Gunde Ninda Gudi Gantalu March 22nd : శృతి విశ్వరూపం.. హడలెత్తిపోయిన ప్రభావతి.. రోహిణికి టెన్షన్
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక మార్చి 21వ తేదీ 384వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మౌనిక తాళి మార్చే ఫంక్షన్ లో ఇంట్రెస్టింగ్ సీన్లు కొనసాగాయి. బంగారు తాళిని దొంగలించిన సంజూ మేనత్త చంద్రకాంతం శృతికి దొరికిపోతుంది. ఇంట్లో ఫంక్షన్ సజావుగా జరగాలనే ఉద్దేశంతో చిన్న కోడలు శృతి విషయం అందరికీ చెప్పకుండా చంద్రకాంతాన్ని పక్కకు తీసుకెళ్లి ఆమె దొంగతనం చేసి కారులో తాళిని దాచిన వీడియో క్లిప్ ను చూపించి బెదిరిస్తుంది. తను చెప్పినట్టు వినకపోతే వీడియోను ఇంట్లో వాళ్లందరికీ చూపిస్తానని చెబుతానని హెచ్చరిస్తుంది. దాంతో అప్పటి వరకు రెచ్చిపోయిన చంద్రకాంతం శృతి చేతిలో కీలుబొమ్మలా మారిపోయింది. శృతి చెప్పిన విధంగా ఇంట్లో వాళ్లందరితో మర్యాదగా మెదులుతుంది.
అంతే కాదు చంద్రకాంతం అల్లుడు సంజూతో సత్యం, ప్రభావతి కాళ్లు మొక్కించి ఆశీర్వాదం తీసుకోమని చెబుతుంది. మేనత్తచెప్పడంతో సంజూ ఏమనలేక తన పొగరును అంచుకొని మరీ కాళ్లు మొక్కుతాడు. ఇక అదునుగా శృతి... బాలు, మీనాల కాళ్లు కూడా మొక్కిస్తుంది. ఇలా బాలును అవమానిద్దామని తాళి మార్చే ఫంక్షన్ కు వచ్చిన సంజూకు ఎదురుదెబ్బ తగిలింది. ఇక చంద్రకాంతం తలపొగరు కూడా దిగిపోయింది. ఒక్క వీడియోతో శృతి వన్ మ్యాన్ షోగా కార్యక్రమాన్ని నడిపించింది. మౌనికాకు కూడా భరోసా ఇస్తూ అత్తగారింటికి సాగనంపుతుంది. అయితే, తాళి దొంగతనం చంద్రకాంతం చేసిందనే విషయం ప్రభావతికి తెలియక... మౌనిక వాళ్లు వెళ్లిపోయాక మీనాపై మండిపడుతుంది. దాంతో శృతి అత్త ప్రభావతికి అసలు సంగతిని తెలియజేస్తుంది. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా తెలియజేస్తుంది. కానీ వీడియో చూపిస్తుందా? లేదా? అన్నది తరువాయి ఎపిసోడ్ కు వాయిదా పడింది. ఇక మార్చి 22వ తేదీ 385వ ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

సంజూ వాళ్ల మేనత్త చంద్రకాంతం బంగారు తాళిని తీసి కారులో దాచి పెట్టిన సంగతి తెలియక ప్రభావతి, ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంతో కంగారు పడుతారు. కానీ శృతికి అసలు విషయం తెలియడంతో చంద్రకాంతంను తన కంట్రోల్ లోకి తీసుకొని.. కీలు బొమ్మలా ఆడుకుంటుంది. చెప్పుచేతల్లో పెట్టుకుంటుంది. అయితే ఫంక్షన్ అంతా సజావుగా జరిపించేలా చంద్రకాంతాన్ని శృతి పావులా వాడుకుంటుంది. మరోవైపు సంజూను అన్న అని కూడా పిలిచి అవమానిస్తుంది. ఇక ఫంక్షన్ ముగుస్తుంది. మౌనికను తీసుకొని అత్తమామ వెళ్లిపోతారు. ఇక ఆ తర్వాత ప్రభావతి మీనాపై మండిపడుతుంది. బంగారం దగ్గరపెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని తెలియదా.. కానివారి ముందు నానా మాటలు పడేలా చేశావు.. నీ నిర్లక్ష్యం వల్లనే నేను అవమానం పాలు కావాల్సి వచ్చిందంటూ ప్రభావతి తన ఆవేశాన్ని అంత కోడలు మీనాపై చూపిస్తుంది.
దాంతో అక్కడి బాలు వచ్చి ఏం జరిగిందని ప్రశ్నిస్తాడు. మీనా వల్లనే మౌనిక ఫంక్షన్ లో పరువంతా పోయిందని చెబుతుంది. దాంతో బాలు తల్లి ప్రభావతిపై మండిపడుతాడు. ఇక మీనాను ప్రభావతి తిడుతున్న క్రమంలోనే శృతి బయటి నుంచి ఇంట్లోకి వస్తుంది. మీనాపై నిప్పులు కురిపిస్తున్న అత్త ప్రభావతిని అడ్డుకుంటుంది. మీనాను ఎందుకు తిడుతున్నావ్ అంటూ ప్రశ్నిస్తుంది. ఆమెకు మనసు ఉండదా? ఆమెను మిషన్ లాగా చూస్తున్నారెందుకు అంటూ చెలరేగిపోతుంది. చేయని తప్పుకు మీనాను ఎందుకు నిందిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మౌనిక అత్త కుటుంబానికి చెందిన చంద్రకాంతం మీనాపై చేయని దొంగతనం నిందను వేసిందంటే.. ఇక మీరు ఇలా తిడుతున్నారెందుకు అంటూ అత్త ప్రభావతిపై మండిపడుతుంది.
