Gunde Ninda Gudi GantaluMarch 25th : రోహిణి కొత్త నాటకం.. అన్ని దారులు మూసేసిన బాలు

గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక మార్చి 24వ తేదీ 385వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మౌనిక తాళి మార్చే ఫంక్షన్ ముగిసింది. ఇక ఇప్పుడు మళ్లీ బాలు ఇంట్లో కొత్త సమస్య మొదలైంది. మనోజ్ కు జాబ్ లేకపోవడంతో బాలు నానా మాటలు అంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఆయన భార్య రోహిణి కూడా తనకు లేని తండ్రిని ఉన్నాడని చెప్పి, మలేషియాలో తన తండ్రి బిజినెస్ చేస్తాడని నమ్మించి గతంలో మనోజ్ ను పెళ్లి చేసుకుంది.

అయితే ఇప్పుడు మనోజ్ కు జాబ్ లేదు అంటూ బాలు ఘోరంగా అవమానిస్తుండడంతో అత్త ప్రభావతి అవమానంగా భావిస్తుంది. దీంతో కోడలు రోహిణి తో తన మలేషియా తండ్రిని ఒకసారి తిరిగి ఇండియాకు రమ్మనమని చెబుతుంది. దీంతో రోహిణి అనుకోని చిక్కుల్లో ఇరుక్కుపోతుంది. లేని తండ్రిని ఎక్కడినుంచి తీసుకురావాలంటూ లోలోపల కంగారు పడుతుంది. ఇక అత్త ప్రభావతికి ఏదో ఒక సమాధానం చెప్పాలి కాబట్టి మరొక అబద్ధం ఆడుతుంది. తన తండ్రితో ఇప్పటికే మాట్లాడానని ఇప్పట్లో రావడం కుదరదని చెబుతుంది. జర్మనీలో మరో బిజినెస్ పని కోసం బిజీగా ఉన్నారు అంటూ సాగు చెబుతుంది. దీంతో అత్త ప్రభావతి అయితేనేం మీ మామయ్యను పిలిపించి బాలు నోరు మూయించు అని సలహా ఇస్తుంది.ఇక ఇప్పటికే ఎన్నో అబద్ధాలు ఆడిన రోహిణి అన్ని దారులు మూసుకుపోవడంతో సరేనని బదిలిస్తుంది. ఇక ఈ విషయాన్ని వెంటనే తన స్నేహితురాలు దివ్యతో చెబుతుంది. దివ్య సలహా మేరకు రోహిణి ఒక జూనియర్ ఆర్టిస్టును తన మేనమామగా నటించేందుకు ఏర్పాటు చేస్తుంది. ఇక అతను చూడడానికి బిజినెస్ మాన్ ల కనిపించకపోవడంతో రోహిణి అతను సెట్ కాడని భావిస్తుంది. కానీ దివ్య మాత్రం అతను బాగానే పెర్ఫాం చేస్తాడని, తన మేనమామగా అద్భుతంగా నటించి ఇంట్లో వాళ్లకి ఎలాంటి అనుమానం రాకుండా చూసుకుంటాడని హామీ ఇస్తుంది. అయినా రోహిణి కి నమ్మకం కుదరదు... ఆ తర్వాత ఏం జరిగిందనేది తరువాయి ఎపిసోడ్ కి వాయిదా పడింది. ఇక మార్చి 25వ తేదీ 386వ ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 386March 25th 2025 here is full story

జూనియర్ ఆర్టిస్ట్ అత్యుత్సాహంతో రోహిణికి నమ్మకం కలగదు. కానీ తన స్నేహితురాలు నమ్మకం కల్పిస్తుంది. అతను బాగానే చేస్తాడని రోహిణికి చెబుతుంది. కానీ అతనేమో తన అతి నటనను, అతి ప్రద్శనను చూపిస్తాడు. మరోవైపు అతను ఇంతకీ షూటింగ్ ఎక్కడ? ఏ సినిమా? అంటూ అడుగుతాడు. దానికి రోహిణి స్నేహితురాలు స్పందిస్తుంది. రాజమౌళి - మహేశ్ బాబు సినిమా అని, షూటింగ్ మలేషియాలో ఉంటుందని అబద్ధం చెబుతుంది. అయితే అందుకు ముందుగా ఆడిషన్ ఉంటుందని, ఇది చాలా రహస్యంగా జరుగుతుందని చెబుతుంది అతని.. నువ్వు ఈమెకు మేనకోడలిగా నటించాలని రోహిణిని చూపిస్తుంది. మలేషియా బిజినెస్ మెన్ గా నటించాలని, రిహార్సల్ కోసమని రోహిణికి మేనమామగా నటించాలని చెబుతుంది. ఇదేదో దొంగపనిలా ఉందని అతను గుర్తిస్తాడు. కానీ రోహిణి స్నేహితులురాలు అక్కడ సీసీ కెమరాలతో షూట్ జరుగుతుందని, చాలా సీక్రెట్ గా రిహార్సల్ జరుగుతుందని, రాజమౌళినే స్వయంగా ఆడిషన్ చూస్తారని చెబుతారు. ఎలాగో ఒప్పకుంటాడు.

