Gunde Ninda Gudi GantaluMarch 28th : సొంతూర్లో సంతోషంగా సత్యం.. ఆగమగం అవుతున్న రోహిణి

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక మార్చి 27వ తేదీ 388వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రోహిణి గుట్టు రట్టు చేసేందుకు బాలు అప్రేయంగా ప్రయత్నిస్తూ ఉంటాడు. మౌనిక తాళి మార్చే ఫంక్షన్ ముగియడంతోనే ఇప్పుడు ఫోకస్ మొత్తం రోహిణిపైకి షిష్ట్ అయ్యింది. ఆమె పుట్టింటి నుంచి ఒక్కరైనా ఇప్పటి వరకు ఈ ఇంటి గుమ్మం తొక్కలేదంటూ బాలు కుటుంబ సభ్యుల ముందే అవమానిస్తాడు. ఓవైపు మనోజ్ కు కూడా బాలు లేకపోవడంతో తన మలేషియా తండ్రికి లేదంటే మలేషియాలో ఉంటున్న మేనమామకు చెప్పి ఇప్పించమని అత్త ప్రభావతి సలహా ఇస్తుంది.

అయితే, రోహిణికి మలేషియా తండ్రి గానీ, మేమమామ గానీ లేకపోవడం గమనార్హం. మనోజ్ ను పెళ్లి చేసుకునే ముందు మలేషియా బ్యాక్ గ్రౌండ్ పేరు చెప్పుకొని వివాహం చేసుకుంది. ఇప్పుడు చిక్కుల్లో పడింది. ఎలాగైనా తన తండ్రిని మలేషియా నుంచి తీసుకొని రావాలంటూ ఓవైపు ప్రభావతి, మరోవైపు బాలు ఒత్తిడి పెంచుతూ ఉంటారు. అయితే రోహిణి గుట్టురట్టు కాకుండా ఓ జూనియర్ ఆర్టిస్ట్ ను తన మేనమామగా నటించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం మాత్రం కుటుంబ సమేతంగా సత్యం సొంత గ్రామంలోని తన తల్లి సుశీలమ్మ వద్దకు వెళ్తాడు. అక్కడికే తన మలేషియా మామయ్య వస్తాడని రోహిణి చెబుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేని ఆసక్తికరంగా మారింది. ఇక మార్చి 28వ తేదీ 389వ ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 389March 28th

ఉగాది పండగ కోసమని కొన్నేళ్ల తర్వాత సొంతూరికి వెళ్లిన సత్యం, తన కుటుంబ సభ్యులను ఊర్లో వారికి పరిచయం చేస్తాడు. తన చిన్ననాటి స్నేహితులతో స్వీట్ మెమోరీస్ ను కూడా గుర్తు చేసుకుంటారు. ఊర్లోని వీధులన్నీ తిరుగుతూ తమ సొంత ఇంటికి చేరుకుంటారు. ఇక అప్పటికే సత్యం వాళ్ల తల్లిగారు, బాలు నానమ్మ సుశీల వారి రాకకోసం ఎంతగానో ఎదురుచూస్తుంది. ఇక నానమ్మను చూసి ఆనందంలో బాలు వెళ్లి సుశీలమ్మను ఎత్తుకొని గిరా గిరా తిప్పేస్తాడు. నానమ్మ మంచి చెడుల గురించి తెలుసుకుంటాడు. ఇక సుశీలమ్మ కూడా మనవడు బాలుతో చమత్కారంగా మాట్లాడుతుంది. మరోవైపు తన మనవళ్లు, మనవరాళ్లను, కొడుకును మందలిస్తుంది. తన కోడలు ప్రభావతిని కూడా పలకరించి ఇంట్లోకి తీసుకెళ్తుంది.

ఇక సుశీలమ్మ ఇంట్లోకి వెళ్లగానే తన మనవాళ్లును కళ్లారా చూసుకుంటుంది. ఒక్కొక్కరిని పలకరిస్తూ తమ మంచి చెడులను తెలుసుకుంటూ ఉంటుంది. కొత్త పెళ్లి చేసుకున్న శృతి, రవిలు నానమ్మ కాళ్లకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. నాయనమ్మ వాళ్లను నిండు మనస్సుతో దీవించి, మంచి జరగాలని ఆకాంక్షిస్తుంది. ఇక పిల్లలు అందరూ ఇంటికి వస్తారని ముందుగానే పిండి వంటలన్నీ దండిగా చేయిస్తుంది. ముందుగా మనిషికో లడ్డును ఇచ్చి పల్లెటూరి రుచులను చూపిస్తుంది.

