Gunde Ninda Gudi Gantalu April 1st : ప్రభావతి తాట తీస్తున్న సుశీలమ్మ.. రిచ్ కోడళ్లను ఇలా

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక మార్చి 31వ తేదీ 390వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఉగాది పండుగ కోసం సత్యం తన కుటుంబంతో సహా సొంత గ్రామమైన పసర్లపూడికి వెళ్తాడు. అయితే అక్కడ మనవరాళ్లకు సుశీలమ్మ పద్ధతులను నేర్పిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఎంతో పనిచేస్తున్న మీనాకు సుశీలమ్మ ఫుల్ సపోర్ట్ చేస్తుంది. తాను చేసే పనుల నుంచి కాస్తా రిలాక్స్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తుంది. ఓవైపు రోహిణి మేనమామ ఆ గ్రామానికి వస్తుండటంతో ప్రత్యేక వంటలు చేయాలని మీనకు ప్రభావతి ఆర్డర్ వేస్తుంది. కానీ సుశీలమ్మ మాత్రం ప్రభావతికి ఊహించని షాక్ ఇస్తుంది. వంటల విషయంలో మీనాపై అధికారం చెలాయించిన ప్రభావతికి సుశీలమ్మ తగిన గుణపాఠం చెబుతుంది.

ఇంట్లో వాళ్ల కంటే రోహిణి వండిపెడుతుంది కానీ.. ఇక రోహిణి వాళ్ల మేనమామకు ఎలా వండిపెడుతుంది. పైగా నీ ఇంట్లో మీనా నీకు కోడలు. కానీ ఇక్కడ నాకు మనవరాలు, మరోవైపు ఇక్కడ కోడలు పోస్ట్ నీదేనన్న సంగతి గుర్తుంచుకోమని సుశీలమ్మ గొంతులేపుతుంది. దాంతో ఇక ఈరోజు వంటలన్నీ నువ్వే చేయాలని ఆదేశిస్తుంది. మీనాకు ఏమాత్రం పనిచెప్పకూడదని, కేవలం ప్రభావతినే చేయాలని కావాలంటే సహకారంగా.. కొత్త కోడళ్లు రోహిణి, శృతిల సహకారం తీసుకోమని సూచిస్తుంది. ఇక మీనాకు మాత్రం పనిచెప్పొద్దని స్పష్టం చేస్తుంది. దాంతో ప్రభావతి తన ఇద్దరు కోడళ్లను తీసుకొని వంటలు వండే పనిలో నిమగ్నమవుతుంది. ఇక అసలు వంటలే రాని ఆ కోడళ్లతో ఎలా వంటలు వండిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఏప్రిల్ 1వ తేదీ 391 ఎపిసోడ్ లో ఏం జరిగిందనేదంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 391 April 1st

ఇక వంటలన్నీ ప్రభావతినే చేయాలని సుశీలమ్మ ఆదేశిస్తుంది. దాంతో శృతి, రోహిణితో కలిసి మొదట కూరగాయాలు తరిమేందుకు వెళ్తుంది. శృతిని కూరగాయలు తరుము అంటుంది. కానీ ఆమెకు కత్తిపీటకు, కత్తికే తేడా తెలియడం లేదు. ఇక తరమాల్సిన కూరగాయాలను తరుముతూ, తరమాల్సిన వాటిని నరుకుతూ ప్రభావతికి చుక్కులు చూపిస్తోంది. ఇక రోహిణి మాత్రం రోలులో ఎండుకారం బాగానే దంచుతుంది. మలేషియాలో ఉన్నప్పటికీ ఎండుకారం బాగానే దంచావే అంటూ పనిమనిషి అంటుంది. దాంతో ప్రభావతి, శృతి షాక్ అవుతారు. నీకు దంచడం రాదు కదా అమ్మా ఎలా అంతబాగా దంచావు అంటు అడుగుతుంది ప్రభావతి. దాంతో రోహిణి నేను ఏదైనా చూస్తే ఇట్టే పట్టేస్తానని, త్వరగా నేర్చుకుంటానని చెబుతుంది. నువ్వు ఎప్పుడు వంట చేయడం చూడలేదే అని శృతి అనుమానం వ్యక్తం చేస్తుంది.

ఇక రోహిణి అయ్యో వంటలకు ఆలస్యం అవుతుంది అంటూ మాట మార్చేస్తుంది. మళ్లీ ముగ్గురు కలిసి వంటపై దృష్టి పెడుతారు. ఇక శృతి మాత్రం ఒకదానికి బదులు, మరొకటి తాళింపులో వేస్తూ ప్రభావతిని భయపడేలా చేస్తుంది. దీంతో శృతిని నువ్వు పక్కకు ఉండూ అమ్మ అని ప్రభావతికి చెప్పి ఇక ఎలోగోలా వంటలు వండుతుంది ప్రభావతి. ఏ ఒక్కరూ సహకరించకపోయినా నానా తిప్పలు పడి తన అత్త సుశీలమ్మ ఆదేశాల మేరకు వంటలు రెడీ చేస్తుంది. ఇక అందరూ కలిసి సహబంప్తి భోజనం చేసేందుకు కూర్చుంటారు. ఈ సందర్భంలో మీనా నేనే వడ్డిస్తాను మీరందరూ కూర్చొండి అని అంటుంది. కానీ ప్రభావతి ఏం వద్దు అని చెబుతుంది. వంట అంతా మేమే చేశాక వడ్డించి ఆ క్రెడిట్ నువ్వే కొట్టేస్తావా? అని కోపం చేస్తుంది. నేనే వడ్డిస్తానని చెబుతుంది.

