Gunde Ninda Gudi GantaluMarch 24th : రోహిణి గుండె ముక్కలు... ఊహించని షాకిచ్చిన మరిది బాలు

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక మార్చి 21వ తేదీ 384వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మౌనిక తాళి మార్చే ఫంక్షన్ ముగిసింది. అయితే ఈ ఫంక్షన్ ముగిసిన తర్వాత సత్యం ఇంట్లో మరో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ తెరపైకి వచ్చింది. మౌనిక తాళి మార్చే ఫంక్షన్ లో మీనాపై అత్త ప్రభావతి నిప్పులు కక్కిన విషయం తెలిసిందే. అది మనస్సులో పెట్టుకున్న బాలు ఇక ఇంట్లో వాళ్లందరినీ ఎప్పటిలాగే ఏకీపారేస్తుంటాడు. అంతే కాదు ఒక్కొక్కరి గతాన్ని తవ్వుతూ ఊపిరాడకుండా మాటాల తూటాలు పేల్చుతుంటాడు బాలు. దాంతో అందరూ నివ్వెరపోయి చూస్తారు. ఇక ఎదురు మాట్లాడిన అన్న మనోజ్ ను కూడా ఏకీపారేస్తాడు. జాబ్ లేనోడా, పార్క్ లో తిరిగేటోడా అంటూ తన నోటికొచ్చి మాటలతో ఆవేశాన్ని వెల్లగక్కుతాడు.

అయితే, తన భర్త మనోజ్ ను నానా మాటలు అంటున్నందుకు భార్య రోహిణి బాధపడుతుంది. తన భర్తను ఎందుకు జాబ్ లేదని అంటున్నావు? ప్రతి సారి అదే విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నావంటూ రోహిణి బాలుపై మండిపడుతుంది. తన భర్తకు సపోర్ట్ గా మాట్లాడుతుంది. దీంతో చిర్రెత్తిపోయిన బాలు తన మాటల ప్రవాహాన్ని పెంచుతాడు. ఈ క్రమంలోనే రోహిణికి ఊహించని షాక్ ఇచ్చి ఇరకాటంలో పడేస్తాడు. అసలు మీ ఇంట్లో వాళ్లను ఒక్కరినైనా పిలిచావా? దమ్ముంటే వారిని వచ్చి ఒకసారి కనిపించమను.. ఇక అంత కోపం తెచ్చుకునే నువ్వు.. మీ మలేషియా నాన్నతో చెప్పి బిజినెస్సో, జాబో పెట్టించొచ్చు కదా అంటూ ప్రశ్నిస్తాడు. దీంతో ఒక్కసారిగా రోహిణి కూడా తన నోరు మూసుకుంటుంది. సీన్ మొత్తం తనవైపు తిరిగిందని కంగారు పడుతుంది. బాలు అలా అనడంతో ప్రభావతి కూడా రోహిణిని తన తండ్రిని మలేషియా నుంచి పిలిపించు అని చెబుతుంది. బాలు నోరుమూయించాలంటే అదే సరైన మార్గమని కోడలు గురించి తెలియక మాట్లాడుతుంది. ఇక రోహిణి ఎప్పటి నుంచో ముదురుతున్న ఈ సమస్యకు ఎలాగైన పరిష్కారం చూపించాలని భావిస్తుంది.. ఆ తర్వాత ఏం జరిగిందనేది తరువాయి ఎపిసోడ్ కు వాయిదా పడింది. ఇక మార్చి 24వ తేదీ 385వ ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 385March 24th

