Gunde Ninda Gudi Gantalu March 31st : రోహిణిపై బాలు అనుమానం.. అనుకున్నంత పనైందిగా
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక మార్చి 28వ తేదీ 389వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఉగాది పండుగ కోసం సత్యం తన కుటుంబంతో సహా సొంత గ్రామమైన పసర్లపూడికి వెళ్తాడు. తన తల్లి సుశీలకు కొడుకు కోడళ్లను నన్ను చూపించి సంతోష పెడతాడు. సుశీలమ్మ అందరిని పలకరించి, వారి బాగోగులు తెలుసుకుంటుంది. అయితే, మనోజ్ భార్య రోహిణికి తన మేనమామ మలేషియా నుంచి వస్తున్నాడు అని చెప్పి ఇరకాటంలో పడుతుంది. ఒక జూనియర్ ఆర్టిస్టును తన మేనమామగా నటించడానికి ఏర్పాట్లు చేస్తుంది. ఇక ఆయన వచ్చి, రోహిణి మేనమామగా నటించాల్సి ఉంది. అయితే మలేషియా నుంచి మామ వస్తున్నాడని రోహిణి ఇప్పటికే అబద్ధం చెప్పి ఉంది. దాంతో ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక జూనియర్ ఆర్టిస్టును తన మేనమామగా కుటుంబ సభ్యులకు పరిచయం చేయడం ఇప్పుడు ఆమె ముందున్న అతి పెద్ద సవాల్.
మరోవైపు అత్త మామ, భర్త మనోజ్ రోహిణి మేనమామ వస్తాడని ఎదురుచూస్తున్నారు. ఆయన వచ్చాక రోహిణి గౌరవం మరింతగా పెరుగుతుందని అత్త ప్రభావతి ఆశపడుతుంది. రోహిణి కోటీశ్వరుడు కూతురు అని అత్త సుశీలతో ప్రభావతి గొప్పలు చెప్పుకుంటుంది. ఈ క్రమంలో రోహిణి ఆ జూనియర్ ఆర్టిస్టుతో తన మేనమామ పాత్రను ఎలా పండిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే బాలు మాత్రం రోహిణి పై ఒక కన్నేసి పెట్టాడు. రోహిణి అనుమానస్పదంగా తిరగడం, దూరంగా వెళ్లి ఫోన్లు మాట్లాడడంతో ఏదో జరుగుతుందని సందేహిస్తున్నాడు. ఇక రోహిణి అలా చేయడాన్ని భార్య మీనా తోని కూడా చెబుతాడు. ఎలాగైనా రోహిణి మేనమామ సంగతి తేల్చాలని బాలు నిశ్చయించుకుంటాడు. ఇక తర్వాత ఏం జరుగుతుందనేది తర్వాత ఎపిసోడ్ కు వాయిదా పడింది. ఇక మార్చి 31వ తేదీ 390 ఎపిసోడ్ లో ఏం జరిగిందనేది వేచి చూడాలి..?

పల్లెటూరి వాతవరణంలో సత్యం కుటుంబం సరదా గడుపుతోంది. అయితే శృతి మాత్రం ఆ పల్లెటూరిలో ఉండలేక ఇబ్బంది పడుతుంది. తను వెళ్లిపోతానని రవితో చెబుతూ ఉంటుంది. ఆ మాట విన్న సుశీలమ్మ బాధపడుతుంది. ఓవైపు రవి కూడా నచ్చచెబుతూనే ఉంటాడు. ఇక్కడ ఒక్క రోజు కూడా ఉండేలా పరిస్థితి లేదని రవితో అంటుంది. ఒక్కటే బాత్ రూమ్ ఉండటంతో అందరికీ ఇబ్బందిగా ఉంటుందని, మనం వెళ్లి ఓ హోటల్ లో రూమ్ తీసుకొని ఉందామని రవితో అంటుంది. మధ్యాహ్నా భోజనం, రాత్రి భోజనానికి వచ్చి వెళ్దామని చెబుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న సుశీలమ్మ బాధపడుతుంది.
వెంటనే శృతి దగ్గరకు వెళ్లి పల్లెటూరి గొప్పదనాన్ని వివరిస్తుంది. నగరాల్లో ఉండే వాతావరణంతో పోల్చితే పల్లెల్లో ఎంతో స్వచ్ఛమైన గాలి, ప్రశాంతత, స్వచ్ఛమైన నీరు, మంచి మనుషులు ఉంటారని తెలియజేస్తుంది. నీకు ఇప్పటి వరకు పల్లెటూరు పరిచయం లేదు కాబట్టి కాస్తా ఇబ్బందిగానే ఉంటుందని, కాస్తా అలవాటైతే వదిలి వెళ్లబోవని చెప్పుతుంది. అందరూ రావడం వల్ల సంతోషంగా ఉన్నానని, ఇక మీరు ఇలా వెళ్లి పోతానని అని చెబుతుంటే నాకు ఆ సంతోషం లేకుండా పోతుందని బాధపడుతుంది. ఇక సుశీలమ్మ అలా మాట్లాడటంతో శృతి మనస్సు కూడా కరుగుతుంది. దీంతో ఇంకోసారి అలా మాట్లాడనని చెబుతుంది. నాలుగు రోజులు ఇంట్లోనే ఉంటానని, తానే అడ్జస్ట్ అవుతానని చెబుతుంది.
