Gunde Ninda Gudi Gantalu March 21st : మీనాపై నిప్పులు కక్కిన ప్రభావతి.. అత్తపై తిరగబడ్డ కోడలు శృతి!

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక మార్చి 20వ తేదీ 383వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బాలు ఇంట్లో చెల్లి మౌనికాకు తాళి మార్చే ఫంక్షన్ ను జరిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫంక్షన్ కోసమని బాలు ఎంతో కష్టపడి బంగారు తాళిని చేయిస్తాడు. ఇక మౌనిక అత్తవాళ్లు కూడా ఇంటికి వస్తారు. అప్పటికే బాలును ఫంక్షన్ లో ఉండకూదనే కండీషన్ ను పెట్టి అవమానిస్తారు. మౌనికను తీసుకొని ఫంక్షన్ కు హాజరైన సమయంలో బాలు ఇంట్లో నుంచి బయటకు వెళ్తాడు. అయితే బాలుతో గొడవ పెట్టుకునేందుకని సంజూ తిరిగి ఇంట్లోకి తీసుకెళ్తాడు. నానా రకాలు మాట్లాడి కోపం తెప్పిస్తాడు. ఎన్నో రకాలుగా అవమానించి ఆవేశానికి లోనయ్యేలా చేస్తాడు. సంజూ అత్త ఇంకా రెచ్చిపోయి బాలు కుటుంబ సభ్యులు, వారి ఆర్థిక స్థోమతపై అనరాని మాటలు అంటుంది.

అన్నిటికీ బాలు ఓపిగ్గా ఉంటాడు. గతంలో మౌనిక పెళ్లి విషయంలో సంజూను కొట్టిన కారణంగానూ, తన చెల్లి ఫంక్షన్ సజావుగా జరగాలని, మరోవైపు తన చెల్లి మౌనికాకు అత్తగారింట్లో ఎలాంటి సమస్యలు రావొద్దనే ఉద్దేశంతో ఎన్ని బాధలు పెట్టినా, ఎంత అవమానించినా సహిస్తూ వస్తాడు. ఎంత రెచ్చగొట్టినా బాలు సహనంతోనే ఉండటంతో ఇక అత్త చంద్రకాంతం రంగంలోకి దిగుతుంది. మౌనికా ఫంక్షన్ కోసం బాలు చేయించిన బంగారు తాళిని దొంగలించిన సమయానికి లేకుండా చేస్తుంది. తన కారులో దాచిపెడుతుంది. ఆ నిందను మీనాపై మోపుతుంది. మీనా ఆందోళన పడుతుంది. తాళి తను తీయలేదని చెప్పుకొస్తుంది. కాంతం అదే అదునుగా ఇంకా రెచ్చిపోతుంది. తోటి కొడలు, అత్త ప్రభావతి కూడా మీనా తాళి దొంగలించిందంటే నమ్మబోరు. ఇక బాలు వచ్చి చివరిగా మన గదిలోకి ఎవరూ వెళ్లారని మీనాతో తెలుసుకుంటాడు. చంద్రకాంతం అని తెలియడంతో ఆమెవైపు గుర్రుగా చూస్తాడు. ఇక అక్కడే ఉన్న శృతి.. కాంతం తన కారు దగ్గరకు వెళ్లిరావడాన్ని గమనిస్తుంది. ఇక ఆమెనే దొంగలించి ఉంటుందని వెళ్లి కారులో చూడగా తాళి అక్కడే కనిపిస్తుంది.... తీసుకొచ్చి ఇంట్లో వాళ్లకు చూపిస్తుంది. కాంతం పిన్ని వినిపించుకోకుండా మీనాపై దొంగతనం నింద మోపిందని సారీ కూడా చెప్పిస్తుంది. అయితే ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక మార్చి 21వ తేదీ 384వ ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 384 March 21st

మౌనికా తాళి మార్చే ఫంక్షన్ తో బాలును అవమానిద్దామని వచ్చిన సంజూకు ఎదురుదెబ్బ తగులుతుంది. మొదట్లో అంతా సంజూకు అనుకూలంగానే జరిగింది. సంజూ మేనత్త చంద్రకాంతం బాలు కుటుంబాన్ని నానా మాటలు అని సంతోషంపెడుతుంది. బాలు, మీనా, ప్రభావతి, సత్యాన్ని, శృతిలను సూటిపోటి మాటలు అని సంజూను సంతృప్తి పడేలా చేస్తుంది. ఇక ఎంత అన్నప్పటికీ బాలు కుటుంబీకులు సహనంతో ఉంటారు. చంద్రకాంతం అత్త తాళిని దొంగలించి కారులో దాచేస్తుంది. కాంతం బంగారాన్ని కారులో దాస్తున్న దృశ్యాన్ని శృతి తన ఫోన్ లో రికార్డు చేసింది. ఆ వీడియోతో చంద్రకాంతం అత్త నోరు మూయిస్తుంది. కాంతం అత్త అన్న మాటలకంటే ఎక్కువగానే మాట్లాడి దెబ్బకు రోగం కుదిరేలా చేస్తుంది. తను బంగారు తాళినిదొంగలిస్తున్న వీడియోను చూపించి బెదిరిస్తుంది.

