Gunde Ninda Gudi GantaluMarch 27th : నానా తంటాలు పడుతున్న రోహిణి.. నిజం కక్కించే పనిలో బాలు

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక మార్చి 26వ తేదీ 387వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రోహిణి గుట్టు రట్టయ్యే పరిస్థితి నెలకొంది. తనకు మలేషియా తండ్రి లేకున్నా ఉన్నాడని చెప్పి మరీ మనోజ్ కు రోహిణి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ గా సత్యం ఇంట్లో మౌనిక తాళి మార్చే ఫంక్షన్ జరిగింది. పుట్టింటి నుంచి మౌనికకు సకల మర్యాదలు చేసి సంతోషంగా పంపించారు. అయితే ఇప్పుడు సీన్ మొత్తం రోహిణి వైపు తిరిగింది. పెళ్లై ఇన్నాళ్లైనా తన పుట్టింటి నుంచి కనీసం ఒక్కరు కూడా చూడటానికి రాలేదని బాలు వాదన లెవనెత్తుతాడు. దీంతో రోహిణి పరిస్థితి ఇరకాటంలో పడుతుంది.

కాగా, అత్త ప్రభావతి కూడా రోహిణి పుట్టింటి నుంచి తన మలేషియా తండ్రినైనా, అదే మలేషియాలో ఉంటున్న తన మేనమామనైనా తీసుకొని రావాలని సూచిస్తుంది. ఓవైపు మనోజ్ కు కూడా జాబ్ లేకపోవడంతో వారిని పిలిపించి జాబ్ లేదా బిజినెస్ పెట్టి ఇంట్లో పరువు కాపాడుకోమని అత్త ప్రభావతి కోడలు రోహిణికి సలహానిస్తుంది. ఇక ఇప్పటికే ఎన్నో మార్లు అబద్ధాలు చెప్పిన రోహిణి ఈసారి మాత్రం తన తండ్రి రాలేడని, జర్మనీలో బిజినెస్ పనుల్లో బిజీగా ఉన్నాడని చెబుతుంది. మామయ్యను పంపిస్తున్నాడని అబద్ధం చెబుతుంది. తన మేనమామగా నటించేందుకు ఒక జూనియర్ ఆర్టిస్ట్ ను ఏర్పాటు చేస్తుంది. ఇక ప్రస్తుతం ఉగాది కోసమని సత్యం కుటుంబ సమేతంగా తన తల్లిగారి ఇల్లు సుశీలమ్మ దగ్గరకు వెళ్తారు. అక్కడికే రోహిణి మేనమామ కూడా వస్తాడని చెబుతుంది... ఇక ఆ జూనియర్ ఆర్టిస్ట్ నే తన పుట్టింటి వారని రోహిణి ఎలా నమ్మిస్తుందోననేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక మార్చి 27వ తేదీ 388వ ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 388March 27th

అయితే ఉగాది పండగ కోసమని సత్యం కుటుంబ సభ్యులంతా సుశీలమ్మ ఇంటికి వెళ్లాలని అందరూ రెడీ అవుతారు. కానీ శృతి మాత్రం తనకు వీలు కావట్లేదని రవితో చెబుతుంది. తనకు డబ్బింగ్ పని ఉందని, పైగా తను పల్లెటూరులో అడ్జస్ట్ కాలేనని అంటుంది. కానీ రవి ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. శృతి, రవిలను పిలిచేందుకు వాళ్ల రూమ్ దగ్గరకు వెళ్లుంది. ఇక శృతి నేను రాను అని, ఈ నాలుగు రోజులు తన పుట్టీంటికి వెళ్లానని రవితో చెప్పడాన్ని వింటుంది. దీంతో వెంటనే ప్రభావతి కలుగచేసుకొని అలా ఒక్కదానివే భర్త లేకుండా పుట్టింటికి వెళ్లకూడదని చెబుతుంది. పెళ్లైన తర్వాత తప్పకుండా ఇద్దరూ కలిసే వెళ్లాలని సూచిస్తుంది. దాంతో శృతి కూడా చేసేది ఏమీ లేక సరేనని ఒప్పుకుంటంది.

ఇక అందరూ తమ అమ్మవాళ్ల ఇంటికి బయల్దేరుతారు. ఈ క్రమంలో బాలు తన కుటుంబ సభ్యులతో చాలా ఫన్నీగా మాట్లాడుతూ ఉంటాడు. తల్లి ప్రభావతి, అన్న మనోజ్ పై పంచులు కురిపిస్తాడు. దాంతో వారు కూడా బాలుకు కౌంటర్ లు ఇస్తారు. అయితే బాలు తన నానమ్మ వాళ్ల ఇంటికి వెళ్తున్న సందర్భంగా తమ పూలకొట్టును మూసేస్తాడు. అందుకని ప్రభావతి పూలకొట్టు లేదు.. వారం దాకా రాదు.. అని బోర్డు రాసి పెడ్తాడు. ఆ బోర్డును చూసి ప్రభావతి షాక్ అవుతుంది. నా పేరు పెద్దగా కనిపించేలా ఆ బోర్డు ఎందుకు పెట్టావు అని కొడుకు బాలును తల్లి ప్రభావతి అడుగుతుంది. దాంతో బాలు ఫన్నీగా బదులిస్తాడు. ఇది నీపేరు కాదు ప్రభావతమ్మ.. మా కొట్టు పేరు రాసుకున్నామని చెబుతారు. దాంతో ప్రభావతి భలే గొప్ప సమాధానం చెప్పావులే అంటూ చూస్తుంది. ఇక బాలు, ప్రభావతి మధ్య మాటలను వింటూ సత్యం నవ్వుకుంటూ ఉంటాడు.

