. బాలు, మీనాల వల్ల తనకు ప్రశాంతత లేకుండా పోతుతందని చిరాకు పడుతుంది. ఇక శృతి వచ్చి అత్త ప్రభావతి మాటలకు అడ్డుకట్ట వేస్తుంది. అసలు తాళి దొంగలించింది చంద్రకాంతం అని నిజం బయటపెడుతుంది. దాంతో అంతా షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో మార్చి 21వ తేదీ 385 వ ఎపిసోడ్ లో చూడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











