Gunde Ninda Gudi Gantalu April 2nd: రోహిణికి అగ్ని పరీక్ష.. కాపుకాస్తున్న మరిది బాలు
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఏప్రిల్ 1వ తేదీ 391వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రోహిణి పుట్టింటి నుంచి తన మేనమామ వస్తున్నాడని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం రోహిణి తన మెట్టింటి వారితో సహా పసర్లపూడి గ్రామం తన మామ సత్యం సొంత ఊరుకు కుటుంబ సమేతంగా వెళ్ళింది. అయితే రోహిణి అత్త ప్రభావతి తన మేనమామ వస్తున్నాడంటూ అక్కడ కూడా గొప్పలు చెబుతూ ఉంటుంది. ప్రభావతి మాటలకు అటు కొడుకు బాలు, భర్త సత్యం కౌంటర్లు ఇస్తూనే ఉంటారు. ఇక సుశీలమ్మ ఇంట్లో ఒకరోజు ఆనందంగా కుటుంబం గడుపుతుంది. అన్ని పనులు ముగించుకోవడంతో రోహిణి వాళ్ళ మేనమామ గురించి అంతా ఎదురు చూస్తూ ఉంటారు. రోహిణిని అడగగా వస్తున్నాడని బదులుస్తుంది. మలేషియా నుంచి హైదరాబాద్ కు ఫ్లైట్ లో వచ్చారని అక్కడి నుంచి రాజమండ్రి కి కూడా చేరుకున్నారని చెబుతుంది.
ఇక పసర్లపూడి గ్రామానికి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారని వివరిస్తుంది. రాజమండ్రిలో తన మేనమామ చిన్ననాటి స్నేహితులు ఉన్నారని వారిని కలిసి ఇక్కడికి కారులో వస్తారని చెబుతుంది. అయితే తనకు మలేషియాలో మేనమామ లేనప్పటికీ ఒక జూనియర్ ఆర్టిస్టును తన మేనమామగా నటింపజేసేందుకు ఏర్పాటు చేస్తుంది. ఇక అతనే ఇప్పుడు రోహిణి మేనమామగా ఇంట్లో వారికి పరిచయం కాబోతున్నాడు. అప్పటికే బాలుకు మలేషియా నుంచి వస్తున్న రోహిణి మేనమామ పై అనుమానం ఉంటుంది. ప్రభావతి ఓవర్ యాక్షన్ తో కూడా అనుమానం మొదలవుతుంది. రాకరాక మొట్టమొదటిసారిగా వస్తున్న రోహిణి మేనమామ తమ ఇంటికి రాకుండా గ్రామానికి ఎందుకు వస్తున్నాడని సందేహం వ్యక్తం అవుతుంది. ఇక అతను వచ్చాక అసలు సంగతి ఏంటో తెలుసుకోవాలంటూ బాలు, సత్యం నిర్ణయించుకుంటారు. ఇక తర్వాతి ఎపిసోడ్లో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఏప్రిల్ 2వ తేదీ 392 ఎపిసోడ్ లో ఏం జరిగిందనేదంటే..?

రోహిణి చాలా టెన్షన్ పడుతూ తన ఫ్రెండ్ కు ఫోన్ చేస్తుంది. ఇంకా తన మేనమామగా నటిస్తానని చెప్పిన జూనియర్ ఆర్టిస్ట్ రాలేదని చెబుతుంది. వాళ్ల అత్తమ్మ ప్రభావతి మాత్రం నిమిషానికి 20 సార్లు మీ మేనమామ ఇంకెప్పుడుడు వస్తాడని అడుగుతోంది అంటూ తన స్నేహితులురాలికి చెబుకుంటుంది. అతను తప్పకుండా వస్తాడని తన స్నేహితురాలు చెప్పడంతో కాస్తా ధైర్యం చెప్పుకుంటుంది. మరోవైపు ప్రభావతి రోహిణి మేనమామ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అంతేకాదు.. రోహిణి వాళ్లమేనమామ రాగానే బిజినెస్ కోసమని డబ్బులు అడుగుమని ప్రభావతి మనోజ్ తో చెబుతుంది. డబ్బుల విషయం కదారా నేను అడిగితే బాగోదు. అది నువ్వు అడిగితేనే కరెక్ట్ గా ఉంటుందని చెబుతుంది. అందుకు మనోజ్ కూడా సరేనని అంటాడు. .
