Gunde Ninda Gudi Gantalu March 29th : కుటుంబానికి రోహిణి మోసం.. రంగంలోకి దిగిన బాలు
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక మార్చి 28వ తేదీ 389వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఉగాది పండుగ కోసం సత్యం తన కుటుంబంతో సహా సొంత గ్రామమైన పసర్లపూడికి వెళ్తాడు. తన తల్లి సుశీలకు కొడుకు కోడళ్లను నన్ను చూపించి సంతోష పెడతాడు. సుశీలమ్మ అందరిని పలకరించి, వారి బాగోగులు తెలుసుకుంటుంది. అయితే, మనోజ్ భార్య రోహిణికి తన మేనమామ మలేషియా నుంచి వస్తున్నాడు అని చెప్పి ఇరకాటంలో పడుతుంది. ఒక జూనియర్ ఆర్టిస్టును తన మేనమామగా నటించడానికి ఏర్పాట్లు చేస్తుంది. ఇక ఆయన వచ్చి, రోహిణి మేనమామగా నటించాల్సి ఉంది. అయితే మలేషియా నుంచి మామ వస్తున్నాడని రోహిణి ఇప్పటికే అబద్ధం చెప్పి ఉంది. దాంతో ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక జూనియర్ ఆర్టిస్టును తన మేనమామగా కుటుంబ సభ్యులకు పరిచయం చేయడం ఇప్పుడు ఆమె ముందున్న అతి పెద్ద సవాల్.
మరోవైపు అత్త మామ, భర్త మనోజ్ రోహిణి మేనమామ వస్తాడని ఎదురుచూస్తున్నారు. ఆయన వచ్చాక రోహిణి గౌరవం మరింతగా పెరుగుతుందని అత్త ప్రభావతి ఆశపడుతుంది. రోహిణి కోటీశ్వరుడు కూతురు అని అత్త సుశీలతో ప్రభావతి గొప్పలు చెప్పుకుంటుంది. ఈ క్రమంలో రోహిణి ఆ జూనియర్ ఆర్టిస్టుతో తన మేనమామ పాత్రను ఎలా పండిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే బాలు మాత్రం రోహిణి పై ఒక కన్నేసి పెట్టాడు. రోహిణి అనుమానస్పదంగా తిరగడం, దూరంగా వెళ్లి ఫోన్లు మాట్లాడడంతో ఏదో జరుగుతుందని సందేహిస్తున్నాడు. ఇక రోహిణి అలా చేయడాన్ని భార్య మీనా తోని కూడా చెబుతాడు. ఎలాగైనా రోహిణి మేనమామ సంగతి తేల్చాలని బాలు నిశ్చయించుకుంటాడు. ఇక తర్వాత ఏం జరుగుతుందనేది తర్వాత ఎపిసోడ్ కు వాయిదా పడింది. ఇక మార్చి 29వ తేదీ 390 ఎపిసోడ్ లో ఏం జరిగిందనేది వేచి చూడాలి..?

రోహిణి తన మెట్టినింటి వారికి మలేషియా నుంచి తన మేనమామ వస్తున్నాడని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే జూనియర్ ఆర్టిస్ట్ తో తన మేనమామ పాత్రను రోహిణి పండించబోతుంది. అతనితో తన మేనమామగా నటింపజేసి మనోజ్ కు బ్రాస్లైట్, తనకు సారే పెట్టించే ఏర్పాట్లు కూడా చేసింది. రోహిణి కుటుంబం తరఫునుంచి ఇక మొట్టమొదటిసారిగా ఒకరు రాబోతుండడంతో అత్తవారింట్లో అంతా సంతోషిస్తారు. ఎప్పుడెప్పుడు రోహిణి మేనమామ వస్తాడనే ఆలోచనలో ఉంటారు.
ఇక ప్రస్తుతం కుటుంబ సమేతంగా రోహిణి సుశీలమ్మ సొంత ఊరు పసర్లపూడి గ్రామంలో ఉగాది పర్వదినాన్ని జరుపుకునేందుకు వెళ్లింది. ఇక తన మేనమామను కూడా అక్కడికే రప్పిస్తానని చెప్పింది. అప్పటికే కుటుంబ సభ్యులు అంతా మలేషియా నుంచి వచ్చే వ్యక్తి ఆ గ్రామంలో ఉంటాడా అని సందేహిస్తారు. దానికి రోహిణి ఆ విషయాలన్నీ నేను చూసుకుంటాను అంటూ బదిలిస్తుంది. ఇక ఎట్టకేలకు తన మేనమామగా జూనియర్ ఆర్టిస్ట్ వచ్చే సమయం ఆసన్నమైంది. ఇక రోహిణి చెప్పినట్టుగానే ఆ జూనియర్ ఆర్టిస్ట్ లగేజ్ అంతా సర్దుకుంటాడు.