అయితే, తినేప్పుడు కూడా తన ఇద్దరు రిచ్ కోడళ్లను పక్కపక్కన కూర్చోబెట్టుకొని, మీనా ను మాత్రం చివర్లో బాలు పక్కన కూర్చోబెడుతుంది. ఇదంతా సుశీలమ్మ గమనిస్తూనే ఉంటుంది. ఇక అందిరికీ భోజనాలు వడ్డించి తినేందుకు సిద్ధం అవుతారు. దీంతో ప్రభావతి వండిన వంటన్నింటిపై అందరూ తమ అభిప్రాయాలను తెలియజేస్తారు. ఇంక ఎలా ఉన్నా తినేందుకు రెడీ అవుతారు. అయితే, కూరగాయాలు తరిమే సమయంలో శృతి వేలు కోసుకుంటుంది. దాంతో తినడానికి రాకపోవడంతో ఇక ప్రభావతినే స్వయంగా నీకు నేనే తినిపిస్తానమ్మ అంటూ తినిపిస్తుంది. ఇక తనకు మరోవైపు ఉన్న రోహిణికి కూడా తినిపిస్తుంది.

సుశీలమ్మ అదంతా చూసి ప్రభావతిపై మండిపడుతుంది. మీనాను ఎందుకలా వేరుగా చూస్తున్నావంటూ ప్రశ్నిస్తుంది. అందరూ కోడళ్లను సమానంగా చూసుకోవాలని, డబ్బు తెచ్చిన వారిని ఒకలా, తేని వారిని మరోలా చూడటం ఏమాత్రం సరికాదని చెబుతుంది. నాలుగు తరాల నుంచి కోడళ్లను కూతురుగా చూస్తున్న ఇల్లు ఇది అని వివరిస్తుంది. ఇక మీనాను లేచి వచ్చి ప్రభావతి పక్కన కూర్చొమని, ముగ్గురికి ప్రేమగా తినిపించు అని తన కోడలను సుశీలమ్మ ఆదేశిస్తుంది. కానీ ప్రభావతి రోహిణి, శృతికి ప్రేమగా తినిపించి మీనాకు మాత్రం విసుక్కుంటూ నోట్లో కుక్కుతుంది. దాంతోనూ సుశీలమ్మ మండిపడుతుంది. అప్పటికే వంటలు చేయించి రిచ్ కోడళ్ల తిక్క కుదర్చడంతో పాటు ఇక ప్రభావతి మనస్సులో మీనాపై ఉన్నచిన్నచూపును కూడా తొలగించేస్తుంది. సుశీలమ్మ భయానికి మాత్రం మంచిగానే ప్రవర్తిస్తుంది.

ఇక భోజనాల కార్యక్రమం అవ్వగానే సాయత్రం వేళ అందరూ పట్టువస్త్రాలు ధరించి వెన్నెల వెతురులో కుటంబ సమేతంగా కూర్చుంటారు. ఈ క్రమంలోనే బాలు ఎప్పటి లాగే తన తల్లి ప్రభావతి, రవి, మనోజ్ లపై పంచులు పేల్చుతాడు. అందరినీ కడిగిపడేస్తున్న నాయనమ్మ సుశీలమ్మకు పూలకొట్టు గురించి కూడా తెలిసేలా చేస్తాడు. దానికి ప్రభావతి పూలకొట్టు అని పేరు పెట్టామని కూడా చెబుతాడు. పార్లర్ కు తన పేరు పెడితే ఏమనని మా తల్లి, పూలకొట్టుకు తన పేరు పెడితే మండిపడుతోందని బాలు సుశీలమ్మకు చెబుతాడు. ఇక సుశీలమ్మ స్పందిస్తూ అలాంటి తారతమ్యాలు చూపించోద్దని చెబుతుంది.

మరోవైపు రోహిణి వాళ్ల మేనమామ రేపు ఇంటికి రాబోతున్నాడని, చాలా పనులు ఉన్నాయని అందరూ వెళ్లి పడుకోండి అంటూ ప్రభావతి అంటుంది. ఇక భర్త సత్యం స్పందిస్తూ రోహిణి కంటే ఎక్కువ హడావుడి నీదే అవుతుంది కదా అంటూ ఆమె ఆత్రుతను తగ్గిస్తాడు. రోహిణి వాళ్ల మేనమామతో సరిగా మాట్లాడూ, మర్యాదగా మెదలాలని ప్రభావతి కొడుకు బాలును హెచ్చరిస్తుంది. సత్యం కలుగజేసుకొని మర్యాద అనేది రెండు వైపులా ఉండాలని అంటాడు. ఇక రోహిణి వాళ్ల మేనమామ ఎలాంటోడో బాలునే కాదు నేనూ చూస్తానని సత్యం అంటాడు. తన మేనమామ హైదరాబాద్ లో ఫైట్ దిగి రాజమండ్రికి వచ్చాడని, తన చిన్ననాటి స్నేహితులను కలిసి రేపు కారులో ఇంటికి వస్తారని చెబుతుంది. ఇక అతను వచ్చాక ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X