చెప్పినట్టు వినకపోతే ఇంట్లో వాళ్లందరికీ వీడియో చూపించి తన బంఢారాన్ని బయటపెడుతానని హెచ్చరిస్తుంది. అప్పుడు అందరూ నీకు మర్యాద ఇవ్వడం మానేసి తిట్ల పురాణం మొదలు పెడుతారని మందలిస్తుంది. దాంతో చంద్రకాంతం చేసేదేమీ లేక శృతి చెప్పుచేతల్లోకి వచ్చేస్తుంది. శృతి చెప్పినట్టుగానే వింటుంది. ఇంట్లో వాళ్లందరితో మంచిగా మెదులుతుంది. ఒక్కసారిగా తన మాట్లల్లో ప్రేమను కుమరిస్తుంది. అవమానాల పాలు చేసిన చంద్రకాంతం అందరితో కలిసిపోతుంది. శృతి దెబ్బకు పొగరు అణుచుకొని బాలు కుటుంబ సభ్యులతో మంచిగా మెదులుతుంది. అందరినీ వరుసలు పెట్టి పిలుస్తూ తాళి మార్చే ఫంక్షన్ ను కూడా తానే దగ్గరుండి జరిపిస్తుంది. ఒక కార్యక్రమం తర్వాత మరో కార్యక్రమం చేయించిస్తుంది.

అయితే బాలు కుటుంబాన్ని ఘోరంగా అవమానించాలని వచ్చిన చంద్రకాంతం అత్త ఒక్కసారిగా మారిపోవడంతో సంజూ ఆశ్చర్యపోతాడు. అటు మౌనిక మామ కూడా షాక్ అవుతాడు. తన అక్కకు పిచ్చి పట్టినట్టుగా ఒక్కసారిగా మౌనిక కుటుంబంపై ప్రేమ కురిపిస్తోందేంటీ అంటూ సందేహిస్తాడు. కానీ అసలు విషయం చెప్పకుండా చంద్రకాంతాన్ని శృతి అడ్డుకుంటుంది. ఎవరికైనా విషయం చెబితే తన దొంగతనం వీడియోను బయటపెడుతుందని బెదిరిస్తుంది. ఇక చంద్రకాంతం శృతి మాటకు ఎదురుచెప్పలేక ఏం చెబితే అది వింటుంది.

అంతే కాదు.. సంజూ చేత మౌనిక మేడలో తాళిని వేయిస్తుంది. బట్టలు పెట్టిన తన మామ సత్యంపై సంజూ మండిపడితే అడ్డుకుంటుంది. ఆయనే పెట్టిన బటలే తీసుకోవాలని చెబుతుంది. మరోవైపు బంగారం కూడా సన్నగా ఉండటంతో ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా ఇప్పుడలానే చేయిస్తున్నారంటూ చెప్పుకువస్తుంది. చంద్రకాంతం ఇంతలా మారిపోవడంతో అందరూ షాక్ అవుతారు. ఇక శృతి చేసిన పనికి చంద్రకాంతం తిక్క కుదురుతుంది. ఇక మొత్తానికి మౌనిక తాళి మార్చే ఫంక్షన్ సజావుగా జరుగుతుంది. చివరల్లో సంజూ చేత అత్తమామలు, బావల కాళ్లు కూడా మొక్కిస్తుంది. ఇదే అదునుగా సంజూతో బాలు కాళ్లకు దండం పెట్టించుకుంటాడు. అనంతరం చెల్లికి మంచి చెడులు చెప్పి,ధైర్యం చెప్పి మెట్టింటికి సాగనంపుతారు.

మౌనిక వాళ్లు వెళ్లిపోగానే అందరూ ఇంట్లోకి వస్తారు. వాళ్లు అటు వెళ్లారో లేదో ఆలోపే ప్రభావతి మీనాపై పడి అరుస్తుంది. అది బంగారం అనుకున్నావా? లేకా ఇకేమైనా అనుకున్నావా? అంటూ ప్రశ్నిస్తుంది. కాస్తా జాగ్రత్తగా పెట్టి ఉండొచ్చు కదా అని మందలిస్తుంది. నీ నిర్లక్ష్యం వల్లనే ఈరోజు వాళ్ల ముందు పరువు పోయిందని మండిపడుతుంది. ఎంతో కష్టపడే మీనానే ఒక్కపని కూడా సరిగా చేయడం రాదా? అంటూ నిప్పులు కక్కుతుంది. దీంతో ఇంట్లోకి వచ్చిన శృతి మీనాను సపోర్ట్ గా నిలుస్తుంది. మీనా అందరికీ అలకగా దొరుకుతుందా? ఎన్నిసి మాటలు అంటున్నారు తనను అంటూ అత్తపై ఫైర్ అవుతుంది. మీనా మనిషి అనుకుంటున్నారా? లేకా మిషన్ అనుకుంటున్నారా? అంటూ ప్రశ్నిస్తుంది. అసలు విషయం తెలియకుండా మీరెందుకు రెచ్చిపోతున్నారు ఆంటీ అంటూ ప్రభావతికి ఎదురుతిరుగుతుంది. అసలు దొంగ చంద్రకాంతం అని బయటపెడుతుంది. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది.

Take a Poll

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X