మరోవైపు రోహిణి వాళ్ల మేనమామ పసర్లపూడి గ్రామానికి వస్తుండటంతో బాలు అనుమానం వ్యక్తం చేస్తాడు. అసలు రోహిణి వాళ్ల మేమమామ పెళ్లైనప్పటి నుంచి మన ఇంటికి రాకుండా ఈ పల్లెటూరికే ఎందుకు వస్తున్నాడు... అసలు రోహిణి రహస్యంగా ఫోన్లో ఎవరితో మాట్లాడుతుందని సందేహిస్తాడు. ఎలాగూ వాళ్ల మలేషియా మామ ఇక్కడికే వస్తున్నాడు కదా వచ్చాక ఆ లెక్కలన్నీ తెల్చుతానని భార్య మీనాతో చెబుతుంటాడు... ఆ తర్వాత మీనాతో బాలు సరసం చెస్తూ ప్రేమను కుమ్మరిస్తాడు. ఇక సుశీలమ్మ వాళ్ల దగ్గరికి వచ్చి బాలుకు షాక్ ఇస్తుంది. తనూ మీనా తన గదిలో పడుకుంటామని, ఇక బాలు అరుగుమీదనే పడుకోవాలని ఆర్డర్ వేస్తుంది. దాంతో బాలు నానమ్మ సుశీలపై గులుగుతూ బయటికి వెళ్లిపోతాడు.
అయితే, రోహిణి వాళ్ల మేనమామ వస్తుండటంతో మీనాకు అత్త ప్రభావతి పనిభారం పెంచే ప్రయత్నం చేస్తుంది. అన్ని రకాల వంటలు చేయమని చెబుతుంది. అసలు మీ మామ ఏం తింటాడని అడిగి వివరాలు తెలుసుకుంటూ ఉంటుంది. దీంతో సుశీలమ్మ ఎవరి కోసం ఆ వంటన్నీ అని ప్రశ్నిస్తుంది. దాంతో ప్రభావతి ఎంతో సంతోషంగా రోహిణి వాళ్ల మేనమామ మలేషియా నుంచి వస్తున్నారని చెబుతుంది. ఆయన కోసమే ప్రత్యేకమైన వంటలు చేయించాలని, అందుకే మీనాకు మటన్, చికెన్, బంగాలదుంప వేపుడు, టమాట పచ్చడి, పులుసు కూడా పెట్టమని ఆదేశించినట్టు చెబుతుంది. దాంతో సుశీలమ్మకు మండిపోతుంది. ఈరోజు మీనా వంట చేయబోదని తన కోడలైన ప్రభావతితో అంటుంది. దాంతో ప్రభావతి షాక్ అవుతుంది.
మీనాకు సుశీలమ్మ ఫుల్ సపోర్ట్ చేస్తుంది. తాను చేసే పనుల నుంచి కాస్తా రిలాక్స్ అయ్యే అవకాశాన్ని అందిస్తుంది. రూల్ అంటే రూలే.. నీ కోడలు మీనా నీ ఇంట్లో వంట చేస్తున్నప్పుడు.. నా కోడలు ప్రభావతి నా ఇంట్లో పని చేయాలి అని ఆదేశిస్తుంది. అందులో ఎలాంటి మార్పులేదని చెబుతుంది. ఇక ప్రభావతి షాక్ అవుతుంది. ఒక్కదాన్నే అన్ని రకాల వంటలు ఎలా చేయగలను అంటూ తడబడుతుంది. మరీ మీనా ఎలా చేస్తుందని సుశీలమ్మ ప్రశ్నిస్తుంది. ఏదేమైనా మలేషియా నుంచి రోహిణి మేనమామ వస్తున్నాడు కాబట్టి.. మీనాతో వంట చేయించడం సరికాదని, నువ్వే వంట చేయాలని సుశీలమ్మ ఆర్డర్ వేస్తుంది. అంతే కాదు మీనాకు ఇవ్వాళ ఫుల్ రెస్ట్ అంటూ తను తిని కూర్చుంటుందని కూడా స్పష్టం చేస్తుంది.
కోడలు ప్రభావతికి వంట రాకపోతే తన మిగితా ఇద్దరు కోడళ్లతో చేయించు అని సుశీలమ్మ చెబుతుంది. అంతే కాదు.. గ్యాస్ బండ ఒక్కటే ఉందని, ఇక కట్టెల పోయ్యి మీదనే వంట చేయాలని మరో షాక్ ఇస్తుంది. మిక్సీ కూడా రిపేర్ లో ఉందని, కారాలుమిర్యాలన్నీ రోజులులోనే రుబ్బాలని చెబుతుంది. వంట చేయడం మాత్రం ప్రభావతి వంతేనని ఖరాకండిగా చెబుతుంది. ఇక చేసేదేమీ లేక ప్రభావతి తన కోడళ్లు ఇద్దరు శృతి, రోహిణిని తీసుకొని వెళ్లి కూరగాయలు కోయించే ప్రయత్నం చేస్తుంది. దాంతో నానా తంటాలు పడుతుంది. ఇక అసలు కిచెన్ వైపే చూడని ఇద్దరు కోడళ్లతో ఎలా వంట చేసిందనేది తరువాయి ఎపిసోడ్ కు మారింది.


Click it and Unblock the Notifications