మౌనికా తాళి మార్చే ఫంక్షన్ లో మీనా జాగ్రత్తగా లేదని తిట్టిన ప్రభావతికి శృతి అసలు విషయం చెబుతుంది. ఇక తన భార్యను నిందించడం, మరోవైపు తల్లి ప్రభావతి కూడా తిట్టడంతో బాలు ఫైర్ అవుతాడు. అసలు తన భార్యను ఎందుకు అంటున్నావని తల్లిని మందలిస్తాడు. దాంతో ప్రభావతి నోరుమూస్తుంది. ఇక చంద్రకాంతంలో అంత మార్పు ఎలా వచ్చిందని రవి, శృతిని అడుగుతాడు. దాంతో శృతి చంద్రకాంతాన్ని నానా బూతులు తిట్టి దారిలోకి తెచ్చానని చెబుతుంది. తన దొంగతనం వీడియోను చూపించి బయపెట్టానని, అందుకే తను చెప్పినట్టు వినిందని వివరిస్తుంది. మరి ఈ విషయం అప్పుడే చెప్పొచ్చు కదా అంటూ శృతిని అడుగుతాడు బాలు. దాంతో శృతి కోపం చేస్తుంది. మళ్లీ బాలు, సంజూ గొడవలు పెట్టుకుంటారనే చెప్పలేదని, అలాగే మౌనిక ఫంక్షన్ కూడా ఆగిపోయి బాధపడుతుందని చెప్పుకొస్తుంది. అందుకే తానే హ్యాండిల్ చేశానని బదులిస్తుంది.

ఇక శృతి, రోహిణిలకు మీనా థ్యాంక్స్ చెబుతుంది. తనపై పడ్డ నిందను తొలగించడమే కాకుండా, ఫంక్షన్ ను కూడా సజావుగా నడిపించినందుకు శృతికి థ్యాంక్స్ చెప్పింది. తనకు ఎంతగానో సపోర్ట్ ఇచ్చినందుకు రోహిణికి కూడా కృతజ్క్ష్తలు తెలియజేస్తుంది. ఇప్పుడు తనకు ఎంతగానో సంతోషంగా ఉందని చెబుతుంది. ఇక ముగ్గురు కోడళ్లు కలిసి పోవడంతో ప్రభావతి షాక్ అవుతుంది. వారు ముగ్గురు ప్రేమగా మాట్లాడటం చూసి నోటమాటరాకుండా అలాగే చూస్తు ఉంటుంది. ఇక బాలు మాటలతో మళ్లీ నార్మల్ అవుతుంది. ఇదిలా జరుగుతుండగానే.. సత్యంకు వాళ్ల అమ్మగారి నుంచి ఫోన్ వస్తుంది. సత్యం తల్లి సుశీలమ్మ ఉగాది అందరినీ ఆహ్వానిస్తూ ఫోన్ చేస్తుంది. దాంతో సత్యం చాలా సంతోషిస్తాడు. బాలు కూడా తన నానమ్మతో మాట్లాడి వస్తామని చెబుతాడు. కానీ ఇంట్లో వాళ్లందరూ ఒప్పుకోవాలి కదా అని నానమ్మతో అంటాడు.

నానమ్మ అక్కడ ఒంటిరితనంగా భావిస్తుందని, ఉగాదికి వెళ్లి వద్దామని బాలు తండ్రి సత్యంతో అంటాడు. ఇదే సమయంలో మనోజ్ తనకు వీలుకాదని చెబుతాడు. ఆ మాట విన్న బాలు చిర్రెత్తిపోతాడు. అవును నువ్వు లేకపోతే పార్కు బోసీపోతుంది, పల్లీల వ్యాపారం దెబ్బతింటుందని దెప్పిపొడుస్తాడు. ఈ శతాబ్దంలోనైనా నీకు జాబ్ వస్తుందో రాదోనని బాలు కించపరుస్తాడు. దాంతో రోహిణి మండిపడుతుంది. బాలు పదే పదే తన భర్తకు జాబ్ లేదని గుర్తు చేయడం ఎందుకని మామ సత్యంతో అంటుంది. దాంతో బాలు రెచ్చిపోతాడు. అంత కోపం వస్తే మలేషియాలో ఉన్న మీ నాన్నతో చెప్పి ఏదైనా జాబ్, ఏదైనా వ్యాపారం పెట్టించు అంటాడు బాలు. అసలు ఒక్కసారైనా రోహిణి పుట్టింటి వాళ్లు వచ్చారా? అని ప్రశ్నిస్తాడు. ఫస్ట్ వాళ్లను ఇంటికి రమ్మని చెప్పమంటాడు.