అయితే శృతి పల్లెటూరికి వచ్చే సమయంలో ఎంతో భయపడ్డ సంగతి తెలిసిందే. ఇక ఊర్లోకి ఎంట్రీ ఇవ్వగానే పేడపైన కాలుపడి ఇబ్బందిగా ఫీలవుతుంది. కానీ సుశీలమ్మ శృతిని మంచిగా చూసుకోవడం కాస్తా రిలాక్స్ అవుతుంది. ఇక సుశీలమ్మ ఇచ్చిన లడ్డు తిన్నాక ఆ ఇల్లు తనకు ఎంతో బాగా నచ్చుతుంది. అయితే సుశీలమ్మ శృతికి రవి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెబుతుంది. అతని రవి అని పెట్టడానికి ఓ రీజన్ ఉందని చెప్పుకొస్తుంది.

ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తుంటేనే పట్టాడని అందుకని రవిగా నామకరణం చేసినట్టు చెప్పింది. ఇక బాలుకు మాత్రం తన తాత పేరునే తీసుకొచ్చి పెట్టానని చెప్పింది. మరోవైపు మనోజ్ కు మాత్రం తల్లి ప్రభావతినే నామకరణం చేసినట్టు చెబుతుంది. ఇక ఇలా పరిచయం కార్యక్రమాలు, పలకరింపులు ముగిశాక ప్రభావతి తన ఇద్దరు కొడుకులు రవి -శృతి, మనోజ్ - రోహిణిలకు చెరో రూమ్ చూపించి మీరు అందులో ఉండండి అంటూ చెబుతుంది.

కానీ బాలు - రోహిణికి మాత్రం రూమ్ లేదని చెప్పకనే చెబుతుంది. దాంతో బాలు మండిపడిపోతారు. వాళ్లు కోటీశ్వర్లు కాబట్టి మా అమ్మ ప్రభావతమ్మ చెరో రూమ్ ఇచ్చింది. ఇక నేను డ్రైవర్, నా భార్య పూలు అమ్ముకునేది కాబట్టి హాలులోనే పడుకోవాలని చెప్పినట్టు ఉందంటూ బాలు ఫీల్ అవుతాడు. దాంతో సుశీలమ్మ తన రూమ్ వాడుకోమని చెబుతుంది. అలాగే నాలుగు రోజులకు ప్రభావతి మాత్రం చాప మీదనే పడుకోవాలని ఆదేశిస్తుంది. దీంతో అందరూ నవ్వుకుంటారు.

కాగా, అందరూ ఇంట్లోకి వచ్చే ముందే... రోహిణి మాత్రం టెన్షన్ పడుతూ బయటనే ఆగిపోతోంది. ఫోన్ తీసుకొని వెంటనే తన మేమనమామ పాత్రలో నటించాల్సిన జూనియర్ ఆర్టిస్ట్ కు కాల్ చేస్తుంది. ఎక్కడున్నావ్? చెప్పింది సరిగా చేయాలంటూ సూచిస్తుంది. అయితే రోహిణి టెన్షన్ పడుతుండటం, సీక్రెట్ గా ఫోన్ మాట్లాడే విషయాన్ని బాలు గమనిస్తాడు. పార్లరమ్మ ఎవరితో మాట్లాడుతుందా అంటూ ఆరా తీసేందుకు ప్రయత్నిస్తాడు. మరోవైపు రోహిణి ఆ జూనియర్ ఆర్టిస్ తో మాట్లాడుతూ పలు సూచనలు చేస్తుంది.

అతను రావడానికి ఇంకా ఆలస్యం చేస్తుంటే త్వరగా క్యాబ్ తీసుకొని రమ్మని చెబుతుంది. ఆ జూనియర్ ఆర్టిస్ట్ మాత్రం క్యాస్ట్యూమ్స్, బిల్స్ అంటూ విసిగిస్తూ ఉంటే.. అన్నీ చూసుకుంటానని సమాధానం ఇస్తుంది. ఇక ఈ విషయాన్ని బాలు గమనిస్తాడు. తన గదిలోకి వెళ్లాక మీనాతో ఇదే విషయాన్ని చెబుతాడు. రోహిణి మీద తనకు అనుమానం ఉందని అంటాడు. ఆమెకు పెళ్లైనప్పటి నుంచి ఒక్కరూ కూడా పుట్టింటికి తిరిగి రాలేదని, ఇవ్వాళ వాళ్ల మేనమామ వస్తుంటే ఎందుకంత టెన్షన్ పడుతుందని, పైగా పక్కకి వెళ్లి ఫోన్ ఎందుకు మాట్లాడుతందని మీనాతో చర్చిస్తాడు. ఎలాగైనా ఆమె మలేషియా మేనమామ వచ్చాక అసలు విషయం తెలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది వేచి చూడాలి. ఇక మరోవైపు మనోజ్ రోహిణి వాళ్ల మేనమామ వస్తే ఎక్కడ ఉంటాడని, అతను మలేషియా నుంచి వచ్చి ఈ పల్లెటూరిలో ఉండగలడా అంటూ సందేహిస్తాడు. కానీ రోహిణి సర్దిచెబుతుంది. ఇక రోహిణి ఆ జూనియర్ ఆర్టిస్ట్ వల్ల దొరికిపోతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X