ఇక మరోవైపు మీనా బాలు మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. పూలకొట్టు వద్ద భార్యతో బాలు సన్నిహితంగా ఉంటాడు. మీనాను 800 అప్పు అడుగుతాడు. మీనా వెంటనే తీసి ఇస్తుంది. అడగ్గానే ఇచ్చినందుకు మీనాకు బాలు ముద్దు పెడ్తాడు. దీంతో మీనా సంతోషంగా తిరిగి భర్త బాలుకు ముద్దుపెడుతుంది. ఈలోగా మీనా తమ్ముడు శివ పూల కొట్టు వద్దకు బైక్ పై వస్తాడు. శివాను బైక్ పై చూసిన బాలు, మీనా షాక్ అవుతారు. వేరే వాళ్ల బైక్ పై తిరిగితే బాగుండదని వార్నింగ్ ఇస్తారు. కానీ శివ తన అక్క మీనాకు ఊహించని షాక్ ఇస్తాడు. తాకట్టులో ఉన్న తన నాలుగు బంగారు గాజులను తీసుకొని వస్తాడు. తీసుకో అక్కా.. అంటూ ఇస్తాడు. కానీ మీనా తీసుకోదు.

నువ్వు చదువుకోమంటే మళ్లీ ఎక్కడ పనికి కుదిరావు అంటూ మందిలిస్తుంది. పార్ట్ టైమ్ జామ్ చేసి వచ్చిన డబ్బులతోనే గాజులు విడిపించానని చెబుతాడు. ఇక మీనా తీసుకోకపోగా తమ్ముడు శివ ఎలాంటి పనులు చేస్తున్నాడోనని మందలిస్తుంది. వెంటనే ఆ గాజులు అక్కడ ఇచ్చేసి తిరిగి డబ్బు తీసుకొని మని చెబుతుంది. ఆ డబ్బుతో బుద్ధిగా చదువుకోమని సూచిస్తుంది. దాంతో శివ తిరిగి తను పనిచేస్తున్న గుణ ఫైనాన్స్ ఆఫీస్ కు వెళ్తాడు. ఇక అక్కడి బాలు స్నేహితుడు రాజేష్ వస్తాడు. శివాను చూసి షాక్ అవుతాడు. మరోవైపు రోహిణి కూడా గుణ ఫైనాన్స్ ఆఫీస్ కు వస్తుంది. గతంలోనే వచ్చి అప్పు తీసుకున్న రోహిణి మళ్లీ ఫైనాన్స్ కోసం రావడం గమనిస్తాడు. ముందుగా రోహిణికి కనిపించకుండా పక్కకు వెళ్తాడు.

ఇక రోహిణికి తన మేనమామ పాత్రకు సంబంధించిన బట్టలు, బంగారం, సారె తదితరులు కొనుగులు చేసేందుకు లక్షల రూపాయలు అవసరం అవుతాయి. దీంతో అప్పుకోసమని గుణ ఫైనాన్స్ ఆఫీస్ వస్తుంది. 1లక్ష అప్పుతీసుకొని వెళ్తుంది. ఇక శివాకు రోహిణి అప్పుతీసుకున్న సంగతి తెలిసిపోతుంది. ఆమెకే పార్లర్ ఉంది, ఆమెకు అప్పు చేయాల్సిన అవసరం ఏంటని సందేహిస్తాడు. ఇక రోహిణికి అప్పు ఇస్తే మాత్రం తను వెళ్లి వసూల్ చేయలేనని బదులిస్తాడు..... మరోవైపు రోహిణిని తన మేనమామ వస్తున్నాడా అంటూ అత్త ప్రభావతి అడుగుతుంది. అందుకు రోహిణి అవును అత్తమ్మ వస్తున్నాడు. ఇందాకనే ఫోన్ లో మాట్లాడాను. బస్ ఎక్కివస్తున్నాడని బదులిస్తుంది. దీంతో బాలు మలేషియా నుంచి మన ఊరికి బస్సులు ఉన్నాయా? అని ప్రశ్నిస్తాడు. ఇప్పటికే రోహిణిని ఇరకాటంలో పెట్టిన బాలుకు రోహిణిపై పూర్తిగా డౌట్ వస్తుంది. అసలు ఆమెకు మేనమామ ఉన్నాడా? లేడా? అతను వస్తున్నాడా? లేడా? అనే విషయాలు తెలుసుకోవాలని తలుస్తాడు. రేపటి ఎపిసోడ్ లో వీటికి సమాధానాలు దొరకనున్నాయి. . . .

Take a Poll

More from Filmibeat

Read more about: gunde ninda gudi gantalu balu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X