ఇక అత్త ప్రభావతి కూడా అవునని రోహిణితో అంటుంది. మనోజ్ జాబ్ నుంచి కథ తనవైపు తిరిగిందని తెలుసుకున్న రోహిణి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంటి టెర్రస్ పైకి వెళ్లి లేని తండ్రిని మలేషియా నుంచి ఎలా రప్పించాలంటూ ఆలోచిస్తుంది. ఈ సమస్యకు పరిష్కారం చూడాలని భావిస్తుంటుంది. ఈలోగా అత్త ప్రభావతి వచ్చి రోహిణితో మాట్లాడుతుంది. ఎందుకు టెన్షన్ పడుతున్నావమ్మ. మనోజ్ కు జాబ్ లేదని బాలు అన్న మాటలేం పట్టించుకోకు.. మైక్ లాగా వాడు ఎప్పుడూ గలగల మాట్లాడుతూనే ఉంటాడు.. నువ్వు అవన్నీ పట్టించుకోకని చెబుతుంది. కానీ అందరి నోర్లు మూయించాలంటే మాత్రం మీ నాన్న మలేషియా నుంచి పిలిపించి మనోజ్ కు జాబ్ పెట్టించు అని చెబుతుంది. మీ నాన్న మన ఇంటికొస్తే అన్ని సమస్యలు తీరిపోతాయని రోహిణితో అంటుంది.

మరోసారి అత్త ప్రభావతి తన తండ్రి గురించి అడగటంతో రోహిణి కంగారు పడుతుంది. వెంటనే దొంగ కన్నీళ్లు పెట్టుకుంటూ తనకు తల్లి లేదని, ఉంటే ఇప్పటికే ఎన్నోసార్లు తనను చూసేందుకు వచ్చేదని చెప్తుంది. తల్లి చనిపోయినప్పటికీ తండ్రి కూడా తనను చూసేందుకు ఏమాత్రం రావడం లేదని బాధపడట్టు నటిస్తుంది. అయినప్పటికీ ప్రభావతి వదలిపెట్టదు. గతంలో జరిగినవి తలుచుకుంటూ ఉంటే ఎలా రోహిణి ఇప్పుడు రోజులు మారాయి. మీ నాన్నతో ఒక్కసారి మాట్లాడుతూ అన్ని సెట్ అవుతాయని సూచిస్తుంది. ఇప్పటికే మాట్లాడానని ఆయన బిజినెస్ పని మీద జర్మన్ కు వెళ్లారని అత్తతో చెబుతుంది. దాంతో ప్రభావతి మీ మామయ్యనైనా పిలిపించూ అంటూ సలహా ఇస్తుంది. దాంతో రోహిణి సరేనని చెబుతుంది. ఇక ఈ విషయాన్ని అంతా తన స్నేహితురాలు దివ్యకు వివరిస్తుంది. ఆమె సలహా మేరకు ఓ జూ.ఆర్టిస్ట్ ను తన మామ పాత్రలో నటించడానికి ఏర్పాట్లు చేస్తారు. అయితే రిచ్ లుక్ కోసమని రోహిణి ఫైనాన్షియర్ దగ్గర రూ.లక్ష అప్పు తీసుకుంటుంది. ఆ విషయాన్ని బాలు స్నేహితుడు చూస్తాడు. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది... ఇక జూ.ఆర్టిస్ట్ నే తన మామగా రోహిణి ఇంట్లో పరిచయం చేస్తుందా.. లేదా? బాలుకు రోహిణి అప్పుతీసుకున్న సంగతిని తన స్నేహితుడు చెబుతాడా? లేదా? అన్న విషయాన్ని తరువాయి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X