ఇక పల్లెటూరి వాతావరణంలో తన భార్య మీనాతో బాలు సరదాగా గడపాలని అనుకుంటాడు. కానీ సుశీలమ్మ బాలును మీనా దగ్గరకు అస్సలు రానివ్వదు. ముట్టుకోనివ్వదు. పట్టుకోనివ్వదు. దాంతో మీనాను చేరుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు బాలు. కానీ సుశీలమ్మ ఆర్డర్ తో మీనా బాలును దగ్గరికి రానివ్వదు. దాంతో బాలు మీనాతో ఏకాంతంగా కలిసేందుకు 'అందరూ పడుకున్నాక గడ్డివాము దగ్గరికి రా, నీకో రహస్యం చెబుతాను' అని చెబుతూ ఓ లెటర్ రాస్తాడు. ఆ లెటర్ ఆసక్తికరమైన సన్నివేశాలకు దారి తీసింది. బాలు రాసిన ఆ ఉత్తరాన్ని మీనాపైకి విసురుతాడు. అదే సమయంలో మీనా బొంది, లడ్డులు ప్లేట్స్ లో సర్వ్ చేస్తుంటుంది. ఆ లెటర్ కాస్తా ప్లేట్ లో పడుతుంది. అది మీనా చూసుకోదు.
మొదటగా స్వీట్స్, కారాను మనోజ్ కు ఇస్తారు. మనోజ్ కు ప్లేట్ ఇచ్చే సమయంలో ఆ లెటర్ కిందపడుతుంది. తెరిచి చదువుతాడు. అటువైపుగా వెళ్తున్న రోహిణిని చూసి తనే రాసిందని భావిస్తాడు. గడ్డివాము దగ్గరికి రా అని చెప్పడంతో సంబర పడుతాడు. అతను చదివాక ఆ లెటర్ ను విసిరేస్తాడు. అది కాస్తా వెళ్లి శృతిపై పడుతుంది.. లెటర్ చదువుతున్న సమయంలో రవి ఎదురవుతాడు. ఇక రవే రాశాడనుకొని సిగ్గుపడుతూ రవిపైనే విసిరేస్తుంది. రవి కూడా ఆ లెటర్ చదివి శృతి పిలిచిందని సంతోషిస్తాడు. ఆ లెటర్ అక్కడి నుంచి ప్రభావతి - సత్యం, అక్కడి నుంచి రోహిణి వరకు చేరుతుంది. ఇలా గడ్డివాము దగ్గర భార్యభర్తలు అందరూ కలుస్తారు. ముందుగా బాలు - మీనా వెళ్లి కలుస్తారు.
