Gunde Ninda Gudi Gantalu April 5th: రోహిణి మేనమామకు బాలుతో తిప్పలు.. అయినా తగ్గట్లేదుగా

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఏప్రిల్ 4వ తేదీ 394వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రోహిణి పుట్టింటి తరుపున మలేషియా నుంచి మేనమామగా జూనియర్ ఆర్టిస్ట్ మాణిక్యం ఎంట్రీ ఇచ్చాడు. అయితే అతను తమ సొంత ఇంటికి రాకుండా పసర్లపూడి గ్రామానికి రావడం పట్ల బాలు అనుమానం వ్యక్తం చేస్తాడు. అసలు అతను అక్కడే ఎందుకు వస్తున్నాడు? అది కూడా మలేషియా నుంచి నేరుగా ఆ గ్రామానికి రావడానికి ఎందుకు ఒప్పుకున్నారు. ఇక మనోజ్ తో రోహిణి పెళ్లైనప్పటి నుంచి పత్తా జాడాలేని ఆయన సడెన్ గా ఊడిపడటం పట్ల బాలు అనుమానం వ్యక్తం చేస్తారు. రోహిణి మేనమామ గురించి పూర్తి తెలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు.

రోహిణి మేనమామ కారులో వస్తాడని అంతా ఎదురుచూస్తూ ఉంటారు. ఇక ప్రభావతి అయితే గ్రాండ్ గా వెల్కమ్ చెప్పాలని ఊవ్విల్లూరుతుంది. కానీ రోహిణి మేనమామగా వచ్చిన వ్యక్తి కారులో రాకపోవడంతో పాటు ఊర్లో కుక్కల భయానికి వెళ్లి కుడితి తొట్టెలో పడిపోతాడు. ఆయన్ని అందులోంచి లేపుతారు. అసలు నువ్వు కారులో రావాలి కదా ఇలా భయపడుతూ పరిగెట్టుకుంటూ వస్తున్నావెందుకు? అని బాలు ప్రశ్నిస్తాడు. దాంతో పల్లెటూరు అందాలు చూద్దామని కారును అటు నుంచి అటే పంపించి వీధులన్నీ తిరుగుతూ ఇలా వచ్చానని చెబుతాడు. కానీ దారిలో కుక్కల బెడద వల్ల ఇలా భయపడాల్సి వచ్చిందని తెలుపుతాడు. ఇక అతన్ని ఇంట్లోకి తీసుకెళ్లి మర్యాదు చేస్తుంటారు. రోహిణి అప్పటికే మేనమామగా నటిస్తున్న వ్యక్తికి బ్రాస్ లెట్, బట్టలు ఇవ్వడంతో వాటిని తీసుకొచ్చి బయటికి తీస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఏప్రిల్ 5వ తేదీ 395 ఎపిసోడ్ లో ఏం జరిగిందనేదంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 395 April 5th

రోహిణి వాళ్ల మేనమామ కోసం అంతా ఎదురుచూస్తున్న క్రమంలో ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇంట్లో వాళ్లు అందరూ ఎంతో గ్రాండ్ గా వెల్కమ్ చెప్పాలని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ అతను పరిగెత్తుకుంటూ ఇంటి గేటు లోపలికి వస్తాడు. వచ్చిన వాడు వాళ్ల దగ్గర ఆగకుండా కంగారులో వెళ్లి కుడితి తొట్టిలో పడిపోతాడు. ఒక్కసారి మామయ్య అని రోహిణి పిలవడంతో అత్త ప్రభావతి షాక్ అవుతుంది. ఈయన మీమామయ్యనా అంటూ మనోజ్ కూడా అవాక్కవుతాడు. మరోవైపు బాలు అయితే ఆయన వింత చేష్టలు చూసి తనకున్న సందేహం ఇంకా బలపడుతుంది.

ఇక కుడితి తొట్టిలో పడటంతో ఆయనకు రోహిణి, మనోజ్ లు ఇద్దరు కలిసి పైకి లేపి తీసుకొస్తారు. ఇక మలేషియా నుంచి వచ్చిన వాడిలా బిల్డప్ ఇచ్చేందుకు రోహిణి మేనమామలా నటిస్తున్న మాణిక్యం కాస్తా అతిగా యాక్టింగ్ చేస్తాడు. అప్పటికే ఆయనకు మటన్ కొట్టే షాప్ ఉండటంతో కుడితిలోని క్యారెట్ ముక్కలు కురగాయాలను చూసి ఇంకాస్తా క్యారెట్ ముక్కలు వేసి ఉంటే మేకలు బాగా తినేవి... అని అంటాడు. దీంతో మళ్లీ అందరూ షాక్ అవుతారు. ఇలా మేకల గురించి మాట్లాడుతున్నావేంటీ నువ్వేదో మటన్ కొట్టే వాడిలా అని బాలు అంటాడు. నువ్వు మలేషియాలో మటన్ కొట్టే షాపులను నడిపిస్తూ ఉంటావ్ కాదా అని సందేహిస్తాడు.