అసలు బంగారాన్ని దొంగలించింది మీనా కాదని, సంజూ మేనత్త చంద్రకాంతం అంటూ అసలు విషయాన్ని బయటపెడుతుంది. ఫంక్షన్ లో తను కాసేపు లేనని, తిరిగి వచ్చే వరకు మీనాను అందరూ నిందిస్తూ కనిపించారంటూ చెబుతుంది. ఇక చంద్రకాంతంపై తను మొదటి నుంచే అనుమానం ఉండటం, తను ఫంక్షన్ వీడియో తీస్తుండగా కాంచన కారు దగ్గరికి వెళ్లిరావడం గమనించినట్టు తెలిపింది. ఒక్కసారి ఆ వీడియోను చూడటంతో అందులో చంద్రకాంతం బంగారాన్ని దొంగలించి కారులో దాచిపెట్టిందని తెలుసుకున్నాను. వెంటనే అది తీసుకొచ్చి మీకు ఇచ్చాను.. అని కుటుంబ సభ్యులకు అసలు జరిగిన విషయాన్ని, అసలు దొంగ ఎవరనే విషయాన్ని శృతి పూసగుచ్చినట్టు వివరిస్తుంది. దాంతో ప్రభావతి, బాలు, సత్యం అంతా షాక్ అవుతారు. తానే దొంగతనం చేసి తానే నిందలు వేసిందా అంటూ మండిపడుతారు. ఇక మీనాను నిందించడం మానుకుంటారు.
ఇంతటితో మౌనిక నిశ్చితార్థపు వేడుక ముగుస్తుంది. దీంతో వెంటనే సత్యం ఇంట్లో మరో చిక్కువచ్చి పడుతుంది. రోహిణికి ఉచ్చుబిగుస్తూ ఉంటుంది. తనకు లేని మలేషియా తండ్రిపై గతంలో హై రేంజ్ లో బిల్డప్ ఇచ్చిన రోహిణికి ఇప్పుడదే సమస్యగా మారింది. మనోజ్ కు జాబ్ లేకపోవడంతో ఇంట్లో పెద్ద రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈసారి మనోజ్ కు జాబ్ లేని కారణంగా రోహిణి ఇరకాటంలో పడుతుంది. మనోజ్ పై బాలు పంచులు పేల్చుతుంటే.. రోహిణి సహించబోదు. బాలుపై తిరగబడుతుంది. దాంతో బాలు రెచ్చిపోతాడు. మధ్యలో ప్రభావతి కలుగజేసుకొని మనోజ్ కు నీతో మాటలు పడాల్సిన కర్మ ఏంటీ అంటూ బదులిస్తుంది. రోహిణి వాళ్ల నాన్నతో చెబితే మలేషియాలో ఉన్న బిజినెస్ లు అన్నీ మనోజ్ కే అప్పజెప్పుతారు అంటూ గొప్పలు చెబుతుంది.
దీంతో బాలుకు మండిపోతుంది. ముందు వాళ్ల పుట్టింటి నుంచి ఒక్కరంటే ఒక్కరినైనా వచ్చి మొహం చూపించమంటూ బాలు సవాల్ చేస్తాడు. దాంతో రోహిణి జంకుతుంది. తనకు మలేషియా తండ్రి లేడని చెబితే ఇంట్లో అవమానంగా ఉంటుందని భావిస్తుంది. అటు తిరిగి ఇటు తిరిగి సమస్య మొత్తం తన మీదకు వచ్చిందని వణికిపోతుంది. ఏం చేయాలో తెలియక ఆందోళన పడుతుంది. ఇదే సమయంలో ప్రభావతి స్పందిస్తూ... మలేషియాలోని మీ నాన్నను ఇంటికి పిలచి బాలు లాంటి వాళ్ల పొగరు దించాలని చెబుతుంది. దాంతో రోహిణి ఇంకా టెన్షన్ ఫీల్ అవుతుంది. లేని నాన్నను ఎక్కడి నుంచి తీసుకొని రావాలి అంటూ గందరగోళ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతుంది. ఎలాగైనా దీనికి పరిష్కార మార్గం చూపించాలంటూ ఆలోచిస్తుంది..
ఇక ఆ తర్వాత రోహిణి తనకు తండ్రి లేడని కుటుంబ సభ్యులతో ఒప్పుకుంటుందా? లేక మనోజ్ కు త్వరగా జాబ్ చూసి తన తండ్రి నుంచి దృష్టి మరల్చేలా ప్రయత్నాలు చేస్తుందా? లేక ఎప్పటిలాగే తన తండ్రి మలేషియాలో బిజీగా ఉన్నాడని ఇప్పట్లో ఆయన్ని కలవలేం అంటూ సాకులు చెబుతుందా? లేక పిలుస్తానని మాట ఇస్తుందా? తన తండ్రిలానే ఇంకెవ్వరినైనా తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు పరిచయం చేస్తుందా? అనేది వేచి చూడాలి. ప్రస్తుతం రోహిణిని తన మలేషియా తండ్రిని పిలిపించేంత వరకు బాలు ఊరుకునేలా లేరు. దాంతో రోహిణి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. తరువాయి ఎపిసోడ్ లో వీటన్నింటికి సమాధానాలు దొరకనున్నాయి.


Click it and Unblock the Notifications











