Gunde Ninda Gudi GantaluMarch 26th : మేనమామను దింపిన రోహిణి.. బాలు సందేహంతో కొత్త మలుపు

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక మార్చి 25వ తేదీ 386వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బాలు ఇంట్లో కొత్త సమస్య మొదలైంది. మనోజ్ కు జాబ్ లేకపోవడంతో బాలు పంచుల వర్షం కురిపిస్తాడు. దీంతో భార్య రోహిణి మనోజ్ కు మద్దతుగా మాట్లాడుతుంది. కానీ తనే ఇరుక్కుపోతోంది. మనోజ్ కు ఏదైనా జాబ్ లేదా, బిజినెస్ పెట్టించు అని, అందుకు తన మలేషియా తండ్రిని పిలిపించు అని అత్త ప్రభావతి అంటుంది. తండ్రి జర్మనీ బిజినెస్ పనిలో బిజీగా ఉన్నారని రోహిణి చెప్పడంతో కనీసం మేనమామనైనా మలేషియా నుంచి రప్పించు అని ఒత్తిడి పెంచుతుంది. అన్ని దారులు మూసుకుపోవడంతో సరేనని ఒప్పుకుంటుంది.

ఇక ఒక జూనియర్ ఆరిస్ట్ ను తన మేనమామ పాత్రలో నటించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. తన స్నేహితురాలి సాయంతో లక్ష రూపాయల అప్పు తీసుకొని అందుకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమై ఉంటుంది. ఇక, ఇంట్లో అత్త ప్రభావతి తన మేనమామ గురించి మళ్లీ అడుగుతుంది. దాంతో రోహిణి బయల్దేరారు అత్తయ్య అని బదులిస్తుంది. బస్సెక్కాడని చెబుతుంది. మలేషియా నుంచి మన ఊరికి నేరుగా బస్సు ఉందా? అని బాలు ప్రశ్నిస్తాడు. దానికి ఎయిర్ బస్ అంటూ బదులిస్తారు. దీంతో బాలుకు సందేహం వస్తుంది. అసలు రోహిణికి మేనమామ ఉన్నాడా? లేడా? అనే విషయాలను తెలుసుకోవాలని ఆలోచిస్తాడు. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక మార్చి 26వ తేదీ 387వ ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 387March 26th

మీనాకు బాలు కొత్త చీర కొనిస్తాడు. తనపై ఉన్న ప్రేమను మాటల కవిత్వంతో వినిపిస్తాడు. ఇక తన భర్తకు మీనా ముద్దుల వర్షం కురిపిస్తుంది. దాంతో బాలు ఉప్పొంగిపోతాడు. వీరిద్దరూ ఇలా ప్రేమలో మునిగి తేలుతుండగా.. మరోవైపు రోహిణి తన మలేషియా మామను ఇంటికి తీసుకొచ్చేందుకు నానా తంటాలు పడుతుంది. అత్త ప్రభావతికి ఇచ్చిన మాట కోసం మలేషియా మమాగా మటన్ కొట్టు వ్యాపారిని నటించమని అడుగుతారు. దానికి అతను ఒప్పకుంటాడు. ఇక అతనికి సగసగం యాక్టింగ్ రావడంతో కాస్తా కంగారు పడుతుంది. అయినా వేరే ఆప్షన్ లేకపోవడంతో అతనినే ఫైనల్ చేస్తారు.

ఇక మలేషియా క్యారెక్టర్ కు సంబంధించిన పాత్రను అతనికి వివరిస్తుంది రోహిణి. ఇంట్లో తన భర్త పాత్ర అంటూ మనోజ్ ను, విలన్ పాత్ర అంటూ బాలును పరిచయం చేస్తుంది. ఇక చీర, డ్రెస్ తీసుకొచ్చి అతనికి ఇస్తుంది. అలాగే బ్రేస్ లెట్ కూడా ఇచ్చి వాటిని తన భర్త పాత్రకు అందించాలని చెబుతుంది. దాంతో నాటకంలో కూడా రియల్ బట్టలు, రియల్ గోల్డ్ పెడ్తారా? అని సందేహిస్తాడు. రాజమౌళి సినిమా కదా అని రోహిణి స్నేహితురాలు చెబుతుంది. మలేషియా వ్యక్తిలాగానే నటించాలని ఎక్కడ కూడా అనుమానం రాకూడదని సూచిస్తుంది.

ఇక తిరిగి ఇంటికి వచ్చే సరికి భర్త మనోజ్, అత్త ప్రభావతి రోహిణి కోసం ఎదురుచూస్తూ ఉంటారు. రోహిణి ఫోన్ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో కంగారు పడుతారు. రోహిణి పని చూసుకుని రాగానే.. ఎటు వెళ్లావని అడుగుతారు. వేరే పనిలో ఉండిలిఫ్ట్ చేయలేదని చెబుతుంది. ఇక అత్త ప్రభావతి వెంటనే తన తండ్రి మలేషియా నుంచి వస్తున్నాడా? అని అడుగుతుంది. అందుకు మీనా నాన్న రావడం లేదు అని బదులిస్తుంది. కానీ తన మేనమామను పంపిస్తున్నారని చెబుతుంది. తన తండ్రి బిజినినెస్ పనిలో లండన్ వెళ్లారని చెప్తుంది. ఆ మాటలు విన్న సత్యం నిన్న జర్మనీ అని చెప్పావు కదా అంటూ రోహిణిని ప్రశ్నిస్తాడు.