ఒక్కసారిగా అతను షాక్ అవుతాడు. ఇక మరోవైపు రోహిణి కంగారు పడుతూ ఉంటుంది. చెప్పినదానికంటే ఎక్కువ మాట్లాడుతూ దొరికిపోయేలా చేస్తున్నాడే అంటూ ఆందోళన పడుతుంది. తన మేనమామగా నటిస్తూ ఉన్న అతన్ని జాగ్రత్తగా ఉండమని సూచిస్తూ ఉంది. మరోవైపు తన మేనమామగా నటిస్తున్న జూనియర్ ఆర్టిస్ట్ మాణిక్యం పొరపాట్లు మాట్లాడుతూ ఉన్నప్పటికీ ఆమె సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు అతను కూడా ఇంట్లో వాళ్లని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మొత్తానికి అతన్ని కుడితొట్టిలో నుంచి లేపి తీసుకొచ్చిన తర్వాత ఇంట్లోకి రమ్మని ఫ్రెషప్ అవ్వమని చెబుతారు.

ఎంతో గ్రాండ్ గా వెల్కమ్ ఇవ్వాలని ప్రభావతి హడావుడి చేసిన సంగతి తెలిసిందే. హారతీ కర్పూరం, ఇంటి ముందు సుస్వాగతం ముగ్గు వేయించి ఎంతో ఘనంగా ఆహ్వానించాలని ప్రభావతి ఊహించింది. అందుకు ఆమె ఊహించిన దానికి పూర్తిగా విరుద్ధంగా జరిగింది. రోహిణి వాళ్ల మేనమామ వచ్చి కుడితి తొట్టెల పడిపోతాడు. అది గమనించిన సత్యం, సుశీలమ్మ, శృతి, బాలు లోలోపల నవ్వుకుంటూ ఉంటారు. మరోవైపు రోహిణి మేనమామలా నటించేందుకు వచ్చిన మాణిక్యం వాలకం చూసి ఇతను మలేషియాలో ఉన్నట్టుగా లేడని సందేహం వ్యక్తం చేస్తారు. దీంతో అతనిపై బాలు అయితే ప్రశ్నల వర్షం కురిపి స్తూనే ఉంటాడు.

అచ్చం పల్లెటూరి వాడిలానే ఉన్నాడని అందరూ సందేహిస్తుండటంతో నాకు పల్లెలు అంటే చాలా ఇష్టమని, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడుతానని తెలియజేస్తాడు. చుట్టూ పచ్చదనం, పల్లె మనుషులు కనిపించే చాలా ఎగ్జైట్ అవుతానని చెప్పుకొచ్చాడు. ఇక మొత్తానికి అతన్ని ఇంట్లోకి తీసుకెళ్లి రోహిణి వాళ్ల గదిలో స్నానం చేయడానికి ఏర్పాట్లు చేస్తాడు. మళ్లీ ఫ్రెష్ బట్టలు వేసుకొని రోహిణి వాళ్ల మేనమామ ఇక హాల్ లోకి వస్తాడు. తను స్నానం చేసే క్రమంలోనూ కాస్తా ఓవర్ గా నటించి రోహిణిని ఇరకాటం పెటేస్తాడు. ఇక హాల్లోకి వచ్చిన తర్వాత రోహిణి, మనోజ్ కు సారె బట్టలు పెట్టాలని చెబుతాడు.

తన అన్నయ్య, రోహిణి వాళ్ల తండ్రి ఈ బట్టలు పెట్టమని చెప్తాడు. అలాగే మనోజ్ కు బంగారు బ్రాస్ లెట్ ప్రత్యేకంగా చేయించామని చెబుతాడు. వాటిని అందజేస్తూ ప్రస్తుతానికి హడావుడిగా ఇవి మాత్రమే తీసుకొచ్చాను. కానీ మా అన్నయ్య వచ్చేప్పుడు మాత్రం వంద రకాల ఐటెమ్స్ తో మీ ఇంటికి వస్తాడని గొప్పలు చెబుతాడు. దీంతో రోహిణి గుండె పేలి పోతుంది. వచ్చిన పని చూసుకోని వెళ్లవయ్యా అంటే తనను ఇంకా ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని రోహిణి మనస్సులో అనుకుంటుంది. ఇప్పటికే అప్పు చేసి ఆ బ్రాస్ లెట్, బట్టలు కొన్నానని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆ బట్టలు, బ్రాస్ లెట్ ను రోహిణి, మనోజ్ కు అందజేస్తాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X