అందరూ తమ సొంత గ్రామం పసర్లపూడి, నానమ్మ సుశీలమ్మ ఉండే ఇంటికి అన్ని బ్యాగులు సర్దుకొని బయల్దేరుతారు. ఇక బాలు కారులో కూర్చొవడానికి రోహిణి, శృతి అస్సలు సాయం చేయదు. పైగా మలేషియా నుంచి తన మేనమామ వస్తున్నాడని బాలు ఇలాగే మాట్లాడితే ఎలా అని రోహిణి మామ సత్యంతో అంటుంది. దాంతో సత్యం, ప్రభావతినే బాలు కారులో కూర్చొని వెళ్తారు. రవి, శృతి, రోహిణి, మనోజ్ తో పాటు బాలు స్నేహితుడు రాజేష్ కూడా మరో కారులో గ్రామానికి బయల్దేరుతారు. ఇక బాలు కారులో ప్రభావతి మీనాపై మండిపడుతూ ఉంటుంది. మీనా పల్లెటూరు వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఆ విషయాలన్ని తన భర్త బాలుతో చెప్పుకుంటూ సంతోషపడుతుంది. కానీ ప్రభావతి ఏదోకటి దెప్పిపోడుస్తూనే ఉంటుంది. అందుకు బాలు కూడా తిరిగి ప్రభావతిపై కౌంటర్ వేస్తాడు.

మరోవైపు మరో కారులో శృతి రవిపై ఫైర్ అవుతూ ఉంటుంది. పల్లెటూరు సిటీ కంటే చాలా బాగుటుందని చెప్పిన రవిపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. అసలు సినిమాల్లో చూపించినట్టుగా వాటర్ ఫాల్స్, గుట్టలు, ఎత్తైన చెట్లు లేవేంటని రవిని ప్రశ్నిస్తుంది శృతి. వాటర్ ఫాల్స్ ఇక్కడెందుకు ఉంటుంది.. కనీసం పల్లెటూరిలో ఏసీ, రిఫ్రిజిరేటర్ కూడా ఉండవని మనోజ్ బదులిస్తాడు. దాంతో శృతి ఇంక బయపడి పోతుంది. తనకు ఏమాత్రం అసౌకర్యంగా అనిపించినా వెంటనే దగ్గరల్లోని టౌన్ కు వెళ్లి రూమ్ తీసుకుంటానని రవిని హెచ్చరిస్తుంది. అలా ఏముండదని చాలా బాగుంటుందని రవి నచ్చచెబుతాడు.

మరోవైపు రోహిణి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పటికే తన మలేషియా మామయ్యలా నటించేందుకు ఓ జూనియర్ ఆర్టిస్ట్ ను ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. దాంతో అతను ఎలా నటించి తన మెట్టింటి వారిని ఒప్పుస్తాడోనని చెబుతుంది. రోహిణి అదే ఆలోచనలో ఉండగా.. మనోజ్ ఏమైంది నీకు ఎందుకు డల్ గా ఉన్నావంటూ ప్రశ్నిస్తాడు. అందుకు రోహిణి అదేం లేదు అని బదులు ఇస్తుంది. అంత నార్మల్ అని చెప్పడంతో మనోజ్ కూడా లైట్ తీసుకుంటాడు.

మరోవైపు కారు తన సొంత ఊర్లోకి వెళ్లడంతో సత్యం ఎంతో సంతోషిస్తాడు. అన్నీ విషయాలను తన కొడుకు బాలుతో చెప్పుకుంటూ చిన్న నాటి మెమోరీస్ ను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక ఊర్లోకి ఎంట్రీ ఇవ్వగానే తన స్నేహితుడు ఒకరు కనిపించడంతో వెంటనే బాలును కారు ఆపమని అడుగుతాడు. అతని వద్దకు వెళ్లి ఓరేయ్ గుర్గుపట్టావా అని అడుగుతాడు. ఈ సమయంలో సత్యం ను గుర్తుపట్టి మరొక స్నేహితుడు మాట్లాడుతాడు. మంచి చెడ్డ మాట్లాడుకుంటారు. ఈలోగా మనోజ్ వాళ్ల కారు కూడా వస్తుంది. దీంతో మొత్తం కుటుంబాన్ని తన స్నేహితులకు పరిచయం చేస్తాడు సత్యం. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రోహిణికి మేనమామ ఎంట్రీ ఇంకా ఇవ్వాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X