అయితే, వెంటనే రోహిణి లండన్ టు జర్మనీ బిజినెస్ పని కోసం తిరుగుతూ ఉంటున్నారని చెబుతుంది. అప్పటికే సత్యం సందేహం వ్యక్తం చేస్తుంటారు. కానీ రోహిణి వాళ్ల మేనమామ బయల్దేరాడని, బస్సు ఎక్కడాని చెప్పడంతో పోనీలే అని వదిలేస్తాడు సత్యం. ఇక బాలు స్పందిస్తూ బస్సు ఎక్కడం ఏంటీ? మలేషియా నుంచి రాజమండ్రికి బస్సు ఉందా? అంటూ ప్రశ్నిస్తాడు. అందుకు మనోజ్ స్పందిస్తూ బస్ అంటే ఎయిర్ బస్ అర్థమని వివరిస్తాడు. ఏమేలే మొదటి సారి రోహిణి పుట్టింటి నుంచి ఒకరు వస్తున్నారంటూ బాలు సైలెంట్ అవుతాడు.

ఇక సత్యం వాళ్ల అమ్మగారు, బాలు నానమ్మ ఇప్పటికే ఉగాదికి ఊరికి రమ్మని పిలవడంతో అందరూ రెడీ అయ్య వెళ్లేందుకు సిద్ధమవుతారు. ఇక రోహిణి వాళ్ల మామయ్య కూడా నేరుగా ఊరికే వస్తానని చెప్పాడని ఇంట్లో వాళ్లకు తెలియజేస్తుంది. అన్నీ సర్దుకొని వెళ్లేసమయంలో శృతి షాక్ ఇస్తుంది. శృతి, రవి ఇంకా కిందికి దిగకపోవడంతో అత్త ప్రభావతి కంగారు పడుతుంది. ఏమౌతుందోనని వారి గది వరకు వెళ్లి పిలిచే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే గదిలోంచి శృతి బిగ్గరగా అరిచే మాటలు వినిపిస్తూ ఉంటాయి. దాంతో ప్రభావతి పిలవడం ఆపేసి శృతి మాటలు వింటూ ఉంటుంది.

శృతి, రవితో తనకు విలేజ్ వెళ్లడం అస్సలు నచ్చడం లేదని చెబుతుంది. అన్ని ఊర్లలోలాగనే ఆ ఊరుకూడా ఉంటుంది కదా? ఇప్పుడు మనం వెళ్లి అక్కడ చేసేది ఏముందని తన అయిష్టాన్ని తెలియజేస్తుంది. పైగా తనకు పెండింగ్ సీరియల్స్ కు డబ్బింగ్ చెప్పాల్సి ఉందని చెబుతుంది. దాని వల్ల తను విలేజ్ కు రాలేకపోతున్నానని రవితో చెబుతుంది. కానీ రవి మాత్రం శృతికి విలేజ్ గురించి, తన నానమ్మ గురించి గొప్పగా వివరిస్తాడు. అక్కడ ఎలాంటి లోటు జరగదని, పనిలో మునిగిపోతే అన్ని బాగుంటాయని నచ్చజెప్తాడు... ఈ క్రమంలోనే ఎపిసోడ్ ముగుస్తుంది.

ప్రొమోలో చూపించిన ప్రకారం.. కుటుంబ సమేతంగా నానమ్మ గారికి ఇంటికి వెళ్తారు. అక్కడ నానమ్మను చూడగానే బాలు సంతోషంతో ఆమెను ఎత్తుకొని గాల్లో తిప్పుతాడు. మరోవైపు చమత్కారంగా మాట్లాడుతూ తన నానమ్మను నవ్విస్తాడు. ఇక అందరూ రావడంతో సుశీలమ్మ సంతోషపడుతుంది. మరోవైపు రోహిణి గుండెల్లో మాత్రం రైల్లు పరిగెడుతూ ఉంటాయి. తన మలేషియా మామయ్య ఇంకెప్పుడు వస్తాడా? అంటూ ఎదురుచూస్తుంది. పక్కకు వెళ్లి జూ.ఆర్టిస్ట్ కు ఫోన్ చేస్తుంది. త్వరగా రమ్మని ఫోన్ లో చెబుతుంది. ఆ సంగతి బాలు కంటపడుతుంది. ఏదో సీక్రెట్ గా ఫోన్ మాట్లాడుతుంది అంటూ గమనించే ప్రయత్నం చేస్తాడు. అంతటి తో ఎపిసోడ్ ముగ్గుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.

Take a Poll

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X