రోహిణి చెప్పినట్టుగా ఆ గ్రామానికి వెళ్లేందుకు రెడీ అవుతాడు. అయితే రాజమౌళి సినిమాలో అవకాశం వచ్చిందనే ఆనందంలో ఆ జూనియర్ ఆర్టిస్ట్ ఎగిరికి గంతులేస్తాడు. ఇక రోహిణి చెప్పినట్టు వినడానికి సిద్ధమవుతాడు. రోహిణి చాలా పెద్ద సమస్యలో ఇరుక్కున్నదనే సంగతి మాత్రం ఆ జూనియర్ ఆర్టిస్ట్ కు తెలియదు. దీంతో సినిమాలో నటించడమే కదా, అందుకు ఆడిషన్ చేయడమే కదా అంటూ ఉత్సాహంగా వచ్చేందుకు రెడీ అవుతాడు.
ఇక బాలు రోహిణి పై ఒక కన్నేసి పెడతాడు. రోహిణి అనుమానాస్పదంగా ఉండడం, ఊరికే టెన్షన్ పడుతుండడం గమనిస్తూ ఉంటాడు. దీంతో రోహిణి ఏదో తప్పు చేయబోతుందని పసిగడతాడు. ఇక తప్పు తన మేనమామగా వస్తున్న వ్యక్తి విషయంలోనే అయి ఉంటుందని భావిస్తాడు. దాంతో ఆ వ్యక్తి అసలు రంగు ఎలాగైనా బయటపడేలా చూడాలని నిర్ణయించుకుంటాడు. మరోవైపు మనోజ్ కూడా మలేషియా నుంచి వచ్చే రోహిణి మేనమామ గురించి ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుంటాడు. అసలు విషయం తెలియని మనోజ్ మలేషియా నుంచి వచ్చే మేనమామ ఇక్కడ ఉండగలుగుతాడా అంటూ రోహిణిని ప్రశ్నిస్తాడు.
ఇక మామ సత్యం, అత్త ప్రభావతి రోహిణి పుట్టింటి నుంచి తొలిసారిగా వస్తున్న తన మేనమామ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. జూనియర్ ఆర్టిస్టు మాత్రం ఈ కుటుంబంలో మేనమామగా ఎంట్రీ ఇచ్చేందుకు ఇంకా ఆలస్యం చేస్తుంటాడు. తాను ఒక ప్రొడక్షన్ హౌస్ లోనే పనిచేస్తున్నాను అనే భావనలో ఉంటాడు. అసలు విషయాలు తెలియకపోవడంతో రోహిణికి మేనమామగా నటించేందుకు వస్తాడు. అయితే అప్పటికే బాలు రోహిణి తన మేనమామపై సందేహం వ్యక్తం చేస్తుండడంతో మీనా గుట్టు రట్టు అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక బాలు తన మాటలతో మేనమామగా నటించేందుకు వచ్చిన ఆ జూనియర్ ఆర్టిస్టులను హడలగొడతాడా అనేది చూడాలి.
మరి ఆ జూనియర్ ఆరిస్ట్ మలేషియాలో బిజినెస్ చేసే వ్యక్తిలా మెప్పిస్తాడా? లేదా దొరికిపోతాడా? అనేది చూడాలి. అత్త ప్రభావతి అంటే ఎలాగూ మలేషియా నుంచి వచ్చాడు కాబట్టి ఎలాంటి సందేహం వ్యక్తం చేయబోదు. కానీ బాలు మాత్రం చిటికెలో పట్టేస్తాడు. ఏమాత్రం అతను తడబడినా తాటతీసేస్తాడు. అప్పటికే తన మాటలతో ఎదుటివారిని అయోమయంలో పడేసే బాలు, మరోవైపు సూటిగా మాట్లాడే తత్వం ఉండటంతో రోహిణి గుట్టురట్టు అవ్వడం ఖాయమే. మరోవైపు మీనా కూడా వ్యక్తుల స్వభావాలను ఇట్టే గుర్తుపట్టగలుగుతుంది. దాంతో రోహిణి మేనమామ నిజం కాదనే తేల్చుతుందా? అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.
అలాగే చిన్న కోడులు శృతి మాత్రం రోహిణి మేనమామగా నటించేందుకు వచ్చిన అతన్ని ఎలా రిసీవ్ చేసుకుంటుందనేది ఆసక్తిని క్రియేట్ చేసింది. ఇప్పటికే మౌనిక వాళ్ల మెట్టింటి నుంచి వచ్చిన చంద్రకాంతంను ఓ ఆటాడుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రోహిణి మేనమామగా, పైగా మలేషియా బిజినెస్ మెన్ గా ఆ జూనియర్ ఆరిస్ట్ లు చాలానే సమస్యలు ఎదుర్కొంటాడు. రోహిణి ఊహించని సవాళ్లను ఫేస్ చేస్తుంది. బాలు మాత్రం రోహిణి అసలు నాటకాన్ని బయటపెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు.


Click it and Unblock the Notifications











