Gunde Ninda Gudi Gantalu April 4th: రోహిణికి అవమానం.. బాలు సహా ఇంటిల్లిపాదితో మాటలు
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఏప్రిల్ 3వ తేదీ 393వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రోహిణి పుట్టింటి నుంచి మేనమామగా జూనియర్ ఆర్టిస్ట్ ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. అంతకంటే ముందు నాయనమ్మ సుశీలమ్మ ఇంట్లో అందరూ సరదగా ఉంటారు. ఆటపాటలతో చక్కటి సమయాన్ని గడుపుతూ ఆనందంగా ఉంటారు. ఈ క్రమంలోనే సుశీలమ్మ తన అనుభవాలను కోడలు ప్రభావతి, మనవరాళ్లు రోహిణి, శృతిలకు నూరిపోస్తుంది. ఇక మీనా మొదటి నుంచి అనుకువగా, మర్యాదలు తెలిసిన అమ్మాయి కావడంతో కాస్తా గారాభం చేస్తుంది. కానీ మిగిలిన వారందనీ సంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతులు కచ్చితంగా తెలుసుకోవాలంటూ సూచిస్తుంది. ముఖ్యంగా కోడళ్లు ముందుండి అన్ని పనులు చేయాలని ఆదేశిస్తుంది. తనకు తెలిసిన మంచి చెడు వివరిస్తూ ఉంటుంది.
ఇక రోహిణి పుట్టింటి తరుపు నుంచి మలేషియా మామ రావాల్సి ఉండటంతో ప్రభావతి తెగ హాడావుడి చేస్తుంది. అతని కోసం అన్ని రకాల సదుపాయాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అసలే మలేషియా నుంచి వస్తున్నాడని అన్నీ సరిగా లేకపోతే ఆయన చిరాకు పడుతాడని పదే పదే అంటుంది. మరోవైపు ఓ ప్రత్యేకమైన ఫుడ్ మెనూ లిస్ట్ రాసి మీనాకు ఆ వంట బాధ్యతలను అప్పజెప్పుబుతుంది. తాను చేసే పని తక్కువే అయినా.. మీనాకు మాత్రం పనిభారం పెంచుతుంది. పైగా తనే మొత్తం కష్టపడుతున్నట్టు బిల్డప్ ఇస్తుంది. పైగా ఇంట్లో కోడుకులు, కోడళ్లు ఉన్నా సంతోషపడకుండా మలేషియా నుంచి వచ్చే రోహిణి మేనమామ కోసం ఎదురుచూస్తు ఉంటుంది. ఇక అతను వచ్చే సమయం ఆసన్నమవడంతో అతని కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇలోగా బాలు, ప్రభావతి మధ్య సంభాషణ కొనసాగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఏప్రిల్ 4వ తేదీ 394 ఎపిసోడ్ లో ఏం జరిగిందదంటే.?

రోహిణి వాళ్ళ మామయ్య మలేషియా నుంచి వస్తున్నాడంటూ ప్రభావతి ఇంట్లో ఒకటే హడావుడిచేస్తుంది. హాల్లో అటు ఇటు తిరుగుతూ కంగారుపడుతూ ఉంటుంది. మరోవైపు మీనా ను పిలిచి రోహిణి వాళ్ళ మామయ్య వచ్చే సమయం అయ్యిందని హారతి పల్లం రెడీ చేయమని చెబుతుంది. ఇక నేను చెప్పిన స్వీట్స్, ఫుడ్ ఐటమ్స్ అన్ని రెడీ చేసావా లేదా అని మీనాపై అరుస్తుంది. ఇక మీనా చేశానని చెబుతుంది. ఇక ప్రభావతి హడావుడి చూసిన భర్త సత్యం, కొడుకు బాలు, అత్త సుశీలమ్మ చిరాకు పడుతూ ఉంటారు. ఏదో వింత జరగబోతున్నట్టు ఎందుకు అంత హడావుడి అంటూ ప్రభావతి స్పీడ్ కు బ్రేకులు వేస్తారు.
ఎవరెన్ని చెప్పినా ప్రభావతి ఎక్సైట్ అవుతుంది. తొలిసారిగా రోహిణి వాళ్ళ పుట్టింటి నుంచి ఒకరు వస్తున్నారని, అది కూడా మలేషియా నుంచి రోహిణి మేనమామ వస్తుండడం విశేషంగా ఉందని, అలాంటి వ్యక్తికి మనం సకల మర్యాదలు చేయడంలో తప్పేమీ లేదని అంటుంది. ఇక ప్రభావతి రోహిణి వాళ్ళ మేనమామ గురించి మాట్లాడినప్పుడల్లా కొడుకు బాలు తన మాటల తూటాలతో ప్రభావతి నోట మాట రాకుండా చేస్తాడు. మలేషియా నుంచి వస్తున్న రోహిణి వాళ్ళ మేనమామ అసలు వస్తాడో రాడో తెలియదు కానీ ప్రభావం మాత్రం ఓవర్ బిల్డప్ ఇస్తుంది అంటూ అత్త సుశీల మందలిస్తుంది.
