Gunde Ninda Gudi Gantalu April 3rd: మేనమామతో రోహిణి గందరగోళం.. పట్టువిడవని బాలు
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఏప్రిల్ 2వ తేదీ 392వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రోహిణి పుట్టింటి నుంచి మేనమామగా జూనియర్ ఆర్టిస్ట్ ఎంట్రీ ఇస్తాడు. ఇప్పటి వరకు మనవళ్లు, మనవరాళ్లతో నాయనమ్మ సుశీలమ్మ సంతోషంగా గడుపుతుంది. అలాగే ఆమె అనుభవాన్ని, ఉమ్మడి కుటుంబంలో ఉండే సంతోషం, కోడళ్లు మెట్టినింటిలో ఎలా మెదలాలనే విషయాలను చక్కగా వివరిస్తుంది. కుటుంబంలో అందరూ ఒకటేనని ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే భావన అస్సలు ఉండకూదని చెబుతుంది.
మరోవైపు లేటెస్ట్ ఎపిసోడ్ లో రోహిణి మేనమామ ఎంట్రీ ఇచ్చారు. ఆయన రావడం రావడమే భయంతో పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వస్తాడు. వచ్చి ఏకంగా కుడితి తొట్టిలో పడిపోతాడు. మలేషియా నుంచి వచ్చినట్టు కూడా అతని ఆహార్యం, బాడీ లాంగ్వేజ్ కనిపించదు. దీంతో అప్పటి రోహిణిపై అనుమానం ఉన్న బాలు మేనమామ పాత్రలో నటించేందుకు వచ్చిన జూనియర్ ఆర్టిస్ట్ పై గురిపెడుతాడు. తన మాటల తడాఖాను చూపించే ప్రయత్నం చేస్తున్నాడు.

అయితే రోహిణి మేనమామగా వచ్చిన అతను ఎలా వారిని నమ్మించాడు. అసలు రోహిణి తన మలేషియా మామ గురించి ఇచ్చిన బిల్డప్ ను అతను మ్యాచ్ చేయగలిగాడా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఏప్రిల్ 2వ తేదీ 393 ఎపిసోడ్ లో ఏం జరిగిందనేదంటే..?


Click it and Unblock the Notifications