బాలు పిలవడంతో మీనా సంతోషంగా వెళ్లి సరదగా సమయం గడుపుదామని అనుకుంటుంది. కానీ బాలు మాత్రం రోహిణి వాళ్ల మేనమామ గురించి మాట్లాడుతూ ఉంటాడు. రోహిణి మనల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నదని మీనాతో అంటాడు. దాంతో మీనా కోపం చేసుకుంటుంది. ఆ విషయం ఇంత రాత్రి పిలిచి మాట్లాడాలా? అని అలుగుతుంది. ఇంకా నేను వెళ్తున్నానని చెప్పడంతో బాలు ఆపుతాడు. ఆ వెంటనే ఓ బ్యూటీఫుల్ సాంగ్ తో డ్యాన్స్ లు వేస్తూ ఆకట్టుకున్నారు. 'గోదారిగట్టు మీద రామ చిలకావె' పాటకు చిందులేస్తూ సంతోషించారు. ఇక వీళ్లలాగే బాలు రాసిన లెటర్ వాళ్ల, మనోజ్ - రోహిణి, శృతి - రవి, చివరికి ప్రభావతి - సత్యం కూడా ఆ గడ్డివాము దగ్గరకు చేరి తమ మెమోరీస్ ను గుర్తుచేసుకుంటారు. వాళ్లు కూడా అదే సాంగ్ కు డ్యాన్స్ వేసి ఆకట్టుకుంటారు. అయితే వీళ్లందరూ గడ్డివాము దగ్గరికి వచ్చేది బాలు - మీనా గమనిస్తూనే ఉంటారు.
చివరికి సుశీలమ్మ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో కంగారు పడుతుంది. వీళ్లంతా ఎక్కడికి వెళ్లిపోయారని ఇళ్లంతా వెతుకుతుంది. చివరి సుశీలమ్మ ఇంటి బయటకు వచ్చి చూస్తుంది. గడ్డివాము దగ్గర చప్పుడు కావడంతో గట్టిగా అరుస్తుంది. ఎవర్రా దొంగలా? అంటూ గర్జిస్తుంది. దీంతో బాలు-మీనా, మనోజ్ - రోహిణి, రవి - శృతి, సత్యం - ప్రభావతి అంతా బయటికి వస్తారు. ఒక్కొక్కరూ బయటికి వస్తారు. ఒకరినొకరు చూసుకొని మొహం చాటేస్తారు. అందరూ అక్కడ ఏం మీటింగ్ పెట్టారురా అని సుశీలమ్మ సత్యంను అడగడంతో తడబడుతాడు. ప్రభావతి రమ్మని చెబితే వచ్చానని బదులిస్తాడు. దాంతో ప్రభావతి నేను రమ్మనలేదు... ఆ ఉత్తరం నువ్వు రాయలేదా? అని సత్యంను అడుగుతుంది. నేను రాయలేదు అని సత్యం చెబుతాడు. ఇక రవి -శృతి, మనోజ్ - రోహిణి కూడా ఆ లెటర్ నువ్వు రాయలేదా? అని ఒకరి మొహం మరొకరు చూసుకుంటారు.
అందరూ కంగారు పడుతుండటంతో బాలు నిజం ఒప్పుకుంటాడు. ఆ లెటర్ తన భార్య మీనా కోసం రాశానని చెబుతాడు. కానీ వీళ్లందరికీ ఇలా చేరుతుందని అనుకోలేదంటూ చెప్పి ఆశ్యర్యపడుతాడు. బాలు చేసిన పనికి అంతా ఫూల్ అవుతారు. కానీ కొద్ది క్షణాలైనా సంతోషంగా ఒకరితోమరొకరు సమయం గడుపుతారు. తర్వాత అందరూ ఇంట్లోకి వెళ్లి పోతారు. ఇక మళ్లీ బాలు - మీనా ఏకాంతంగా కలుస్తారు.. అక్కడితో ఎపిసోడ్ ముగిస్తుంది... ఇక ఆ తర్వాత ఎపిసోడ్ లో రోహిణి మేనమామ ఎంట్రీ ఇచ్చినట్టుగా చూపించారు. ఆయన ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ భయపడుతూ ఇంట్లోకి వస్తాడు. వచ్చి ఏకంగా కుడితి తొట్టిలో పడిపోతాడు... రోహిణి తన మామయ్యే అని చెప్పడంతో.. మలేషియా నుంచి వచ్చి అలా కుడితి తొట్టేలో పడిపోయాడేంటీ అని అందరూ షాక్ అవుతారు. అసలు ఆయన ఎందుకు భయపడ్డాడు? ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