ఇక రోహిణి అసలు మీ మామయ్య వస్తున్నాడా లేదా అని అడుగుతుంది సుశీలమ్మ. దగ్గర వరకు వచ్చాడని, కార్ లోనే వస్తున్నాడని బదిలిస్తుంది. దగ్గరికి వచ్చాడని చెప్పడంతో ప్రభావతి ఇంకా ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంట్లో కాలు కాలిన పిల్లి లాగా అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతోంది. ఇన్నాళ్లు ఇంట్లో ఒక్కరి కోసమైనా ఇంతలా హడావుడి చేయలేదు నువ్వు, మలేషియా నుంచి రోహిణి మామ రావడంతో ఎందుకు అంతలా సంతోష పడుతుందో అర్థం కావడం లేదు అంటూ సత్యం అంటాడు. నిన్నటి నుంచి ఒకటే హడావిడి చేస్తుందంటూ ఇంట్లో వాళ్ళందరూ చిరాకు పడతారు. దాంతో ప్రభావతి మన ఇంటికి వచ్చే వాళ్లకు మర్యాదలు చేయాలి కదండీ అని బదులిస్తుంది.
ఇక వెంటనే మళ్లీ ప్రభావతి కంగారు పడుతుంటారు. ఈసారి ఏమైందని అందరూ అడుగుతారు. దాంతో రోహిణి వాళ్ళ మలేషియా మావయ్య వస్తే ఏ గదిలో ఉంచాలని చూస్తున్నానని అంటుంది. రూమ్ అనగానే మనోజ్ టెన్షన్ పడతాడు. తమ రూమ్ అడుగుతారేమోనని వెంటనే శృతి వల్ల రూమ్ పెద్దగా ఉంటుందని, మలేషియా నుంచి వస్తున్న అతనికి బాగా ఉంటుందని చెప్తాడు. అప్పటికే రూమ్ నుంచి హాల్లోకి వచ్చిన రవి శృతీలు తమ రూమ్ ఇవ్వడానికి ఒప్పుకోరు. ఇక సుశీలమ్మ రూమును అడుగుతారేమోనని బాలు ముందుగానే తన పంచులతో అడగకుండా చేస్తాడు. చేసేదేం లేక రోహిణి మా రూమ్ ఇస్తాం లే అని, మేమే హాల్లో పడుకుంటామని బదులిస్తుంది.
ఇక మలేషియా నుంచి మా మామయ్య వస్తున్నాడా లేదా అని, వస్తే ఏ బస్సు ఎక్కాడని బాలు వెటకారంగా అడుగుతాడు. అందుకు రోహిణి ప్రభావతితో చెప్పి బాలు నోరు మూయిస్తుంది. ఇక సత్యం కూడా ఈసారి ప్రభావతి సపోర్ట్ చేస్తాడు. తన కొడుకుని తోటకి వెళ్లి కొబ్బరి బోండాలు తీసుకురా అని ఆదేశిస్తారు. ఇక ఈ లోగా బయట కార్స్ సౌండ్ వినిపిస్తుంది. వచ్చింది మలేషియా మామ అనుకొని ప్రభావతి మనోజ్ హడావుడిగా వచ్చేస్తారు. రోహిణి కూడా ముందుగానే వస్తుంది. మొదట ఒక కారు వచ్చి అడ్రస్ అడిగి వెళ్లిపోతుంది. ఇక రోహిణి తన మేనమామగా నటించేందుకు ఏర్పాటు చేసిన మటన్ కొట్టే మాణిక్యం జూనియర్ ఆర్టిస్ట్ కు కార్లో రమ్మని రోహిణి ముందే చెబుతుంది. కానీ ఎవరిని ఇచ్చిన డబ్బులు బట్టలకే సరిపోయాయని, క్యాబ్ కష్టమేనని బదులిస్తాడు.
ఆ కారణంగా ఇంకా ఆ జూనియర్ ఆర్టిస్ట్ మాణిక్యం ఊర్లోకి ఎంట్రీ ఇచ్చాక తన వేషధారణ చూసి ఊర కుక్కలు మొరగడంతో పరుగులు తీస్తాడు. ఆ భయంతో రోహిణి వాళ్ళ ఇంటి వరకు వెళ్తాడు. కాపాడండి కాపాడండి అంటూ అరుస్తూ వాకిట్లో నుంచి పరుగులు తీస్తాడు. నేరుగా వెళ్లి కుడిది తొట్టిలో పడతాడు. అలా పడగానే ఒక్కసారిగా అంటూ రోహిణి ఇంకా తన నటనను స్టార్ట్ చేస్తుంది. రోహిణి మామయ్య అనడంతో ప్రభావతి ఈయనే మీ మామయ్య అని షాక్ అవుతుంది. ఇక అతన్ని కుడిది తొట్టిలో నుంచి లేపుతారు. ఇక మలేషియా నుంచి వచ్చానని మర్చిపోయిన అతను లోకల్ లాంగ్వేజ్ లోనే మాట్లాడుతాడు.
దాంతో బాలు అసలు వీడు మలేషియా నుంచే వచ్చాడా అని సందడిస్తాడు. ఇదే సందేహం అటు శృతి రవికి కూడా కలుగుతుంది. ఇంకా మలేషియా మేనమామ గా వచ్చిన అతను ఏం మాట్లాడినా బాలు పంచుల వర్షం కురిపిస్తాడు. ఇన్నాళ్లు తమ ఇంటికి రాకుండా ఆ గ్రామానికి ఎందుకు వచ్చాడు అనే ప్రశ్నకు సమాధానం వెతుకుతాడు. అందుకే మలేషియా నుంచి వచ్చిన వ్యక్తికి ఊపిరి ఆడనివ్వకుండా మాటల తూటాలు పేలుస్తాడు. ఇక దాంతో జూనియర్ ఆర్టిస్ట్ మాణిక్యం మటన్ కొట్టుకునే వాడే అంటూ బాలు గుర్తిస్తాడు. అంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











